Minister for Housing, R&B, Telangana

Minister for Housing, R&B, Telangana

Share

Official page of the Hon'ble Minister for Housing, Law and Endowments, Government of Telangana, Sri A.Indrakaran Reddy.

Photos 13/07/2018

బోనాల పండుగను ఘనంగా నిర్వహిస్తామని, రాష్ట్రం, దేశం సుభిక్షంగా ఉండేలా అమ్మవారి అనుగ్రహం ఉండాలని రాష్ట్ర గృహ నిర్మాణ,న్యాయ, దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి పేర్కొన్నారు. తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలకు అద్దంపట్టే బోనాల పండుగ నిర్వహణ కోసం ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేస్తోందన్నారు. ఇవాళ బొగ్గులకుంటలోని ధార్మిక భవన్ లో బోనాల నిర్వహణ పై దేవాదాయశాఖ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమీక్ష సమావేశానికి దేవాదాయ శాఖ ముఖ్య కార్యదర్శి శివశంకర్, అదనపు కమిషనర్ శ్రీనివాస రావు, హైదరాబాద్ డిప్యూటీ కమిషనర్ రామకృష్ణ, నగర సహాయక కమిషనర్లు, వివిధ ఆలయాల కార్య నిర్వహణ అధికారులు హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి మాట్లాడుతూ... తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ప్రతి ఏటా బోనాల ఉత్సవాలు ఎంతో వైభవంగా నిర్వహిస్తున్నామని, ఈ సంవత్సరం కూడా అంబరాన్ని అంటేలా బోనాల సంబరాలను జరుపుకునేలా అన్నిశాఖల అధికారుల సమన్వయంతో విస్తృత ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. హైదరాబాద్ నగరంలోని 14 ప్రధాన ఆలయాలకు ప్రభుత్వం తరపున పట్టు వస్త్రాలను సమర్పిస్తామన్నారు.

బోనాలు జరిగే అన్ని దేవాలయాలను విద్యుత్ దీపాలతో అలంకరించాలని, రహదారులను శుభ్రంగా ఉండేలా చూడాలని, మంచినీటి సౌకర్యం కల్పించాలని అధికారులను ఆదేశించారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకోవాలన్నారు. జీహెచ్ఎంసీతో పాటు ఇతర శాఖల అధికారులతో సమన్వయం చేసుకుంటూ.. విజయవంతంగా బోనాల ఉత్సవాలను నిర్వహించాలన్నారు. బోనాల పండుగ అత్యంత భక్తి శ్రద్ధలతో జరుపుకోవాలని భక్తులకు సూచించారు. గంగ, జమున, తెహజీబ్ సంస్కృతికి నిలయమైన హైదరాబాద్ నగరంలో అందరూ ప్రశాంతంగా బోనాలు నిర్వహించుకుని, సుఖశాంతులతో ఉండాలని అకాంక్షించారు. ఈ నెల 15న గోల్కొండ జగదాంబ మహాంకాళి అమ్మవారికి తొలిబోనం సమర్పించడంతో ఉత్సవాలు ప్రారంభం కానున్నాయి.. ఉజ్జయిని మహంకాళి దేవాలయం సికింద్రబాద్ వద్ద జూలై 29 న బోనాలు, జూలై 30 న రంగము మరియు ఏనుగు ఉరేగింపు నిర్వహిస్తారు. హైదరాబాద్ లాల్ దర్వాజ మహంకాళి అమ్మవారికి ఆగష్టు 5 న బోనాల పండుగను, అ మరుసటి రోజు బోనాల ఉరేగింపును నిర్వహిస్తారు.

13/06/2018

ప్రజారోగ్యానికే ప్రాధాన్యం: మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి

తెలంగాణ ప్రభుత్వం ప్రజారోగ్యానికి అధిక ప్రాధాన్యమిస్తున్నదని రాష్ట్ర దేవాదా య, న్యాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి అన్నారు. మంచిర్యాల
జిల్లా కేంద్రంలో ఆధునీకరించిన జిల్లా ప్రభుత్వ దవాఖానను ఆయన ప్రారంభించారు. వీటితో పాటు దవాఖానలో కొత్తగా ఏర్పాటుచేసిన రక్త పరీక్షల కేంద్రాన్ని విప్ నల్లాల ఓదెలు, లాండ్రీ గదిని ఖానాపూర్ ఎమ్మెల్యే రేఖానాయక్, వాషింగ్ మిషన్ ను ఎమ్మెల్యే దివాకర్‌రావు, తలసేమియా వార్డును ఎమ్మెల్సీ పురాణం సతీశ్‌కుమార్, మాతా శిశు సంరక్షణ కేంద్రంలోని కింది అంతస్తును ఎమ్మెల్యే దివాకరరావు, బెల్లంపల్లి ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్యపై అంతస్తును లెక్టర్ ఆర్వీ కర్ణన్ ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి ఐకే రెడ్డి మాట్లాడారు. ముఖ్యమంత్రి రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ దవాఖానలను బలోపేతం చేస్తూ, మెరుగైన వైద్యం అందిస్తున్నారని చెప్పారు. సర్కారు దవాఖానల్లో ప్రసవం చేయించుకున్న వారికి నగదు ప్రోత్సాహం తో పాటు కేసీఆర్ కిట్లు అందిస్తున్నారని చెప్పారు. మాతా శిశు మరణాలను అరికట్టడంలో రాష్ట్రం ముందుందని గుర్తుచేశారు. మంచిర్యాల జిల్లాకేంద్రంలో అధునాతన జిల్లా దవాఖాన నిర్మాణానికి రూ.20కోట్లు మంజూరైనట్లు చెప్పారు. రూ.70 లక్షలు వెచ్చించి ఇప్పుడున్న ప్రభుత్వ దవాఖానను ఆధునీకరించారనీ, రూ.50 లక్షలతో వాషింగ్ మిషన్లు కొనుగోలు చేశారనీ, రూ.16 లక్షలతో తలసేమియా బాధితుల కోసం వార్డు ఏర్పాటు చేసినట్లు వివరించారు. రూ.40 లక్షలు వెచ్చించి మాతా శిశు సంరక్షణ కేంద్రాన్ని నిర్మించినట్లు వివరించారు. ప్రభుత్వ ఆసప్పత్రుల్లో రోగుల సంఖ్య పెరిగిన్పటికీ ఓపికగా వైద్యం అందిస్తున్న వైద్యులకు ఆయన ఈ సందర్భంగా ప్రత్యేకంగా అభినందనలు తెలిపారు.

