మహిళను లైంగికంగా వేధించి, హత్య చేసిన కేసులో నిందితుడికి జీవిత ఖైదు,102000/- రూపాయల జరిమాన........
కొడిమ్యాల పోలీస్ స్టేషన్ పరిధికి చెందిన వివాహిత మహిళను అదే గ్రామానికి చెందిన ఇల్లంతకుంట శ్రీధర్ వయస్సు 28 సంవత్సరాలు అనే వ్యక్తి తరచూ లైంగికంగా వేధిస్తూ ఉండేవాడు. తేదీ 14-04-2019 రోజున మధ్యాహ్నం సమయంలో వివాహిత ఇంట్లో ఎవరు లేని సమయంలో ఇంట్లోకి ప్రవేశించి లైంగిక కోరిక తీర్చమని వేధించగా లేదంటే చంపుతానని బెదిరించగా అందుకు ఆ వివాహిత ఒప్పుకోనందున శ్రీధర్ తన వెంట తెచ్చుకున్న కిరోసిన్ డబ్బా తో వచ్చి ఆ యొక్క మహిళను చంపాలనే ఉద్దేశంతో ఆమెపై కిరోసిన్ పోసి నిప్పటించగా ఈ సంఘటనలో ఆ యొక్క మహిళ తీవ్ర గాయపడి గా ఆ యొక్క మహిళను చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించగా ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించడం జరిగింది.
బాధితురాలి భర్త ఫిర్యాదు మేరకు కొడిమ్యాల పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేయడం జరిగినది. కేసు నమోదు చేసి దర్యాప్తు చేసిన పోలీసులు నిందితుడు అయిన ఇల్లంతకుంట శ్రీధర్ ని కోర్టులో హాజరు పరచడం జరిగింది. కేస్ ను విచారించిన గౌరవ న్యాయమూర్తి శ్రీమతి నీలిమ గారు నిందితునికి జీవిత ఖైదు తో పాటు 102000/- రూపాయల జరిమానా విధిస్తూ తీర్పు వెల్లడించారు.
పై కేస్ లో నిందితునికి జైలు శిక్ష పడటం లో కృషి చేసిన పోలీసు అధికారుల ను జిల్లా ఎస్పీ శ్రీ అశోక్ కుమార్ ఐపీఎస్ గారు అభినందించారు.
Telangana state Police
SHO Kodimial
Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from SHO Kodimial, Police station, kodimial, Jagtial.
మైనర్ బాలికను ప్రేమిస్తున్నానని వెంటపడి, అసభ్యకరంగా ప్రవర్తించిన కేసులో నిందితుడికి 2 సంవత్సరాల జైలు శిక్ష మరియు 25,000 రూపాయల జరిమాన.....
కోడిమ్యాల పోలీస్ స్టేషన్ పరిదికి చెందిన నిందితుడు MD అంకుష్ వయస్సు 20 సంవత్సరాలు అనే వ్యక్తి మైనర్ బాలికను ప్రేమిస్తున్నానని వెంటపడి, అసభ్యకరంగా ప్రవర్తించిన ఘటనలో బాధితురాలు ఇచ్చిన ఫిర్యాదు మేరకు నిందితుడిపై 2019 సంవత్సరంలో కోడిమ్యాల పోలీస్ స్టేషన్ లో అప్పటి ఎస్.ఐ శివ కృష్ణ కేసు నమోదు చేసి దర్యాప్తు చేయగా కోర్టు కానిస్టేబుల్ సాగర్ సాక్షులను ప్రవేశపెట్టగా అదనపు పబ్లిక్ ప్రాసిక్యూటర్ రామకృష్ణ రావు గారు తమ వాదన వినిపించగా సాక్ష్యులను విచారించిన గౌరవ న్యాయమూర్తి శ్రీమతి నీలిమ గారు నిందితుడి పై నేరం రుజువు కావడంతో నిందితుడికి 2 సంవత్సరాల జైలు శిక్షతో పాటు 25,000 రూపాయల జరిమాన విధిస్తూ తీర్పునిచ్చారు.
