Kurnool Police

Call Directions Website

Kurnool Police Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from Kurnool Police, Law enforcement agency, konda reddy fort, Kurnool.

బనవాసి గ్రామంలో పోలీసుల పల్లె నిద్ర​జిల్లా ఎస్పీ శ్రీ విక్రాంత్ పాటిల్ ఐపీఎస్ గారి ఆదేశాల మేరకు బనవాసి గ్రామంలో ఎమ్మిగనూ...
09/10/2026

బనవాసి గ్రామంలో పోలీసుల పల్లె నిద్ర
​జిల్లా ఎస్పీ శ్రీ విక్రాంత్ పాటిల్ ఐపీఎస్ గారి ఆదేశాల మేరకు బనవాసి గ్రామంలో ఎమ్మిగనూరు రూరల్ పోలీసులు పల్లె నిద్ర నిర్వహించారు. మద్యం, గంజాయి, జూదం వలన కలిగే నష్టాలు, సైబర్ నేరాల (1930) పై ప్రజలకు అవగాహన కల్పిస్తూ రాబోయే ఎన్నికలను ప్రశాంతంగా జరుపుకోవాలని సీఐ చిరంజీవి సూచించారు.
​

09/10/2026

బనవాసి గ్రామంలో పోలీసుల పల్లె నిద్ర
​జిల్లా ఎస్పీ శ్రీ విక్రాంత్ పాటిల్ ఐపీఎస్ గారి ఆదేశాల మేరకు బనవాసి గ్రామంలో ఎమ్మిగనూరు రూరల్ పోలీసులు పల్లె నిద్ర నిర్వహించారు. మద్యం, గంజాయి, జూదం వలన కలిగే నష్టాలు, సైబర్ నేరాల (1930) పై ప్రజలకు అవగాహన కల్పిస్తూ రాబోయే ఎన్నికలను ప్రశాంతంగా జరుపుకోవాలని సీఐ చిరంజీవి సూచించారు.
​

నాటుసారా తయారీపై ఉక్కుపాదం​నేరణికి తండా అటవీ ప్రాంతంలో హొలగుంద పోలీసులు దాడులు చేసి 150 లీటర్ల బెల్లం ఊటను ధ్వంసం చేసి, ...
09/10/2026

నాటుసారా తయారీపై ఉక్కుపాదం
​నేరణికి తండా అటవీ ప్రాంతంలో హొలగుంద పోలీసులు దాడులు చేసి 150 లీటర్ల బెల్లం ఊటను ధ్వంసం చేసి, ఒక వ్యక్తిని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు.
​

శాంతిభద్రతల పరిరక్షణే లక్ష్యంఎస్పీ శ్రీ విక్రాంత్ పాటిల్ ఐపిఎస్ గారి ఆదేశాల మేరకు ​చిన్న హేటలో బన్నీ ఉత్సవాలు, ఎన్నికలను...
08/10/2026

శాంతిభద్రతల పరిరక్షణే లక్ష్యం

ఎస్పీ శ్రీ విక్రాంత్ పాటిల్ ఐపిఎస్ గారి ఆదేశాల మేరకు ​చిన్న హేటలో బన్నీ ఉత్సవాలు, ఎన్నికలను ప్రశాంతంగా జరుపుకోవాలని, సైబర్ మోసాలపై 1930కు కాల్ చేయాలని, మహిళా భద్రత, రోడ్డు నియమాలు పాటించాలని హొలగుంద ఎస్సై దిలీప్ కుమార్ ప్రజలకు అవగాహన కల్పించారు.
​

కర్నూలు జిల్లా ఆదోని నూతన ఏఎస్పీ జయ శర్మ, ఐపీఎస్ గారు గురువారం క్యాంపు కార్యాలయంలో జిల్లా ఎస్పీ శ్రీ విక్రాంత్ పాటిల్, ఐ...
08/10/2026

కర్నూలు జిల్లా ఆదోని నూతన ఏఎస్పీ జయ శర్మ, ఐపీఎస్ గారు గురువారం క్యాంపు కార్యాలయంలో జిల్లా ఎస్పీ శ్రీ విక్రాంత్ పాటిల్, ఐపీఎస్ గారిని మర్యాదపూర్వకంగా కలిశారు.





ఆదోని నూతన ఏఎస్పీగా బాధ్యతలు చేపట్టిన జయ శర్మ, ఐపీఎస్ గారు గురువారం కర్నూలు రేంజ్ డీఐజీ డాక్టర్ కోయ ప్రవీణ్, ఐపీఎస్ గారి...
08/10/2026

ఆదోని నూతన ఏఎస్పీగా బాధ్యతలు చేపట్టిన జయ శర్మ, ఐపీఎస్ గారు గురువారం కర్నూలు రేంజ్ డీఐజీ డాక్టర్ కోయ ప్రవీణ్, ఐపీఎస్ గారిని మర్యాదపూర్వకంగా కలిశారు.




