Kakinada District Police

Call Directions Contact the organization

Kakinada District Police This is an initiative by the Kakinada Dist. Police to connect directly with the citizen & redresses Please do not report crime here.

In case of emergency
100 /
9494933233

10/10/2026

రూ. 1.45 కోట్ల విలువైన కిలోకు పైగా బంగారు ఆభరణాలు స్వాధీనం

బ్యాంక్ ఆఫ్ బరోడా, జీజీహెచ్ కాకినాడ బ్రాంచిలో గోల్డ్ లోన్‌కు సంబంధించిన బంగారు ఆభరణాల దుర్వినియోగం కేసును ఛేదించి నిందితుడిని అరెస్టు చేసిన కాకినాడ జిల్లా పోలీసులు

- నిందితుల అరెస్టు: 1
- బంగారం స్వాధీనం: 1020.53 గ్రాములు
- స్వాధీన విలువ: ₹1.45 కోట్లు
- గోల్డ్ లోన్ ఖాతాలు: 44
- మొత్తం దుర్వినియోగం: 1056.90 గ్రాములు

కాకినాడ జిల్లా ఎస్పీ శ్రీ జి. బిందు మాధవ్, ఐపీఎస్ గారి ప్రత్యేక చొరవతో, కాకినాడ ఇన్‌చార్జ్ సబ్ డివిజనల్ పోలీస్ ఆఫీసర్ మరియు అదనపు ఎస్పీ (అడ్మిన్) డా. మహంతి కిషోర్ కుమార్, APPS గారి ప్రత్యక్ష పర్యవేక్షణలో, కాకినాడ వన్ టౌన్ పోలీస్ స్టేషన్ ఇన్‌స్పెక్టర్ శ్రీ ఎం నాగ దుర్గారావు ఆధ్వర్యంలో, ఎస్‌ఐ శ్రీ పివిసి స్వామి నాయుడు మరియు సిబ్బంది కలిసి బ్యాంక్ ఆఫ్ బరోడా, జీజీఎచ్ బ్రాంచిలో గోల్డ్ లోన్ ఖాతాలకు సంబంధించిన బంగారు ఆభరణాల దుర్వినియోగం కేసును ఛేదించారు. ఈ కేసులో ప్రధాన నిందితుడిని అరెస్టు చేసి, అతని వద్ద నుంచి 1020.53 గ్రాముల బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు.
కేసు వివరాలు
కాకినాడ వన్ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని జీజీహెచ్ లో ఉన్న బ్యాంక్ ఆఫ్ బరోడా బ్రాంచిలో గోల్డ్ లోన్ ఖాతాలకు సంబంధించిన బంగారు ఆభరణాల దుర్వినియోగంపై Cr.No.147/2026 U/s 316(4) BNS గా కేసు నమోదు చేయబడింది. కేసు దర్యాప్తులో సుమారు 44 గోల్డ్ లోన్ ఖాతాలకు సంబంధించిన బంగారు ఆభరణాలు దుర్వినియోగానికి గురైనట్లు గుర్తించగా, మొత్తం సుమారు 1.0569 కిలోలు (1056.90 గ్రాములు) బంగారు ఆభరణాలు దుర్వినియోగానికి గురైనట్లు వెల్లడైంది.
ప్రత్యేక దర్యాప్తు బృందాలు
బ్యాంకింగ్ రంగంలో జరిగే మోసాలను అరికట్టడంలో భాగంగా కాకినాడ జిల్లా ఎస్పీ శ్రీ జి. బిందు మాధవ్, ఐపీఎస్ గారు ఈ కేసును ప్రత్యేకంగా పర్యవేక్షించి, నిందితులను త్వరితగతిన గుర్తించి అరెస్టు చేయాలని ఆదేశించారు. ఎస్పీ గారి ఆదేశాల మేరకు అదనపు ఎస్పీ (అడ్మిన్) డా. మహంతి కిషోర్ కుమార్, APPS గారి పర్యవేక్షణలో, ఇన్‌స్పెక్టర్ శ్రీ ఎం. నాగ దుర్గా రావు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి దర్యాప్తు చేపట్టారు.
నిందితుడి అరెస్టు