మహిళా పట్ల అసభ్యంగా ప్రవర్తించిన కేసులో నిందితునికి 7 రోజుల జైలు శిక్ష,15,000/- వేల రూపాయలు జరిమానా.......
కొడిమ్యాల పోలీస్ స్టేషన్ పరిధికి చెందిన ఆడువాల నాగరాజు అనే వ్యక్తి ఒంటరిగా ఉన్న మహిళ పట్ల అసభ్యంగా ప్రవర్తించడంతో పాటు బెదిరింపులకు గురి చేసినందుకు నిందితుని పై 2017 సంవత్సరంలో అప్పటి ఎస్సై కిరణ్ కుమార్ కేసు నమోదు చేయగా ఈరోజు నిందితునికి ఏడు రోజుల జైలు శిక్ష 15 వేల రూపాయల జరిమాన విధిస్తూ జిల్లా జడ్జి శ్రీమతి నీలిమ గారు తీర్పునిచ్చారు.
అజాగ్రత్తగా వాహనం నడిపిన కేసులో నిందితుడికి 6 నెలల జైలు శిక్ష,9000 రూపాయల జరిమాన......
గాయపడిన బాధితులకు 30000 రూపాయల పరిహారం...
A.P.P. Smt. M. రజని గారి కదనం ప్రకారం.. కొడిమ్యల పోలీస్ స్టేషన్ పరిధికి చెందిన పోతర్ల రవి అనే వ్యక్తి తేదీ 15-5-2019 రోజున ఉదయం 7 గంటలకు తన కుమారునితో కలిసి ద్విచక్ర వాహనం పై వేములవాడ కు బంధువుల ఇంటికి వెళ్ళి తిరిగి అదే రోజు ఉదయం 10 గంటలకు వస్తున్న సమయంలో నల్గొండ గ్రామం టెంపుల్ మలుపు వద్ద ఎదురుగా వేములవాడ కు వెళ్తున్న మ్యాకాల అంజయ్య ద్విచక్ర వాహనం ను అతివేగంగా,అజాగ్రత్తగా నడిపి వీరిని ఢీకొట్టగా బండి నడుపుతున్న పోతర్ల రవి,అతని కుమారునికి గాయాలు కావడం జరిగింది. ఇట్టి విషయం గురించి పోతర్ల రవి కొడిమ్యల పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా అప్పటి ఎస్.ఐ సతీష్ నిందితుడి పై కేసు నమోదు చేసి విచారణ జరిపి ఛార్జ్ షీటు దాఖలు చేశారు.
సాక్షులను విచారించిన గౌరవ న్యాయమూర్తి శ్రీ వినీల్ కుమార్ సెకండ్ అడిషనల్ JFCM గారు నిందితుడికి 6 నెలల జైలు శిక్ష,9000/- వేల రూపాయల జరిమాన విధిస్తూ,గాయపడిన బాధితులకు 30,000/- వేల రూపాయల పరిహారం ఇవ్వాలని తీర్పునిచ్చారు.
20/02/2025
Please dial 1930 for any assistance regarding Cybercrimes or Dial100
TG Cyber Bureau
29/06/2024
జగిత్యాల జిల్లా.....
*- - - జిల్లా లో దొంగతనలకు పాల్పడుతున్న 3 గురు నిందితులు, ఒకరు బంగారం కొన్న వ్యక్తి అరెస్ట్.*
*- - - 260 గ్రాములు బంగారు ఆభరణాలు, కారు -1, వ్యవసాయ కరెంట్ మోటార్లు-3, మూడు సెల్ ఫోన్ లను స్వాదినo.*
*- - - స్వాదిన పరచుకున్న మొత్తం విలువ సుమారు 30,00,000/-రూపాయలు*
*- - - - జిల్లా ఎస్పీ శ్రీ అశోక్ కుమార్ ఐపీఎస్ గారు*
గత కొద్ది రోజుల నుంచి జగిత్యాల జిల్లా పట్టణ మరియు పరిసర ప్రాంతాలలో గల తాళం వేసిన ఇండ్లల్లో క్రింద పేర్కొన్న నిందితులు పలు దొంగతనలకు పాల్పడినారు, పోలీస్ స్టేషన్ల వారిగా మొత్తం 11 -కేసులు నమోదు అయినవి.
