18/09/2026
కావలి మాజీ ఎమ్మెల్యే ప్రతాప్ కుమార్ రెడ్డి గారిని కలిసిన అనంత వెంకటరామిరెడ్డి, శైలజానాథ్ గారు.
తాగునీరు, సాగునీటి సమస్యలపై ఆరా.. ప్రజలు, రైతుల పక్షాన పోరాటానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రణాళిక
కావలి మాజీ ఎమ్మెల్యే, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కావలి నియోజకవర్గ ఇన్చార్జ్ రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి నివాసానికి మాజీ ఎంపీ, అనంతపురం జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు అనంత వెంకటరామిరెడ్డి, మాజీ మంత్రి శైలజానాథ్ శుక్రవారం విచ్చేశారు.
ఈ సందర్భంగా ప్రతాప్ కుమార్ రెడ్డి వారికి ఘన స్వాగతం పలికి శాలువాలతో సత్కరించారు. అనంతరం కావలి నియోజకవర్గానికి చెందిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, వార్డు ఇన్‌చార్జిలను వారికి పరిచయం చేశారు.
తదుపరి కావలి ప్రాంతంలో నెలకొన్న తాగునీరు, సాగునీటి సమస్యలపై వారు వివరాలు అడిగి తెలుసుకున్నారు. తాగునీటి సమస్యతో ప్రజలు, సాగునీటి ఇబ్బందులతో రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రతాప్ కుమార్ రెడ్డి వారి దృష్టికి తీసుకెళ్లారు.
ప్రజలు, రైతుల సమస్యల పరిష్కారం కోసం వైయస్ జగన్మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వారి పక్షాన నిలిచి పోరాటం చేసేందుకు ప్రణాళిక సిద్ధం చేస్తోందని ఈ సందర్భంగా తెలిపారు. తాగునీరు, సాగునీటి సమస్యలపై ప్రజల తరఫున ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకువచ్చేందుకు, సమస్యల పరిష్కారం కోసం అవసరమైన పోరాటాన్ని చేపట్టేందుకు పార్టీ ఎల్లప్పుడూ ముందుంటుందని పేర్కొన్నారు.
కావలి నియోజకవర్గ ప్రజలు, రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను పార్టీ నాయకులు సమన్వయంతో ముందుకు తీసుకెళ్లాలని ఈ సందర్భంగా చర్చించినట్లు తెలిపారు.