10.10.2026 తేదీన కాకినాడ వన్ టౌన్ పోలీస్ స్టేషన్ ఇన్‌స్పెక్టర్ శ్రీ ఎం నాగ దుర్గా రావు ఆధ్వర్యంలో, ఎస్‌ఐ శ్రీ పివిసి స్వామి నాయుడు మరియు సిబ్బంది నిందితుడిని గుర్తించి అరెస్టు చేశారు.
అరెస్టయిన నిందితుడి వివరాలు
నరవ సూరిబాబు, S/o సత్యనారాయణ, వయస్సు 59 సంవత్సరాలు, D.No.3-207, బైబిల్ మిషన్ చర్చి ఎదురుగా, చీడిగ గ్రామం, కాకినాడ రూరల్ మండలం. (గోల్డ్ అప్రైజర్)
ఒక కోటి 45 లక్షల విలువైన 1020.53 గ్రాముల బంగారు ఆభరణాల స్వాధీనం
నిందితుడి వద్ద నుంచి మొత్తం ఒక కోటి 45 లక్షల విలువైన 1020.53 గ్రాముల బంగారు ఆభరణాలను కాకినాడ వన్ టౌన్ పోలీస్ స్టేషన్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
దర్యాప్తులో గుర్తించిన మొత్తం దుర్వినియోగమైన బంగారం సుమారు 1056.90 గ్రాములు కాగా, అందులో 1020.53 గ్రాముల బంగారు ఆభరణాలను రికవరీ చేసినట్లు పోలీసులు తెలిపారు.
దర్యాప్తులో వెల్లడైన అంశాలు
పోలీసుల దర్యాప్తు ప్రకారం, నిందితుడు నరవ సూరిబాబు బ్యాంకులో గోల్డ్ అప్రైజర్‌గా పనిచేస్తున్న సమయంలో ఖాతాదారులు గోల్డ్ లోన్ కోసం తాకట్టు పెట్టిన బంగారు ఆభరణాలను దుర్వినియోగం చేసినట్లు ప్రాథమికంగా వెల్లడైంది. అసలు ఆభరణాల స్థానంలో నకిలీ ఆభరణాలను ఉంచడం ద్వారా దుర్వినియోగం చేసినట్లు దర్యాప్తులో వెల్లడైంది. నిందితుడి నుంచి సుమారు 44 గోల్డ్ లోన్ ఖాతాలకు సంబంధించిన 1056.90 గ్రాముల బంగారు ఆభరణాలు దుర్వినియోగానికి గురైనట్లు పోలీసులు తెలిపారు.
పోలీసు బృందానికి ఎస్పీ గారి అభినందనలు
ఈ కేసును సమర్థవంతంగా దర్యాప్తు చేసి, నిందితుడిని అరెస్టు చేసి 1020.53 గ్రాముల బంగారు ఆభరణాలను రికవరీ చేసిన కాకినాడ వన్ టౌన్ పోలీస్ స్టేషన్ ఇన్‌స్పెక్టర్ శ్రీ ఎం నాగ దుర్గా రావు, ఎస్‌ఐ శ్రీ పివిసి స్వామి నాయుడు మరియు దర్యాప్తులో పాల్గొన్న పోలీసు సిబ్బందిని కాకినాడ జిల్లా ఎస్పీ శ్రీ జి. బిందు మాధవ్, ఐపీఎస్ గారు అభినందించారు.

AP Police
Andhra Pradesh Police
Dgp Andhra Pradesh

10/10/2026

ఈ నెల 12 న జిల్లా పోలీసు కార్యాలయంలో ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక (PGRS) రద్దు

ఈనెల 12 వ తేదీన (సోమవారం) కాకినాడ జేఎన్టీయూకె నందు సి ఐ ఐ ప్రాంతీయ సదస్సు జరగనున్న నేపథ్యం లో ఈ కార్యక్రమం లో జిల్లా పోలీసు అధికారులందరూ నిమగ్నమై ఉన్నందున జిల్లా పోలీసు కార్యాలయంలో జరుగు ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంను రద్దు చేస్తున్నట్లు, జిల్లా ఎస్పీ శ్రీ జి బిందుమాధవ్, ఐపీఎస్., గారు
శనివారం ఒక ప్రకటనలో తెలిపారు.

జిల్లా పోలీస్ కార్యాలయం, కాకినాడ.
తేదీ: 10.10.2026.

