మద్యం సేవించి అజాగ్రత్తగా వాహనం నడిపి ఒకరి మరణానికి కారణం అయన కేసులో నిందితుడికి 10 సంవత్సరం జైలు శిక్ష, 20,500/- రూపాయల జరిమాన...
మెట్పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని చెందిన సంకేత్ తేదీ 01-02-2022 రోజున మద్యానం 12 గంటల సమయం లో తన ద్విచక్ర వాహనం తో మెటపల్లి బస్ డిపో ను౦డి ఏకలవ్య నగర్ కు తిరిగి ఇంటికి వస్తున్న క్రమంలో AP 25T 6877 అనే లారీ డ్రైవర్ షేక్ ఇషాక్ నిజామాబాద్ జిల్లా కి చెందిన వ్యక్తి మద్యం సేవించి అతివేగంగా అజాగ్రత్తగా నడిపి ముందు నుండి వెళ్తున్న ద్విచక్ర వాహనం పై ఉన్న సంకేత్ ను డీకొట్టగా తీవ్రగా గాయాలు అయ్యే సంఘటన స్థలంలో మరణించడం జరిగింది.ఇట్టి విషయం గురించి మృత్తిడి మమ రాజశేకర్ మెటపల్లి పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయగా అప్పటి ఎస్.ఐ సదకర్ నిందితుడి పై కేసు నమోదు చేసి విచారణ జరిపి ఛార్జ్ షీటు దాఖలు చేశారు.
కోర్టు కానిస్టేబుల్ రంజిత్,CMS కానిస్టేబుల్ G. కిరణ్ కుమార్ లు సాక్షులను ప్రవేశపెట్టగా అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ k.మల్లేశం గారు తమ వాదనలు వినిపించగా సాక్షులను విచారించిన గౌరవ న్యాయమూర్తి శ్రీ S. నారాయణ అడిషనల్ సెషన్స్ జడ్జి గారు నిందితుడికి 10 సంవత్సరముల కఠిన కారాగార శిక్ష, మరియు 20,500/- వేల రూపాయల జరిమాన విధిస్తూ తీర్పునిచ్చారు.
SHO Metpalli
Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from SHO Metpalli, Police station, Metpalli, Jagtial.
హత్య కేసులొ నిందితుడికి జీవిత ఖైదు, 5 వేల రూపాయలు జరిమాన.....
మెట్పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని ఆరపేట కు చెందిన షేక్ అహ్మద్ మేస్త్రి పనులు చేస్తూ జీవనం సాగిస్తాడు. తేదీ 18-2-2023 శివరాత్రి పండుగను పురస్కరించుకొని పనిలోకి వెళ్లకుండా అతని స్నేహితులతో కలిసి ఇంటి దగ్గర మద్యం సేవిస్తుండగా అతనితో చెట్పల్లి సురేష్ అనుమతను సిమ్ కార్డ్ విషయంలో గొడవ పెట్టుకొని మాట మాటా పెరిగి సురేష్ తన జేబులో ఉన్న నెయిల్ కటర్ తీసి షేక్ అహ్మద్ కడుపులో పొడువగా తీవ్ర రక్త అయినది ఇది గమనించిన అతని బావమరిది షేక్ అహ్మద్ ను మెట్పల్లి హాస్పటల్ కు తరలించగా మెరుగైన చికిత్స నిమిత్తం జగిత్యాల హాస్పిటల్ కు తరలించగా అక్కడ నుండి నిజామాబాడు ఆసుపత్రి కి తరలించగా అక్కడ చికిత్స పొందుతూ మరణించడం జరిగింది. మృతుడి బావమరిది ఫిర్యాదు మేరకు మెట్పల్లి పోలీస్ స్టేషన్లో అప్పటి ఎస్సై శ్యామ్ రాజ్ కేసు నమోదు చేయగా సి.ఐ లక్ష్మీనారాయణ దర్యాప్తు చేసిన నిదితుడు అయన చెట్పల్లి సురేష్, వయస్సు 36 సంవత్సరాలు గ్రామo వీరాపూర్, రాయికల్ మండలం కు చెందిన వ్యక్తిని కోర్టులో హాజరు పరచడం జరిగింది. కేస్ ను విచారించిన Hon'ble Prl. District and Sessions Judge శ్రీమతి నీలిమ గారు నిందితునికి జీవిత ఖైదు తో పాటు 5000 /- రూపాయల జరిమానా విధిస్తూ తీర్పు వెల్లడించారు.
