19/03/2026
Wishing everyone a very Happy Ugadi!
On this auspicious occasion, may the New Year bring prosperity, good health, and happiness to all workers and their families. Let us move forward with strength, unity, and hope for a better future.
Warm wishes from Telangana Four Wheeler Driver's Association and
Telangana Gig and Platform Workers Union (TGPWU)
Shaik Salauddin
Founder President, (TGPWU), (TGFWDA)
Co-Founder and National General Secretary, (IFAT)
09/03/2026
గ్రూప్ మిత్రులందరికి నమస్కారం . ఈరోజు డ్రైవర్ సోదరులందరూ కలిసి తెలంగాణ ఆఫీసర్ అసోసియేషన్ ప్రెసిడెంట్ గారిని కలవడం జరిగింది డ్రైవర్ల రెస్ట్ రూమ్ కొరకు ఏదైనా సహాయం చేయడానికి కోరడం జరిగింది అందుకు రాజీవ్ రెడ్డి గారు సానుకూలంగా స్పందించి రెస్ట్ రూమ్ కొరకు రెండు కూలర్లు ఇప్పిస్తా అని చెప్పినారు
09/03/2026
జిల్లాలో వివిధ ప్రభుత్వ శాఖల్లో అధికారులకు నడుస్తున్న అద్దె వాహన డ్రైవర్ల సమస్యలను పరిష్కరించాలని తెలంగాణ ఫోర్ వీలర్స్ అసోసియేషన్ జిల్లా అధ్య క్షుడు అబ్దుల్ ఖాదర్ కోరారు. ఈ మేరకు గురువారం తన చాంబర్లో వినతిపత్రం అందజే శారు. ఈ సందర్భంగా ఇటీవల కలెక్టర్గా బాధ్యతలు స్వీకరించిన కుష్బూగుప్తాకు పుష్పగు చ్చాలిచ్చి శుభాకాంక్షలు తెలిపారు. అద్దె వాహన డ్రైవర్లకు పెండింగ్లో ఉన్న బిల్లులు వెంటనే విడు దల చేయాలని కోరారు. నెలల తరబడి బిల్లులు రాకపోవడంతో అప్పుల పాలవుతున్నామని ఆవే దన వ్యక్తం చేశారు. ప్రభుత్వం చేపడుతున్న పథ కాలు డ్రైవర్ల సంక్షేమం కోసం సమర్థవంతంగా అమలు చేయాలని కోరారు.
09/03/2026
తెలంగాణా ఫోర్ వీలర్ డ్రైవర్ అసోసియేషన్, డ్రైవర్ సోదరులకు నమస్కారం 🙏 ఈరోజు మన డ్రైవర్ సోదరుడు శ్రీ గోటిముక్కల స్వామి గారు చనిపోయి 14రోజులు ఆవుతున్నది, వారి కుటుంబసభ్యులను ఈరోజు కలవడం జరిగినది, అలాగే వారి వారి కుటుంబo కోసం మన యూనియన్ సభ్యులందరు కలిసీ జామచేసిన అమౌంట్ 20000/- రూపాయలు జమ చేయడం జరిగింది వారి కుటుంబ అవసరాలకోసం ఈరోజు10,000/- ఇవ్వడం జరిగినది 🙏
మిగతా 10,000/- వారి ఇద్దరి ఆడపిల్లల కోసం పోస్టపిసులో జమ చేయడం జరిగింది..దీనికి సహకరించిన రాజ గౌడ్ గారికి మరియు తెలంగాణ ఫోర్ వీల్లర్ డ్రైవర్ అసోసియేషన్ తోటి డ్రైవర్ సోదరులకు ధన్యవాదములు 🙏💐💐
ఇంతటితో కాకుండా వారి కుటుంబానికి అవసరాలు ఉన్నాయో మా యూనియన్ తరపున ప్రత్యక్షంగా గాని పరోక్షంగా గాని ఉంటామని హామీ ఇవ్వడం జరిగింది🙏🤝
30/11/2025
