29/08/2026
CPM PRESS NOTE
*కాకినాడ కార్పొరేషన్ లో ఆరు గ్రామాలు విలీనం కోరుతూ ఎమ్మెర్వో కార్యాలయం వద్ద సిపిఎం నిరాహారదీక్ష.*
కాకినాడ రూరల్ ఆగష్టు 29: కాకినాడ రూరల్ మండలంలో ఉన్న వలసపాకల, వాకలపూడి, రమణయ్యపేట, తూరంగి, ఇంద్రపాలెం, చీడిగ విలీన గ్రామాలను కాకినాడ కార్పొరేషన్ లో విలీనం చేయాలని సిపిఎం చేపట్టిన నిరవధిక పోరాటంలో భాగంగా రూరల్ మండల రెవిన్యూ అధికారి కార్యాలయం వద్ద నిరాహారదీక్ష నిర్వహించింది. తొట్టిపూడి రాజా, వాసంశెట్టి చంద్రరావు, పి. రామకృష్ణ , శ్రీహరి, డి. సత్యనారాయణ, సింహాద్రి, సిద్ధి రాజు లు దీక్షలో పాల్గొన్నారు. పార్టీ నాయకులు పెద్దింశెట్టి రామకృష్ణ, అజయ్ కుమార్, కృష్ణాజీ, జుత్తుగ శ్రీనివాసరావు దీక్షాపరులకు పూలమాలలు వేసి దీక్షను ప్రారంభించారు. పార్టీ రూరల్ కన్వీనర్ తిరుమలశెట్టి నాగేశ్వరరావు సభను ఉద్దేశించి మాట్లాడుతూ కార్పొరేషన్ లో ఆరు విలీన గ్రామాలను విలీనం చేయకుండా ప్రభుత్వం, రాజకీయ నాయకులు తెలుగుదేశం, వైసిపి, కూటమి నాయకులు ఆరు విలీన గ్రామాల సమస్యలను పరిష్కరించకుండా వారి స్వార్ధ ఆర్థిక ప్రయోజనాల కోసం బంగారు బాతుల్లా వినియోగించుకుంటున్నారని ఆయన ఆవేదం వ్యక్తం చేశారు. ఇప్పటికైనా ఈ నాయకులు ఈ గ్రామాల అభివృద్ధి కోసం కాకినాడ కార్పొరేషన్ లో విలీనం చేయడానికి త్రికరణ శుద్ధిగా పనిచేయాలని సిపీఎం పార్టీ విజ్ఞప్తి చేస్తుందన్నారు. పంతం వెంకటేశ్వరరావు (నానాజీ) విలీనానికై అనుకూలంగా ప్రభుత్వానికి లేఖ ఇవ్వాలని ఆయన కోరారు. తొట్టిపూడి రాజా మాట్లాడుతూ రాష్ట్రవ్యాప్తంగా ఎన్నికల ప్రక్రియలో ఉన్న ప్రభుత్వం ఆరు విలీన గ్రామాల విషయంపై ప్రజలకు సరైన స్పష్టత ఇవ్వాలని కోరారు. తూరంగి గ్రామ ప్రజలు మంచినీటికి సమస్యతో ఇబ్బందులు పడుతున్నారు. ఈ గ్రామానికి పాలకవర్గం లేక, సుమారు 50 కోట్లు రూపాయలు కేంద్ర ఫైనాన్స్ నిధులు కోల్పోయింది. ప్రతిపక్ష వైసిపి నాయకులు మాజీ మంత్రి కురసాల కన్నబాబు, కూటమి నాయకులు మాజీ శాసనసభ్యులు పిల్లి అనంతలక్ష్మి సత్యనారాయణమూర్తిలు విలీన గ్రామాలకు అనుకూలంగా ప్రభుత్వానికి లేఖలు ఇచ్చి రాజకీయ నిర్ణయం తీసుకోవాలని రాజా కోరారు. సామాజిక కార్యకర్త దూసర్లపూడి రమణరాజు మాట్లాడుతూ ఈ విలీన గ్రామాలు కార్పొరేషన్ లో కలిస్తే పన్నులు పెరుగుతాయనే అపోహల నుండి ప్రజలకు పది సంవత్సరాలపాటు పన్నులు నియంత్రించాలని, రాయితీలు ప్రకటించాలని ఆయన డిమాండ్ చేశారు. విలీనంపై, ఎన్నికలపై ప్రభుత్వం సరైన విధంగా స్పందించకపోతే స్థానిక సంస్థలకు ఉన్న ప్రజాస్వామ్య హక్కుల కోసం కోర్టుకైనా వెళ్లడానికి సిద్ధంగా ఉన్నామని ఆయన తెలియజేశారు.
ఈ కార్యక్రమంలో సిపిఎం నాయకులు చింతపల్లి అజయ్ కుమార్, పెద్దింశెట్టి రామకృష్ణ, జుత్తుగ శ్రీనివాసరావు, ఏ.వి.కృష్ణాజీ, దాట్ల సుబ్బరాజు, ఆదర్శ కార్తిక్ ప్రజా సంఘాల నాయకులు, కార్మికులు రాంబాబు, సింహాద్రి, సంగీతరావు, గుడాల శ్రీను, పంతాడి శ్రీను, దుర్గాప్రసాద్, సురేంద్ర, డేవిడ్, రాజేష్, సాయి తదితరులు పాల్గొన్నారు.
టి. రాజా
CPM కాకినాడ రూరల్ మండల కమిటీ. వలసపాకల
9985611648