Abdul kaif Social Media Congress

Directions Contact the organization

Abdul kaif Social Media Congress KAMAREDDY DISTRICT

IYC SOCIAL MEDIA COORDINATOR

10/07/2026

కామారెడ్డి జిల్లా 10-07-2026

ఎస్‌ఐఆర్ ప్రక్రియలో ప్రతి ఓటరు తప్పనిసరిగా పాల్గొనాలి: ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ అలీ షబ్బీర్ గారు.

ప్రజాస్వామ్య పరిరక్షణలో స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (ఎస్‌ఐఆర్) ప్రక్రియ అత్యంత కీలకమైనదని తెలంగాణ ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ అలీ షబ్బీర్ గారు పేర్కొన్నారు.

శుక్రవారం జుమ్మా నమాజ్ అనంతరం బిలాల్ మజీద్ లో ప్రజలను ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ.

ప్రతి అర్హ ఓటరు తప్పనిసరిగా ఎస్‌ఐఆర్ ప్రక్రియలో పాల్గొని ఓటరు జాబితాలో తమ వివరాలను నమోదు చేసుకోవడం లేదా ధృవీకరించుకోవడం ద్వారా ఓటు హక్కును పరిరక్షించుకోవాలని పిలుపునిచ్చారు.

ఓటరు జాబితాను పూర్తిగా పారదర్శకంగా, తప్పులు లేకుండా రూపొందించేందుకు ఎన్నికల సంఘం చేపట్టిన ఈ ప్రత్యేక సవరణ కార్యక్రమానికి ప్రజలంతా సహకరించాలని ఆయన కోరారు.

ప్రజాస్వామ్య వ్యవస్థ బలోపేతానికి ప్రతి పౌరుడి భాగస్వామ్యం అవసరమని, ఓటు హక్కు రాజ్యాంగం కల్పించిన విలువైన హక్కు అని పేర్కొన్నారు.

ప్రతి ఒక్కరూ తమ పేరు ఓటరు జాబితాలో సక్రమంగా ఉందో లేదో వెంటనే పరిశీలించుకోవాలని, ఏవైనా తప్పులు ఉంటే సరిదిద్దించుకోవాలని సూచించారు.

కొత్తగా అర్హత పొందిన వారు తప్పనిసరిగా ఓటరుగా నమోదు చేసుకోవాలని, అవసరమైన పత్రాలను సమర్పించి నమోదు, సవరణ, ధృవీకరణ ప్రక్రియను ఆలస్యం చేయకుండా పూర్తి చేసుకోవాలని కోరారు.

ఎస్‌ఐఆర్ ప్రక్రియపై ప్రజల్లో విస్తృత అవగాహన కల్పించడం రాజకీయ పార్టీలు, ప్రజాప్రతినిధులు, సామాజిక సంస్థలు, కార్యకర్తలందరి బాధ్యత అని షబ్బీర్ అలీ అన్నారు. గ్రామాలు, వార్డులు, కాలనీల స్థాయిలో ప్రచారం నిర్వహించి ఒక్క అర్హ ఓటరు కూడా నమోదు కాకుండా మిగిలిపోకుండా చర్యలు తీసుకోవాలని పిలుపునిచ్చారు.

ప్రతి ఓటరు తన ఓటు హక్కును పరిరక్షించుకుంటూ ఎస్‌ఐఆర్ ప్రక్రియలో చురుకుగా పాల్గొని ప్రజాస్వామ్యాన్ని మరింత బలోపేతం చేయాలని ఆయన ప్రజలకు విజ్ఞప్తి చేశారు.

