08/09/2026
ఈ వినాయక చవితి ఉత్సవాలలో ప్రతి ఒక్క గణేష్ మండపం కేవలం వేడుకలకే పరిమితం కాకుండా,
సమాజంలో బాధ్యతాయుతమైన మార్పుకు ఒక దిక్సూచిలా నిలవాలని కుశల సర్వీసెస్ ఆశిస్తోంది.
మన ఆచరణ - సమాజానికి స్ఫూర్తి: మనం ఏర్పాటు చేసే మండపాలు పర్యావరణహితంగా ఉండాలి. రసాయన రంగుల విగ్రహాలకు బదులు మట్టి వినాయకులను పూజించి ప్రకృతిని రక్షించుకుందాం.
ప్లాస్టిక్కు స్వస్తి: పందిళ్లలో మరియు ప్రసాదాల వితరణలో ప్లాస్టిక్ కవర్లు, గ్లాసుల వినియోగాన్ని పూర్తిగా నిరోధిద్దాం.
ఆమోదయోగ్యమైన వేడుకలు: మన భక్తి, మనం చేసే పనులు ఇతరులకు ఇబ్బంది కలిగించకుండా, పదిమందికి ఆమోదయోగ్యంగా, ఒక చక్కని సందేశాన్ని ఇచ్చేలా ఉండాలి.
"మీరు చేసే ప్రతి మంచి పని సమాజానికి ఒక ఆదర్శం, భావితరాలకు ఒక ఇన్స్పిరేషన్ అవ్వాలి!"
ఆచరిద్దాం... అందరికీ మార్గదర్శకులుగా నిలుద్దాం!
ఫౌండర్
కొప్పాక శ్రీనివాసరావు
కుశల సర్వీసెస్ ఫర్ రూరల్ అండ్ అర్బన్ పీపుల్
వాలంటరీ ఆర్గనైజేషన్
జంగారెడ్డిగూడెం.