తాగునీటి కోసం మిషన్ భగీరథ సంప్
ప్రభుత్వ దవాఖానలో నీటి సమస్యను శాశ్వతంగా పరిష్కరించేందుకు గాను ఆవరణలో మిషన్ భగీరథ సంప్ ఏర్పాటు చేయనున్నట్లు మంత్రి ఐకే రెడ్డి తెలిపారు. తద్వారా అవసరమైనన్ని నీళ్లను తీసుకోవచ్చునని పేర్కొన్నారు. పారిశుధ్యం అస్తవ్యస్తంగా ఉందని, పరిసరాలు కంపు కొడుతున్నాయనీ విలేకరులు ఆయన దృష్టికి తీసుకెళ్లగా పనులు సక్రమంగా చేయించాలని, అవసరమైతే కాంట్రాక్టర్‌ను తొలగించాలని సూపరింటెండెంట్‌ను మంత్రి ఆదేశించారు. ఎమ్మెల్యే దివాకర్‌రావు మాట్లాడుతూ మంచిర్యాల ప్రభుత్వ దవాఖానలో రోజురోజుకూ రోగుల సంఖ్య పెరుగతున్నదనీ, ప్రసవాలు కూడా నెలకు 400 కు పైగా జరుగుతున్నాయని వివరించారు. మంచిర్యాలతో పాటు ఆసిఫాబాద్ జిల్లా, మహారాష్ట్రల నుంచి కూడా రోగులు ఇక్కడికి వస్తున్నారన్నారు. కార్యక్రమంలో బెల్లంపల్లి సబ్ కలెక్టర్ రాహుల్‌రాజ్, ట్రెయినీ ఐఏఎస్ స్నేహలత, మంచిర్యాల మున్సిపల్ అధ్యక్షురాలు మామిడిశెట్టి వసుంధర, మహిళా శిశు సంక్షేమ శాఖ ఆర్గనైజర్ అత్తి సరోజ, ఎంపీపీ బేర సత్యనారాయణ, జడ్పీటీసి రాచకొండ ఆశాలత, మార్కెట్ కమిటీ చైర్మన్ వెంకటేశ్వరరావు, దవాఖాన సూపరింటెండెంట్ యశ్వంత్‌రావు, టీఆర్‌ఎస్ నాయకులు పెంట రాజయ్య, యాదగిరిరావు, గోగుల రవీందర్‌రెడ్డి, గొంగళ్ల శంకర్, టీఆర్‌ఎస్ పట్టణ అధ్యక్షుడు గాదె సత్యం, కార్యదర్శి పెండ్లి అంజయ్య పాల్గొన్నారు.

Photos from Minister for Housing, R&B, Telangana's post 05/06/2018

Book pujas at Ganesh temple via website

Endowments Minister Sri A. Indrakaran Reddy launched an online portal for the famous Ganesh temple in Secunderabad.

The portal would enable devotees to buy puja tickets online. Minister said the initiative will be extended to all the major temples in the state soon.

“In the Secunderabad Ganesha temple, devotees can book online to perform Nithya kalyanam, Ganapathi Homam pujas, etc,” Minister said.

