SHO Medipalli

SHO Medipalli

Share

Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from SHO Medipalli, Police station, Medipalli, Jagtial.

21/01/2025

జగిత్యాల జిల్లా....
గల్ఫ్ కు పంపిస్తానని డబ్బులు తీసుకొని నకిలీ వీసా ఇచ్చి మోసం చేసిన కేసులో నిందితుడికి 3 సంవత్సరాలు జైలు శిక్ష 1000 రూపాయల జరిమాన

మేడిపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని రాగోజిపేట గ్రామానికి చెందిన రాపల్లి నాగేష్ కు నిజామాబాద్ జిల్లా, పిప్పరి మండలం, భీమ్ గల్ గ్రామానికి చెందిన ఎగోలము మనోజ్ కుమార్ తో దుబాయ్ లో పరిచయం ఏర్పడింది. మనోజ్ తన దగ్గర దుబాయి దేశానికి చెందిన అలికో కంపెనీకి చెందిన వీసాలు ఉన్నాయ నమ్మించి రాపిల్లి నాగేష్ మరియు అదే గ్రామానికి చెందిన మరో ఆరుగురు దగ్గర ఒక్కొక్కరి దగ్గర 40,000 రూపాయల చొప్పున మొత్తం 2,40,000/- రూపాయలు తీసుకొని నకిలీ వీసాలు ఇవ్వడం జరిగింది. తమకు ఇచ్చిన వీసాలు నకిలీవని గమనించిన రాపల్లి నాగేష్ మేడిపల్లి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా నిందితుడు ఎగోలము మనోజ్ పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేసిన పోలీసులు కేసు విచారణలో భాగంగా జడ్జి శ్రీమతి పావని జుడీష్యల్ ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్, కోరుట్ల గారు సాక్షులను విచారించిన అనంతరం నిందితుడు మనోజ్ కుమార్ కు 3 సంవత్సరాలు జైలు శిక్ష 1000 రూపాయల జరిమానా విధించడం జరిగింది.

ఈ యొక్క కేస్ లో ఏపీపీ గా ప్రణయ్ కుమార్ ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ గా ఎస్సైలు శ్యామ్ రాజ్, V.వెంకటేశ్వర్ రావు ,
CMS SI శ్రీకాంత్ ,కోర్ట్ కానిస్టేబుల్ మహేశ్వర్, నిందితుని కి శిక్ష పడడం లో గౌరవ కోర్టుకు సాక్షాధారాలు అందించడం లో ప్రముఖ పాత్ర వహించడం జరిగింది. పై కేస్ లో నిందితుడు కి జైలు శిక్ష పడటం లో కృషి చేసిన పోలీసు అధికారుల ను జిల్లా ఎస్పీ శ్రీ అశోక్ కుమార్ ఐపిఎస్ గారు అభినందించారు.

23/06/2024

*పేకాట స్థావరంపై సీసీఎస్ పోలీసుల దాడి*

*- - - 7గురు అరెస్ట్*

*- - - 4,50,000/- నగదు,7మొబైల్స్ మరియు ఒక కారు, బైక్ స్వాధీనం ...*

*- - - జిల్లా ఎస్పీ శ్రీ అశోక్ కుమార్ ఐపీఎస్ గారి ఆదేశాలతో అక్రమ కార్యక్రమాలపై పటిష్ఠ నిఘా ...*

*- - - పేకాట ఆడిన, నిర్వహణ స్థావరాలు ఏర్పాటు చేసినా చట్ట ప్రకారం కఠిన చర్యలు*

మేడిపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని భీమారం గ్రామ శివారులో గల మామిడితోట లో గుట్టుచప్పుడు కాకుండా నిర్వహిస్తున్న పేకాట స్థావరం పై సీసీఎస్ పోలీసులు దాడి చేసి 7 మందిని అరెస్ట్ చేసి వారి వద్ద నుండి 4,50,000/- నగదు,7 మొబైల్స్ మరియు ఒక బైక్, కార్ స్వాధీనం చేసుకోవడం జరిగింది ....

