My city-KURNOOL

Directions Website Contact the organization

My city-KURNOOL Like and start getting updates of kurnool My city Kurnool page will provide updates about kurnool city which is Ranked as 4th biggest city in Andhra pradesh.
(1084)

We update information which is upto our knowledge.My city Kurnool encourage Educational events,Emergency blood service,social awareness and all other social activities which will helps people. More info will get updated soon....

Best wishes to Karan & Girinath (wicket keeper)
08/10/2026

Best wishes to Karan & Girinath (wicket keeper)

12 నుంచి విద్యా సంస్థలకు దసరా సెలవులుకర్నూలు కల్చరల్: రాయలసీమ యూనివర్సిటీపరిధిలోని అఫ్లియేటెడ్ డిగ్రీ, బీఈడీ కళా శాలలకు ...
08/10/2026

12 నుంచి విద్యా సంస్థలకు దసరా సెలవులు
కర్నూలు కల్చరల్: రాయలసీమ యూనివర్సిటీ
పరిధిలోని అఫ్లియేటెడ్ డిగ్రీ, బీఈడీ కళా శాలలకు ఈనెల 12 నుంచి 21వ తేదీ వరకు దసరా సెలవులను ప్రకటించినట్లు వర్సిటీ అక డమిక్ అఫైర్స్ డీన్ ప్రొఫెసర్ కృష్ణారెడ్డి ఒక ప్రక టనలో తెలిపారు. 22వ తేదీ కళాశాలలు పునఃప్రారంభమవుతాయన్నారు. అయితే 10వ తేదీ రెండో శనివారం, 11వ తేదీ ఆదివారం కూడా సెలవులు ఉండటంతో రెండు రోజులు అదనంగా సెలవులు కలిసి వచ్చినట్లయింది.

07/10/2026

దేవరగట్టు బన్ని ఉత్సవాలకు పటిష్ఠ ఏర్పాట్లు: కలెక్టర్
దేవరగట్టు బన్ని ఉత్సవాలను ప్రశాంతంగా, పకడ్బందీగా నిర్వహించేందుకు అన్ని శాఖల అధికారులు సమన్వయంతో ఏర్పాట్లు చేపట్టాలని కలెక్టర్ డాక్టర్ ఏ. సిరి, SP విక్రాంత్ పాటిల్ సూచించారు. కలెక్టరేట్కా కాన్ఫరెన్స్ హాల్లో హోళగుంద, హాలహర్వి, ఆలూరు మండలాల అధికారులు, సంబంధిత గ్రామాల పెద్దలు, వివిధ శాఖల జిల్లా అధికారులతో సమన్వయ సమావేశం నిర్వహించారు. ఉత్సవాలకు పకడ్బందీగా ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు.

07/10/2026

దొంగతనానికి పాల్పడిన కొడుకును స్వయంగా తండ్రే పోలీసులకు పట్టించడం చర్చనీయాంశంగా మారింది. ఆల్కాలీస్ ఫ్యాక్ట రీలో పనిచేసే రాఘవేంద్ర ఇంట్లో చోరీకి పాల్పడిన ఇద్దరు దొంగలను నాల్గవ పట్టణ పోలీసులు అరెస్టు చేసి కటకటాలకు పంపారు. రాఘవేంద్ర కోడుమూరు రోడ్డులోని సీతారాం నగర్ లో నివాసముంటాడు. గత ఆదివారం మధ్యాహ్నం కుటుంబ సభ్యులతో కలసి ఇం టికి తాళం వేసి షాపింగ్కు వెళ్లారు. ఇదే అద నుగా భావించిన దొంగలు తాళాలు పగులగొట్టి ఇంట్లోకి చొరబడి బీరువాలోని బంగారు, వెండి ఆభరణాలు మూటగట్టుకుని ఉడాయించారు. రాఘవేంద్ర ఫిర్యాదు మేరకు నాల్గవ పట్టణ పోలీసులు కేసు నమోదు చేసుకుని ఆ ప్రాంతం లో అందుబాటులో ఉన్న సీసీటీవీ ఫుటేజీలను సేకరించి దొంగల కోసం గాలింపు చేపట్టారు. ఈ క్రమంలో బుధవారపేటకు చెందిన షాకీర్ తన ఇంట్లో కొంత బంగారు నగలను కొడుకు ఫైజన్ దాచి ఉంచాడని పోలీసులకు సమాచార మిచ్చాడు. పరారీలోని ఫైజన్ ను పట్టుకుని విచా రించగా తన స్నేహితుడైన మైనర్ బాలుడిని ఫ్లోరింగ్ పని కోసమని తీసుకెళ్లి దొంగతనానికి పాల్పడినట్లు నేరం ఒప్పుకున్నాడు. దీంతో ఇద్దరు నిందితులతో పాటు 20 తులాల బం గారు ఆభరణాలు, 30 తులాల వెండి ఆభరణా లను స్వాధీనం చేసుకుని రిమాండ్కు తరలిం చినట్లు పోలీసులు తెలిపారు.