Here Website Details: www.ganeshtemplesec.telangana.gov.in

తెలంగాణ రాష్ట్రంలోని ప్ర‌ధాన ఆల‌యాల్లో త‌వదేర‌లోనే ఆన్ లైన్ సేవ‌ల‌ను అందుబాటులోకి తీసుకువ‌స్తామ‌ని గృహ నిర్మాణ‌, న్యాయ‌, దేవాదాయ శాఖ మంత్రి ఇంద్ర‌క‌ర‌ణ్ రెడ్డి అన్నారు. టీటీడీ తరహాలో నూతన సాంకేతికతో భక్తులకు ఆన్‌లైన్‌ సేవలు అందించేందుకు దేవాదాయ శాఖ అన్ని చర్యలు తీసుకుంటుందని వెల్ల‌డించారు. తెలంగాణా రాష్ట్రంలోనే ప్రపథమంగా సికింద్రాబాద్ నగరంలోని గణేష్ దేవాలయంలో ఆన్ లైన్ సేవలను మంత్రి ఇంద్ర‌క‌ర‌ణ్ రెడ్డి సోమ‌వారం ప్రారంభించారు. గ‌ణేష్ ఆల‌యంలో నూతనంగా ప్రవేశ పెట్టిన (www.ganeshtemplesec.telangana.gov.in) ఆన్‌లైన్‌ సేవలను భ‌క్తులు సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఇకనుంచి రోజువారీ పూజలు, ప్రత్యేక సేవలు, ప్రసాదం, గణపతి హోమం వంటి సేవలు ఆన్ లైన్ లో బుక్ చేసుకోచ్చ‌ని తెలిపారు. ఆన్ లైన్ సేవలను అందుబాటులోకి తీసుకురావడం వల్ల భక్తులకు సౌకర్యవంతంగా ఉండటంతో పాటు ఆలయాల్లో పారదర్శకత పెరిగి ఆదాయం కూడా పెరుగుతుంద‌న్నారు.

భ‌క్తుల విలువైన స‌మ‌యం వృధా కాద‌న్నారు. ఆన్ లైన్లోనే హుండీ చెల్లింపులు, విరాళాలు,కానుక‌లు చెల్లించ‌వ‌చ్చ‌న్నారు. విదేశాల్లో ఉన్న ఎన్ఆర్ఐ భ‌క్తులు కూడా ఆన్ లైన్ సేవ‌ల‌ను ఉపయోగించుకోవాల‌ని సూచించారు. ముఖ్య‌మంత్రి కే.చంద్ర‌శేఖ‌ర్ రావు ఆల‌యాల అభివృద్దికి విశేష‌ కృషి చేస్తున్నార‌ని, తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం త‌ర్వాత రాష్ట్రంలోని అన్ని ప్ర‌సిధ్ద దేవాల‌యాల్లో భ‌క్తుల ర‌ద్దీ పెరిగింద‌న్నారు. ఆలయాల‌కు వచ్చే భక్తుల సౌకర్యార్థం ఎన్నో కార్య క్రమాలు అమలు చేస్తున్నామని వెల్ల‌డించారు. భక్తులకు అసౌకర్యం కలగకుండా వ‌స‌తులు క‌ల్ప‌న‌తో పాటు క్యూలైన్ల క్రమ బద్దీకరణ, సేవాటికెట్లు, వసతి గృహాలు అందుబాటులో ఉండేలా చ‌ర్య‌లు తీసుకుంటున్నామ‌ని చెప్పారు.

రెండో దశలో రాష్ట్రంలోని ప్ర‌ధాన ఆల‌యాలైన యాదాద్రి, బాసర, వేములవాడ, భద్రాచలం ఆల‌యాల‌తో పాటు గ్రేట‌ర్ హైద‌రా‌బాద్ ప‌రిధిలో ఉన్న దేవాల‌యాల్లో ఆన్ లైన్ సేవ‌ల‌ను త్వ‌రిత‌గ‌తిన అందుబాటులోకి తెచ్చేందుకు క‌స‌ర‌త్తు కొన‌సాగుతుంద‌న్నారు. ఓ వైపున ఆల‌యాలను అభివృద్ది చేస్తూనే మ‌రోవైపు భ‌క్తుల వ‌స‌తుల‌ క‌ల్ప‌నకు పెద్దపీట వేస్తున్నామ‌న్నారు. దేవాదాయ శాఖలో అనేక సంస్క‌ర‌ణ‌లు తీసుకువ‌స్తున్నామ‌ని చెప్పారు. దేవాదాయ శాఖ‌లో పార‌ద‌ర్శ‌క‌త పెంపోందించాడానికి , అర్జీదారుల ఫైళ్ల‌ను త్వ‌రిత‌గ‌తిన ప‌రిష్క‌రించ‌డానికి ఇ- ఆఫీసు విధానాన్ని అమ‌లు చేయ‌నున్న‌ట్లు మంత్రి ఇంద్ర‌క‌ర‌ణ్ రెడ్డి వెల్ల‌డించారు. దీనికి సంబంధించి సాఫ్ట్‌వేర్‌ను ఐటీ ఆండ్ సీ శాఖ రూపోందిస్తుంద‌న్నారు. ఆన్ లైన్ సేవ‌ల‌కు సంబంధించి కూడా ఐటీ అండ్ సీ శాఖ స‌హాకారం తీసుకుంటున్నామ‌ని చెప్పారు.

