Desineedi SATYA Prasad

Call Directions Contact the organization

Desineedi SATYA Prasad సత్యప్రసాద్ దేశనీడి

జనసేన పార్టీ స్థానిక సంస్థల ఎన్నికల కోఆర్డినేషన్ కమిటీలు ప్రకటించాలని  నిర్ణయం• 25 పార్లమెంట్, 175 అసెంబ్లీ నియోజకవర్గాల...
08/10/2026

జనసేన పార్టీ స్థానిక సంస్థల ఎన్నికల కోఆర్డినేషన్ కమిటీలు ప్రకటించాలని నిర్ణయం

• 25 పార్లమెంట్, 175 అసెంబ్లీ నియోజకవర్గాలకు ప్రత్యేక అడ్‌హాక్ కమిటీల ఏర్పాటు
• జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారి స్వీయ పర్యవేక్షణలో కమిటీల ఏర్పాటు
• విజయవాడ మినహా మిగతా పార్లమెంట్ కమిటీలు ప్రకటించాలని నిర్ణయం

ఆంధ్రప్రదేశ్‌లో త్వరలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని, 25 పార్లమెంట్, 175 అసెంబ్లీ నియోజకవర్గాలకు ప్రత్యేక అడ్‌హాక్ కమిటీలను జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు స్వీయ పర్యవేక్షణలో ఏర్పాటు చేశారు. క్షేత్రస్థాయి వాస్తవ సమాచారాన్ని సేకరించి, ఆ నివేదికలను సిద్ధం చేసి స్థానిక ఎన్నికల కో ఆర్డినేషన్ కేంద్ర కమిటీ ద్వారా అధ్యక్షుల వారికి ఈ కమిటీలు అందించనున్నాయి.

భరతమాత తల రాతను మార్చిన విధాత.. మన జాతిపిత. :- Janasena Sainik - SatyaPrasad Desineedi.   భారత దేశాన్ని బ్రిటిష్ సామ్రాజ...
02/10/2026

భరతమాత తల రాతను మార్చిన విధాత.. మన జాతిపిత. :- Janasena Sainik - SatyaPrasad Desineedi.
భారత దేశాన్ని బ్రిటిష్ సామ్రాజ్య పాలన నుంచి విముక్తి చేసేందుకు ముందుండి పోరాడిన నాయకుల్లో గాంధీజీ ఒకరు. చేత కర్రబట్టి, నూలు వడకి, మురికివాడలు శుభ్రం చేసి, అన్ని మతాలు, కులాలు ఒక్కటే అని సాటి చెప్పారు గాంధీ. సత్యం, అహింస అనేవి తన ఆయుధాలని చెప్పి.. బ్రిటిష్ సామ్రాజ్యాన్ని గడగడలాడించారు. బ్రిటిష్ పాలకుల చేతుల్లోంచి భారతమాతకు విముక్తి కలిగించిన మహోన్నతుడు గాంధీ. దేశం కోసం ప్రాణాలర్పించిన ధైర్య పురుషులు మరియు మహిళలందరికీ జనసేన పార్టీ తరుపున వందనం చేస్తున్నాము.
ప్రతి భారతీయుడి హృదయంలో స్వదేశీ, స్వభాష, స్వరాజ్ అనే స్ఫూర్తిని గాంధీ నింపారు, ఆయన ఆలోచనలు ప్రతి భారతీయుడిలో స్ఫూర్తిని నింపుతాయి.అహింసే అత్యున్నత కర్తవ్యం. మనం దాన్ని పూర్తి స్థాయిలో సాధన చేయలేకపోయినా, దాని గొప్పతనాన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నించాలి. మానవతా దృక్పథంతో హింసామార్గం నుంచి సాధ్యమైనంత వరకూ దూరంగా ఉండాలి. సత్యం, అహింసలనే ఆయుధాలుగా మలుచుకుని దేశానికి స్వేచ్ఛా, స్వాతంత్య్రాలు సంపాదించిన మహనీయుడు జాతిపిత మహాత్మా గాంధీజయంతి సందర్భంగా ఆ మహనీయుని స్మృతికి నివాళులు అర్పిస్తున్నాము.
#సత్యప్రసాద్_దేశినీడి
జనసేన పార్టీ
కాకినాడ జిల్లా.