AP Police
Andhra Pradesh Police
Dgp Andhra Pradesh

సీఐఐ ప్రాంతీయ సదస్సు బందోబస్తు ఏర్పాట్లను పరిశీలించిన కాకినాడ జిల్లా ఎస్పీ శ్రీ జి. బిందు మాధవ్, ఐపీఎస్ ఈ నెల 12వ తేదీన ...
10/10/2026

సీఐఐ ప్రాంతీయ సదస్సు బందోబస్తు ఏర్పాట్లను పరిశీలించిన కాకినాడ జిల్లా ఎస్పీ శ్రీ జి. బిందు మాధవ్, ఐపీఎస్

ఈ నెల 12వ తేదీన కాకినాడ జేఎన్టీయూలో నిర్వహించనున్న సీఐఐ ప్రాంతీయ సదస్సుకు పటిష్టమైన పోలీసు బందోబస్తు ఏర్పాటు చేస్తున్నట్లు కాకినాడ జిల్లా ఎస్పీ శ్రీ జి. బిందు మాధవ్, ఐపీఎస్ తెలిపారు.

ఈ సందర్భంగా శనివారం జిల్లా కలెక్టర్ శ్రీ ఎం.ఎన్. హరేంధిర ప్రసాద్‌తో కలిసి ఎస్పీ సదస్సు ప్రాంగణాన్ని, హెలిప్యాడ్ ఏర్పాట్లను పరిశీలించారు. ఈ సందర్భంగా రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారు పర్యటించుటకు అవకాశం ఉన్నందున భద్రతా ఏర్పాట్లు, ట్రాఫిక్ నియంత్రణ, వాహనాల పార్కింగ్ తదితర అంశాలను సమీక్షించారు. విధుల్లో ఉన్న పోలీసు అధికారులు, సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని, ఎలాంటి అవాంఛనీయ ఘటనలకు తావులేకుండా సమన్వయంతో విధులు నిర్వహించాలని ఎస్పీ సూచించారు.

AP Police
Andhra Pradesh Police
Dgp Andhra Pradesh

రూ. 1.45 కోట్ల విలువైన కిలోకు పైగా బంగారు ఆభరణాలు స్వాధీనం  బ్యాంక్ ఆఫ్ బరోడా, జీజీహెచ్ కాకినాడ బ్రాంచిలో గోల్డ్ లోన్‌కు...
10/10/2026

రూ. 1.45 కోట్ల విలువైన కిలోకు పైగా బంగారు ఆభరణాలు స్వాధీనం

బ్యాంక్ ఆఫ్ బరోడా, జీజీహెచ్ కాకినాడ బ్రాంచిలో గోల్డ్ లోన్‌కు సంబంధించిన బంగారు ఆభరణాల దుర్వినియోగం కేసును ఛేదించి నిందితుడిని అరెస్టు చేసిన కాకినాడ జిల్లా పోలీసులు

- నిందితుల అరెస్టు: 1
- బంగారం స్వాధీనం: 1020.53 గ్రాములు
- స్వాధీన విలువ: ₹1.45 కోట్లు
- గోల్డ్ లోన్ ఖాతాలు: 44
- మొత్తం దుర్వినియోగం: 1056.90 గ్రాములు

కాకినాడ జిల్లా ఎస్పీ శ్రీ జి. బిందు మాధవ్, ఐపీఎస్ గారి ప్రత్యేక చొరవతో, కాకినాడ ఇన్‌చార్జ్ సబ్ డివిజనల్ పోలీస్ ఆఫీసర్ మరియు అదనపు ఎస్పీ (అడ్మిన్) డా. మహంతి కిషోర్ కుమార్, APPS గారి ప్రత్యక్ష పర్యవేక్షణలో, కాకినాడ వన్ టౌన్ పోలీస్ స్టేషన్ ఇన్‌స్పెక్టర్ శ్రీ ఎం నాగ దుర్గారావు ఆధ్వర్యంలో, ఎస్‌ఐ శ్రీ పివిసి స్వామి నాయుడు మరియు సిబ్బంది కలిసి బ్యాంక్ ఆఫ్ బరోడా, జీజీఎచ్ బ్రాంచిలో గోల్డ్ లోన్ ఖాతాలకు సంబంధించిన బంగారు ఆభరణాల దుర్వినియోగం కేసును ఛేదించారు. ఈ కేసులో ప్రధాన నిందితుడిని అరెస్టు చేసి, అతని వద్ద నుంచి 1020.53 గ్రాముల బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు.