20/02/2025
15/02/2025
తాళం వేసి ఉన్న ఇళ్లు, మోటార్ సైకిళ్లు, వ్యవసాయ కరెంటు మోటార్ల దొంగతనాలు చేసే ముగ్గురు నిందితులు గల ముఠా అరెస్ట్.
6 లక్షలు విలువగల ( ఒక మోటార్ సైకిల్, 30 కిలోల కాపర్ వైర్ మరియు 30 వ్యవసాయ కరెంటు మోటార్లు. రూ.5,000) స్వాదినం
వివరాలు వెల్లడించిన జిల్లా ఎస్పి శ్రీ అశోక్ కుమార్ ఐపిఎస్ గారు....
మెట్‌పల్లి సబ్ డివిజన్ పరిధిలో ఇటీవల జరిగిన దొంగతనాల కేసులలో ముగ్గురు నిందితులను అరెస్టు చేసి, వారి వద్ద నుంచి రూ.6 లక్షల విలువైన సొత్తును స్వాధీనం చేసుకోవడం జరిగిందని జిల్లా ఎస్పీ శ్రీ అశోక్ కుమార్ ఐపిఎస్ గారు తెలిపారు. తాళం వేసి ఉన్న ఇళ్లు, మోటార్ సైకిళ్లు, వ్యవసాయ కరెంటు మోటార్ల దొంగతనాలు ప్రత్యేక నిఘ ఏర్పాటు చేసి మెట్‌పల్లి డీఎస్పీ రాములు ఆధ్వర్యంలో, మెట్‌పల్లి సీఐ నీరంజన్ రెడ్డి నేతృత్వం ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ యొక్క బృందo సీసీటీవీ ఫుటేజీలు మరియు ఇతర సాంకేతిక పరిజ్ఞానం ఆధారంగా ఈ రోజు ఉదయం ఇబ్రహీంపట్నం ఎక్స్ రోడ్డు వద్ద ఇబ్రహీంపట్నం ఎస్సై. అనిల్ తన సిబ్బంది కలిసి వాహనాలు తనిఖీ చేస్తుండగా, ఇద్దరు అనుమానితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు వారిని విచారించగా వారు దొంగతనాలకు పాల్పడినట్లు అంగీకరించారు. వీరు మెట్‌పల్లికి చెందిన స్క్రాప్ వ్యాపారితో కలిసి ముఠాగా ఏర్పడి దొంగతనాలకు పాల్పడుతున్నట్లు తేలింది. నిందితులు మెట్‌పల్లి, ఇబ్రహీంపట్నం, మల్లాపూర్, కథలాపూర్ పరిధిలో దొంగతనాలకు పాల్పడ్డారు. దొంగిలించిన వస్తువులను స్క్రాప్ వ్యాపారికి విక్రయించి, డబ్బులు పంచుకునేవారు.
నిందితుల వివరాలు మరియు వారి నేపథ్యం:
A-1: కుంచేపు వెంకటేష్,తండ్రి పేరు: మైసయ్య, వయస్సు: 28 సం.,డి.డి. నగర్, మెట్‌పల్లి ట్రాక్టర్ డ్రైవర్ గా పని చేస్తూ జీవించేవాడు. వచ్చిన డబ్బులు అతని కుటుంబాలకు మరియు జల్సాలకు సరిపోకపోవడంతో ఏదైనా దొంగతనం చేయాలని నిర్ణయించుకొని గతంలో కూడా కోరుట్ల పోలీస్ స్టేషన్ పరిదిలో (6) మరియు మెట్పల్లి పోలీస్ స్టేషన్ (2) వివిధ దొంగతనాలకు పాల్పడి జైలుకు వెళ్లి తిరిగి వచ్చినారు కూడా ఈజీగా డబ్బులు సంపాదించాలని ఉద్దేశంతో మళ్లీ దొంగతనాలు చేస్తున్నాడు ఇతడు మెట్పల్లి పోలీస్ స్టేషన్లో ఒక గ్యాంగ్ రేప్ కేసులో కూడా ముఖ్యమైన నిందితుడు.
