Kamareddy District Police

Call Directions Website Contact the organization

Kamareddy District Police This page is meant for all who wish to contribute towards better Policing in Kamareddy District. Lets work together!!

06/10/2026

కామారెడ్డి జిల్లా పోలీస్ కార్యాలయ ఆవరణలో పోలీస్ కుటుంబ సభ్యుల ఆత్మీయ సమ్మేళనం.
అంకితభావంతో విధులు నిర్వహిస్తున్న పోలీసులను వారికి అండగా నిలుస్తున్న కుటుంబ సభ్యులను జిల్లా ఎస్పీ శ్రీ యం. రాజేశ్ చంద్ర, ఐపీఎస్ గారు అభినందించారు. 🤝

#ఫ్యామిలీమీట్

🚨 గంజాయి అక్రమ రవాణా ముఠాపై కామారెడ్డి పోలీసుల మరో కఠిన చర్య!🔹 మరో ముగ్గురిపై PD Act అమలురూ.1.93 కోట్ల విలువైన 387.128 క...
03/10/2026

🚨 గంజాయి అక్రమ రవాణా ముఠాపై కామారెడ్డి పోలీసుల మరో కఠిన చర్య!

🔹 మరో ముగ్గురిపై PD Act అమలు

రూ.1.93 కోట్ల విలువైన 387.128 కిలోల గంజాయి అక్రమ రవాణా కేసులో షేక్ కరీముల్లా @ కరీం, గైని సుభాష్, షేక్ రహీమ్‌లపై PD Act కింద నిర్బంధ ఉత్తర్వులు జారీ. ఇప్పటికే నలుగురిపై చర్యలతో ఈ కేసులో మొత్తం 7 మందిపై PD Act అమలు.

జిల్లా ఎస్పీ శ్రీ యం. రాజేష్ చంద్ర, ఐపీఎస్ గారు మాట్లాడుతూ, “యువత భవిష్యత్తును నాశనం చేసే మాదకద్రవ్యాల అక్రమ రవాణాదారులను ఉపేక్షించేది లేదు. డ్రగ్స్ అక్రమ రవాణాను అరికట్టేందుకు కఠిన చర్యలు కొనసాగుతాయి.” అని స్పష్టం చేశారు.

02/10/2026

🚨 భారీ దొంగతనం కేసును సాంకేతిక ఆధారాలతో ఛేదించిన బాన్సువాడ పోలీసులు!

🔹 గౌలిగూడ కాలనీలో జరిగిన చోరీ కేసులో ఇద్దరు నిందితుల అరెస్ట్
🔹 సీసీ కెమెరాలు, సాంకేతిక ఆధారాలతో నిందితుల కదలికలను గుర్తించి వలపన్ని పట్టుకున్న పోలీసులు
🔹 31.2 తులాల బంగారం, 3 కిలోల వెండి, ₹9,700 నగదు, నేరంలో ఉపయోగించిన బైక్ స్వాధీనం
🔹 స్వాధీనం చేసుకున్న సొత్తు విలువ సుమారు ₹56 లక్షలు
🔹 కేసును ఛేదించిన పోలీసు అధికారులు, సిబ్బందిని జిల్లా ఎస్పీ శ్రీ యం. రాజేష్ చంద్ర, IPS గారు అభినందించారు. 👏

🚨 జాతిపితకు ఘన నివాళి కామారెడ్డి జిల్లా పోలీస్ కార్యాలయంలో మహాత్మా గాంధీ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. గాంధీజీ చిత్ర...
02/10/2026

🚨 జాతిపితకు ఘన నివాళి

కామారెడ్డి జిల్లా పోలీస్ కార్యాలయంలో మహాత్మా గాంధీ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. గాంధీజీ చిత్రపటానికి పూలమాల వేసి జిల్లా ఎస్పీ శ్రీ యం. రాజేష్ చంద్ర, ఐపీఎస్ గారు ఘన నివాళులర్పించారు.

