27/05/2025
*గంజాయి అనార్థాలపై యువతకు అవగాహన కార్యక్రమం....
జిల్లా ఎస్పీ శ్రీ అశోక్ కుమార్ ఐపీఎస్ ఎస్పీ గారి ఆదేశాల మేరకు యువతలో గంజాయి నిర్మూలన అవగాహనలో భాగంగా బీర్పూర్ మండలం తుంగూరు లోని ప్రైవేట్ కంప్యూటర్ ఇన్స్టిట్యూట్లో శిక్షణ తీసుకుంటున్న యువకులకు గంజాయి అనార్థాలపై అవగాహన కార్యక్రమం నిర్వహించడం జరిగింది..
ఈ సందర్భంగా బీర్పూర్ ట్రైనీ ఎస్సై రాజు మాట్లాడుతూ...
గంజాయి ఇతర డ్రగ్స్ త్రాగడం వల్ల ఆరోగ్యం దెబ్బతింటుందని, దాని ద్వారా బంగారు భవిష్యత్తు నాశనం అవుతుందని యువకులకు తెలియజేశారు. సెలవులలో దొరికిన సమయాన్ని కంప్యూటర్ శిక్షణ కోసం వినియోగిస్తున్నందుకు వారిని అభినందించారు మరియు మంచి అలవాట్లతో మంచి భవిష్యత్తు ఉంటుందని వారికి తెలియజేశారు.
యువతపై వారి తల్లిదండ్రులు ఎన్నో ఆశలు పెట్టుకొని జీవిస్తారని వారికి తెలియజేసి ఎవరు కూడా వారి తల్లిదండ్రుల ఆశలను వమ్ము చేయకుండా మంచిగా చదువుకొని తల్లిదండ్రులకు గ్రామానికి మంచి పేరు తీసుకురావాలని చెడు అలవాట్లు కు గురికాకుండా ఉండాలని తెలియజేశారు. ఎవరైనా గంజాయి కి అలవాటు పడిన, గంజాయి అమ్మిన, కొన్న, పోలీస్ వారికి తెలియజేయాలని చెప్పారు. బీర్పూర్ పోలీస్ స్టేషన్ నెంబర్ 8712656828 కి తెలియపరచాలని చెప్పారు. యువత ముఖ్యంగా ధూమపానం మద్యం గంజాయి వంటి వాటికి దూరంగా ఉండాలని ఘంటా పథంగా చెప్పారు.గంజాయి నిర్మూలనలో అందరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో భాగంగా యువతకు స్పోకెన్ ఇంగ్లీష్ పుస్తకాలు ఇవ్వడం జరిగింది.
04/05/2025
వెంటనే స్పందించారు.... ప్రాణాలు నిలిపారు.
నిర్మల్ జిల్లా కి చెందిన గణపతి బీర్పూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని రోల్ల వాగు దగ్గర పీతలు పట్టడానికి వచ్చి పాముకాటుకు గురికాగా అర్ధరాత్రి సమయంలో డయాల్ 100 ద్వారా పోలీసులను సంప్రదించగా వెంటనే స్పందించిన బీర్పూర్ ప్రొబిషనరీ ఎస్.ఐ రాజు తమ సిబ్బంది తో కలిసి పాముకాటు గురైన వ్యక్తిని అటవీ ప్రాంతo నుండి సురక్షితంగా 108 అంబులెన్స్ ద్వారా జగిత్యాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించడం జరిగింది.
ఆపద సమయంలో వెంటనే స్పందించి ఒక వ్యక్తి ప్రాణాలు కాపాడినందుకు ప్రొబిషనరీ ఎస్.ఐ రాజు మరియు సిబ్బందిని జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ ఐపిఎస్ గారు అభినందించారు.
Telangana police 🚓
07/07/2024
డయల్ 100 కాల్స్ కి తక్షణమే స్పందించి వెంటనే సంఘటనా స్థలానికి చేరుకోవాలి.