*నిందితుల వివరాలు :*
1. వనం రాము s/o నర్సింహులు 34 సం.లు, కులం: కుంచెరుకాల r/o ఇంటి. నెం.216 ,తారకరామనగర్
2. జగన్నాథ్ అభియా s/o నాగయ్య , 40సం లు , కులం: కుంచెరుకాల r/o ఇంటి. నెం.216 ,తారకరామనగర్
3. జగన్నాథ్ మీనయ్య s/o నాగయ్య , 24 సం లు , కులం: కుంచెరుకాల r/o ఇంటి. నెం. 6-6 ,తారకరామనగర్
పై నిందితులను ఈ రోజు న అనగా తేది : 29 .06 .2024 రోజున మద్యాహ్నం 14:00 గంటలకు JNTU చెక్ పోస్ట్,నాచుపల్లి
NH -563 హైవే రోడ్డు వద్ద వాహనాలు తనికి చేస్తుండగా పట్టుబడినారు. దొంగలించిన బంగారంలో కొంత మొత్తాన్ని గంగాధర్ ,సిద్దార్థ్ జువెల్లర్ జగిత్యాల అనునతనికి అమ్మడం జరిగింది , మరో ఇద్దరు నిందితులు పరారీలో వున్నారు. పైన తెలిపిన నిందితుతలు ఉదయం పూట బండ్ల మీద తాళం వేసిన ఇళ్లను గమనించి రాత్రి సమయంలో ఊరి చివర్లో వాహనాన్ని నిలిపి దొంగతనం చేసి వాహనాలపై పారిపోవడం జరుగుతుంది. ఊళ్లకు వెళ్లే వారు అప్రమత్తంగా ఉండాలని, ముందస్తుగా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని జిల్లా ఎస్పీ గారు ప్రజలకు సూచించారు. గ్రామలో ,పట్టణలో అనుమానాస్పదంగా తమ వీధుల్లో తిరిగే కొత్త వ్యక్తుల కదలికలపై 100 డయల్ లేదా దగ్గరలో ఉన్న పోలీస్ స్టేషన్ లో సమాచారం ఇవ్వాలని సూచించారు.
*నిందితుల నుంచి స్వాదినపరుచుకున్న సొత్తు వివరాలు:*
1. బంగారు ఆభరణాలు - 260 గ్రాములు
2. హుందాయి I 20 కారు -1
3.వ్యవసాయ కరెంట్ మోటార్లు-3
4.మూడు సెల్ ఫోన్ లను స్వాదిన పరుచుకోవడం జరిగింది.
“ స్వాదిన పరచుకున్న మొత్తం విలువ సుమారు 30,00,000/-రూపాయలు”.
*దొంగతనాల వివరాలు*
జగిత్యాల జిల్లా: ( 11-కేసులు)
1.కోడిమ్యాల పి. యస్:కోడిమ్యాల గ్రామంలోని నాగుల ఆఖిల అను ఇంటిలో తాళం పగులగొట్టి దొంగతనం,
2. మల్యాల పి. యస్: మల్యాల మండలం లోని తాటిపల్లి గ్రామం నందు దాసరి లక్ష్మీనారాయణ ఇంట్లో దొంగతనం .