🔹 సత్యం, అహింస, శాంతి మార్గాలను ప్రతి ఒక్కరూ ఆచరిస్తూ ఆదర్శవంతమైన సమాజ నిర్మాణానికి కృషి చేయాలని ఎస్పీ గారు పిలుపునిచ్చారు.

ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీ కె. నరసింహ రెడ్డి గారు, డీఎస్పీలు, ఇన్స్పెక్టర్లు, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.

🇮🇳 గాంధీజీ ఆశయాలే మనకు స్ఫూర్తి… ప్రజాసేవే మన సంకల్పం!

ఒక్క 112 కాల్..ఒక ప్రాణానికి రక్షణచిన్నకోడబల్లిలో ఒక సమస్యపై మనస్తాపంతో వాటర్ ట్యాంక్‌పైకి ఎక్కి ఆత్మహత్యకు యత్నించిన వ్...
30/09/2026

ఒక్క 112 కాల్..ఒక ప్రాణానికి రక్షణ
చిన్నకోడబల్లిలో ఒక సమస్యపై మనస్తాపంతో వాటర్ ట్యాంక్‌పైకి ఎక్కి ఆత్మహత్యకు యత్నించిన వ్యక్తిని సమాచారం అందిన వెంటనే పిట్లం పోలీసులు క్షణాల్లో చేరుకుని సురక్షితంగా కిందకు దించారు.అనంతరం కౌన్సెలింగ్ ఇచ్చారు.
ఆపదలో ప్రజలకు అండగా కామారెడ్డి పోలీసులు

🚨 వడ్ల లోడ్ లారీని అడ్డగించి రూ.1.20 లక్షలు డిమాండ్ చేసిన కేసులో నలుగురు అరెస్టు🔹 తాము విలేకరులమని చెప్పి లారీ డ్రైవర్‌న...
28/09/2026

🚨 వడ్ల లోడ్ లారీని అడ్డగించి రూ.1.20 లక్షలు డిమాండ్ చేసిన కేసులో నలుగురు అరెస్టు

🔹 తాము విలేకరులమని చెప్పి లారీ డ్రైవర్‌ను బెదిరింపు
🔹 రూ.1.20 లక్షలు ఇవ్వాలని డిమాండ్
🔹 నిందితుల నుంచి వ్యాగనర్ కారు, 4 సెల్‌ఫోన్లు స్వాధీనం
🔹 వృత్తి లేదా హోదాను అడ్డుపెట్టుకున్నా.. చట్టం నుంచి ఎంతటి వారైనా తప్పించుకోలేరు.

27/09/2026

🥁 భజనల మాధుర్యం.. డప్పుల దరువుల హోరు.. గణనాథుడి నామస్మరణతో పాత బాన్సువాడ మార్మోగుతోంది! 🙏

సంప్రదాయ భజనలు, కీర్తనలు, డప్పుల దరువులు, వాయిద్యాల నడుమ గణేష్ నిమజ్జన శోభాయాత్ర భక్తి వైభవంగా కొనసాగుతోంది. భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని ఉత్సాహంగా గణనాథుడిని నిమజ్జనానికి తరలిస్తున్నారు. భక్తుల సందడితో పాత బాన్సువాడ ఆధ్యాత్మిక వాతావరణంతో కళకళలాడుతోంది.

26/09/2026

డప్పుల దరువులు..బ్యాండ్ మేళాలు..భజనల నడుమ బాన్సువాడలో గణేష్ నిమజ్జన కార్యక్రమాలు ఘనంగా ప్రారంభమయ్యాయి.
జిల్లా ఎస్పీ రాజేష్ చంద్ర,IPS అంబేద్కర్ చౌరస్తాలో సీసీకెమెరాల మానిటరింగ్ స్క్రీన్‌ను పరిశీలించి,మినీ ట్యాంక్ బండ్ వద్ద జరుగుతున్న నిమజ్జన ప్రక్రియను స్వయంగా పర్యవేక్షిస్తున్నారు

Address

District Police Office, Adloor Road
Kamareddi
503111

Alerts

Be the first to know and let us send you an email when Kamareddy District Police posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Organization

Send a message to Kamareddy District Police:

Shortcuts

Share