22/03/2024
పత్రిక ప్రకటన
జగిత్యాల జిల్లా..
*పెగడపల్లి పోలీస్ స్టేషన్ ను ఆకస్మిక తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ శ్రీ సన్ ప్రీత్ సింగ్ ఐపీఎస్ గారు*
ఈ సందర్బంగా ఎస్పీ గారు పోలీస్ స్టేషన్ పరిసరాలను, రిసెప్షన్, స్టేషన్ రైటర్, ఎస్ హెచ్ వో, రెస్ట్ రూమ్ , లాక్ అప్ రూమ్, 5S అమలు తీరును పరిశీలించారు. పోలీస్ స్టేషన్ లో ఎంత మంది సిబ్బంది ఉన్నారు, వారు ఏ ఏ విధులు నిర్వహిస్తున్నారో పరిశీలించారు. త్వరలో జరగనున్న లోక్ సభ ఎన్నికల నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ప్రశాంత వాతావరణం లో ఎన్నికల నిర్వహణకు ఫ్లాగ్ మార్చ్, రూట్ మార్చ్ లు నిర్వహించి ఓటర్ల కు భద్రతా భావాన్ని కలిగించాలన్నారు. సిబ్బంది తమకు కేటాయించిన గ్రామాల పూర్తి సమాచారం సిబ్బంది అందరి దగ్గర ఉండాలని, ప్రజలకు ఎల్లపుడు అందుబాటులో వుంటూ ప్రజల సమస్యలను తీర్చాలని, ప్రజా ఫిర్యాదులలో ఎటువంటి జాప్యం చేయకుండా తక్షణమే స్పందించాలని సూచించారు.పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న నేరస్తుల, రౌడీ షీటర్ల వివరాలు తెలుసుకున్నారు. పోలీస్ స్టేషన్ పరిధిలో పోలీస్ స్టేషన్ పరిధిలో గల సమస్యాత్మక, సున్నితమైన పోలింగ్ కేంద్రాల వివరాలు తెలుసుకున్నారు. గతంలో ఎన్నికల సమయంలో గొడవలు చేసిన లేదా అల్లర్లను సృష్టించి, ప్రజలను భయభ్రాంతులకు గురి చేసి, ఓటర్లను ప్రభావితం చేసే ఎన్నికల నేరస్థులపై, రౌడీ షీటర్ల పై పటిష్ట నిఘా ఏర్పాటు చేయాలని, వారిని సంబంధిత అధికారుల ఎదుట బైండోవర్ చేయాలని, వారి కదలికలపై ఎప్పటికప్పుడు నిఘా ఉంచాలన్నారు. ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నందున విధుల్లో అప్రమత్తంగా ఉండాలని,అలసత్వం ప్రదర్శిస్తే శాఖపరమైన చర్యలు తప్పవన్నారు.
ఈ కార్యక్రమంలో సి.ఐ రవి , ఎస్.ఐ రామకృష్ణా మరియు సిబ్బంది పాల్గొన్నారు.
24/02/2024
జగిత్యాల జిల్లా....
*సామాజిక అంశాలపై జిల్లా పోలీస్ కళ బృందం ద్వారా ప్రజలకు అవగాహన*
జిల్లా ఎస్పీ శ్రీ సన్ ప్రీత్ సింగ్ ఐపిఎస్ గారి ఆదేశాల మేరకు పెగడపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని లింగాపుర్ గ్రామం లో పోలీస్ కళాబృందం వారు మూఢ నమ్మకాలు, ఆత్మహత్యల నివారణ, రోడ్డు ప్రమాదాలు మరియు ట్రాఫిక్ నియమాలు, గల్ఫ్ ఏజెంట్ ల మోసాలు, సైబర్ మోసాలు,నివారణ పై అవగాహన, సీసీ కెమెరాల యొక్క ఆవశ్యకత గురించి ప్రజలకు అవగాహన కల్పించడం జరిగింది.
కార్యక్రమం భాగంగా ఏఎస్సై గారు మాట్లాడుతూ పోలీస్ స్టేషన్ పరిధిలో అన్ని గ్రామంలో సిసి కెమెరాలు ఏర్పాటు చేయడం జరుగుతుంది. దీని వల్ల గ్రామంలో ఏ సంఘటన జరిగిన వెంటనే తెలుస్తోంది అని తెలిపారు, సిసి కెమెరాలు ఏర్పాటు సహకరించలని గ్రామస్థులను కోరారు.తల్లిదండ్రులు పిల్లలను ఉన్నత చదువులు చదివించాలని అన్నారు.
