14/05/2017
బహుజన రాజ్యాధికార పార్టీ రాష్ట్ర నాయకుల పర్యటనలు
52శాతం unna బిసిలు ముఖ్యమంత్రి కావడానికి అర్హత లేదా?
చర్చా
ముఖ్యఅతిథి : నల్లా సూర్యప్రకాష్ అధ్యక్షలు BRP
Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from Bahujana Rajyadhikara Party, Political Party, Hyderabad.
14/05/2017
బహుజన రాజ్యాధికార పార్టీ రాష్ట్ర నాయకుల పర్యటనలు
52శాతం unna బిసిలు ముఖ్యమంత్రి కావడానికి అర్హత లేదా?
చర్చా
ముఖ్యఅతిథి : నల్లా సూర్యప్రకాష్ అధ్యక్షలు BRP
బహుజన రాజ్యాధికార పార్టీ రాష్ట్ర నాయకుల పర్యటనలు
52శాతం unna బిసిలు ముఖ్యమంత్రి కావడానికి అర్హత లేదా?
చర్చా
ముఖ్యఅతిథి : నల్లా సూర్యప్రకాష్ అధ్యక్షలు BRP
17/03/2017
బహుజన రాజ్యాధికార పార్టీ (బిఆర్పి)
ఎజెండా (93 Vర 7) మరియు తీర్మానాలు
06/03/2017
24/02/2017
వెలమ దొరల నాయకత్వంలో తెలంగాణాలో ప్రభుత్వం ఏర్పడిన తరువాత రెడ్డి సామాజిక వర్గం నాయకులంతా అధికారం కోల్పోయినందుకు విలవిల్లాడుతున్నారు. ఏవిధంగానైనా ప్రభుత్వం మన చేతుల్లోకి రావాలనే లక్ష్యంతో కెసీఆర్‌కు వ్యతిరేకంగా ఎత్తులు వేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ మొదటినుండి రెడ్డి సామాజిక వర్గం నాయకత్వంలో పని చేస్తుంది. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే రెడ్డి ముఖ్యమంత్రి అవుతాడు. అయితే ఇప్పుడున్న పరిస్థితుల్లో ప్రజలు కాంగ్రెస్ పార్టీని నమ్మే స్థితిలో లేరు. అవకాశం పోగొట్టుకోకూడదనే ఉద్దేశ్యంతో పొలిటికల్ జెఎసీ ఛైర్మన్ కోదండరాంరెడ్డిని రెడ్లు ప్రోత్సహిస్తున్నారు. సహజంగానే తొందరగా ఏ నిర్ణయం తీసుకోలేని వ్యక్తి కోదండరాంరెడ్డి. అనేక సంవత్సరాలుగా కేసీఆర్‌తో సహవాసం చేశాడు కాబట్టి కోదండరాం, కేసీఆర్‌కు కోవర్టుగా మారతాడేమో అని రెడ్లు మధన పడుతున్నారు. ఇప్పుడు నిరుద్యోగ నిరసన ర్యాలీ కూడా కేసీఆర్ - కోదండారామ్ ఆలోచనలోనే నిరసన ర్యాలీ జరగకుండా వ్యవహరించారని జనం భావిస్తున్నారు.
కనీసం పరోక్షంగానైనా అధికారం మన చేతుల్లో వుండాలనే ఉద్దేశంతో చెరుకు సుధాకర్‌ను ప్రోత్సహిస్తున్నారు. మరొకవైపు కమ్యూనిస్టు పార్టీల్లో వున్న రెడ్ల సహకారంతో జస్టిస్ చంద్రకుమార్‌ను ప్రోత్సహిస్తున్నారు. ఇవేవీ కూడా వర్కవుట్ అవుతున్నట్లు కనిపించడం లేదు. ఏది ఏమైనా రెడ్లు అధికారంలోకి రావాలనే ప్రధాన లక్ష్యంతో పని చేస్తున్నారు.
93% వున్న బహుజనులు, 7% వున్న ఆధిపత్య కులాలను, అందులోనూ రెడ్డి సామాజిక వర్గాన్ని ఓడించడానికి ఒక బరి గీయాల్సి వుంది. బరికి అటువైపు 7%, ఇటువైపు 93% బహుజనులు సమరశంఖం పూరించాల్సిన అవసరం ఆసన్నమైంది. ఇప్పుడు కాకపోతే మరెప్పుడూ రాజ్యాధికారాన్ని చేపట్టలేము. బీసీ ముఖ్యమంత్రిగా, ఎస్సీ పార్టీ అధ్యక్షుడిగా కొత్త పార్టీ ఏర్పడి రంగంలోకి వచ్చినప్పుడు మాత్రమే డబ్బుతో విర్రవీగుతున్న 7% ఆధిపత్య కులాలను ఓడించవచ్చు.
బహుజనులారా మేల్కొండి! రాజ్యాధికారం ఏలుకోండి!! కలిస్తే నిలుస్తాం- నిలిస్తే గెలుస్తాం. గెలిస్తే - రాజ్యాధికారం చేపడుతాం. రాజ్యాధికారాన్ని చేపడితే - సామాజిక పరివర్తన, ఆర్ధిక విముక్తి తీసుకువస్తాం.