కేసు వివరాలు

కాకినాడ వన్ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని జీజీహెచ్ లో ఉన్న బ్యాంక్ ఆఫ్ బరోడా బ్రాంచిలో గోల్డ్ లోన్ ఖాతాలకు సంబంధించిన బంగారు ఆభరణాల దుర్వినియోగంపై Cr.No.147/2026 U/s 316(4) BNS గా కేసు నమోదు చేయబడింది. కేసు దర్యాప్తులో సుమారు 44 గోల్డ్ లోన్ ఖాతాలకు సంబంధించిన బంగారు ఆభరణాలు దుర్వినియోగానికి గురైనట్లు గుర్తించగా, మొత్తం సుమారు 1.0569 కిలోలు (1056.90 గ్రాములు) బంగారు ఆభరణాలు దుర్వినియోగానికి గురైనట్లు వెల్లడైంది.
ప్రత్యేక దర్యాప్తు బృందాలు
బ్యాంకింగ్ రంగంలో జరిగే మోసాలను అరికట్టడంలో భాగంగా కాకినాడ జిల్లా ఎస్పీ శ్రీ జి. బిందు మాధవ్, ఐపీఎస్ గారు ఈ కేసును ప్రత్యేకంగా పర్యవేక్షించి, నిందితులను త్వరితగతిన గుర్తించి అరెస్టు చేయాలని ఆదేశించారు. ఎస్పీ గారి ఆదేశాల మేరకు అదనపు ఎస్పీ (అడ్మిన్) డా. మహంతి కిషోర్ కుమార్, APPS గారి పర్యవేక్షణలో, ఇన్‌స్పెక్టర్ శ్రీ ఎం. నాగ దుర్గా రావు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి దర్యాప్తు చేపట్టారు.

నిందితుడి అరెస్టు

10.10.2026 తేదీన కాకినాడ వన్ టౌన్ పోలీస్ స్టేషన్ ఇన్‌స్పెక్టర్ శ్రీ ఎం నాగ దుర్గా రావు ఆధ్వర్యంలో, ఎస్‌ఐ శ్రీ పివిసి స్వామి నాయుడు మరియు సిబ్బంది నిందితుడిని గుర్తించి అరెస్టు చేశారు.

అరెస్టయిన నిందితుడి వివరాలు

నరవ సూరిబాబు, S/o సత్యనారాయణ, వయస్సు 59 సంవత్సరాలు, D.No.3-207, బైబిల్ మిషన్ చర్చి ఎదురుగా, చీడిగ గ్రామం, కాకినాడ రూరల్ మండలం. (గోల్డ్ అప్రైజర్)

ఒక కోటి 45 లక్షల విలువైన 1020.53 గ్రాముల బంగారు ఆభరణాల స్వాధీనం

నిందితుడి వద్ద నుంచి మొత్తం ఒక కోటి 45 లక్షల విలువైన 1020.53 గ్రాముల బంగారు ఆభరణాలను కాకినాడ వన్ టౌన్ పోలీస్ స్టేషన్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
దర్యాప్తులో గుర్తించిన మొత్తం దుర్వినియోగమైన బంగారం సుమారు 1056.90 గ్రాములు కాగా, అందులో 1020.53 గ్రాముల బంగారు ఆభరణాలను రికవరీ చేసినట్లు పోలీసులు తెలిపారు.

దర్యాప్తులో వెల్లడైన అంశాలు

పోలీసుల దర్యాప్తు ప్రకారం, నిందితుడు నరవ సూరిబాబు బ్యాంకులో గోల్డ్ అప్రైజర్‌గా పనిచేస్తున్న సమయంలో ఖాతాదారులు గోల్డ్ లోన్ కోసం తాకట్టు పెట్టిన బంగారు ఆభరణాలను దుర్వినియోగం చేసినట్లు ప్రాథమికంగా వెల్లడైంది. అసలు ఆభరణాల స్థానంలో నకిలీ ఆభరణాలను ఉంచడం ద్వారా దుర్వినియోగం చేసినట్లు దర్యాప్తులో వెల్లడైంది. నిందితుడి నుంచి సుమారు 44 గోల్డ్ లోన్ ఖాతాలకు సంబంధించిన 1056.90 గ్రాముల బంగారు ఆభరణాలు దుర్వినియోగానికి గురైనట్లు పోలీసులు తెలిపారు.