ఈ సందర్భంగా సిసిఎస్ ఇన్స్పెక్టర్ లక్ష్మీనారాయణ గారు మాట్లాడుతూ... జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ ఐపీఎస్ గారి ఆదేశాలతో అక్రమ,అసాంఘిక కార్యక్రమాలపై నిఘా పటిష్టం చేసి,పక్క సమాచారంతో దాడులు నిర్వహిస్తున్నట్ల తెలిపారు ...

Photos from SHO Medipalli's post 27/02/2024

జగిత్యాల జిల్లా....

*సామాజిక అంశాలపై జిల్లా పోలీస్ కళ బృందం ద్వారా ప్రజలకు అవగాహన*

జిల్లా ఎస్పీ శ్రీ సన్ ప్రీత్ సింగ్ ఐపిఎస్ గారి ఆదేశాల మేరకు మేడిపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని తోబార్రావు పేట గ్రామం లో పోలీస్ కళాబృందం వారు మూఢ నమ్మకాలు, ఆత్మహత్యల నివారణ, రోడ్డు ప్రమాదాలు మరియు ట్రాఫిక్ నియమాలు, గల్ఫ్ ఏజెంట్ ల మోసాలు, సైబర్ మోసాలు,నివారణ పై అవగాహన, సీసీ కెమెరాల యొక్క ఆవశ్యకత గురించి ప్రజలకు అవగాహన కల్పించడం జరిగింది.

కార్యక్రమం భాగంగా ఎస్సై శ్యామ్ రాజ్ గారు మాట్లాడుతూ పోలీస్ స్టేషన్ పరిధిలో అన్ని గ్రామంలో సిసి కెమెరాలు ఏర్పాటు చేయడం జరుగుతుంది. దీని వల్ల గ్రామంలో ఏ సంఘటన జరిగిన వెంటనే తెలుస్తోంది అని తెలిపారు, సిసి కెమెరాలు ఏర్పాటు సహకరించలని గ్రామస్థులను కోరారు.తల్లిదండ్రులు పిల్లలను ఉన్నత చదువులు చదివించాలని అన్నారు.
యువత చెడు వ్యసనాలకు అలవాటు పడకూడదని,ప్రభుత్వం ,పోలీస్ తరపున అన్ని విధాల సహాయహకారులు ఉంటాయని అన్నారు. వాహన దారులు తాగి డ్రైవింగ్ చేయవద్దని, లైసెన్స్ లేకుండ వాహనాలు నడపవద్దని, వాహనాలు నడిపేటప్పుడు హెల్మెట్ ఆవశ్యకత గురించి వివరించారు.
గ్రామాల్లో అనుమానస్పదంగా వ్యక్తులు కనపడితే తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి ప్రజలకు వివరించారు. గ్రామంలో ఎలాంటి సమస్యలు వున్న పోలీస్ స్టేషన్ కు తెలియపరచాలని తెలిపారు. గ్రామంలో చిన్న చిన్న తగాదాలకు పోయి జీవితం నాశనము చేసుకొవద్దని, నేరరహిత గ్రామాలుగ చేయడానికి ప్రజలు కృషి చేయాలనీ సూచించారు. మంత్రాలు తత్రాలు ముడనమ్మకాలు నమ్మవద్దని, గ్రామాల్లో ఏ సమ్యస వున్న వెంటనే స్థానిక పోలీస్ స్టేషన్ లో తెలుపాలన్నారు,లేదా 100 నెంబర్ కు ఫోన్ చేస్తే నిమిషాల్లో పోలీసులు తమ వద్దకు వస్తారని అన్నారు.