18/02/2017
కేసీఆర్ చెప్పే మాటలకు, చేసే పనులకు పొంతన వుండదు. దళితులకు 3 ఎకరాల భూమి కొనుగోలు ఏమైంది? డబుల్ బెడ్రూం ఇళ్లు 2 గ్రామాలకే పరిమితమైంది. హాస్టళ్లలో సన్నబియ్యం సన్నబడిపోయింది. ఆర్టీసీని అమ్ముతామంటున్నారు. కేసీఆర్ పాలన పోలీసులు, జర్నలిస్టులు, బ్రాహ్మణుల అభివృద్ధికే పరిమితమైపోయింది. రేపు ప్రజలు తిరుగుబాటు చేస్తే అణచివేయడానికి పోలీసులు అవసరం, తన తప్పిదాలను ఎత్తిచూపకుండా వుండడానికి మీడియా, పూజలు చేయడానికి బ్రాహ్మణులు అవసరం.
కేసీఆర్ గారూ! ఇకనైనా పిట్టలదొర మాటలు మాట్లాడకండి, వాస్తవాలే మాట్లాడండి. రెండున్నర సంవత్సరాల కాలంలో సాధించిందేమీ లేదు. శుష్క వాగ్ధానాలు, ఢాంబికాలు తప్ప. పూర్తిగా అవినీతిమయమైన నీ పరిపాలనలో, కొంతమందికి గొర్రెలు, చేపలు ఇచ్చినంతమాత్రాన కోటీశ్వరులు కారు.
రానున్నకాలంలో 93% ప్రజలు తమ ఓట్లు తాము వినియోగించుకుని మీ పార్టీతో సహా, అన్ని అగ్రకుల రాజకీయ పార్టీలను పాథాళానికి బహుజనులు తొక్కేస్తారు.
16/02/2017
సుప్రీంకోర్టు న్యాయమూర్తుల నియామకాల్లో 30%వున్న ఎస్సీ, ఎస్టీలకు మరొక్కసారి మొండిచేయి. పరోక్షంగా న్యాయవ్యవస్థలో మనువాదం చెలామణి అవుతున్నది.
16/02/2017
నిజమా? ఇది కూడా మరో బూటకపు వాగ్ధానము కాదుగదా?
15/02/2017
కేసీఆర్ ప్రభుత్వానికి కనీస మానత్వం లేదు.
తమ రక్తాన్ని చెమటగా మార్చే ఆదివాసీలు (ఎస్టీ)లు వేసిన పంటలను నిర్ధాక్షిణ్యంగా ధ్వంసం చేయడాన్ని బహుజన రాజ్యాధికార పార్టీ (బీఆర్పీ) తీవ్రంగా ఖండిస్తోంది.
లక్షల కోట్ల రూపాయలు ఎగనామం పెడుతున్న అగ్రకుల, అగ్రవర్ణ కార్పొరేట్ అధిపతులను, పారిశ్రామికవేత్తలను పట్టుకోలేని, చేవలేని దద్దమ్మ ప్రభుత్వాలు ఆదివాసీల పంటలను ధ్వంసం చేయడం మానవత్వానికే మచ్చ. ఇటువంటి సంఘటనలు జరగకుండా వుండాలంటే, ఆదివాసీలు విల్లంబులు చేతబట్టడం కాదు, లైసెన్స్డ్ ఆయుధాలు వున్నటువంటి పోలీసులు రక్షణగా వచ్చే పరిస్థితిని సృష్టించుకోవాలి. దానికి మార్గం రాజ్యాధికారం. ఆ దిశగా నడిచినప్పుడే మన సమస్యలు పరిష్కారమవుతాయి.
14/02/2017
భారత రాజ్యాంగం అమలుకు నాలుగు పట్టుకొమ్మలు, వాటినే నాలుగు స్థంభాలుగా మనం వ్యవహరిస్తాం. 1. లెజిస్లేచర్ (చట్టసభలు), 2.జ్యూడిషియల్ (న్యాయవ్యవస్థ), 3.ఎగ్జిక్యూటివ్ (కార్యనిర్వాహక), 4.మీడియా (ప్రసార సాధనాలు) ఈ నాలుగు ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించడంలో, పౌరుల హక్కుల్ని కాపాడటంలో ప్రధాన పాత్ర పోషిస్తున్నాయి. మీడియా మినహాయిస్తే పై మూడు సంస్థలకు రాజ్యాంగంలో డాక్టర్ బాబాసాహెబ్ బి.ఆర్.అంబేడ్కర్ వాటి విధులు, హక్కుల గురించి స్పష్టంగా పొందుపర్చడం జరిగింది. మీడియా పరోక్షంగా తనవంతు పాత్ర పోషిస్తోంది.