పోలీసు బృందానికి ఎస్పీ గారి అభినందనలు

ఈ కేసును సమర్థవంతంగా దర్యాప్తు చేసి, నిందితుడిని అరెస్టు చేసి 1020.53 గ్రాముల బంగారు ఆభరణాలను రికవరీ చేసిన కాకినాడ వన్ టౌన్ పోలీస్ స్టేషన్ ఇన్‌స్పెక్టర్ శ్రీ ఎం నాగ దుర్గా రావు, ఎస్‌ఐ శ్రీ పివిసి స్వామి నాయుడు మరియు దర్యాప్తులో పాల్గొన్న పోలీసు సిబ్బందిని కాకినాడ జిల్లా ఎస్పీ శ్రీ జి. బిందు మాధవ్, ఐపీఎస్ గారు అభినందించారు.

AP Police
Andhra Pradesh Police
Dgp Andhra Pradesh

09/10/2026

"ఆపరేషన్ త్రిశూల్‌" కార్యక్రమంలో పాల్గొన్న కాకినాడ జిల్లా ఎస్పీ శ్రీ జి బిందుమాధవ్, ఐపీఎస్.,

సూరంపాలెంలోని ఆదిత్య యూనివర్సిటీలో ఏర్పాటు చేసిన ‘ఆపరేషన్ త్రిశూల్’ కార్యక్రమంలో కాకినాడ జిల్లా ఎస్పీ శ్రీ జి. బిందుమాధవ్, ఐపీఎస్ స్వయంగా పాల్గొని విద్యార్థులకు కీలకమైన సామాజిక అంశాలపై విస్తృత అవగాహన కల్పించారు.
ఈ సందర్భంగా ఎస్పీ గారు స్వయంగా మాట్లాడుతూ.. ఆపరేషన్ త్రిశూల్‌ లో భాగంగా గంజాయి, ఇతర మత్తు పదార్థాలు యువత జీవితాలను నాశనం చేస్తాయని హెచ్చరించారు. డ్రగ్స్ నిర్మూలనకు ఇటీవల చేపట్టిన "రైజ్ ఎగైనెస్ట్ గాంజా"లో విద్యార్థులు చురుగ్గా పాల్గొనాలని, మత్తు పదార్థాలకు సంబంధించిన సమాచారం ఇస్తే తగిన బహుమతి ఇస్తామని, అలాంటి సమాచారం ఉంటే 1972 హెల్ప్‌లైన్ నంబర్‌కు తెలియజేయాలని పిలుపునిచ్చారు.
రహదారి భద్రత ప్రతి ఒక్కరి బాధ్యత అని స్పష్టం చేస్తూ, వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్, సీట్‌బెల్ట్ ధరించాలని మరియు అతివేగం, డ్రైవింగ్ చేసేటప్పుడు సెల్‌ఫోన్ వాడకం వంటి నిర్లక్ష్య స్వభావాన్ని వీడాలని సూచించారు. మైనర్లకు వాహనాలు ఇవ్వడం తీవ్రమైన నేరమని, ట్రాఫిక్ నిబంధనలు మన ప్రాణ రక్షణ కోసమేనని వివరించారు. ప్రస్తుత డిజిటల్ యుగంలో పెరిగిపోతున్న సైబర్ నేరాల పట్ల విద్యార్థులు అప్రమత్తంగా ఉండాలని, అపరిచిత లింకులు, ఆన్‌లైన్ పార్ట్‌టైమ్ ఉద్యోగాలు, నకిలీ పెట్టుబడి పథకాలను నమ్మవద్దని తెలిపారు. బ్యాంకు ఖాతా వివరాలు, పిన్, OTP వంటి రహస్య సమాచారాన్ని ఎవరికీ చెప్పకూడదని, సైబర్ మోసం జరిగితే వెంటనే 1930 హెల్ప్‌లైన్‌ను సంప్రదించాలని చెప్పారు.
అలాగే అనధికారిక లోన్ యాప్‌ల ఉచ్చులో పడకూడదని మరియు మహిళలు, బాలికల భద్రతకు పోలీసు శాఖ అత్యంత ప్రాధాన్యత ఇస్తుందని ఎస్పీ స్పష్టం చేశారు. వేధింపులకు గురైతే భయపడకుండా 112 అత్యవసర నంబర్‌కు లేదా పోలీసులకు ఫిర్యాదు చేయాలని సూచించారు.
అలాగే ఆపరేషన్ సేఫ్ క్యాంపస్ లో భాగంగా విద్యార్థులు సమాజంలో మార్పు తెచ్చే శక్తి అని, నేరాల నివారణలో పోలీసులకు సహకరిస్తూ సురక్షితమైన సమాజ నిర్మాణంలో భాగస్వాములు కావాలని కోరారు. ఈవ్ టీజింగ్, ర్యాగింగ్ కు పాల్పడవద్దని, సీనియర్ విద్యార్థులు జూనియర్స్ కి సహకరిస్తూ, వారితో జోక్స్ వేసుకోవడం, క్యాంటీన్ లో కూర్చుని కప్పు కాఫీ తాగటం వల్ల వారిలో భయాన్ని పోగొట్టి, వారికి అన్ని విధాలుగా మేమున్నాం అనే ధైర్యాన్ని నింపాలని కోరారు.
ఈ కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీ (అడ్మిన్) డాక్టర్ మహంతి కిషోర్ కుమార్, ఎస్బీ డీఎస్పీ కేవీవీ సత్యనారాయణ, పెద్దాపురం డీఎస్పీ ఏబీజీ తిలక్, ఈగల్ ఇన్స్పెక్టర్ జి. వెంకటేశ్వరరావు, జగ్గంపేట సీఐ తిరుపతి రావు, గండేపల్లి ఎస్సై యు. వి. శివనాగబాబు, పోలీసు సిబ్బంది, ప్రో ఛాన్సలర్ డాక్టర్ ఎన్. సతీష్ రెడ్డి, డిప్యూటీ ప్రో ఛాన్సలర్ డాక్టర్ ఎం. శ్రీనివాస రెడ్డి, రిజిస్ట్రార్ డాక్టర్ జి. సురేష్, డీన్ ఆఫ్ స్టూడెంట్ వెల్ఫేర్ డాక్టర్ వై.కె.ఎస్. సుబ్బారావు, యాంటీ ర్యాగింగ్ కన్వీనర్ డాక్టర్ ఐ. రమేష్ రాజా తదితర అధ్యాపకులు మరియు విశ్వవిద్యాలయ విద్యార్థులు పాల్గొన్నారు.