ఈ కార్యక్రమంలో ఎస్సై శ్యామ్ రాజ్ గారు మరియు గ్రామ ఎంపీటీసీ,మాజీ సర్పంచ్, పోలీసు సిబ్బంది, పోలీస్ కళా బృందం సభ్యులు మరియు గ్రామస్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

25/08/2023

జగిత్యాల జిల్లా.....

*దారి దోపిడీ చేస్తున్న ముగ్గురు నిందితుల అరెస్ట్.*

*రెండు పెప్పర్ స్ప్రేలు బాటిల్లు, మూడు సెల్ ఫోన్లు స్వాధీనo.*

*నిందితుల వివరాలు:*

A1) ప్రకాష్ s/o రాముతల్, వయస్సు: 26 సంవత్సరాలు,కులం:రాజ్పుత్, ఘర్పూర్ గ్రామం, బంగారుమాలు తాసిల్, ఉన్నావు జిల్లా

A2) దరోగ s/o మోజీలాల్, వయస్సు:30 సంవత్సరాలు, కులం: రాజ్ పుత్, మల్లాపూర్వ గ్రామం, బిలిగ్రామ్ తాసిల్, హర్దోయ్ జిల్లా

A3. అభిషేక్ రాజ్ పుత్ s/o రమేష్ చంద్, వయస్సు:26 సంవత్సరాలు, కులం: లోదే రాజ్పుత్, శివలామూరు గ్రామం, బిలిగ్రామ్ తాసిల్, హార్దోయ్ జిల్లా

A4. మైనర్ బాలుడు పరారీలో ఉన్నాడు.