యువత చెడు వ్యసనాలకు అలవాటు పడకూడదని,ప్రభుత్వం ,పోలీస్ తరపున అన్ని విధాల సహాయహకారులు ఉంటాయని అన్నారు. వాహన దారులు తాగి డ్రైవింగ్ చేయవద్దని, లైసెన్స్ లేకుండ వాహనాలు నడపవద్దని, వాహనాలు నడిపేటప్పుడు హెల్మెట్ ఆవశ్యకత గురించి వివరించారు.
గ్రామాల్లో అనుమానస్పదంగా వ్యక్తులు కనపడితే తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి ప్రజలకు వివరించారు. గ్రామంలో ఎలాంటి సమస్యలు వున్న పోలీస్ స్టేషన్ కు తెలియపరచాలని తెలిపారు. గ్రామంలో చిన్న చిన్న తగాదాలకు పోయి జీవితం నాశనము చేసుకొవద్దని, నేరరహిత గ్రామాలుగ చేయడానికి ప్రజలు కృషి చేయాలనీ సూచించారు. మంత్రాలు తత్రాలు ముడనమ్మకాలు నమ్మవద్దని, గ్రామాల్లో ఏ సమ్యస వున్న వెంటనే స్థానిక పోలీస్ స్టేషన్ లో తెలుపాలన్నారు,లేదా 100 నెంబర్ కు ఫోన్ చేస్తే నిమిషాల్లో పోలీసులు తమ వద్దకు వస్తారని అన్నారు.
ఈ కార్యక్రమంలో ఏఎస్సై గారు మరియు గ్రామ ఎంపీటీసీ,మాజీ సర్పంచ్, పోలీసు సిబ్బంది, పోలీస్ కళా బృందం సభ్యులు మరియు గ్రామస్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
10/01/2024
జగిత్యాల జిల్లా
తేదీ:10-01-2024 రోజున సాయంత్రం:06:00 గంటల సమయంలో ఒక వ్యక్తి నిషేధిత గంజాయి అక్రమంగా రవాణా చేస్తున్నట్లు నమ్మదగిన సమాచారం రాగా వెంటనే ఇట్టి విషయాన్ని వెంటనే పై అధికారులకు సమాచారం అందించి పోలీస్ సిబ్బందితో యుక్తంగా పెగడపల్లి బస్టాండ్ వద్ద వేచివుండగా ఒక వ్యక్తి అనుమానాస్పదంగా బస్టాండ్ వద్ద కనిపించగా వెంటనే అట్టి వ్యక్తి వద్దకు వెళ్లి అతని వద్ద వున్న హ్యాండ్ బ్యాగ్ తనిఖీ చేసి చూడగా అందులో 1.720 Kg గంజాయి దొరికినది.దాని విలువ అందద 35,000-/ వుంటుంది.తదుపరి అట్టి వ్యక్తి వివరాలు తెలుసుకొనగ తన పేరు:రాగల్ల వంశీ తండ్రి:శ్రీనివాస్, 22 సంవత్సరాలు, గ్రామం:వెంగలాయిపేట అని తెలిపినాడు.వెంటనే అట్టి వ్యక్తిని అదుపులోకి తీసుకొని గంజాయిని మరియు 2 సెల్ ఫోన్స్ స్వాధీనం పరుచుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంబించానైనది.
నేరస్తున్ని పట్టుకోవడంలో చాకచక్యంగా వ్యవహరించిన B.కోటేశ్వర్ CI మల్యాల గారు మరియు CH.సతీష్ SI పెగడపల్లి గారు ఇతర పోలీస్ సిబ్బంది అయిన ASI సత్తయ్య తిరుపతి,.సంపత్,.ఉదయ్,.మహేష్,ప్రవీణ్లను జిల్లా పోలీస్ ఉన్నతాదికారులు అభినందించనైనది
10/01/2024
జగిత్యాల జిల్లా....