AP Police
Andhra Pradesh Police
Dgp Andhra Pradesh

Aditya Engineering College
Aditya University

#

"ఆపరేషన్ త్రిశూల్‌" కార్యక్రమంలో పాల్గొన్న కాకినాడ జిల్లా ఎస్పీ శ్రీ జి బిందుమాధవ్, ఐపీఎస్. సూరంపాలెంలోని ఆదిత్య యూనివర్...
09/10/2026

"ఆపరేషన్ త్రిశూల్‌" కార్యక్రమంలో పాల్గొన్న కాకినాడ జిల్లా ఎస్పీ శ్రీ జి బిందుమాధవ్, ఐపీఎస్.

08/10/2026

ప్రాథమిక శిక్షణ అనంతరం కాకినాడ జిల్లాకు రిపోర్ట్ చేసిన సివిల్ పోలీస్ కానిస్టేబుళ్లకు 45 రోజుల జిల్లా ప్రత్యేక శిక్షణ ప్రారంభం

ప్రాథమిక శిక్షణను విజయవంతంగా పూర్తి చేసి కాకినాడ జిల్లాకు రిపోర్ట్ చేసిన సివిల్ పోలీస్ కానిస్టేబుళ్లకు 45 రోజుల జిల్లా ప్రత్యేక శిక్షణ కార్యక్రమాన్ని కాకినాడ జిల్లా ఎస్పీ శ్రీ జి. బిందుమాధవ్, ఐపీఎస్ గారు గురువారం జిల్లా పోలీసు పరేడ్ గ్రౌండ్స్‌లో ప్రారంభించారు. మహిళా సివిల్ పోలీస్ కానిస్టేబుళ్లు 05.10.2026న, పురుష సివిల్ పోలీస్ కానిస్టేబుళ్లు 07.10.2026న కాకినాడ జిల్లా పోలీసు శాఖలో రిపోర్ట్ చేశారు. మొత్తం 269 మంది సివిల్ పోలీస్ కానిస్టేబుళ్లలో 189 మంది పురుషులు, 80 మంది మహిళలు ఉన్నారు.