దేవాదాయ శాఖ‌లో ఉన్న రికార్డుల‌ను డిజిట‌లైజ్ చేసేందుకు చ‌ర్య‌లు తీసుకుంటున్నామ‌ని తెలిపారు. రెవెన్యూ శాఖ చేప‌ట్టిన స‌మ‌గ్ర భూస‌ర్వే వ‌ల్ల దేవాదాయ శాఖ ఆల‌య భూముల‌కు సంబంధించి ఖ‌చ్చిత‌త్వం పెరిగిందని, ఆల‌యాల పేరు మీద పట్టా పాస్ బుక్కులు జారీ అవుతున్నాయ‌న్నారు. కామ‌న్ గుడ్ ఫండ్ ద్వారా చేప‌ట్టే కొన్ని ప‌నుల‌ను త్వ‌రిత‌గ‌తిన పూర్తి చేసేందుకు పంచాయ‌తీ రాజ్ శాఖకు అప్ప‌గించడం జ‌రిగింద‌న్నారు. ఈ కార్య‌క్ర‌మంలో కంటోన్మెంట్ ఎమ్మెల్యే సాయ‌న్న‌, స్థానిక కార్పోరేట‌ర్ ఆకుల రూప‌, ఆల‌య చైర్మ‌న్ న‌గేష్ ముదిరాజ్, ఈవో నర్సింహులు, సికింద్రాబాద్ అసిస్టెంట్ క‌మిష‌న‌ర్ వెంక‌టేష్, జీహెచ్ఎంసీ కో ఆప్ష‌న్ స‌భ్యులు న‌ర‌సింహా ముదిరాజ్, ట్ర‌స్ట్ స‌భ్యులు, ఆల‌య పూజారులు,ఇత‌రులు పాల్గొన్నారు.

10/05/2018
Photos from Minister for Housing, R&B, Telangana's post 05/05/2018

Hon’ble Minister for Endowments Sri A. Indrakaran Reddy held a review meeting with the concerned officials of Endowments Department.

అత్యంత ప‌విత్ర‌మైన ఆల‌యాల్లో అవినీతి,అక్ర‌మాలు చేసే దేవాదాయ శాఖ‌ ఉద్యోగులు, సిబ్బంది పై కఠిన చ‌ర్య‌లు త‌ప్ప‌వ‌ని మంత్రి శ్రీ ఇంద్ర‌క‌ర‌ణ్ రెడ్డి హెచ్చ‌రించారు. ఇప్ప‌టికే విచార‌ణ పూర్తై ఆరోప‌ణ‌లు రుజువైన వారిపై శాఖప‌ర‌మైన చ‌ర్య‌లు తీసుకోవాల్సిందేన‌ని స్ప‌ష్టం చేశారు.

దేవాదాయ శాఖ‌ సమీక్ష సమావేశాన్ని మంత్రి శ్రీ ఇంద్ర‌క‌ర‌ణ్ రెడ్డి ఇవాళ స‌చివాలయంలో నిర్వహించారు. మంత్రి చాంబ‌ర్ లో జరిగిన‌ ఈ సమావేశంలో దేవాదాయ శాఖ ముఖ్య కార్య‌ద‌ర్శి శివశంకర్, అదనపు కమీషనర్ శ్రీనివాస్ రావు, జాయింట్ కమీషనర్ కృష్ణవేణి , ఆయా జిల్లాల సహాయక కమీషనర్ లు పాల్గొన్నారు. దేవాల‌యాల్లో ఆన్ లైన్ సేవ‌లు, ధూప దీప నైవేద్యం, కామ‌న్ గుడ్ ఫండ్, ప్ర‌త్యేక అభివృద్ది నిధులు ప్ర‌ధాన ఎజెండ‌గా స‌మావేశంలో చ‌ర్చించారు. ఈ సంద‌ర్భంగా బాస‌ర స‌ర‌స్వ‌తీ అమ్మ‌వారి ఆల‌యంలో గ‌త మూడేళ్ల‌లో ప‌ని చేసిన ఆరుగురు ఈవోలు విధుల్లో నిర్ల‌క్ష్యం వ‌హించిన‌ట్లు విచార‌ణ‌లో తేల‌డంతో వారికి చార్జీ మెమోలు జారీ చేసిన‌ట్లు దేవాదాయ శాఖ ముఖ్య కార్య‌ద‌ర్శి శివ‌శంక‌ర్ మంత్రికి తెలిపారు. బాస‌ర ఆల‌యంలో ప‌ని చేస్తూ ఆరోప‌ణ‌లు ఎదుర్కొంటున్న మిగ‌తా సిబ్బందికి కూడా వారం రోజుల్లో చార్జీ మెమోలు జారీ చేయాలని ఆల‌య ఈవోను మంత్రి ఇంద్ర‌క‌ర‌ణ్ రెడ్డి ఆదేశించారు. నిధులు దుర్వినియోగం చేసిన సిబ్బంది నుంచే ఆ సొమ్మును వ‌సూలు చేయాల‌న్నారు. బాస‌ర స‌ర‌స్వ‌తీ అమ్మ‌వారి ఆల‌యంలో అక్ర‌మాల‌పై వివిధ ప‌త్రిక‌లు, న్యూస్ ఛాన‌ళ్ల‌లో వ‌చ్చిన క‌థ‌నాల‌పై స్పందించిన మంత్రి ఇంద్ర‌క‌ర‌ణ్ రెడ్డి విచార‌ణ‌కు ఆదేశించిన విష‌యం తెలిసిందే. మంత్రి ఆదేశాల మేర‌కు దేవాదాయ శాఖ జాయింట్ క‌మిష‌న‌ర్ కృష్ణ‌వేణి విచార‌ణ జ‌రిపి,నివేదిక స‌మ‌ర్పించారు. మ‌రోవైపు రాష్ట్రంలోని మిగితా ఆల‌యాల్లో ప‌ని చేస్తూ, అవినీతి ఆరోప‌ణలు ఎదుర్కొంటున్న ఆల‌య అధికారులు, సిబ్బందిపై రెండు నెల‌ల్లో విచార‌ణ పూర్తి చేసి నివేదిక‌ను స‌మ‌ర్పించాల‌ని మంత్రి ఆదేశించారు. విచారణలో అవినీతి ఆరోపణలు రుజువైన అధికారులపై శాఖ‌ప‌రమైన చర్యలు తీసుకోవాలని సూచించారు.