3. మల్యాల పి. యస్: మల్యాల మండలం లోని తాటిపల్లి గ్రామం నందు సిరిమల్ల రాజ్యలక్ష్మీ ఇంట్లో దొంగతనం
4. మల్యాల పి. యస్: మల్యాల మండలం లోని మానాల గ్రామం నందు ఎడపెల్లి స్వప్న ఇంట్లో దొంగతనం
5. మల్యాల పి. యస్: మల్యాల మండలం లోని పోతారం గ్రామం నందు ఎలుకొండ చిన్న గంగారం ఇంట్లో దొంగతనం
6. మేడిపల్లి పి. యస్: మేడిపల్లి మండలం లోని కట్లకుంట గ్రామం నందు కుంట హారిక ఇంట్లో దొంగతనం
7. మేడిపల్లి పి. యస్: మేడిపల్లి మండలం లోని దేశాయిపేట గ్రామం నందు ఇల్లందుల శ్రీనివాస్ ఇంట్లో దొంగతనం
8 . రాయికల్ పి. యస్: రాయికల్ గ్రామం నందు బూడికే విజయలక్ష్మి ఇంట్లో దొంగతనం
9. జగిత్యాల రూరల్ పి. యస్:జగిత్యాల మండలం లోని ధరూర్ గ్రామ శివారులో కెనాల్ దగ్గర గల రెండు వ్యవసాయ కరెంట్ మోటార్లు దొంగతనం
10 జగిత్యాల రూరల్ పి. యస్: జగిత్యాల మండలం లోని తాటిపెళ్ళి గ్రామ శివారులో కెనాల్ దగ్గర గల ఐధు వ్యవసాయ కరెంట్ మోటార్లు దొంగతనం ,
11. జగిత్యాల రూరల్ పి. యస్: జగిత్యాల మండలం లోని ధరూర్ గ్రామ శివారులో కెనాల్ దగ్గర గల రెండు వ్యవసాయ కరెంట్ మోటార్లు దొంగతనం ,
పైన తెలిపిన ప్రాంతాలలో బంగారు, వెండి ఆభరణాలు మరియు డబ్బులు దొంగిలించిన పై ముగ్గురు దొంగలను, జిల్లా ఎస్పి శ్రీ ఆశోక్ కుమార్ ఐపీఎస్ గారి ఆదేశాలమేరకు జగిత్యాల డిఎస్పి శ్రీ రఘుచంధర్ గారి సూచనాలతో మరియు మల్యాల CI, నీలం రవి వారి పర్యవేక్షణలో పై దొంగలను పట్టుకున్న కోడిమ్యాల S.I సౌడం సందీప్, హెడ్ కానిస్టేబుల్ లు రాజు,రాజయ్య, సౌందర్య మరియు కానిస్టేబుల్ లు తిరుమల్, చంద్రశేఖర్ , వినోద్ ,రాజు ,సాగర్ ,శ్రీకాంత్ ,రాకేశ్ ,కళ్యాణ్, స్వప్న,కళ్యాణి మరియు CDR సెల్ నేరెళ్ళ రాజశేఖర్ , మహేష్ ,మల్లేశం మరియు ఇతర సిబ్బందిని జగిత్యాల ఎస్పిగారు అభినందిచినారు.
ఈ యొక్క విలేకరుల సమావేశంలో అదనపు ఎస్పీ (AR) భీమ్ రావు ,డిఎస్పీ రఘు చందర్, మల్యాల సి.ఐ రవి, ఎస్.ఐ సందీప్ మరియు సిబ్బంది పాల్గొన్నారు.
22/03/2024
జగిత్యాల జిల్లా...
*- - - జిల్లాకు అక్రమంగా డబ్బు, మద్యం, ఇతర వస్తువులు రానీయకుండా పకడ్బందీగా చెక్ పోస్టు ల నిర్వహణ.*
*- - - దొంగలమర్రి, రాయపట్నం చెక్ పోస్టులను ఆకస్మిక తనిఖీ చేసిన అదనపు ఎస్పీ శ్రీ వినోద్ కుమార్ గారు*
కొడిమ్యాల, ధర్మపురి పోలీస్ స్టేషన్ల పరిధిలోని దొంగలమర్రి, రాయపట్నం వద్ద ఏర్పాటు చేసిన చెక్ పోస్ట్ ను అదనపు ఎస్పీ గారు ఆకస్మికంగా తనిఖీ చేయడం జరిగింది.