45 రోజులపాటు నిర్వహించే జిల్లా ప్రత్యేక శిక్షణలో జిల్లా పరిధిలో పోలీసు విధుల నిర్వహణకు అవసరమైన అంశాలు, శాంతిభద్రతల పరిరక్షణ, నేర నియంత్రణ, చట్టాలపై అవగాహన, ప్రజలతో వ్యవహరించే విధానం, పోలీస్ స్టేషన్లలో విధుల నిర్వహణ తదితర అంశాలపై శిక్షణ అందించనున్నారు. శిక్షణను సద్వినియోగం చేసుకుని క్రమశిక్షణ, అంకితభావంతో విధులు నిర్వహిస్తూ ప్రజలకు మెరుగైన సేవలు అందించాలని ఎస్పీ గారు సూచించారు. ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీ అడ్మిన్ డా. మహంతి కిషోర్ కుమార్, ఏఆర్ డీఎస్పీ వి.జి. శ్రీహరి రావు, ఆర్‌ఐలు ఏఆర్ ఎం. నరసింహమూర్తి, కె వెంకటరావు మరియు 269 మంది సివిల్ పోలీస్ కానిస్టేబుళ్లు పాల్గొన్నారు.

AP Police
Andhra Pradesh Police
Dgp Andhra Pradesh

కాకినాడ జిల్లా ఎస్పీ శ్రీ జి బిందుమాధవ్, ఐపీఎస్ గారిని మర్యాదపూర్వకంగా కలిసిన నూతన ఎస్డీపీవో కాకినాడ శ్రీ ఎన్ ఎస్ వి కె ...
08/10/2026

కాకినాడ జిల్లా ఎస్పీ శ్రీ జి బిందుమాధవ్, ఐపీఎస్ గారిని మర్యాదపూర్వకంగా కలిసిన నూతన ఎస్డీపీవో కాకినాడ శ్రీ ఎన్ ఎస్ వి కె దుర్గారావు

కాకినాడ సబ్ డివిజన్ నూతన సబ్ డివిజనల్ పోలీస్ ఆఫీసర్ గా శ్రీ ఎన్ ఎస్ వి కె దుర్గారావు గురువారం బాధ్యతలు స్వీకరించారు. గతంలో విజయవాడ వెస్ట్ జోన్ ఏసీపీ గా సేవలందించిన ఆయన, బాధ్యతల స్వీకరణ అనంతరం జిల్లా పోలీసు కార్యాలయంలో కాకినాడ జిల్లా ఎస్పీ శ్రీ జి. బిందుమాధవ్, ఐపీఎస్ గారిని మర్యాదపూర్వకంగా కలిశారు.

ఇప్పటివరకు కాకినాడ ఎస్డీపీవో గా అదనపు ఎస్పీ (అడ్మిన్) డాక్టర్ మహంతి కిషోర్ కుమార్ ఇన్‌చార్జి బాధ్యతలు నిర్వహించారు. ఈ సందర్భంగా నూతన ఎస్డీపీవో ఎన్.ఎస్.వి.కె. దుర్గారావుకు జిల్లా ఎస్పీ శుభాకాంక్షలు తెలిపారు. కాకినాడ సబ్ డివిజన్ పరిధిలో శాంతిభద్రతల పరిరక్షణ, నేర నియంత్రణతో పాటు ప్రజలకు వేగవంతమైన, మెరుగైన పోలీసు సేవలు అందించేలా నిబద్ధతతో పనిచేయాలని ఎస్పీ సూచించారు.