మరువలేని 'మహాత్ముడు' లాల్ బహదూర్ శాస్త్రి.:- Janasena Sainik- SatyaPrasad Desineedi.   భారత ప్రధానుల్లో లాల్ బహదూర్ శాస్...
02/10/2026

మరువలేని 'మహాత్ముడు' లాల్ బహదూర్ శాస్త్రి.:- Janasena Sainik- SatyaPrasad Desineedi.
భారత ప్రధానుల్లో లాల్ బహదూర్ శాస్త్రిది భిన్నమైన శైలి. భారతదేశానికి రెండో ప్రధానిగా కొంతకాలమే పనిచేసినా ఆయన భారతీయ యవనికపై తనదైన ముద్ర వేశారు. ఇక లాల్ బహదూర్ శాస్త్రి ఔన్నత్యం గురించి ఎన్ని సంఘటనలు గుర్తు చేసుకున్నా ఇంకొకటి ఉందేమో అనిపిస్తుంది అంతటి వ్యక్తిత్వం ఆయన సొంతం.చివరి శ్వాస వరకు దేశానికి అంకితం చేసిన గొప్ప దేశ భక్తుడు.
శారీరకంగా పొట్టివాడిని అయినప్పటికినీ మానసికంగా గట్టివాడినే అన్న మాటలు ఋజువు చేసుకున్న లాల్ బహుదూర్ శాస్త్రి నైతికత, సహనశీలి,నిరాడంబర,నిస్వార్థ జీవనశైలి నేటి భారతీయులకు దీపస్తంభంగా దారి చూపుతున్నాయి. బిన్నత్వంలో ఏకత్వం సాధించిన ఘనత నా భారత దేశానిది అంటూ నిత్యం జాతిహిత ఆలోచనలతో అసమాన్య దేశభక్తిని శ్వాసించిన లాల్ బహుదూర్ శాస్త్రి జీవితం నేటి యువ భారతానికి మార్గదర్శనం చేయాలని ఆశిద్దాం.
సామాన్య కుటుంబంలో జన్మించి, సాధారణ కార్యకర్తగా రాజకీయ జీవితం ప్రారంభించి, నైతిక బాధ్యత గల మంత్రిగా, రాజనీతిగల ప్రధానిగా, భారతదేశం గర్వించదగ్గ మహోన్నత వ్యక్తిగా చరిత్రలో నిలిచారు.జై జవాన్, జై కిసాన్ నినాదంతో దేశానికి రైతులు,సైనికుల గొప్పతనాన్ని చాటి చెప్పిన మహనీయుడు లాల్ బహుదూర్ శాస్త్రి గారు. ప్రధాన మంత్రిగా ఆయన ప్రజలకు ఎనలేని సేవలందించారు. ఈరోజు వారి జయంతి సందర్బంగా ఆ మహాత్ముడు సేవలను స్మరించుకుంటూ ఘన నివాళులు అర్పిస్తున్నాను.
#సత్యప్రసాద్_దేశినీడి
జనసేన పార్టీ
కాకినాడ జిల్లా.

స్థానిక సంస్థల ఎన్నికల సమన్వయానికి త్వరలో నూతన కమిటీలు
30/09/2026

స్థానిక సంస్థల ఎన్నికల సమన్వయానికి త్వరలో నూతన కమిటీలు

జనసేన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి  గౌ. శ్రీ. రామ్ తాళ్లూరి గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. 💐
26/09/2026

జనసేన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గౌ. శ్రీ. రామ్ తాళ్లూరి గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. 💐

Heartfelt birthday wishes to our Hon'ble Prime Minister Shri Narendra Modi Ji on behalf of the JanaSena Party.We wholehe...
17/09/2026

Heartfelt birthday wishes to our Hon'ble Prime Minister Shri Narendra Modi Ji on behalf of the JanaSena Party.

We wholeheartedly pray to Tirumala Venkateswara Swamy, Kondagattu Anjanna, and Bezawada Kanaka Durgamma to bless you with good health and longevity to lead the nation to even greater heights.

14/09/2026

గణనాథుడు మిమ్మల్ని అన్నివేళలా దీవించాలి.:- JanasenaParty Sainik:-SatyaPrasad Desineedi.

