08/10/2026
కాకినాడ & కోనసీమ ప్రయాణికులకు ఒక శుభవార్త! 🚆🌴
దశాబ్దాలుగా ఎదురుచూస్తున్న 57.21 కి.మీ ల కోటిపల్లి - నర్సాపూర్ రైల్వే లైన్ ప్రాజెక్టును వేగవంతం చేయడానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అదనంగా ₹100 కోట్ల నిధులను మంజూరు చేసింది! ఈ నిధులు ముఖ్యంగా ల్యాండ్ అక్విజిషన్ (భూసేకరణ) కోసం ఉపయోగపడనున్నాయి.
మరో ముందడుగుతో, 2027 నాటికి ఈ ప్రాజెక్ట్ను పూర్తి చేయాలని భావిస్తున్నారు. గౌతమి, వశిష్ట, వైనతేయ నదులపై నిర్మిస్తున్న భారీ బ్రిడ్జ్లతో ఈ మార్గం మన కోనసీమ ప్రాంత రైలు కనెక్టివిటీకి ఒక వరంగా మారనుంది. 🌉
హైలైట్స్:
📍 పొడవు: 57.21 కి.మీ.
💰 నిధులు: ₹100 కోట్లు (రాష్ట్ర ప్రభుత్వ 25% వాటా)
🎯 ప్రధాన లక్ష్యం: త్వరగా భూసేకరణ & బ్రిడ్జ్ పనులు పూర్తి చేయడం.
📆 పూర్తి కావాల్సిన సమయం: 2027 నాటికి (అంచనా)
కోనసీమ ప్రజల చిరకాల రైల్వే కల (లెజెండరీ GMC బాలయోగి గారి కలల ప్రాజెక్ట్) ఎట్టకేలకు వేగం పుంజుకుంటోంది! ఈ రైల్వే లైన్ అందుబాటులోకి వస్తే మన కాకినాడ వారికి కూడా ప్రయాణం ఎంతో సులువు అవుతుంది.
మీ అభిప్రాయాలను కింద కామెంట్స్ లో తెలియజేయండి! 👇!!!!!