Ganesh Kalyan Dharavath

Directions Website

Ganesh Kalyan Dharavath తెలంగాణా నాదే, ఆంధ్ర నాదే, ఇ దేశమే నాది. మనల్నీ ఎవడ్రా ఆపేది 👈🔥🔥

02/11/2026

జై సేనానని ✊✊

#𝙥𝙖𝙬𝙖𝙣𝙠𝙖𝙡𝙮𝙖𝙣

నాయకులు క్షేత్రస్థాయికి వెళ్లి పనిచేస్తేనే పార్టీ సంస్థాగతంగా బలోపేతం అవుతుంది-రాజకీయాల్లో యువ నాయకత్వం రావాలని అధ్యక్షు...
30/10/2026

నాయకులు క్షేత్రస్థాయికి వెళ్లి పనిచేస్తేనే పార్టీ సంస్థాగతంగా బలోపేతం అవుతుంది

-రాజకీయాల్లో యువ నాయకత్వం రావాలని అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడూ చెప్తుంటారు
-క్షేత్ర స్థాయిలో బలమైన నాయకులను ఇంచార్జులుగా ప్రకటిస్తాం
-అన్ని బలాలు సిద్ధం చేసుకుని ఎన్నికలకు వెళ్దాం
-పన్నెండేళ్లు పడ్డ కష్టం వృధా కాకుండా ఉండేందుకు మరో రెండేళ్లు కష్టపడాలి
-కొత్తవారికి ఆహ్వానం పలుకుతూనే పాతవారికి తగిన గౌరవం అందిద్దాం
-జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి శ్రీ రామ్ తాళ్లూరి

జనసేన నాయకులు తెలంగాణ రాష్ట్రంలో క్షేత్రస్థాయికి వెళ్లి పని చేసినప్పుడే జనసేన పార్టీ సంస్థాగతంగా బలోపేతం అవుతుందని జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి శ్రీ రామ్ తాళ్లూరి స్పష్టం చేశారు. జనసేన తెలంగాణ ‘అలయ్ బలయ్’ ఆత్మీయ సమ్మేళనం హైద్రాబాదులోని జనసేన పార్టీ తెలంగాణ రాష్ట్ర కార్యాలయంలో శుక్రవారం జరిగింది. జనసేన పార్టీ తెలంగాణ రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ, ఉమ్మడి ఖమ్మం, నల్గొండ, వరంగల్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల జనసేన పార్టీ అభ్యర్థి డాక్టర్ శ్రీ గడల శ్రీనివాసరావు ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించారు. జనసేన ప్రధాన కార్యదర్శి శ్రీ రామ్ తాళ్ళూరి ముఖ్య అతిథిగా, తెలంగాణ ఇన్చార్జ్ శ్రీ నేమూరి శంకర్ గౌడ్, ప్రచార కార్యదర్శి శ్రీ ఆర్.కె. సాగర్ అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా శ్రీ రామ్ తాళ్ళూరి మాట్లాడుతూ.. రాజకీయాల్లో యువ నాయకత్వం రావాలని, యువ నాయకత్వాన్ని ప్రోత్సహించాలని అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడూ చెప్తుంటారని అన్నారు. క్షేత్ర స్థాయిలో బలంగా పనిచేస్తోన్న నాయకులను త్వరలో ఇంచార్జులుగా ప్రకటిస్తామని, అన్ని బలాలు సిద్ధం చేసుకుని ఎన్నికలకు వెళ్దామని చెప్పారు. పన్నెండేళ్లు పడ్డ కష్టం వృధా కాకుండా ఉండేందుకు ప్రతి కార్యకర్త, నాయకులు మరో రెండేళ్లు కష్టపడితే అనుకున్న లక్ష్యాలు సాధించవచ్చని అన్నారు. పార్టీలోకి కొత్తవారికి ఆహ్వానం పలుకుతూనే పాతవారికి తగిన గౌరవం అందిచాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉన్నదని వెల్లడించారు. ముఖ్యంగా మన ముందున్న ప్రదాన లక్ష్యం ఉమ్మడి ఖమ్మం, నల్గొండ, వరంగల్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల జనసేన పార్టీ అభ్యర్థి డాక్టర్ శ్రీ గడల శ్రీనివాసరావును గెలిపించుకోవడమని, పార్టీ శ్రేణులంతా గెలుపు కోసం శ్రమించాలని అన్నారు. పార్టీకి నిజమైన బలం పదవుల్లో కాదని, ప్రజలతో మమేకమై పనిచేసే కార్యకర్తల్లోనే ఉందనే భావనతో శ్రీ పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో జనసేన ఆశయాలను, ప్రజాసేవ విలువలను తెలంగాణ ప్రజల ఆకాంక్షలతో అనుసంధానిస్తూ ఒకే లక్ష్యంతో కలిసి పనిచేసే వాతావరణాన్ని నిర్మించడం ‘జనసేన తెలంగాణ అలయ్ బలయ్’ సమ్మేళనం ప్రధాన ఉద్దేశమని వివరించారు.