A-2: సూర్యవంశీ సాయికుమార్, తండ్రి పేరు: శ్యాం రావు, వయస్సు: 28 సం., కులం: SC-మాల స్వస్థలం: ARP క్యాంపు, ఎడపల్లి, నిజామాబాదు జిల్లా ప్రస్తుత చిరునామా: రాఘవపేట గ్రా., మల్లాపూర్ మం. ట్రాక్టర్ డ్రైవర్ పనిచేసుకుంటూ జీవిస్తు ఉన్నాడు. ఇతడు కూడా ట్రాక్టర్ వచ్చే డబ్బులు అతని కుటుంబ అవసరాలకు మరియు అతని జల్సా లకు సరిపోక ఈ క్రమంలో పరిచయమైన మొదటి నిందితుడు కొంచెం వెంకటేష్ తో కలిసి దొంగతనాలు చేయాలని నిర్ణయించుకున్నాడు.
A-3: అబ్దుల్ బారి, తండ్రి పేరు: అబ్దుల్ ఖాదర్, వయస్సు: 61 సం., ముస్లిం, చిరునామా: రెడ్డి కాలనీ, మెట్‌పల్లి. గత కొంత కాలం నుంచి మెట్పల్లి పట్టణంలో స్క్రాప్ బిజినెస్ పేరుతో వ్యాపారం నిర్వహించేవాడు. ఇతను దొంగిలించిన సొత్తును కొనేవాడు.
ఇట్టి ముగ్గురు కలిసి సులువుగా డబ్బులు సంపాదించాలనే ఉద్దేశ్యం తో ఒక వ్యవస్థి కృత నేరానికి తేరాలేపినారు.
కేసుల వివరాలు మరియు స్వాధీనం చేసుకున్న సొత్తు:
ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్:
ఒక ఇల్లు దొంగతనం కేసు: స్వాధీనం చేసుకున్న సొత్తు: రూ.5,000.
ఆరు వ్యవసాయ కరెంటు మోటార్ దొంగతనం కేసులు: 11 కరెంటు మోటార్లు.
మెట్‌పల్లి పోలీస్ స్టేషన్:
ఒక మోటార్ సైకిల్ దొంగతనం కేసు.
మూడు వ్యవసాయ కరెంటు మోటార్ దొంగతనం కేసులు: 8 కరెంటు మోటార్లు.
మల్లాపూర్ పోలీస్ స్టేషన్:
ఒక కాపర్ వైర్ దొంగతనం కేసు.
రెండు వ్యవసాయ కరెంటు మోటార్ దొంగతనం కేసులు: 10 కరెంటు మోటార్లు.
కథలాపూర్ పోలీస్ స్టేషన్:
ఒక వ్యవసాయ కరెంటు మోటార్ దొంగతనం కేసులు: 1కరెంటు మోటార్లు.
స్వాధీనం చేసుకున్న సొత్తు
6 లక్షలు విలువగల ( ఒక మోటార్ సైకిల్, 30 కిలోల కాపర్ వైర్ మరియు 30 వ్యవసాయ కరెంటు మోటార్లు. రూ.5,000) స్వాదినం
ఈ కేసును తక్కువ సమయంలో ఛేదించిన డీఎస్పీ రాములు, సీఐ నిరంజన్ రెడ్డి, ఎస్సై అనిల్, ఎస్సై కిరణ్, ఎస్సై రాజు, సిబ్బంది చైతన్య, కిరణ్, అనిల్, సాధు నాయక్ మరియు మారుతీ లను జిల్లా శ్రీ అశోక్ కుమార్ ఐపిఎస్ ఎస్పీ అభినందించారు.
Telangana State Police
23/01/2025
రోడ్డు ప్రమాదాల నివారణ చర్యలో బాగంగా గుంతలు పడ్డ రోడ్డును మర్మతులు చేసిన జగిత్యాల జిల్లా పోలీసులు....