కర్నూలు ఎస్పీ శ్రీ విక్రాంత్ పాటిల్ ఐపీఎస్ గారిని మర్యాదపూర్వకంగా కలిసిన .... పత్తికొండ నూతన డీఎస్పీ వంశీధర్ గౌడ్.గురువా...
08/10/2026

కర్నూలు ఎస్పీ శ్రీ విక్రాంత్ పాటిల్ ఐపీఎస్ గారిని మర్యాదపూర్వకంగా కలిసిన .... పత్తికొండ నూతన డీఎస్పీ వంశీధర్ గౌడ్.

గురువారం పత్తికొండ డీఎస్పీగా బాధ్యతలు చేపట్టిన వంశీధర్ గౌడ్ కర్నూలు జిల్లా పోలీసు కార్యాలయంలో కర్నూలు ఎస్పీ శ్రీ విక్రాంత్ పాటిల్ ఐపీఎస్ గారిని మర్యాదపూర్వకంగా కలిశారు.

పత్తికొండ సబ్ డివిజన్‌లో శాంతిభద్రతల పరిరక్షణ, నేరాల నియంత్రణపై ప్రత్యేక దృష్టి సారించాలని ఎస్పీ గారు సూచించారు.

జిల్లా పోలీస్ కార్యాలయం. కర్నూలు




08/10/2026

రూ . 1 కోటి 20 లక్షల విలువైన 589 మొబైల్ ఫోన్లను రికవరీ చేసి బాధితులకు అందజేసిన...
కర్నూలు ఎస్పీ శ్రీ విక్రాంత్ పాటిల్ ఐపియస్ గారు.
* ఇతర రాష్ట్రాల నుండి మొబైల్ ఫోన్లను రికవరీ చేసిన కర్నూలు. పోలీసులు.
* మొబైల్ పోగొట్టుకుంటే వెంటనే CEIRలో IMEI వివరాలు నమోదు చేసుకోవాలి.




08/10/2026

6 వ మొబైల్ మేళా... 589 మొబైల్ ఫోన్లు రికవరీ – బాధితులకు అందజేత

కర్నూలు ఎస్పీ శ్రీ విక్రాంత్ పాటిల్ గారు




పత్రికా ప్రకటన(08.10.2026)కర్నూలు జిల్లా...రూ . 1 కోటి 20 లక్షల  విలువైన 589 మొబైల్ ఫోన్లను రికవరీ చేసి బాధితులకు అందజేస...
08/10/2026

పత్రికా ప్రకటన
(08.10.2026)

కర్నూలు జిల్లా...

రూ . 1 కోటి 20 లక్షల విలువైన 589 మొబైల్ ఫోన్లను రికవరీ చేసి బాధితులకు అందజేసిన...

కర్నూలు ఎస్పీ శ్రీ విక్రాంత్ పాటిల్ ఐపియస్ గారు.

* ఇప్పటివరకు ఆరు విడతల మొబైల్ రికవరీ కార్యక్రమాల్లో 3,670 మొబైల్ ఫోన్లను రికవరీ చేసిన విలువ రూ.7.36 కోట్లు.

* ఇతర రాష్ట్రాల నుండి మొబైల్ ఫోన్లను రికవరీ చేసిన కర్నూలు. పోలీసులు.

* మొబైల్ పోగొట్టుకుంటే వెంటనే CEIRలో IMEI వివరాలు నమోదు చేసుకోవాలి.

కర్నూలు జిల్లా పోలీసు కార్యాలయంలోని వ్యాస్ ఆడిటోరియంలో గురువారం 6 వ మొబైల్ రికవరీ మేళా కార్యక్రమాన్ని నిర్వహించారు.

కర్నూలు సైబర్ ల్యాబ్ పోలీసులు మరియు స్థానిక పోలీసులు రికవరీ చేసిన 589 మొబైల్ ఫోన్లను, సుమారు రూ.1 కోటి 20 లక్షల విలువైన ఫోన్లను జిల్లా ఎస్పీ శ్రీ విక్రాంత్ పాటిల్ ఐపీఎస్ గారు బాధితులకు అందజేశారు.

ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ గారు మాట్లాడుతూ...

ఆరు విడతల మొబైల్ రికవరీ కార్యక్రమాల్లో ఇప్పటివరకు రూ. 7.36 కోట్ల విలువైన 3,670 మొబైల్ ఫోన్లను రికవరీ చేసి బాధితులకు అందజేశామన్నారు.