-జనసేన పార్టీ రాష్ట్ర కార్యాలయం, తెలంగాణ.

తీర ప్రాంత మత్స్యకారుల సమస్యలకు శాశ్వత పరిష్కారాలు అన్వేషించాలి• వేట పడవలకు బీమా సౌకర్యం కల్పించే అంశంపై ప్రతిపాదనలు సిద...
30/10/2026

తీర ప్రాంత మత్స్యకారుల సమస్యలకు శాశ్వత పరిష్కారాలు అన్వేషించాలి

• వేట పడవలకు బీమా సౌకర్యం కల్పించే అంశంపై ప్రతిపాదనలు సిద్ధం చేయాలి
• దీపావళి తర్వాత మత్స్యకార గ్రామాల్లో క్షేత్ర స్థాయి పర్యటన
• ఉప్పాడ తీర ప్రాంత రక్షణ గోడ పనులు వేగవంతం చేయాలి
• మత్స్యకారుల సమస్యలపై స్వయంగా అధ్యయనం చేస్తా
• కాకినాడ జిల్లాపై అర్నబ్ తుపాను ప్రభావం, సహాయక చర్యలపై జిల్లా యంత్రాంగం, తీర ప్రాంత గ్రామాల ప్రజలతో వర్చువల్ సమావేశంలో ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారు

తీర ప్రాంత మత్స్యకారుల సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపే దిశగా ప్రణాళికలు సిద్ధం చేయాలని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రివర్యులు, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, అటవీ, పర్యావరణ శాఖల మంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారు కాకినాడ జిల్లా అధికారులను ఆదేశించారు. తుపానులు వచ్చిన ప్రతిసారీ తాత్కాలిక చర్యలు చేపట్టడం కాకుండా, తీర ప్రాంత ప్రజలకు శాశ్వత రక్షణ కల్పించేలా చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు. వేట పడవలకు బీమా సౌకర్యం కల్పించే అంశంపై సాధ్యాసాధ్యాలను పరిశీలించి, తగిన ప్రతిపాదనలు సిద్ధం చేయాలని దిశా నిర్దేశం చేశారు. దీపావళి తర్వాత మత్స్యకార గ్రామాల్లో పర్యటించి, వారి సమస్యలపై స్వయంగా అధ్యయనం చేస్తానని తెలిపారు. అర్నబ్ తుపాను ప్రభావం, సహాయక చర్యలు, బాధితులకు అందుతున్న సాయం తదితర అంశాలపై కాకినాడ జిల్లా యంత్రాంగం, తీర ప్రాంత గ్రామాల ప్రజలతో క్యాంపు కార్యాలయం నుంచి ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారు వర్చువల్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్, తీర ప్రాంత గ్రామాలకు చెందిన మత్స్యకారులతో తుపాను కారణంగా జరిగిన నష్టం, సహాయక చర్యల వివరాలు అడిగి తెలుసుకున్నారు. జిల్లా వ్యాప్తంగా చేపట్టిన సహాయక చర్యలను సమీక్షించి, పలు అంశాలపై దిశానిర్దేశం చేశారు.
ముఖ్యంగా ఉప్పాడ తీర ప్రాంత రక్షణ గోడకి సంబంధించి డిజైన్ రూపకల్పన, డీపీఆర్ తదితర పనులు వేగవంతం చేయాలని, సాధ్యమైనంత త్వరగా పనులు ప్రారంభించేలా చర్యలు తీసుకోవాలని ఉప ముఖ్యమంత్రివర్యులు జిల్లా కలెక్టర్ ను ఆదేశించారు. కోనపాపపేట వరకు రక్షణ గోడ పొడిగింపు అంశంపై గతంలో స్టేట్ డిజాస్టర్ మేనేజ్మెంట్ సంస్థకు చేసిన ప్రతిపాదనలు త్వరితగతిన ఆమోదం పొందేలా చర్యలు తీసుకోవాలన్నారు.
ఉప్పాడ – కాకినాడ బీచ్ రోడ్డు పునరుద్ధరణకు తక్షణ చర్యలు
ఉప్పాడ – కాకినాడ బీచ్ రోడ్డు తుపాను అలల తాకిడికి పూర్తిగా దెబ్బ తిన్న నేపథ్యంలో తక్షణమే పునరుద్ధరణ చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. తీర ప్రాంత ప్రజల రాకపోకలకు ఇబ్బందులు కలగకుండా అవసరమైన చర్యలు తీసుకోవాలన్నారు. అందుకు సంబంధించిన ప్రతిపాదనలు సిద్ధం చేయాలని తెలిపారు.
ముంపు ప్రాంతాల్లో ప్రజలకు సత్వర ఉపశమనం
కాకినాడ జిల్లావ్యాప్తంగా 92 తీర ప్రాంత ఆవాసాల నుంచి 10 వేల మందికి పైగా ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించి, 102 పునరావాస కేంద్రాల్లో వారందరికీ ఆశ్రయం కల్పించడం పట్ల జిల్లా యంత్రాంగాన్ని అభినందించారు. తుపాను ప్రభావిత ప్రాంతాల్లో ప్రజలకు అవసరమైన సహాయక చర్యలను నిరంతరం కొనసాగించాలని సూచించారు. సూరాడపేట, మాయాపట్నం, కొత్తపట్నం, నాయకర్ కాలనీల్లోకి సముద్రపు నీరు చొచ్చుకురావడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారని తెలిపారు. ఈ విషయాన్ని తెలియజేసిన వెంటనే స్పందించి, 24 గంటల్లో నీటిని పూర్తిగా తొలగించిన జిల్లా యంత్రాంగాన్ని అభినందించారు.
తుపాను గాలుల కారణంగా పిఠాపురం నియోజక వర్గంలోని పలు ప్రాంతాల్లో విద్యుత్ సరఫరాకు అంతరాయం కలిగిందని ఉప ముఖ్యమంత్రివర్యులు తెలిపారు. తుపాను ప్రభావం తగ్గిన వెంటనే విద్యుత్ పునరుద్ధరణ చర్యలు చేపట్టినప్పటికీ, భోగాపురం, నరసింగపురం, చిత్రాడ ఎస్సీ కాలనీ, మల్లం, విరవాడ మధ్య విద్యుత్ స్తంభాలు పడిపోయాయని వివరించారు. కొన్ని చోట్ల పునరుద్ధరణ తర్వాత వైర్లు కాలిపోయినట్లు తెలిపారు. ఈ సమస్యలన్నింటినీ త్వరగా పరిష్కరించి, విద్యుత్ సరఫరాను పూర్తిస్థాయిలో పునరుద్ధరించాలని అధికారులకి స్పష్టం చేశారు.
నష్టం అంచనాలను త్వరగా పూర్తి చేయాలి
తుపాను కారణంగా దెబ్బతిన్న ఇళ్లు, పంటలు, బోట్లు, వలలు, మగ్గాలకు ఎన్యూమరేషన్ ప్రక్రియను త్వరగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. నష్టాలపై సమగ్ర అంచనాలు రూపొందించి, ప్రభుత్వానికి నివేదిక సమర్పించాలని నిర్దేశించారు. రైతులు, మత్స్యకారులతో పాటు తుపాను బాధితులందరికీ న్యాయం జరిగేలా నష్టపరిహారం అందించేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలన్నారు.
ముంపునకు గురైన గ్రామాల ప్రజలకు 25 కేజీల బియ్యం, మత్స్యకారులు, చేనేతలకు 50 కేజీల బియ్యంతోపాటు పప్పు, వంటనూనె, ఉల్లిపాయలు, బంగాళాదుంపలు, పంచదార తదితర నిత్యావసర సరుకులను ప్రతి బాధిత కుటుంబానికి అందించేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. పంపిణీ చేసే సరుకుల్లో కొరత ఏర్పడకుండా జాగ్రత్తలు తీసుకోవాలని, ప్రజలకు ఇబ్బందులు కలగకుండా చూడాలని పేర్కొన్నారు.
సహాయక చర్యల్లో పాల్గొన్న సిబ్బందికి అభినందనలు
విపత్తు సమయంలో ఎలాంటి ప్రాణనష్టం వాటిల్లకుండా, ప్రజలకు ఇబ్బందులు కలగకుండా నిరంతరం కృషి చేసిన పోలీసు, రెవెన్యూ, మున్సిపల్, విద్యుత్, వైద్య ఆరోగ్య శాఖ ఉప ముఖ్యమంత్రి అభినందించారు. సహాయక, రక్షణ చర్యల్లో పాల్గొన్న 45 ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాలు, గ్రామాల్లో మౌలిక సదుపాయాల తక్షణ పునరుద్ధరణకు కృషి చేస్తున్న పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ నీటి సరఫరా విభాగం సిబ్బంది సేవలను ప్రశంసించారు. విపత్కర పరిస్థితుల్లో సమన్వయంతో పనిచేసి ప్రజలకు అండగా నిలిచిన ప్రతి ఒక్కరికీ అభినందనలు తెలిపారు.
ఈ సమావేశంలో కాకినాడ రూరల్ శాసన సభ్యులు శ్రీ పంతం నానాజీ, జిల్లా కలెక్టర్ శ్రీ హరేంధిర ప్రసాద్, పంచాయతీరాజ్, ఎస్పీ శ్రీ బిందు మాధవ్, గ్రామీణాభివృద్ధి శాఖ కమిషనర్ శ్రీ కృష్ణ తేజ, ఏపీఈపీడీసీఎల్ సీఎండీ శ్రీ పృధ్వితేజ, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ నీటి సరఫరా విభాగాల ఇ.ఎన్.సీలు తదితరులు పాల్గొన్నారు.