మన రాష్ట్ర అధ్యక్షులు షేక్ సలావుద్దిన్ గారు అంచేలాంచెలుగా ఎదుగుతు ఒక డ్రైవర్ స్థాయి నుండి జాతీయ స్థాయి వరకు వెళ్లిన ఏకైక డ్రైవర్. సలాద్దీన్ గారని నేను గౌరవంగా చెప్తున్న. అతను డ్రైవర్స్ కె కాకుండా తన దగ్గర సహాయం కొరకు వచ్చే ఏ కార్మికుల అయిన హెల్పింగ్ నేచర్ ఉన్న నాయకుడు. మొన్నటి గిగ్ వర్కర్స్ ఎన్నో సంవత్సరాలనుండి పోరాటం చేస్తూ వారి హక్కులను ఇంప్లిమెంట్ సాధనకు అహర్నిశలు కష్టపడి సాధించిన గొప్ప నాయకుడు సలాద్దీన్ గారు. ఇలాంటి నాయకుడు డ్రైవర్ నుండి ఇంత మంచి వ్యక్తి ఎవరు లేరు. తను నిజాయతి నిబద్దతతో ఉన్నందుకు రాష్ట్ర. మరియు జాతీయ స్థానం సంపాదించి పేరు ప్రతిష్ట ఉన్న నాయకుడు షేక్ సలావుద్దిన్ గారు హృదయ పూర్వక పుట్టినరోజు శుభాకాంక్షలు. భవిష్యత్ లో ఇంకా ఎన్నో కార్యక్రమంలు కార్మికులకు మంచి చేస్తారని భావిస్తున్నాను..💐💐💐💐💐💐.. మీ. షకీల్. జిల్లా ఉపాధ్యక్షులు. మహబూబ్ నగర్
14/11/2025
How Advance Tip Is Changing Driver and Rider Behaviour
Rider Behaviour Is Shifting Under Pressure
Shaik Salauddin, Founder President of the Telangana Gig and Platform Workers Union told MediaNama that the advance tip feature is already reshaping behaviour on both ends of the marketplace.
How Advance Tipping Is Reshaping India’s Ride-Hailing Experience
Read on to know how advance tipping on cab booking apps is reshaping user experience for those who tip, and importantly for those who do not.
14/11/2025
హెచ్ఎమ్‌డబ్ల్యూఎస్‌ఎస్‌బి మేనేజింగ్ డైరెక్టర్ అశోక్ రెడ్డి కొర్రెం గారు తెలంగాణ ఫోర్‌వీలర్ డ్రైవర్స్ అసోసియేషన్ కొత్త బృంద సభ్యులకు శుభాకాంక్షలు తెలిపారు
ఈ రోజు హైదరాబాద్ మెట్రోపాలిటన్ వాటర్ సప్లై అండ్ సీవరేజ్ బోర్డు (HMWSSB) మేనేజింగ్ డైరెక్టర్ శ్రీ అశోక్ రెడ్డి కొర్రెం గారు తెలంగాణ ఫోర్‌వీలర్ డ్రైవర్స్ అసోసియేషన్ యొక్క కొత్తగా ఎన్నికైన అధ్యక్షుడు, ప్రధాన కార్యదర్శి మరియు ఇతర సభ్యులను కలుసుకున్నారు.
ఈ సందర్భంగా ఆయన వారికి హృదయపూర్వక అభినందనలు మరియు శుభాకాంక్షలు తెలిపారు.
తెలంగాణ ఫోర్‌వీలర్ డ్రైవర్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు షేక్ సలాహుద్దీన్ గారు కూడా అశోక్ రెడ్డి కొర్రెం గారికి ధన్యవాదాలు తెలుపుతూ, హైదరాబాద్ నగర అభివృద్ధి కోసం ఆయన చేస్తున్న సేవలు మరింత విజయవంతం కావాలని ఆకాంక్షించారు.
రెండు సంస్థల నాయకులు డ్రైవర్ల సంక్షేమం, హైర్ వెహికిల్స్ (Hire Vehicles) సేవల మెరుగుదల మరియు ప్రజా సేవల బలోపేతం కోసం పరస్పర సహకారం అవసరమని అభిప్రాయపడ్డారు.
అధ్యక్షుడు: సయ్యద్ ఖలీద్
ప్రధాన కార్యదర్శి: మున్నావరుద్దీన్
ఉపాధ్యక్షుడు మరియు ఇతర సభ్యులు: తెలంగాణ ఫోర్‌వీలర్ డ్రైవర్స్ అసోసియేషన్