రోడ్డు ప్రమాదాల నివారణ చర్యలో భాగంగా జిల్లాలో రోడ్డు ప్రమాదాలు జరుగు ప్రదేశాల్లో ప్రత్యేక చర్యలు చేపడుతూ ప్రమాదాల నివారణకు జిల్లా పోలీసులు కృషి చేస్తునారు. ఇందులో భాగంగా మెట్ పల్లి పట్టణం లోని RTC బస్ డిపో సర్కిల్ దగ్గర గుంతలు ఏర్పడ గా వాహనదారులకు ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని, ప్రజల సౌకర్యం మరియు వారి భద్రత దృష్ట్యా మెట్ పల్లి ఎస్.ఐ కిరణ్ కుమార్ గారు మానవత ద్రూక్పధo తో స్థానికుల సహాయంతో కంకర తెప్పించి రోడ్డు పై ఏర్పడిన గుంతలను పూడ్చి వేయడం జరిగింది.
రోడ్డు ప్రమాదాల నివారణకు కృషి చేస్తున్న ఎస్.ఐ ని పట్టణ ప్రజలు, వాహనదారులు అభినందించి హర్షం వ్యక్తం చేశారు...
01/07/2024
*పోలీస్ స్టేషన్ కు వచ్చే బాధితులకు తక్షణమే న్యాయం జరిగేలా కృషి చేయాలి**
ఇబ్రహీంపట్నం, మెట్ పల్లి పోలీస్ స్టేషన్ ను ఆకస్మిక తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ శ్రీ అశోక్ కుమార్ ఐపీఎస్ గారు. ఈ సందర్బంగా ఎస్పీ గారు స్టేషన్ పరిసరాలను మరియు రిసెప్షన్, స్టేషన్ రైటర్, ఎస్ హెచ్ వో, రెస్ట్ రూమ్, లాక్ అప్ రూమ్ ను పరిశీలించారు. 5S అమలు తీరును పరిశీలించారు.
పోలీస్ స్టేషన్ లో ఎంత మంది సిబ్బంది ఉన్నారు, వారు ఏ ఏ విధులు నిర్వహిస్తున్నారో పరిశీలించారు. పోలీస్ స్టేషన్ నుండి రోజు ఎన్ని బ్లూ కోల్ట్స్, పెట్రో కార్స్ విధులు నిర్వహిస్తున్నాయని, పోలీస్ స్టేషన్ పరిధిలో ఎక్కడెక్కడ ఎన్ని బిట్స్ నడుస్తున్నాయని తెలుసుకొని ప్రాపర్ గా పెట్రోలింగ్ నిర్వహిస్తూ దొంగతనాలు జరగకుండా చూసుకోవాలని ఆదేశించారు.
డయల్ 100 కాల్ రాగానే వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని సమస్య పరిష్కరించాలని, బ్లూకోల్ట్స్, పెట్రోల్ కార్ నిరంతరం 24x7 గస్తీ నిర్వహించాలని, సిబ్బంది తమకు కేటాయించిన గ్రామాల పూర్తి సమాచారం సిబ్బంది అందరి దగ్గర ఉండాలని, ప్రజలకు ఎల్లపుడు అందుబాటులో ఉండి ప్రజల సమస్యలను తీర్చాలని, ప్రజా ఫిర్యాదులలో ఎటువంటి జాప్యం చేయకుండా తక్షణమే స్పందించాలని సూచించారు.
గ్రామాలలో సీసీ కెమెరాల ఏర్పాటు ప్రాముఖ్యతను ప్రజలకు వివరించాలని, సైబర్ నేరాల పట్ల ప్రజలతోపాటు యువతను అప్రమత్తం చేయాలని సూచించారు.
26/08/2023
జగిత్యాల జిల్లా.....
*- - -శాంతి భద్రతల పరిరక్షణ కొరకే కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రోగ్రాం*
*- - - అనుమానిత వ్యక్తులు కనిపిస్తే పోలీసులకు సమాచారం ఇవ్వండి.*
*- - - సరైన పత్రాలు లేని 123 వాహనాలు స్వాధీనం, 20 లీటర్ల గుడుంబా సీజ్.*
*- - - మాదకద్రవ్యాలను, పేలుడు పదార్థాలను కనిపెట్టే డాగ్స్ స్క్వాడ్ చే తనిఖీలు*
జిల్లా ఎస్పీ శ్రీ ఎగ్గడి భాస్కర్ గారి ఆదేశాల మేరకు డిఎస్పిలు వెంకటస్వామి, రవీంద్ర రెడ్డి గారి ఆద్వర్యంలో జగిత్యాల పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలోని చిలుకవాడ కోరుట్ల పోలీస్ స్టేషన్ పరిధిలోని నక్కలగుట్ట లో ఈరోజు ఉదయం కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రోగ్రాం నిర్వహించారు.
