11/10/2026
కామారెడ్డి జిల్లా కేంద్రంలో తెలంగాణ జిల్లా దశాబ్ది ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. జిల్లా కేంద్రంలో నిర్వహించిన తెలంగాణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా తెలంగాణ ఉద్యమ కారులను, న్యాయవాదులను, డాక్టర్లను, విద్యార్థి ఉద్యమ కారులను, గాయకులను మాజీ ఎమ్మెల్యేలు గంప గోవర్ధన్, జుక్కల్ మాజీ ఎమ్మెల్యే హనుమంతు షిండే లు బిఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు ముజీబుద్దీన్ లు శాలువాలు కప్పి సన్మానించారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే గంప గోవర్ధన్ మాట్లాడుతూ సబ్బండ వర్గాలను ఏకం చేసి తెలంగాణ రాష్ట్రం సాధించిన నాయకులు కేసీఆర్ అని అన్నారు. బిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆదేశాలు మేరకు అన్ని నూతన జిల్లాలో దశాబ్ది ఉత్సవాలు నిర్వహిస్తున్నామని తెలిపారు. సాధించిన తెలంగాణ రాష్ట్రంలో పరిపాలన సౌలభ్యంగా కోసం 10 జిల్లాలను 31 జిల్లాలు చేసి అన్ని జిల్లా కేంద్రాల్లో జిల్లా కలెక్టర్, ఎస్పీ కార్యాలయాలు కట్టించిన నాయకుడు కేసీఆర్ అని అన్