సైబర్ మోసాల పై ప్రజలకు అవగాహన కల్పించాలి
బీర్పూర్ పోలీస్ స్టేషన్ ను ఆకస్మికంగా తనిఖీ చేయడం జరిగింది
ఈ సందర్భంగా పోలీస్ స్టేషన్ లో ఎంత మంది సిబ్బంది ఉన్నారు, వారు ఏ ఏ విధులు నిర్వహిస్తున్నారో పరిశీలించుట జరిగింది. పోలీస్ స్టేషన్ నుండి రోజు ఎన్ని బ్లూ కోల్ట్స్, పెట్రో కార్స్ విధులు నిర్వహిస్తున్నాయని, పోలీస్ స్టేషన్ పరిధిలో ఎక్కడెక్కడ ఎన్ని బిట్స్ నడుస్తున్నాయని తెలుసుకొని ప్రాపర్ గా పెట్రోలింగ్ నిర్వహిస్తూ దొంగతనాలు జరగకుండా చూసుకోవాలని ఆదేశించడం జరిగింది. "డయల్ 100 కాల్ రాగానే వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని సమస్య పరిష్కరించాలని, బ్లూకోల్ట్స్, పెట్రోల్ కార్ నిరంతరం 24x7 గస్తీ నిర్వహించాలి. ప్రజలకు ఎల్లపుడు అందుబాటులో వుంటూ ప్రజల సమస్యలను తీర్చాలి, ప్రజా ఫిర్యాదులలో ఎటువంటి జాప్యం చేయకుండా తక్షణమే స్పందించాలి . సిబ్బంది, అధికారులు అందరూ విధులు సక్రమంగా నిర్వహించడం ద్వారానే శాంతిభద్రతలు అదుపులో ఉంటాయి. ప్రస్తుత రోజుల్లో మద్యం సేవించి వాహనాలు నడపడం ద్వారా ఎక్కువగా ప్రమాదాలు జరుగుతున్నాయి కావున ప్రమాదాలను దృష్టిలో ఉంచుకొని ట్రాఫిక్ మరియు టౌన్ సిబ్బంది అందరూ డ్రంక్ అండ్ డ్రైవ్ చేసే వారిపై పై ఎక్కువ దృష్టి సారించి ప్రమాదాల నివారణకు కృషి
చేయాలని" సూచించడం జరగింది.
03/02/2024
జగిత్యాల జిల్లా....
*సామాజిక అంశాలపై జిల్లా పోలీస్ కళ బృందం ద్వారా ప్రజలకు అవగాహన*
జిల్లా ఎస్పీ శ్రీ సన్ ప్రీత్ సింగ్ ఐపిఎస్ గారి ఆదేశాల మేరకు బీర్ పుర్ పోలీస్ స్టేషన్ పరిధిలో బీర్ పూర్ గ్రామంలో పోలీస్ కళా బృందం వారు మూఢ నమ్మకాలు, ఆత్మహత్యల నివారణ, రోడ్డు ప్రమాదాలు మరియు ట్రాఫిక్ నియమాలు, గల్ఫ్ ఏజెంట్ ల మోసాలు, సైబర్ మోసాలు,నివారణ పై అవగాహణ, సీసీ కెమెరాల యొక్క ఆవశ్యకత గురించి ప్రజలకు అవగాహన కల్పించడం జరిగింది.
ఎస్సై గౌతం పవార్ గారు మాట్లాడుతూ... నేను సైతం అనే కార్యక్రమం ద్వారా పోలీస్ స్టేషన్ పరిధిలో అన్ని గ్రామంలో సిసి కెమెరాలు ఏర్పాటు చేయడం జరుగుతుంది దీని వల్ల గ్రామంలో ఏ సంఘటన జరిగిన వెంటనే తెలుస్తోంది అని తెలిపారు, సిసి కెమెరాలు ఏర్పాటు సహకరించలని గ్రామస్థులను కోరారు.తల్లిదండ్రులు పిల్లలను ఉన్నత చదువులు చదివించాలని అన్నారు ,యూత్ చెడు వ్యసనాలకు అలవాటు పడకూడదని,ప్రభుత్వం ,పోలీస్ తరపున అన్ని విధాల సహాయహకారులు ఉంటాయని అన్నారు. వాహన దారులు తాగి డ్రైవింగ్ చేయవద్దని, లైసెన్స్ లేకుండ వాహనాలు నడపవద్దని, వాహనాలు నడిపేటప్పుడు హెల్మెట్ ఆవశ్యకత గురించి వివరించారు.