30/10/2026

జనసేన తెలంగాణ ‘అలయ్ బలయ్’ ప్రారంభం

జనసేన తెలంగాణ ‘అలయ్ బలయ్’ ఆత్మీయ సమ్మేళనం హైద్రాబాదులోని జనసేన పార్టీ తెలంగాణ రాష్ట్ర కార్యాలయంలో ప్రారంభమైంది.

జనసేన పార్టీ తెలంగాణ రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ, ఉమ్మడి ఖమ్మం, నల్గొండ, వరంగల్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల జనసేన పార్టీ అభ్యర్థి డాక్టర్ శ్రీ గడల శ్రీనివాసరావు ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నరు.

జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి శ్రీ రామ్ తాళ్ళూరి, తెలంగాణ రాష్ట్ర ఇన్చార్జ్ శ్రీ నేమూరి శంకర్ గౌడ్, ప్రచార కార్యదర్శి శ్రీ ఆర్.కె. సాగర్ అతిథులుగా హాజరయ్యారు.

జనసేన పార్టీ సంస్థాగత బలోపేతం, రానున్న ఎన్నికలకు సన్నద్ధత లక్ష్యంగా, పార్టీలో నూతనంగా చేరిన నాయకులకు స్వాగతం పలకడం, వారిని సమావేశానికి పరిచయం చేయడం, పార్టీ బలోపేతంలో వారి పాత్ర, బాధ్యతలు, భవిష్యత్ కార్యాచరణపై చర్చించడం, జానపద కార్యక్రమాల ద్వారా తెలంగాణ రాష్ట్ర సంస్రృతిని చాటి చెప్పాలనేది ‘అలయ్ బలయ్’ ప్రధాన ఉద్దేశ్యం. ఈ నేపథ్యంలోనే అతిథుల ప్రసంగాలు కొనసాగుతున్నాయి.

20/10/2026

మా ఊరి దసరా సెలబ్రేషన్స్

అమ్మలగన్న అమ్మ దుర్గమ్మ దివ్య ఆశీస్సులు మనందరిపై ఎల్లవేళలా ఉండాలని, చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీక అయిన ఈ విజయదశమ...
20/10/2026

అమ్మలగన్న అమ్మ దుర్గమ్మ దివ్య ఆశీస్సులు మనందరిపై ఎల్లవేళలా ఉండాలని, చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీక అయిన ఈ విజయదశమి పర్వదినాన, ఆ జగన్మాత శక్తి స్వరూపిణి ప్రజలందరికీ ఆయురారోగ్యాలు, సుఖశాంతులు ప్రసాదించాలని కోరుకుంటూ ప్రజలందరికీ విజయదశమి శుభాకాంక్షలు.



Address

Thandriyal
Karimnagar
505306

Alerts

Be the first to know and let us send you an email when Ganesh Kalyan Dharavath posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Shortcuts

Share