ఈ కార్యక్రమంలో ఇంచార్జ్ అడిషనల్ కలెక్టర్ (ఆర్డీవో) డీవై గిరి, ఎమ్మార్వో హిమబిందు, మున్సిపల్ చైర్‌పర్సన్ ఇప్ప ఉమా శ్రీనివాస్, కామారెడ్డి టౌన్ కాంగ్రెస్ అధ్యక్షుడు ఐరేని సందీప్, మండల అధ్యక్షులు రాజగౌడ్, కౌన్సిలర్లు, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

హైదరాబాద్ - 08-07-2026హైదరాబాద్ బంజారా హిల్స్ రోడ్ నెంబర్–12లో మహానేత, దివంగత మాజీ ముఖ్యమంత్రి వై. ఎస్ రాజశేఖర రెడ్డి గా...
08/07/2026

హైదరాబాద్ - 08-07-2026
హైదరాబాద్ బంజారా హిల్స్ రోడ్ నెంబర్–12లో మహానేత, దివంగత మాజీ ముఖ్యమంత్రి వై. ఎస్ రాజశేఖర రెడ్డి గారి జయంతి సందర్భంగా ఆయన విగ్రహానికి రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులు శ్రీ షబ్బీర్ అలీ గారు పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు.

ఈ కార్యక్రమంలో ఉప ముఖ్యమంత్రి శ్రీ భట్టి విక్రమార్క గారు, మంత్రి శ్రీధర్ బాబు గారు, ఎమ్మెల్సీ బాల్మూర్ వెంకట్ గారు, స్థానిక ఎమ్మెల్యే దానం నాగేందర్ గారు, మాజీ రాజ్యసభ సభ్యులు కేవీపీ రామచందర్ రావు గారు, రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షులు చిన్నారెడ్డి గారు, ఆంధ్రప్రదేశ్ మాజీ పీసీసీ అధ్యక్షులు రుద్రరాజు గారు తదితరులు పాల్గొని మహానేత వై.ఎస్. రాజశేఖర్ రెడ్డి గారి ప్రజాసేవ, సంక్షేమ పాలన, రైతులు, పేదలు మరియు బలహీన వర్గాల అభ్యున్నతి కోసం ఆయన చేసిన సేవలను స్మరించుకున్నారు.

ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ, వై.ఎస్. రాజశేఖర్ రెడ్డి గారు ప్రజల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోయిన మహానేత అని, ఆయన ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు నేటికీ ప్రజలకు ఆదర్శంగా నిలుస్తున్నాయని పేర్కొన్నారు. ఆయన ఆశయాలను కొనసాగిస్తూ ప్రజా సంక్షేమానికి కట్టుబడి పనిచేయడం ఆయనకు అందించే నిజమైన నివాళి అని అభిప్రాయపడ్డారు.

Hon'ble Advisor to Telangana Government Shri Mohammed Ali Shabbir participated in the meeting, chaired by Hon'ble Minist...
06/06/2026

Hon'ble Advisor to Telangana Government Shri Mohammed Ali Shabbir participated in the meeting, chaired by Hon'ble Minister Shri Mohammed Azharuddin, to review the minority welfare schemes at Telangana Secretariat on Saturday. Chairmen of various corporations and senior officials attended the meeting.

Advisor to Telangana Government Mohammed Ali Shabbir felicitated Mukram Ahmed at his Secretariat Chambers on Thursday af...
21/05/2026

Advisor to Telangana Government Mohammed Ali Shabbir felicitated Mukram Ahmed at his Secretariat Chambers on Thursday after he secured the overall 1st rank in the TG-EAPCET Agriculture and Pharmacy stream with a score of 150.17 marks. Mukram Ahmed, a student of TMREIS, was congratulated by Shabbir Ali, who appreciated his achievement and wished him success in his future academic and professional journey.

Shabbir Ali also appreciated the good performance of other students, including Asma Jubin, who secured State 2nd rank in Bi.PC-2, Shariqa Muskan, State 3rd rank in Bi.PC-2, Huraya Dilsath, State 3rd rank in MPC-1, Ayesha Siddiqua, State 3rd rank in Bi.PC-1, and Afiya Tabbasum, State 4th rank in Bi.PC-1.

20/05/2026

Address

Kamareddy
503111

Website

Alerts

Be the first to know and let us send you an email when Abdul kaif Social Media Congress posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Organization

Send a message to Abdul kaif Social Media Congress:

Shortcuts

Share