అయితే ఎస్సీ, ఎస్టీల విషయానికి వచ్చేసరికి మీడియాలో స్వాతంత్య్రం వచ్చి 70 సం||లు గడిచినప్పటికీ 30%గా జనాభా వున్న ఎస్సీ, ఎస్టీల పాత్ర నామమాత్రం, 1% కూడా లేదు. అందుచేతనే పాలకులు ఎస్సీ,ఎస్టీ వర్గాల హక్కుల్ని కాలరాసినప్పుడు మీడియా గొంతు మూగబోతోంది. కార్యనిర్వాహక (ఎగ్జిక్యూటివ్ పవర్స్) సంస్థలుగా వున్నటువంటి ఎస్సీ, ఎస్టీలకు చెందిన జిల్లా లెజిస్లేటివ్లు కూడా అవమానాలు పడుతున్న పరిస్థితులు, పాలకులు వారిని అనేక రకాలుగా వేధింపులకు గురి చేస్తున్నారు. పదోన్నతుల్లో ప్రజలకు మేలు చేసేటువంటి పదవులు ఇవ్వడంలోగానీ, ప్రజలకు అనుకూలంగా వ్యవహరించినప్పుడుగానీ అదేవిధంగా అటు లోక్‌సభ, రాజ్యసభలు, రాష్ట్రాల శాసనసభ, విధానసభల్లో ఎస్సీ, ఎస్టీల ప్రతినిధులను మాట్లాడనీయకుండా అడ్డుకోవడం అనివార్యంగా మారింది.
ఇక చివరికి అత్యున్నత న్యాయస్థానమైన సుప్రీంకోర్టు పూర్తిగా అగ్రకులాలతో నిండి, భూతద్ధంతో వెదికినా ఒక్క దళితుడు కానరారు. దళితవర్గానికి చెందిన హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ సీఎస్ కర్ణన్ని సుప్రీంకోర్టు న్యాయమూర్తులందరూ కలిసి మూకుమ్మడిగా న్యాయస్థానాన్ని ధిక్కరించాడనే నెపంతో అతడిని వేధించడాన్ని బహుజన రాజ్యాధికార పార్టీ (బీఆర్పి) తీవ్రంగా గర్హిస్తుంది.
డాక్టర్ బాబాసాహెబ్ అంబేడ్కర్ ఆశించినట్టు పాలితులైన దళితులు అధికారంలో స్వంతంగా వాటా సంపాదించుకున్నప్పుడే ఈ వైషమ్యాలు తగ్గే అవకాశముంది. ఇప్పటికైనా బహుజన సమాజం కళ్లు తెరిచి, జరుగుతున్న అన్యాయానికి వ్యతిరేకంగా, రాజ్యాధికారమే లక్ష్యంగా ఉద్యమించాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
-నల్లా సూర్య ప్రకాశ్, స్టీరింగ్ కమిటీ ఛైర్మన్,
బహుజన రాజ్యాధికార పార్టీ (బిఆర్పి)
06/02/2017
ప్రత్యేక బడ్జెట్ ద్వారానే ఎస్సీ, ఎస్టీల అభివృద్ధి
- నల్లా సూర్యప్రకాష్,
అధ్యక్షులు, బహుజన రాజ్యాధికార పార్టీ
ఎస్సీ, ఎస్టీలకు కేటాయించిన నిధులు దుర్వినియోగం కాకుండా ఉండాలంటే ఖచ్చితంగా ఎస్సీ, ఎస్టీలకు ప్రత్యేక బడ్జెట్ ప్రవేశ పెట్టాలి. మీరు గ్రామస్థాయిలో ప్రణాళికలు కావాలని కలెక్టర్స్ ఆదేశించిన మాదిరిగానే, గ్రామ స్థాయి నుండి రాజధాని వరకు ఎస్సీ, ఎస్టీల కోసం ఒక ప్రణాళిక రూపొందించి ఆ ప్రణాళిక ఆధారంగా ప్రత్యేక బడ్జెట్ ప్రవేశపెడితే డాక్టర్ బాబాసాహెబ్ అంబేడ్కర్ ఆశించినట్లు 10 సంవత్సరాల్లోనే ఎస్సీ, ఎస్టీ వర్గాల్లోని పేదరిక నిర్మూలనతోపాటు ఇతర వర్గాలతో సమానంగా అభివృద్ధి చెందే అవకాశం ఉంది.
స్వాతంత్య్రం సిద్దించి 70 ఏళ్ళు గడిచినప్పటికీ నేటికి ఎస్సీ, ఎస్టీలు వివక్షకు గురౌతున్నారు. కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీల హయాంలో ఎస్సీ, ఎస్టీ అభివృద్ది కాగితాలకే పరిమితం అయింది. ఇప్పటికైనా పాలకులు స్వద్భద్దితో వ్యవహారించవలసి ఉంది. ఈ రెండున్నర సంవత్సరాల కాలంలో టిఆర్ఎస్ ప్రభుత్వం గత ప్రభుత్వాల మాదిరిగానే వ్యవహారించింది. మాటలు కాకుండా చేతలతో ఎస్సీ, ఎస్టీల అభివృద్ధి కార్యరూపంలో ఉండాలని డిమాండ్ చేస్తున్నాం.