*సామాజిక అంశాలపై జిల్లా పోలీస్ కళ బృందం ద్వారా ప్రజలకు అవగాహన*
జిల్లా ఎస్పీ శ్రీ సన్ ప్రీత్ సింగ్ ఐపిఎస్ గారి ఆదేశాలమేరకు పెగడ పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో బతకపల్లి గ్రామంలో పోలీస్ కళా బృందం వారు మూఢ నమ్మకాలు, ఆత్మహత్యల నివారణ, రోడ్డు ప్రమాదాలు మరియు ట్రాఫిక్ నియమాలు, గల్ఫ్ ఏజెంట్ ల మోసాలు, సైబర్ మోసాలు,నివారణ పై అవగాహణ, సీసీ కెమెరాల యొక్క ఆవశ్యకత గురించి ప్రజలకు అవగాహన కల్పించడం జరిగింది.
ఎస్.ఐ సతీష్ గారు మాట్లాడుతూ... నేను సైతం అనే కార్యక్రమం ద్వారా పోలీస్ స్టేషన్ పరిధిలో అన్ని గ్రామంలో సిసి కెమెరాలు ఏర్పాటు చేయడం జరుగుతుంది దీని వల్ల గ్రామంలో ఏ సంఘటన జరిగిన వెంటనే తెలుస్తోంది అని తెలిపారు, సిసి కెమెరాలు ఏర్పాటు సహకరించలని గ్రామస్థులను కోరారు.తల్లిదండ్రులు పిల్లలను ఉన్నత చదువులు చదివించాలని అన్నారు ,యూత్ చెడు వ్యసనాలకు అలవాటు పడకూడదని,ప్రభుత్వం ,పోలీస్ తరపున అన్ని విధాల సహాయహకారులు ఉంటాయని అన్నారు. వాహన దారులు తాగి డ్రైవింగ్ చేయవద్దని, లైసెన్స్ లేకుండ వాహనాలు నడపవద్దని, వాహనాలు నడిపేటప్పుడు హెల్మెట్ ఆవశ్యకత గురించి వివరించారు. గ్రామాల్లో అనుమానస్పదంగా వ్యక్తులు కనపడితే తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి ప్రజలకు వివరించారు. గ్రామంలో ఎలాంటి సమస్యలు వున్న పోలీస్ స్టేషన్ కు తెలియపరచాలని తెలిపారు. గ్రామంలో చిన్న చిన్న తగదలకు పోయి జీవితం నాశనము చేసుకొవద్దని, నేరరహిత గ్రామలుగా చేయడానికి ప్రజలు కృషి చేయాలనీ సూచించారు. మంత్రలు తత్రాలు ముడనమ్మకాలు నమ్మవద్దని, గ్రామాల్లో ఏ సమ్యస వున్న వెంటనే స్థానిక పోలీస్ స్టేషన్ లో తెలుపాలన్నారు,లేదా 100 నెంబర్ కు ఫోన్ చేస్తే నిమిషాల్లో పోలీసులు తమ వద్దకు వస్తారని అన్నారు.
ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్, పోలీసు సిబ్బంది, గ్రామస్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
10/01/2024
ప్రజాపాలనలో దరఖాస్తు చేసుకున్న వారికి ఇల్లు మంజూరైందని, లేదా మంజూరు చేయిస్తామంటూ మొబైల్ ఓటీపీ అడుగుతూ ఫోన్ కాల్స్ వస్తున్నాయా..
ఇది సైబర్ నెరగాళ్ల పని అని గ్రహించండి.
ప్రజాపాలనలో దరఖాస్తు పేరిట ఏ అధికారి మిమ్మలి OTP అడుగరు.
06/06/2022
#కమ్యూనిటీ_పొలిసింగ్ పెగడపల్లి మండలం ఏడుమోటార్లపల్లి GP వద్ద ప్రజలకు
💠బాల్య వివాహాలు
💠బాల కార్మిక నిషేధ చట్టం
💠కుల/సంఘ బహిష్కరణ మొదలగు సాంఘీక దురాచారాల గురించి
💠సైబర్ నేరాలు,
💠సైబర్ క్రైమ్ టోల్ ఫ్రీ నెంబర్ 1930, ,
📸CC కెమెరాల ప్రాధాన్యత గురించి అవగాహన కల్పిస్తున్న పెగడపల్లి పోలీస్