గత కొంతకాలంగా ఒంటరిగా ప్రయాణిస్తున్న మహిళలను లక్ష్యంగా చేసుకొని వారి కళ్ళల్లో పెప్పర్ స్ప్రే కొట్టి వారి మెడలో నుంచి బంగారు చైన్లు, ఒంటిపై గల విలువైన వస్తువులను గాని దొంగిలించే దారిదోపిడి ముఠాలోని ముగ్గురు దొంగలు నిన్న సాయంత్రం మెట్ పల్లి బస్టాండ్ ప్రాంతంలో అనుమానాస్పదంగా తిరుగుతుండగా మెట్ పల్లి సి.ఐ, వారి సిబ్బంది వారిని పట్టుకుని అదుపులోకి తీసుకొని విచారించగా వీరు గత సంవత్సరం క్రితం ఉత్తరప్రదేశ్ రాష్ట్రం నుండి కోరుట్ల మండలం వెంకటాపూర్ గ్రామానికి వచ్చి ఐస్ క్రీం లు అమ్ముతు జీవనోపాధి కొనసాగిస్తున్నారు, అలా వచ్చిన డబ్బులతో జల్సాలకు అలవాటు పడి డబ్బులు సరిపోనందున దొంగతనాలు, దోపిడీ చేయాలని నిర్ణయించుకుని గత సంవత్సరం తేదీ:30.10.2022 రోజున ముగ్గురు మహిళలు మెట్ పల్లి పాత బస్టాండ్ నుండి కోరుట్ల వైపుకు వెళ్తుండగా ఇట్టి ముగ్గురు దారి దోపిడీ దారులు అదే ఆటోలో ఎక్కి మెట్పల్లి నుండి కోరుట్ల వైపుకు వెళ్తున్న దారి మధ్యలో మారుతి నగర్ వద్ద ఆటోను ఆపి ముగ్గురు మహిళలు, మరియు ఆటో డ్రైవర్ పై పెప్పర్ స్ప్రే చేసి ఒక మహిళ మెడలో నుండి మూడు తులాల బంగారు చైన్ దొంగిలించికుపోయారు, అదేవిధంగా తేదీ: 21.08.2023 రోజున కూడా మేడిపల్లి గ్రామంలో ఇద్దరు భార్యాభర్తలు తమ ఆటోలో మేడిపల్లి అంగడిలో కూరగాయలు అమ్ముకొని తిరిగి కోరుట్లకు వెళుతున్న సమయంలో రాత్రి అందాజా ఎనిమిది గంటల సమయంలో పై ముగ్గురు వ్యక్తులతో పాటు మరొక మైనర్ బాలుడు, వయస్సు:14 సంవత్సరాలు మొత్తం నలుగురు కలిసి వారు ముందుగానే అనుకున్న పథకం ప్రకారం A1. ప్రకాష్ , A2. దరోగా, మైనర్ బాలుడు మేడిపల్లిలో అట్టి ఆటో ఎక్కి మేడిపల్లి శివారులోని ఎస్సారెస్పీ కెనాల్ వద్ద ఆటో ఆపి డ్రైవర్ తో అందులోని ప్రకాష్ అను వ్యక్తి ఆటో వెనుక సీట్లో కూర్చుంటానని చెప్పి ఆటో ఆగగానే పెప్పర్ స్ప్రే తీసి డ్రైవర్ కళ్ళలోకి కొట్టి అతడి జేబులో నుండి డబ్బులు తీసేందుకు ప్రయత్నం చేయగా ఆటో డ్రైవర్ మరియు అతని భార్య అరుపులు కేకలు వేయగా ఎవరికైన దొరికిపోతామేమో అనే భయంతో అప్పటికే అక్కడ కాపు కాస్తున్న అభిషేక రాజపుత్ తో కలిసి మొత్తం నలుగురు అక్కడి నుండి పారిపోయారు ఇట్టి సంఘటనలో ఎలాంటి డబ్బులు గానీ వస్తువులు గాని పోలేదు, ఇదే క్రమంలో నిన్న సాయంత్రం కూడా మెట్పల్లి ప్రాంతంలో ఏదైనా దోపిడీ చేద్దామని ప్రకాష్, దరొగ, అభిజిత్ రాజాపుత్ అను ముగ్గురు వ్యక్తులు రెండు పెప్పర్ స్ప్రే పట్టుకొని మెట్పల్లి బస్టాండ్ ప్రాంతంలో అనుమానాస్పదంగా తిరుగుతుండగా మెట్పల్లి సి.ఐ వారి సిబ్బంది వారిని పట్టుకోవడం జరిగింది, వారి నుండి రెండు పెప్పర్ స్ప్రే , మూడు సెల్ ఫోన్లు స్వాధీన పరుచుకొని ముగ్గురిని అరెస్టు చేయడం జరిగింది ముఠాలోని మైనర్ బాలుడు పరారీలో ఉన్నాడు. అతడిని కూడా త్వరలోనే పట్టుకుంటాం. ఇట్టి దారి దోపిడీ ముఠా సభ్యుల్ని పట్టుకోవడంలో చాకచక్యంగా వ్యవహరించిన కోరుట్ల సి.ఐ ఎం. ప్రవీణ్ కుమార్, మెటపల్లి సి.ఐ కె. లక్ష్మీనారాయణ , కోరుట్ల ఎస్సై కిరణ్ కుమార్, మేడిపల్లి ఎస్సై చిరంజీవి మరియు మేడిపల్లి పోలీస్ సిబ్బందిని అధికారులను జిల్లా ఎస్పీ గారు అభినందించారు.

29/01/2022

సురక్షితమైన సైబర్ స్పేస్ గురించి తన అభిప్రాయాలను తో పంచుకోవటానికి ప్రపంచ స్థాయి మహిళా బ్యాడ్మింటన్ స్టార్ గారు "iSMART CYBER CHILD" ద్వారా లైవ్ లో మన ముందుకు రాబోతున్నారు

Photos from Jagtial District Police's post 12/01/2021
28/12/2020
Photos from SHO Medipalli's post 27/12/2020
24/12/2020

Don't fall prey to unauthorized mobile apps for instant loans.

Want your business to be the top-listed Government Service in Jagtial?

Click here to claim your Sponsored Listing.

Location

Category

Website

Address


Medipalli
Jagtial