ఈ సందర్భంగా అదనపు ఎస్పీ గారు మాట్లాడుతూ.. ఎన్నికలను సజావుగా నిర్వహించేందుకు చెక్పోస్టులు కీలకపాత్ర వ్యవహరిస్తాయని అన్నారు. జిల్లాలో ఏర్పాటు చేసిన అంతర్ జిల్లా బోర్డర్ చెక్ పోస్టులను పకడ్బందీగా 24x7 వాహన తనిఖీలు నిర్వహిస్తున్నామని జిల్లా లోనికి అక్రమ మార్గంలో ఎటువంటి మద్యం, డబ్బు, ప్రజలను ప్రలోభ పెట్టే వస్తువులను జిల్లాకు రాకుండా వివిధ శాఖల సమన్వయంతో 24 గంటల పర్యవేక్షణలో చెక్ పోస్టు ను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. అనంతరం వాహన తనిఖీలు చేసిన వాహన నమోదు చేసిన రిజిస్టర్ ను పరిశీలించడంతో పాటు, ప్రత్యక్షంగా పోలీస్ సిబ్బంది వాహనాలు తనిఖీలు చేస్తున్న తీరును క్షేత్ర స్థాయిలో పరిశీలించారు. తనిఖీల సమయంలో సిబ్బంది అప్రమత్తంగా వ్యవహారించండంతో పాటు, వాహనాలను క్షుణ్ణంగా తనిఖీలు చేయాలని సిబ్బందికి సూచించారు.
19/01/2024
జగిత్యాల జిల్లా...
జిల్లా ఎస్పీ శ్రీ సన్ ప్రీత్ సింగ్ ఐపిఎస్ గారి ఆదేశాలమేరకు కొడిమ్యల పోలీస్ స్టేషన్ పరిధిలో నమిలికొండ గ్రామంలో పోలీస్ కళా బృందం వారు మూఢ నమ్మకాలు, ఆత్మహత్యల నివారణ, రోడ్డు ప్రమాదాలు మరియు ట్రాఫిక్ నియమాలు, గల్ఫ్ ఏజెంట్ ల మోసాలు, సైబర్ మోసాలు,నివారణ పై అవగాహణ, సీసీ కెమెరాల యొక్క ఆవశ్యకత గురించి ప్రజలకు అవగాహన కల్పించడం జరిగింది.
ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్, పోలీసు సిబ్బంది, పోలీస్ కళా బృందం సభ్యులు మరియు గ్రామస్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
10/01/2024
జగిత్యాల జిల్లా....
కొడిమ్యల పోలీస్ స్టేషన్ లో పనిచేస్తూ గుండెపోటుతో మృతి చెందిన హెడ్ కానిస్టేబుల్ ఆంజనేయులు కుటుంబానికి జిల్లా ఎస్పీ శ్రీ సన్ ప్రీత్ సింగ్ ఐపిఎస్ గారు ఈరోజు జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో పోలీస్ భద్రత పథకం కింద మంజూరు కాబడిన 8,00,000/-రూపాయల చెక్కును ఆంజనేయులు గారి భార్యకు అందజేయడం జరిగింది. ఆంజనేయులు గారి కుటుంబానికి పోలీస్ శాఖ తరుపున పూర్తి సహకారం అందిస్తూ వారి కుటుంబానికి భరోసా కల్పిస్తామన్నారు.
ఈ కార్యక్రమంలో అడ్మినిస్ట్రేటివ్ అధికారి అమర్నాథ్ పాల్గొన్నారు
Click here to claim your Sponsored Listing.
Location
Category
Telephone
Website
Address
Kodimial
Jagtial
505501
