Team RPKR - Kavali

Directions Contact the organization

Team RPKR - Kavali Official Team Page Of Ramireddy Pratap Kumar Reddy ✍️

🎯

21/09/2026

పాతూరు గడ్డ ప్రతాప్ అన్న అడ్డా 🔥🔥🔥🔥🔥

20/09/2026

అనిల్ బాబు మాస్ బ్యాటింగ్ 😂😂

19/09/2026

కావలి ఎమ్మెల్యే అండతో రెచ్చిపోతున్న భూ కబ్జా మాఫియా..!

పట్టించుకోని ఎమ్మెల్యే మరియు సంబంధిత అధికారులు..!

వరుస భూ కబ్జా వార్తలతో సంచలంగా మారిన కావలి నియోజకవర్గం..!

మహిళా ఆవేదన వింటున్నారా ఎమ్మెల్యే గారు..?

15/09/2026

సీన్ డిఫెరెంట్ ... కావలి మున్సిపల్ ఎన్నికల్లో టీడీపీ ఢమాల్... వైస్సార్సీపీ అదిరిపోయే ప్లాన్

15/09/2026

పండగ రోజు పారిశుద్ధ్య కార్మికుల కుటుంబాల్ని పస్తులు పెట్టిన కూటమి ప్రభుత్వం

నెల్లూరు జిల్లాలోని అల్లూరు నగర పంచాయతీ పరిధిలో పనిచేస్తున్న పారిశుద్ధ్య కార్మికులకి 2 నెలలుగా అందని వేతనాలు

వినాయక చవితి రోజు కనీసం పండగ సరుకులు కొనుగోలు చేయడానికి కూడా తమ వద్ద డబ్బులు లేవని.. ఆఖరికి దేవుడికి కూడా సంతోషంగా కొబ్బరికాయ కొట్టలేకపోయామని కార్మికులు ఆవేదన

వేతనాలు అందే వరకూ విధుల్లోకి వచ్చేది లేదంటూ కార్మికులు విధులు బహిష్కరణ

ఠంచనుగా ఒకటో తారీఖున జీతాలు/వేతనాలు ఇచ్చేస్తామంటూ బీరాలు పలికావు.. మరి ఇదేంటి చంద్రబాబు ?

11/09/2026

కావలి నియోజకవర్గ వైస్సార్సీపీ ఆత్మీయ సమావేశం

కావలి మాజీ ఎమ్మెల్యే మరియు వైస్సార్సీపీ ఇంఛార్జి శ్రీ రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి గారి ఆధ్వర్యంలో వైస్సార్సీపీ ఆత్మీయ సమావేశం..

ముఖ్య అతిధులుగా పాల్గొన్న జిల్లా వైస్సార్సీపీ అధ్యక్షులు శ్రీ కాకణి గోవర్ధన్ రెడ్డి గారు.

ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్సీ చంద్రశేఖర్ రెడ్డి గారు మాజీ ఆప్కాప్ చైర్మన్ కొండూరు అనిల్ బాబు గారు.. మరియు వైస్సార్సీపీ నాయకులు ,కార్యకర్తలు.

08/09/2026
02/09/2026

ప్రజల గుండెల్లో చిరస్థాయిగా వైయస్ఆర్: మాజీ ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి

కావలి పట్టణంలో ఘనంగా వైయస్ఆర్ 17వ వర్ధంతి వేడుకలు

దివంగత ముఖ్యమంత్రి, మహానేత స్వర్గీయ డా. వైయస్‌ రాజశేఖర రెడ్డి గారి 17వ వర్ధంతి వేడుకలను కావలి పట్టణంలో వైయస్ఆర్ సీపీ నాయకులు, కార్యకర్తలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి గారు, స్థానిక వైయస్ఆర్ సీపీ నాయకులు, అధ్యక్షులు, పట్టణ మరియు రూరల్ ముఖ్య నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి వైస్సార్సీపీ నాయకులతో కలిసి వైయస్ఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం వైయస్ఆర్ చేసిన ప్రజాసేవలను స్మరించుకున్నారు.