దేవాల‌యాల్లో ఆన్ లైన్ సేవ‌ల‌ను విస్త‌రించాలి

రాష్ట్రంలోని ప్ర‌ధాన ఆల‌యాల‌తో పాటు గ్రేట‌ర్ హైద‌ర‌బాద్ ప‌రిధిలో ఉన్న దేవాల‌యాల్లో ఆన్ సేవ‌ల‌ను త్వ‌రిత‌గ‌తిన అందుబాటులోకి తీసుకురావాల‌న్నారు. సికింద్ర‌బాద్ లోని గ‌ణేష్ ఆల‌యంలో ప్ర‌స్తుతం ప్ర‌యోగాత్మ‌కంగా ఆన్ లైన్ సేవ‌ల‌ను అందుబాటులోకి తెచ్చారు. ఈ నెల‌ఖారులోగా పూర్తిస్థాయిలో ఆన్ లైన్ సేవ‌ల‌ను అందుబాటులోకి తేవాల‌ని దేవాదాయ శాఖ అధికారుల‌ను మంత్రి ఆదేశించారు. త‌ర్వాత రాష్ట్రంలోని 8 ప్ర‌దాన ఆల‌యాల‌కు దీన్ని విస్త‌రించాల‌న్నారు. ఆన్ లైన్ సేవ‌ల‌ను అందుబాటులోకి తీసుకురావ‌డం వ‌ల్ల భ‌క్తుల‌కు సౌక‌ర్య‌వంతంగా ఉండ‌టంతో పాటు ఆల‌యాల్లో పార‌ద‌ర్శ‌క‌త పెరిగి,ఆదాయం కూడా పెరుగుతుంద‌ని చెప్పారు.

పేప‌ర్ లెస్ కార్యాల‌యంగా దేవాదాయ శాఖ
జూన్ 1 నుంచి ఇ-ఆఫీస్ విధానం అమలు

ఫైళ్ల జాడ కనుక్కోవడానికే కాదు వాటిని సత్వరం పరిష్కరించడానికి ఇకపై దేవాదాయ శాఖ ప్ర‌ధాన‌ కార్యాలయంలో ఇ-ఆఫీసు విధానాన్ని అమ‌లు చేయాల‌ని దేవాదాయ శాఖ మంత్రి ఇంద్ర‌క‌ర‌ణ్ రెడ్డి అధికారుల‌ను ఆదేశించారు.జూన్ 1 నుంచి ఫైళ్ల ప‌రిష్కారానికి ఆన్ లైన్ ట్రాకింగ్ వ్య‌వ‌స్థ‌ను అందుబాటులోకి తీసుకురావాల‌ని అధికారుల‌కు సూచించారు. దీనికి సంబంధించిన సాఫ్ట్‌వేర్‌ను ఐటీఈ&సీ శాఖ‌ రూపొందిస్తోంది.

జూన్ 1 నుంచి మ‌రిన్ని ఆల‌యాల‌కు ధూప దీప నైవేద్య ప‌థ‌కం

జూన్ 1 నుంచి మ‌రిన్ని ఆల‌యాల‌కు ధూప దీప నైవేద్య ప‌థ‌కం వ‌ర్తించేలా చ‌ర్య‌లు తీసుకోవాల‌ని మంత్రి ఇంద్ర‌క‌ర‌ణ్ రెడ్డి అధికారుల‌ను ఆదేశించారు. ఇప్ప‌టికే వ‌చ్చిన ద‌రఖాస్తుల‌ను మ‌రోసారి క్షుణ్ణంగా ప‌రిశీలించాల‌ని సూచించారు. దేవాదాయ శాఖ చ‌ట్టంలోని నిబంధ‌న‌ల‌కు లోబ‌డి అర్హ‌మైన ఆల‌యాల‌కు మాత్ర‌మే ఈ ప‌థ‌కాన్ని వ‌ర్తింప‌జేసేలా చ‌ర్య‌లు తీసుకోవాల‌న్నారు. ఇప్ప‌టి వ‌ర‌కు 5289 ద‌రఖాస్తులు వ‌చ్చిన‌ట్లు అధికారులు తెలిపారు. పూర్తి స్థాయి ప్ర‌క్రియ పూర్త‌య్యేందుకు స‌మ‌యం ప‌ట్టే అవ‌కాశం ఉన్నందున జూన్ 1 నుంచి మొద‌టి విడ‌త‌లో కొన్ని ఆల‌యాల‌కు ధూప దీప ప‌థ‌కం వ‌ర్తింపజేయాల‌న్నారు. కొన్ని ఆల‌యాల్లో అర్చ‌కులుగా ప‌ని చేస్తున్న విశ్వ బ్రాహ్మ‌ణుల‌తో పాటు గిరిజ‌న ఆల‌య పూజారుల‌కు కూడా ధూప దీప నైవేద్య ప‌థ‌కాన్ని వ‌ర్తింప‌జేయ‌నున్నారు.