ఈ సందర్భంగా డిఎస్పీలు స్థానిక ప్రజలతో మట్లాడుతు... ప్రజల రక్షణ గురించి ప్రజల లో భద్రతాభావం సెన్స్ ఆఫ్ సెక్యూరిటీ కల్పించడం గురించి మరియు ప్రజల యొక్క సమస్యలు నేరుగా తెలుసుకొనే అవకాశం ఉంటుందని ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగిందని తెలిపారు. పట్టణ,గ్రామంలో, కాలనీలో ఎవరైనా కొత్త వ్యక్తులు గాని నేరస్తులు కానీ వచ్చి షెల్టర్ తీసుకుంటున్నారా అనే విషయం కూడా తెలుస్తుందని, నేర రహిత గ్రామలుగా చేయలనే జిల్లా ఎస్పీ గారి ఉద్దేశ్యం తోనే ఈ యొక్క కార్యక్రమo నిర్వహించడం జరుగుతుందని తెలిపినారు. అదేవిధంగా మాదక ద్రవ్యాలను, గంజాయి వంటి మత్తు పదార్థాలను, పేలుడు పదార్థాలను నివృత్తి చేయగల జాగిలల చే విస్తృత తనిఖీలు నిర్వహించారు.ఈ సందర్భంగా జగిత్యాల టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఎలాంటి పేపర్లు లేని, సరైన నంబర్ ప్లేట్స్ లేని 40వాహనాలు సీజ్ చేయడం జరిగింది. అదేవిధంగా కోరుట్ల పోలీస్ స్టేషన్ పరిధిలోని సరైన పత్రాలు లేని 83 వాహనాలు, 20 లీటర్ల ప్రభుత్వ నిషేధిత గుడుంబను స్వాధీనం చేసుకోవడం జరిగింది.వాహనాలు నడిపే ప్రతి ఒక్కరు తప్పనిసరిగా వారి యొక్క వాహనాలకు ఆర్ సి, ఇన్సూరెన్స్, మరియు డైవింగ్ లైసెన్స్ కలిగివుండాలని తెలిపారు.ఎలాంటి పత్రాలు లేని వాహనాలు నడపవద్దని నడిపేవారి పై చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని తెలిపినారు. పాత వాహనాలు కొనేటప్పుడు వాటి యొక్క డాక్యుమెంట్స్ చెక్ చేసుకుని కొనాలని డాక్యుమెంట్స్ లేని వాహనాలను కొనుగోలు చేయవద్దని అన్నారు. ఎవరైనా అనుమానస్పదంగా తిరుగుతూ వుంటే వెంటనే పోలీసుల కు ఫోన్ చేయాలని లేదా డయల్ 100 కాల్ కు ఫోన్ చేసినాచో వెంటనే చర్యలు చేపడతాం అన్నారు. తనిఖీలు నిర్వహించడం వలన నేరాల రేటు తగ్గుముఖం పట్టడం తో పాటు ప్రజలకు మరింత రక్షణ కల్పించవచ్చని తెలిపినారు.ఈ యొక్క కార్యక్రమాo తరుచుగా నిర్వహిస్తామని తెలిపారు. చట్ట వ్యతిరేక కార్యక్రమాలు అయిన గాంజా, గుడుంబా రవాణా మరియు విక్రయాలు చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. ప్రస్తుత రోజుల్లో సైబర్ నేరాల సంఖ్య ఎక్కువైందని వీటి పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కోరారు.ఈ యొక్క కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రోగ్రాం కి సహకరించిన ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో టౌన్ ఇన్స్పెక్టర్ నటేష్, కోరుట్ల సీ.ఐ ప్రవీణ్ కుమార్ మరియు ఎస్.ఐ లు ఖాన్, ఎస్.ఐ లు ASI లు, హెడ్ కానిస్టేబుల్,కానిస్టేబుల్ , డిస్ట్రిక్ట్ గార్డ్ సిబ్బంది, హోమ్ గార్డ్స్ పాల్గొన్నారు.
Click here to claim your Sponsored Listing.
Location
Category
Telephone
Website
Address
Metpalli
Jagtial