ముఖ్యమంత్రిగా వైయస్ఆర్ పనిచేసిన సమయంలో పేదలు, రైతులు, మహిళలు, విద్యార్థులు, బలహీన వర్గాల సంక్షేమానికి అనేక సంక్షేమ పథకాలను అమలు చేసి ప్రజలకు అండగా నిలిచారని మాజీ ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి గారు అన్నారు. ఆరోగ్యశ్రీ, ఉచిత విద్యుత్‌, ఫీజు రీయింబర్స్‌మెంట్‌, జలయజ్ఞం వంటి అనేక కార్యక్రమాల ద్వారా పేద ప్రజల జీవితాల్లో వెలుగులు నింపిన మహానేత వైయస్ఆర్ అని కొనియాడారు. ప్రజల సమస్యలను స్వయంగా తెలుసుకుని, వారి కష్టాల్లో అండగా నిలిచిన వైయస్ఆర్ సేవలు ఎప్పటికీ మరువలేనివని అన్నారు. వైయస్ఆర్ మరణించి ఎన్నో సంవత్సరాలు గడిచినా ఆయన సంక్షేమ పాలనను, ప్రజలకు చేసిన సేవలను ప్రజలు ఇప్పటికీ గుర్తుచేసుకుంటున్నారని తెలిపారు.



01/09/2026

కడుపునిండా అన్నం పెట్టలేరా?

చాలీచాలని భోజనంపై కావలి ప్రభుత్వ ఆసుపత్రిలో రగడ!

రోగుల కడుపు మంటపై హాస్పిటల్ కమిటీ, అధికారుల మౌనం ఎందుకు?

నెల్లూరు జిల్లా, కావలి:
కావలి ఏరియా ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు అందిస్తున్న భోజనంపై తీవ్ర ఆవేదన వ్యక్తమవుతోంది.
రోగులకు కడుపునిండా అన్నం పెట్టడం కూడా భారమైపోయిందా?
అనారోగ్యంతో ఆసుపత్రిలో చేరిన రోగులకు చాలీచాలని భోజనం అందిస్తే వారి పరిస్థితి ఏమిటంటూ బాధితులు ప్రశ్నిస్తున్నారు.
ఆసుపత్రిలో చికిత్స కోసం చేరిన రోగులకు వైద్యం ఎంత ముఖ్యమో... సమయానికి సరైన పోషకాహారం అందించడం కూడా అంతే ముఖ్యం. కానీ భోజనం పరిమాణం సరిపోవడం లేదంటూ రోగులు, వారి బంధువులు ఆవేదన వ్యక్తం చేస్తున్నట్లు సమాచారం.
ఒకవైపు ప్రభుత్వ ఆసుపత్రుల్లో రోగులకు మెరుగైన వైద్యం అందిస్తున్నామని అధికారులు చెబుతుంటే...
మరోవైపు కనీసం కడుపునిండా భోజనం కూడా అందడం లేదంటూ ఫిర్యాదులు రావడం అధికారుల పనితీరుపై ప్రశ్నలు రేకెత్తిస్తోంది.
అసలు రోగుల భోజనం కోసం ప్రభుత్వం కేటాయిస్తున్న నిధులు ఎంత?
రోగికి రోజుకు ఎంత భోజనం అందించాలి?
అదే పరిమాణంలో భోజనం అందుతోందా?
భోజనం సరఫరాను హాస్పిటల్ కమిటీ సభ్యులు ఎప్పటికప్పుడు పరిశీలిస్తున్నారా?
హాస్పిటల్ కమిటీ సభ్యులు, ఆసుపత్రి యాజమాన్యం పర్యవేక్షణ బాధ్యత తీసుకున్నప్పుడు...
రోగులకు అందుతున్న భోజనంపై ఎందుకు నిఘా పెట్టడం లేదనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి.
అనారోగ్యంతో ఉన్న రోగులకు కడుపునిండా, నాణ్యమైన భోజనం అందేలా చూడాల్సిన బాధ్యత ఎవరిది?
రోగి ఆకలి కూడా పట్టించుకోకపోతే... ప్రభుత్వ ఆసుపత్రి సేవలు ఎవరి కోసం?
ఇప్పటికైనా హాస్పిటల్ కమిటీ, ఆసుపత్రి అధికారులు స్పందించి...
రోగులకు అందిస్తున్న భోజనం నాణ్యత, పరిమాణంపై సమగ్రంగా పరిశీలన చేయాలని బాధితులు కోరుతున్నారు.
రోగుల ఆకలి కేకలకు అధికారులు సమాధానం చెబుతారా?
లేక... ఇదంతా చూసీచూడనట్టే వ్యవహరిస్తారా?

29/08/2026

భయంకరమైన ఆరోపణలు చేసిన టీడీపీ సీనియర్ నాయకుడు.

ఒక విధంగా చూస్తుంటే నిజమే అనిపిస్తుంది ..!

మీరేమంటారు ప్రజలారా..?

Address

Kavali

Website

Alerts

Be the first to know and let us send you an email when Team RPKR - Kavali posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Organization

Send a message to Team RPKR - Kavali:

Shortcuts

Share