ప్రస్తుత రోజుల్లో మొబైల్ ఫోన్ కేవలం ఆర్థిక విలువ కలిగిన వస్తువు మాత్రమే కాదని, బ్యాంకింగ్ లావాదేవీలు, ఫోన్ నంబర్లు, ఫొటోలు, వీడియోలు, వ్యక్తిగత సమాచారం, జ్ఞాపకాలు వంటి అనేక ముఖ్యమైన వివరాలు అందులో ఉంటాయన్నారు.

అందువల్ల మొబైల్ ఫోన్ పోయినప్పుడు ఆర్థిక నష్టంతో పాటు బాధితులు భావోద్వేగపరమైన ఆందోళనకు గురవుతున్నారన్నారు.

బాధితుల సమస్యలను దృష్టిలో ఉంచుకుని జిల్లా ఐటీ కోర్ టీమ్, సైబర్ ల్యాబ్ పోలీసులు, స్థానిక పోలీసులు సమన్వయంతో ప్రత్యేకంగా కృషి చేస్తున్నారన్నారు.

ఆంధ్రప్రదేశ్‌తో పాటు తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు, మహారాష్ట్ర, రాజస్థాన్ తదితర రాష్ట్రాల నుండి మొబైల్ ఫోన్లను రికవరీ చేసి తీసుకొచ్చారన్నారు.

రికవరీ చేసిన పోలీసు అధికారులు, సిబ్బందిని ప్రత్యేకంగా అభినందిస్తున్నామన్నారు.

సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి వివిధ ప్రాంతాల్లో పోగొట్టుకున్న మొబైల్ ఫోన్లను పొరుగు రాష్ట్రాల నుంచి కర్నూలు పోలీసులు రికవరీ చేశారన్నారు.

అవి...

1) జి.ఎస్. రవికుమార్ (ఫారెస్ట్ ఆఫీస్ ఏవో, కర్నూలు): కర్నూలులో పోగొట్టుకున్న మొబైల్ ఫోన్‌ను హైదరాబాద్‌లో గుర్తించి కర్నూలు టూటౌన్ పోలీసులు రికవరీ చేశారు.

2) టి. శిరీష (పిఠాపురం): మంగళగిరిలో పోగొట్టుకున్న మొబైల్ ఫోన్‌ను బెంగళూరులో గుర్తించి ఎమ్మిగనూరు రూరల్ పోలీసులు రికవరీ చేశారు.

3) ఎం. రంజిత్ (కడప): తమిళనాడులో పోగొట్టుకున్న మొబైల్ ఫోన్‌ను తమిళనాడులో గుర్తించి ఉలిందకొండ పోలీసులు రికవరీ చేశారు.

4) పి. సాంబశివుడు (కర్నూలు): కర్నూలులో పోయిన మొబైల్ ఫోన్‌ను మహారాష్ట్రలో గుర్తించి కర్నూలు తాలూకా పోలీసులు రికవరీ చేశారు.

5) ఎస్. దానం (పేపర్ బాయ్, కర్నూలు): కర్నూలు, సి.క్యాంప్ లో పోయిన మొబైల్ ఫోన్‌ను తమిళనాడులో గుర్తించి కర్నూలు త్రీటౌన్ పోలీసులు రికవరీ చేశారు.

ప్రజలకు జిల్లా ఎస్పీ గారి విజ్ఞప్తి ...

ఎవరైనా మొబైల్ ఫోన్ పోగొట్టుకున్నా లేదా దొంగతనానికి గురైనా ఆందోళన చెందకుండా కేంద్ర ప్రభుత్వం అందించిన CEIR (Central Equipment Identity Register) పోర్టల్‌లో వెంటనే మొబైల్ IMEI నంబర్, ఇతర వివరాలను నమోదు చేసుకోవాలని జిల్లా ఎస్పీ గారు సూచించారు.

CEIRలో నమోదు చేసిన వివరాల ఆధారంగా పోలీసులు మొబైల్ ఫోన్‌ను ట్రాక్ చేసి రికవరీ చేసేందుకు చర్యలు తీసుకుంటారన్నారు.

మొబైల్ ఫోన్ పోయిన వెంటనే ఆలస్యం చేయకుండా సంబంధిత వివరాలను CEIR లో నమోదు చేసుకోవాలని జిల్లా ఎస్పీ గారు ప్రజలకు విజ్ఞప్తి చేశారు.

ఈ కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీ అడ్మిన్ హుస్సేన్ పీరా, సీఐలు మధుసూదన్ రావు, శివశంకర్, సైబర్ ల్యాబ్ ఎస్‌ఐలు వెంకట మోహన్, ఆశాలత, సైబర్ ల్యాబ్ టెక్నికల్ టీమ్ సిబ్బంది పాల్గొన్నారు.

జిల్లా పోలీసు కార్యాలయం, కర్నూలు




Address

Konda Reddy Fort
Kurnool
518001

Telephone

100

Alerts

Be the first to know and let us send you an email when Kurnool Police posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Shortcuts

Share