AP Police
Andhra Pradesh Police
Dgp Andhra Pradesh

ప్రాథమిక శిక్షణ అనంతరం కాకినాడ జిల్లాకు రిపోర్ట్ చేసిన సివిల్ పోలీస్ కానిస్టేబుళ్లకు 45 రోజుల జిల్లా ప్రత్యేక శిక్షణ ప్ర...
08/10/2026

ప్రాథమిక శిక్షణ అనంతరం కాకినాడ జిల్లాకు రిపోర్ట్ చేసిన సివిల్ పోలీస్ కానిస్టేబుళ్లకు 45 రోజుల జిల్లా ప్రత్యేక శిక్షణ ప్రారంభం

ప్రాథమిక శిక్షణను విజయవంతంగా పూర్తి చేసి కాకినాడ జిల్లాకు రిపోర్ట్ చేసిన సివిల్ పోలీస్ కానిస్టేబుళ్లకు 45 రోజుల జిల్లా ప్రత్యేక శిక్షణ కార్యక్రమాన్ని కాకినాడ జిల్లా ఎస్పీ శ్రీ జి. బిందుమాధవ్, ఐపీఎస్ గారు గురువారం జిల్లా పోలీసు పరేడ్ గ్రౌండ్స్‌లో ప్రారంభించారు. మహిళా సివిల్ పోలీస్ కానిస్టేబుళ్లు 05.10.2026న, పురుష సివిల్ పోలీస్ కానిస్టేబుళ్లు 07.10.2026న కాకినాడ జిల్లా పోలీసు శాఖలో రిపోర్ట్ చేశారు. మొత్తం 269 మంది సివిల్ పోలీస్ కానిస్టేబుళ్లలో 189 మంది పురుషులు, 80 మంది మహిళలు ఉన్నారు.

45 రోజులపాటు నిర్వహించే జిల్లా ప్రత్యేక శిక్షణలో జిల్లా పరిధిలో పోలీసు విధుల నిర్వహణకు అవసరమైన అంశాలు, శాంతిభద్రతల పరిరక్షణ, నేర నియంత్రణ, చట్టాలపై అవగాహన, ప్రజలతో వ్యవహరించే విధానం, పోలీస్ స్టేషన్లలో విధుల నిర్వహణ తదితర అంశాలపై శిక్షణ అందించనున్నారు. శిక్షణను సద్వినియోగం చేసుకుని క్రమశిక్షణ, అంకితభావంతో విధులు నిర్వహిస్తూ ప్రజలకు మెరుగైన సేవలు అందించాలని ఎస్పీ గారు సూచించారు. ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీ అడ్మిన్ డా. మహంతి కిషోర్ కుమార్, ఏఆర్ డీఎస్పీ వి.జి. శ్రీహరి రావు, ఆర్‌ఐలు ఏఆర్ ఎం. నరసింహమూర్తి, కె వెంకటరావు మరియు 269 మంది సివిల్ పోలీస్ కానిస్టేబుళ్లు పాల్గొన్నారు.

AP Police
Andhra Pradesh Police
Dgp Andhra Pradesh

07/10/2026

// రోడ్డు ప్రమాదాల నివారణకు పటిష్ట చర్యలు //

// ప్రజల భద్రత దృష్ట్యా, నేర నియంత్రణలో భాగంగా వాహనాల తనిఖీలు, అనుమానితులపై నిఘా చర్యలు //

కాకినాడ జిల్లా ఎస్పీ శ్రీ జి. బిందు మాధవ్, ఐపీఎస్., గారి ఆదేశాల మేరకు జిల్లా వ్యాప్తంగా రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రత్యేక చర్యలు చేపడుతున్నారు. ఇందులో భాగంగా “Stop, Wash and Go” కార్యక్రమం నిర్వహిస్తూ డ్రైవర్లను అప్రమత్తం చేస్తున్నారు.
అదేవిధంగా అనుమానిత వాహనాలను తనిఖీ చేయడం, అనుమానాస్పద వ్యక్తుల వివరాలు మరియు వారి ప్రయాణ వివరాలను సేకరించడం జరుగుతోంది. అలాగే వారి మొబైల్ ఫోన్లను తనిఖీ చేసి చట్టవిరుద్ధమైన ఆన్‌లైన్ బెట్టింగ్ వంటి కార్యకలాపాలకు పాల్పడుతున్న వారిని గుర్తించే దిశగా చర్యలు తీసుకుంటున్నారు.

AP Police@followers
Andhra Pradesh Police
Dgp Andhra Pradesh

Address

ANDHRAPRADESH
Kakinada
533001

Telephone

+919494933233

Website

Alerts

Be the first to know and let us send you an email when Kakinada District Police posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Organization

Send a message to Kakinada District Police:

Shortcuts

Share