గ్రామాల్లో అనుమానస్పదంగా వ్యక్తులు కనపడితే తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి ప్రజలకు వివరించారు. గ్రామంలో ఎలాంటి సమస్యలు వున్న పోలీస్ స్టేషన్ కు తెలియపరచాలని తెలిపారు. గ్రామంలో చిన్న చిన్న తగదలకు పోయి జీవితం నాశనము చేసుకొవద్దని, నేరరహిత గ్రామలుగా చేయడానికి ప్రజలు కృషి చేయాలనీ సూచించారు. మంత్రలు తత్రాలు ముడనమ్మకాలు నమ్మవద్దని, గ్రామాల్లో ఏ సమ్యస వున్న వెంటనే స్థానిక పోలీస్ స్టేషన్ లో తెలుపాలన్నారు,లేదా 100 నెంబర్ కు ఫోన్ చేస్తే నిమిషాల్లో పోలీసులు తమ వద్దకు వస్తారని అన్నారు.
ఈ కార్యక్రమంలో ఎస్సై గౌతం పవార్ గారు, గ్రామ సర్పంచ్, పోలీసు సిబ్బంది, పోలీస్ కళా బృందం సభ్యులు మరియు గ్రామస్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
30/11/2021
*Date30-11-2021 రోజున*
*జగిత్యాల జిల్లా బీర్పూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని నరసింహులపళ్లే గ్రామం నందు*
👉 *గౌరవనీయులు జగిత్యాల జిల్లా SP శ్రీమతి శ్రీ సిందుశర్మ IPS గారి అదేశాల మేరకు..*
👉 *బీర్పూర్ SI శ్రీ నినిషా రెడ్డి గారి ఆధ్వర్యంలో*
👉 *మాదకద్రవ్యాలకు యువత దూరంగా ఉండాలని*
👉 *సైబర్ నేరాల నియంత్రణ,టోల్ ఫ్రీ నెం 155260 పై అవగాహన*
👉 *ట్రాఫిక్ మొబైల్ వాహనం ద్వారా రోడ్డు ప్రమాదాలపైన LED స్క్రీన్ ద్వారా ప్రజలకు అవగాహన*
👉 *మహిళల భద్రత మరియు,మానవ అక్రమ రవాణా, బాల్య రక్షణ,మూఢ నమ్మకాలపై*
*👉డైల్100 మరియు సైబర్ క్రైమ్ డైల్ 155260 పై అవగాహన..*
*కార్యక్రమంలో*
👉 *బీర్పూర్ SI శ్రీ నినిషా రెడ్డి గారు పోలీస్ సిబ్బంది,ప్రజలు మరియు పోలీస్ కళాబృందం జగిత్యాల🌹* 🙏
29/11/2021
*Date29-11-2021 రోజున*
*జగిత్యాల జిల్లా బీర్పూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని కండ్లపెళ్లి గ్రామం నందు*
👉 *గౌరవనీయులు జగిత్యాల జిల్లా SP శ్రీమతి శ్రీ సిందుశర్మ IPS గారి అదేశాల మేరకు..*
👉 *బీర్పూర్ SI శ్రీ నినిషా రెడ్డి గారి ఆధ్వర్యంలో*
👉 *మాదకద్రవ్యాలకు యువత దూరంగా ఉండాలని*
👉 *సైబర్ నేరాల నియంత్రణ,టోల్ ఫ్రీ నెం 155260 పై అవగాహన*
👉 *ట్రాఫిక్ మొబైల్ వాహనం ద్వారా రోడ్డు ప్రమాదాలపైన LED స్క్రీన్ ద్వారా ప్రజలకు అవగాహన*
👉 *మహిళల భద్రత మరియు,మానవ అక్రమ రవాణా, బాల్య రక్షణ,మూఢ నమ్మకాలపై*
*👉డైల్100 మరియు సైబర్ క్రైమ్ డైల్ 155260 పై అవగాహన..*
*కార్యక్రమంలో*
👉 *బీర్పూర్ SI శ్రీ నినిషా రెడ్డి గారు పోలీస్ సిబ్బంది,ప్రజలు మరియు పోలీస్ కళాబృందం జగిత్యాల🌹* 🙏