ఆల‌యాభివృద్ది ప‌నులు మ‌రింత వేగ‌వంతం

ప్ర‌త్యేక అభివృద్ది నిధి ద్వారా 8 ఆల‌యాల్లో రూ.55.60 కోట్ల‌తో చేప‌ట్టిన ఆల‌యాభివృద్ది ప‌నుల‌ను వేగ‌వంతం చేయాల‌ని మంత్రి ఇంద్ర‌క‌ర‌ణ్ రెడ్డి ఆదేశించారు.

బాస‌ర ఆల‌యాభివృద్దికి బృహ‌త్ ప్ర‌ణాళిక

ప్ర‌సిధ్ద పుణ్య‌క్షేత్రం బాస‌ర స‌ర‌స్వ‌తీ అమ్మ‌వారి ఆల‌య అభివృద్ది ప‌నుల ప్ర‌క్రియ‌ను వేగ‌వంతం చేయాల‌ని అధికారుల‌ను ఆదేశించారు. ఆల‌యాభివృద్దిపై ప్ర‌ణాళిక‌ను రూపోందించి, మాస్ట‌ర్ ప్లాన్ ను సిధ్దం చేయాల‌న్నారు. మాస్ట‌ర్ ప్లాన్ రూపోందించిన త‌ర్వాత సీయం కేసీఆర్ గారిని సంప్ర‌దించిన త‌ర్వాత ఆల‌యాభివృద్ది ప‌నుల‌ను చేపడ‌తామ‌ని మంత్రి తెలిపారు. బాస‌ర ఆల‌యాభివృద్దికి సీయం కేసీఆర్ రూ.50 కోట్ల నిధులు కేటాయించిన విష‌యం తెలిసిందే. బాస‌ర పుణ్య‌క్షేత్రానికి వ‌చ్చే భ‌క్తుల‌కు ఎలాంటి నీటి కొర‌త లేకుండా చూడాల‌ని ఆల‌య ఈవోను మంత్రి అల్లోల ఆదేశించారు.

Photos from Minister for Housing, R&B, Telangana's post 24/04/2018

Minister for Housing Sri A. Indra Karan Reddy and Vice President Sri M Venkaiah Naidu visited Sri. Laxminarasimha Swamy Temple had divine blessings of Lord Krishna and the spiritual radiance of Srila Prabhupada in Hyderabad at Banjara Hills.

13/04/2018

Minister for Endowments and Housing Sri A. Indrakaran Reddy felicitating ZP Chairperson V. Shobha Rani in Adilabad.

Minister for Endowments and Housing Sri Allola Indrakaran Reddy said that State government was leaving no stone unturned for creating required facilities to all sections of society.

He was addressing at a general meeting of Adilabad Zilla Parishad held here on Thursday. The meeting, chaired by Zilla Parishad chairperson V Shobha Rani, discussed 27 topics, including the major drinking water crisis witnessed by several parts of erstwhile Adilabad district.

Indrakaran Reddy reiterated that the government was committed to not only to create basic amenities but also solving persistent challenges of the State by conceiving innovative programmes. He stated that the crop investment scheme, Raithubandhu, would be launched from April 20, as planned. He added that the ongoing process of recruiting teachers would be ended by ensuing June

The Minister suggested district authorities note down challenges raised by local public representatives and to redress them immediately. He clarified that the government was not showing any form of discrimination against a member of ZPTC and was concerned with the development of all regions. He cited Mission Bhageeratha was being taken up for ending drinking water crisis and works would be completed as per deadline.

Congress ZPTC members from Bhela and Bellampalli walked out of the meeting, demanding poor allocation of funds and redressal of drinking water crisis faced by the public.
Indrakaran Reddy said that government was making efforts to put an end to the woes of hydration by taking up Mission Bhageeratha and was giving equivalent importance not treating ZPTCs belonging to all parties.

The other topics which were debated by the meeting included flawless implementation of schemes by ITDA-Utnoor, improving connectivity of rural pockets, provision of LPG connections to the poor and speedy payments to labourers of national rural guarantee employment scheme. The participants lauded the government for introducing Raithubandhu Scheme and for implementing various welfare schemes.They gave inputs and suggestions to the authorities concerned.

Adilabad MP Nagesh, Government Whip Nallala Odelu, MLC Puranam Satheesh Kumar, legislators A Rekha Naik, Vittal Reddy, D Chinnaiah, Collectors D Divya, Prasanth Jeevan Patil, RV Karnan and M Prashanti, ZP CEO Jithender Reddy, Adilabad Joint Collector K Krishna Reddy and DCCB Chairman Damodar Reddy were present.

Source: Telangana Today

TS to empower fishermen community 11/04/2018

Telangana government to empower fishermen community

Endowments and Housing Minister Sri Allola Indrakaran Reddy said the State government’s Integrated Fisheries Development Scheme (IFDS) would help fishermen grow economically.

He was addressing the fishermen at an awareness programme on the newly launched scheme held here on Tuesday. Reddy said the government would spend Rs 1,000 crore through IFDS. As a result, the fishermen community would achieve financial growth. The objective of the scheme is to enhance the productivity of fingerlings, provide marketing opportunities and impart industry skills.