సకల విఘ్నాలను తొలగించే దేవాధిదేవుడు విఘ్నేశ్వరుడు. అందుకే, ఏ పూజ చేయాలన్నా తొలి పూజను ఆయనకే చేస్తాము.. మనం చేసే మంచి పనులకు ఎలాంటి విఘ్నాలు ఎదురుకాకుండా ఉండేందుకు వినాయక చవితి జరుపు కొంటూన్నాము. విఘ్నాలను ప్రారద్రోలే ఆ వినాయకుడు, అందరికీ మంచి జరగాలని ఆ గణనాథుణ్ని కోరుకుందాం. కుటుంబసభ్యులు,బంధుమిత్రులు, శ్రేయోభిలాషులు చేపట్టిన పనుల్లో విజయం సాధించాలని మంచి మనసుతో వేడుకుందాం.
గణపతి కృప కలిగేలా.. ఆ విఘ్నాదిపతి మీకు క్షేమ, స్థైర్య ఆయురారోగ్యాలు సిద్ధించాలని, సుఖసంతోషాలు చేకూర్చాలని మనస్ఫూర్తిగా గణనాథుడు మిమ్మల్ని అన్నివేళలా దీవించాలనీ, మీరు ఏ పని మొదలుపెట్టినా ఎలాంటి విఘ్నాలు లేకుండా పూర్తయ్యేటట్లు చూడాలని ఆమహాగణపతిని వేడుకుందాం. మీరు చేసే ప్రతీ కార్యం ఆ వినాయకుడి ఆశీస్సులతో విజయం చేకూరాలని, వినాయక చవితి రోజున మీరందరూ మనసారా గడపాలని, ఆ గణపతి మీకు ఆనంద ఆరోగ్య ఐశ్వర్యాలను ప్రసాదించాలని కోరుకుంటూ... మీ ఇంటిల్లిపాదికీ వినాయక చవితి శుభాకాంక్షలు!
#సత్యప్రసాద్_దేశినీడి
జనసేనపార్టీ
కాకినాడ జిల్లా.
. #𝙥𝙖𝙬𝙖𝙣𝙠𝙖𝙡𝙮𝙖𝙣

పని పూర్తయ్య వరకు కాదు.. ప్రజలకు ఫలితం అందే వరకు పర్యవేక్షణ!
11/09/2026

పని పూర్తయ్య వరకు కాదు.. ప్రజలకు ఫలితం అందే వరకు పర్యవేక్షణ!

05/09/2026
05/09/2026

భావితరాలకు బంగారు భవిష్యత్తు విద్యతోనే సాధ్యం:- Janasena Sainik - SatyaPrasad Desineedi.
ప్రతి గడపలో చదువు ఆ ఇంటికి పంచే వెలుగు. చదువుంటే సమాజానికి జరుగుతుంది మేలు. మానవ ప్రగతికి అక్షరాస్యత తప్పనిసరి. అక్షరాస్యత మనిషి జీవన స్థితిగతులను మార్చేస్తుంది. వారివారి సంస్కృతిని బలపరచుకునేలా చేస్తుంది. అక్షరాస్యత అనేది మానవ జీవితాలలో అత్యంత విలువైన అంశం మానవులు ఎదగడానికి, స్థిరమైన వాతావరణాన్ని సృష్టించడానికి అక్షరాస్యత, విద్య చాలా ముఖ్యం, ‘మనిషి జీవించడానికి ఆహారం ఎంత అవసరమో,చదువు కూడా అంతే అవసరం. పేదరికాన్ని పారద్రోలడానికి, శిశు మరణాలు తగ్గించడానికి, అధిక జనాభా నియంత్రణకు, లింగ వివక్షత లేకుండా ఉండటానికి విద్య ఎంతో అవసరం.
అక్షరాస్యత కుటుంబ స్థితిగతులను మెరుగు పరుస్తుంది, దాంతో దేశ ప్రగతి త్వరితంగా జరుగుతుంది. ప్రతి పౌరుడూ కుటుంబం పట్ల, సంఘం పట్ల, దేశం పట్ల బాధ్యతగా ప్రవర్తించడానికి నిరంతర విద్యాభ్యాసం దోహద పడుతుంది నాణ్యతతో కూడిన విద్యను అందించటంలో మనరాష్ట్ర ప్రభుత్వం ఎంతగానో కృషి చేస్తుంది . దేశరక్షణకు ఆయుధం ఎంత ముఖ్యమో,ఆ ఆయుధానికి అక్షరం అంతముఖ్యం. అంతర్జాతీయ అక్షరాస్యతా దినోత్సవం శభాకాంక్షలు.
#సత్యప్రసాద్_దేశినీడి
జనసేన పార్టీ, కాకినాడ జిల్లా.

Address

పిఠాపురం నియోజకవర్గం, తూర్పుగోదావరి జిల్లా, ఆంద్రప్రదేశ్
Kakinada

Telephone

9912565576

Website

Alerts

Be the first to know and let us send you an email when Desineedi SATYA Prasad posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Organization

Send a message to Desineedi SATYA Prasad:

Shortcuts

Share