12/10/2026
🌺మల్‌రెడ్డి యువశక్తి ఆధ్వర్యంలో బతుకమ్మ సంబురాలు
🌺14న అంబేద్కర్ చౌరస్తాలో ఆడబిడ్డలకు బతుకమ్మ పోటీలు...
🌺మల్‌రెడ్డి స్నేహా అభిషేక్‌రెడ్డి పిలుపు...
తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే బతుకమ్మ పండుగను పురస్కరించుకొని ఇబ్రహీంపట్నంలో 'మల్‌రెడ్డి యువశక్తి' నేతృత్వంలో ఈ నెల 14వ తేదీన బుధవారం బతుకమ్మ సంబురాలను ఘనంగా నిర్వహించనున్నాం. ఇబ్రహీంపట్నం అంబేద్కర్ చౌరస్తాలో సాయంత్రం 5గంటల నుంచి నిర్వహించనున్న ఈ వేడుకల్లో భాగంగా ఆడబిడ్డలకు ప్రత్యేకంగా బతుకమ్మ పోటీలను ఏర్పాటు చేస్తున్నాం. ఈ పోటీల్లో ప్రతిభ కనబరిచిన విజేతలకు భారీ నగదు బహుమతులను అందజేయటం జరుగుతుంది. ప్రథమ బహుమతిగా రూ.25,000, ద్వితీయ బహుమతిగా రూ.15,000, తృతీయ బహుమతిగా రూ.10,000 లను గౌరవ శాసనసభ్యులు మల్‌రెడ్డి రంగారెడ్డి గారి చేతుల మీదుగా అందించటం జరుగుతుంది. మహిళల్లో పండుగ ఉత్సాహాన్ని పెంపొందించడంతో పాటు తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలను భావితరాలకు పరిచయం చేయాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం. ఈ వేడుకలను మరింత ఉత్సాహభరితంగా నిర్వహించేందుకు ప్రముఖ జానపద కళాకారులు కూడా పాల్గొననున్నారు. మహిళలు, యువతులు పెద్ద సంఖ్యలో పాల్గొని బతుకమ్మ సంబురాలను విజయవంతం చేయాలని పిలుపునిస్తున్నాం.**