The Minister said as many as 80 crore fingerlings would be raised in reservoirs and irrigation tanks across the State, while 4 crore fishlings would be released in the water bodies of Nirmal district this year free of cost. A sum of Rs 70 lakh was sanctioned for the construction of a building for fishermen community and a fish market would be erected costing Rs 50 lakh.

Collector M Prashanti, trainee IAS officer Kranti Reddy, District Fisheries Officer Devender Reddy and many others were present.

Source:

TS to empower fishermen community Endowments and Housing Minister Allola Indrakaran Reddy said the State government’s Integrated Fisheries Development Scheme (IFDS) would help fishermen grow economically.

Photos from Minister for Housing, R&B, Telangana's post 20/03/2018

Hon’ble Home Minister Sri Naini Narshimha Reddy and Hon’ble Minister for Housing Sri A. Indrakaran Reddy held a meeting with Director of prosecutions department at Secretariat.

రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ఆదేశాల మేరకు హోం శాఖ మంత్రి శ్రీ నాయిని నరసింహ రెడ్డి మరియు శ్రీ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి సమక్షంలో డైరెక్టర్ అఫ్ ప్రాసిక్యుషన్స్ శాఖను సమూలంగా బలోపేతం చేయడానికి ఒక ఉన్నత స్థాయి సమావేశం సచివాలయంలోని హోం మంత్రి కార్యాలయంలో జరిగింది. రాష్ట్రంలో ఉన్న వివిధ కోర్టులలో అవసరమైన ప్రాసిక్యుటింగ్ ఆఫీసర్ల పోస్టులు మంజూరు చేయడానికి సత్వర చర్యలు తీసుకోవాలని నిర్ణయించడం జరిగింది. క్యాడర్ ప్రాసిక్యుటర్ పోస్టుల మంజురూ, భర్తీ కి కొంత సమయం అవసరం అయిన నేపధ్యంలో ప్రస్తుతం నియామకం చేస్తున్న టెన్యూర్ ప్రాసిక్యూటర్ల నియామకం కోసం మరింత పటిష్టమైన విదానాన్ని అవలంభించాలని నిర్ణయించారు.

అంతే కాకుండా, డైరెక్టర్ అఫ్ ప్రాసిక్యుషన్స్ ఆఫీసులో అవసరమైన మినిస్టేరియల్ సిబ్బంది, ఫర్నిచర్, కంపూటర్లు, సిబ్బందికి ఇంటర్నెట్, ఫోన్ ఇతర సదుపాయాలు కల్పనకు పూర్తి స్థాయిలో తక్షణమే తగు ప్రతిపాదనలు ప్రభుత్వానికి పంపాలని డైరెక్టర్ అఫ్ ప్రాసిక్యుషన్స్ కు సూచించారు. ఇప్పటికే వివిధ కోర్టులకు ప్రాసిక్యుటింగ్ ఆఫీసర్ల పోస్టుల మంజూరు కొరకు ప్రభుత్వంలో ఉన్న ప్రతిపాదనల తో పాటు, ఈ ప్రతిపాదనలు జత చేసి సత్వరమే మంజురుకు చర్యలు తీసుకోవాలని నిర్ణయించారు. అదేవిధంగా ప్రస్తుతం డైరెక్టర్ అఫ్ ప్రాసిక్యుషన్స్ శాఖాధిపతి కార్యాలయానికి తగిన వసతి లేని కారణంగా అనువైన ప్రభుత్వ భవనాన్ని సమకూర్చుకోవాలని, ఈ విషయంలో భవనాన్ని ఎంపిక చేసుకుని ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపాలని డైరెక్టర్ అఫ్ ప్రాసిక్యుషన్స్ కు సూచించడం జరిగింది. ఈ శాఖను పటిష్టపరచడానికి అవసరమైన ప్రాసిక్యుటింగ్ ఆఫీసర్ల పోస్టులు మంజూరు చేసి, వీటి భర్తీకి త్వరలో చర్యలు తీసుకుంటామని ఇప్పటికే ముఖ్యమంత్రి ప్రకటించిన నేపధ్యంలో ఈ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో హోం శాఖ ముఖ్య కార్యదర్శి రాజీవ్ త్రివేది, లా సెక్రటరీ నిరంజన్ రావు, డిజిపి మహేందర్ రెడ్డి, సి.ఐ.డి. అడిషనల్ డిజిపి గోవింద్ సింగ్, డైరెక్టర్ అఫ్ ప్రాసిక్యుషన్స్ వైజయంతి తదితరులు పాల్గొన్నారు.

Photos from Minister for Housing, R&B, Telangana's post 17/02/2018

Hon’ble Minister for MA&UD Sri K. T. Rama Rao and Hon’ble Minister for Housing Sri A. Indrakaran Reddy held a meeting with officials of Steel manufacturing companies.

రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన డబుల్ బెడ్‌రూం ఇండ్ల నిర్మాణానికి ఉక్కును తక్కువ ధరకు విక్రయించేందుకు స్టీల్ కంపెనీలు ముందుకొచ్చాయి. రాష్ట్ర ఐటీ, పరిశ్రమలు, పురపాలకశాఖల మంత్రి కే తారకరామారావు, గృహనిర్మాణశాఖ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి పలుదఫాలుగా చర్చలు జరిపిన నేపథ్యంలో టన్ను ఉక్కును దాదాపు పదివేల రూపాయల తక్కువ ధరకు అమ్మేందుకు కంపెనీల యజమానులు అంగీకరించారు. ప్రస్తుతం బహిరంగ మార్కెట్లో టన్ను ఉక్కు ధర రూ.53,100 (జీఎస్టీతో కలిపి) ఉండగా, డబుల్ బెడ్‌రూం ఇండ్లకు రూ.43,660కే విక్రయించేందుకు అంగీకరించాయి. బహిరంగ మార్కెట్‌తో పోల్చుకొంటే, రూ.9,440 తక్కువ. దీంతో గృహనిర్మాణశాఖపై రూ.264.60 కోట్ల భారం తగ్గినట్టయ్యింది. డబుల్ బెడ్‌రూం ఇండ్ల నిర్మాణ పథకం ప్రారంభించినపుడు టన్ను స్టీల్ ధర పన్నులతో కలుపుకొని రూ.32,550 ఉండేది. శుక్రవారం బేగంపేటలోని తన క్యాంపు కార్యాలయంలో మంత్రి కేటీఆర్.. ఇంద్రకరణ్‌రెడ్డితో కలిసి స్టీల్‌కంపెనీల యజమానులతో సమావేశమయ్యారు. డబుల్ బెడ్‌రూం ఇండ్ల నిర్మాణానికి అవసరమైన ఉక్కును నిర్దిష్ట ధర(బేస్‌రేటు)కు అందించాలని స్టీల్ కంపెనీలను మంత్రులు కోరారు.

రాష్ట్ర ప్రభుత్వం దేశంలో ఎక్కడాలేనివిధంగా నిరుపేదలకు నాణ్యతతో విశాలమైన డబుల్ బెడ్‌రూం ఇండ్లను నిర్మిస్తున్నదని, ఇటువంటి ఉన్నత కార్యక్రమానికి లాభాపేక్షతో కాకుండా సానుకూల దృక్పథంతో సరసమైన ధరకు ఉక్కును విక్రయించాలని సూచించారు. గ్రామాల్లో లక్ష ఇండ్లకు 1.45లక్షల టన్నులు, పట్టణాల్లో 60వేల ఇండ్లకు 1.04లక్షల టన్నులు, జీహెచ్‌ఎంసీ పరిధిలో లక్ష ఇండ్లకు 2.78లక్షల టన్నుల స్టీల్ అవసరమని వివరించారు. ఈ మేరకు రెండునెలల కాలానికి (లాక్ ఇన్ పీరియడ్ ఫిబ్రవరి 16 నుంచి ఏప్రిల్ 16 వరకు) టన్ను ఉక్కును రూ.43,660కే అమ్మేందుకు ఉక్కుకంపెనీలు అంగీకరించాయి. ఉక్కు కంపెనీల యజమానులతో చర్చించి బేస్‌రేటును నిర్ణయించడంలో కీలకపాత్ర పోషించిన గృహనిర్మాణశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి చిత్రారామచంద్రన్‌ను మంత్రులు అభినందించారు. సమావేశంలో హౌజింగ్ కార్పొరేషన్ చైర్మన్ మడుపు భూంరెడ్డి, ఎమ్మెల్సీ పీ సుధాకర్‌రెడ్డి, ఎమ్మెల్యే గువ్వల బాలరాజు, పురపాలకశాఖ ముఖ్య కార్యదర్శి అరవింద్ కుమార్, జీహెచ్‌ఎంసీ కమిషనర్ జనార్దన్‌రెడ్డి, వాణిజ్యపన్నులశాఖ కమిషనర్ అనిల్‌కుమార్, గృహనిర్మాణశాఖ సీఈ సత్యమూర్తి, జీహెచ్‌ఎంసీ సీ సురేశ్‌కుమార్, ఆలిండియా స్టీలు అసోసియేషన్ చైర్మన్ సురేశ్‌కుమార్ సింఘాల్, స్టీలు కంపెనీల యజమానులు పాల్గొన్నారు.

Photos from Minister for Housing, R&B, Telangana's post 14/02/2018

Endowments Minister Sri A. Indrakaran Reddy said Telangana government was taking steps to develop historic and famous temples of the State.

The Minister along with local MLA Ch Ramesh Babu presented silk clothes to Raja Rajeshwara Swamy of Vemulwada on behalf of the State government.

Later speaking to reporters, he termed presentation of clothes to Lord Shiva as a great opportunity for him. Chief Minister K Chandrashekhar Rao was giving priority to the development of historic shrines which had been neglected earlier.

Talking about the development of Vemulawada shrine, Indrakaran Reddy said KCR had constituted Vemulawda Temple Development Authority and continuing as chairman of the body since he had a personal attachment to the shrine.

Acquirement of 35 acres of land for the temple had been completed and other works would be started after getting approval from Sringeri Peetham.

Source: Telangana Today

Photos from Minister for Housing, R&B, Telangana's post 12/02/2018

Hon’ble Minister for Endowments Sri A.Indrakaran Reddy held a meeting with all the heads of departments and administrative officers on Preparatory Budget Meeting of 2018-19.

Want your business to be the top-listed Government Service in Hyderabad?

Click here to claim your Sponsored Listing.

Location

Category

Telephone

Address


Hyderabad