06/10/2026

కర్నూలుకు ఇక కమిషనరేట్.. రెండు జోన్లు, ఐదు సబ్ డివిజన్లు
కర్నూలు కేంద్రంగా పోలీస్ కమిషనరేట్ ఏర్పాటు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం అనుమతిచ్చింది. ఈ మేరకు హోంశాఖ జీఓ ఎంఎస్ -199ను సోమవారం జారీ చేసింది. ఐజీపీ/డీఐజీపీ స్థాయి అధికారి పోలీస్ కమిషనర్గా వ్యవహరించనున్నారు. కమిషనరేట్లో రెండు జోన్లు, కర్నూలు అర్బన్, కర్నూలు రూరల్, ఆదోని, ఎమ్మిగనూరు, పత్తికొండ ఐదు సబ్ డివిజన్లు ఉంటాయి. ప్రస్తుతం ఉన్న కర్నూలు రెవెన్యూ, పోలీస్ జిల్లా పరిధే కమిషనరేట్ పరిధి ఉంటుంది.

05/10/2026

డ్రోన్ సిటీ ఫేజ్ ఫేజ్–1 పనులను వేగవంతంగా పూర్తి చేయాలి. *జిల్లా కలెక్టర్ డా.ఏ.సిరి* డ్రోన్ సిటీ ఫేజ్ ఫేజ్–1 పనులను వేగవంతంగా పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ డా.ఏ.సిరి ఏపిఐఐసి అధికారులను ఆదేశించారు.

సోమవారం ఓర్వకల్లు మండలం కొమరోలు గ్రామంలో ఏర్పాటు చేయనున్న డ్రోన్ సిటీ మొదటి దశ పనులను కలెక్టర్ పరిశీలించారు..

ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ డ్రోన్ సిటీ ఫేజ్ ఫేజ్–1 కు సంబంధించి రోడ్లు, డ్రెయిన్ల నిర్మాణ పనులు ఒప్పందం ప్రకారం నెలాఖరులోగా పూర్తి చేయాలని కలెక్టర్ కాంట్రాక్టర్లను, సంబంధిత అధికారులను ఆదేశించారు..నీటి సరఫరా పనులను కూడా సాధ్యమైనంత త్వరగా పూర్తి చేయాలని కలెక్టర్ సంబంధిత అధికారులను ఆదేశించారు..ఓవర్ హెడ్ ట్యాంక్ నిర్మాణం, సంప్ పనులను మరో నెలన్నరలోగా పూర్తి చేయాలని కలెక్టర్ స్పష్టం చేశారు. పనుల్లో ఎలాంటి జాప్యం లేకుండా నిర్దేశిత గడువులను పాటిస్తూ నాణ్యతతో పనులు పూర్తి చేయాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు.

కార్యక్రమంలో కర్నూలు ఆర్డీఓ సందీప్ కుమార్, ఏపిఐఐసి జెడ్ ఎం మధుసూదన్ రెడ్డి, పరిశ్రమల శాఖ అధికారి సంజీవ రాజు, ఏపిఐఐసి అధికారి సందీప్ , ఓర్వకల్లు తహసిల్దార్ విద్యా సాగర్ తదితరులు పాల్గొన్నారు.

--------DIPRO KURNOOL------

05/10/2026

Only strict fines from authorities can save KC Canal

05/10/2026

ఎన్హెచ్-44 ఆరు లేన్ల పనులు వేగవంతం చేయాలి: కర్నూలు కలెక్టర్

హెచ్-44ను కర్నూలు నుంచి బెంగళూరు వరకు ఆరు లేన్లుగా విస్తరించే పనులను వేగవంతం చేయాలని కలెక్టర్ డా. ఏ. సిరి గారు అధికారులను ఆదేశించారు.

కలెక్టరేట్లో ఎన్హెచ్-44 విస్తరణపై వివిధ శాఖల అధికారులతో సమీక్ష నిర్వహించారు. డీపీఆర్లో భవిష్యత్ రవాణా అవసరాలు, రోడ్డు భద్రతకు ప్రాధాన్యం ఇవ్వాలని సూచించారు. భూసేకరణ, యుటిలిటీ షిఫ్టింగ్, ఇరిగేషన్ అనుమతులు, రివైజ్డ్ ఎస్టిమేట్లను త్వరగా పూర్తి చేయాలని ఆదేశించారు.

As many as 31,361 traffic violation cases were registered in Kurnool district during the past nine months despite repeat...
04/10/2026

As many as 31,361 traffic violation cases were registered in Kurnool district during the past nine months despite repeated awareness programmes and enforcement drives by the police. Drunken driving accounted for more than 6,000 cases during the period. Police have repeatedly warned motorists against driving after consuming alcohol. Failure to wear helmets has also remained a concern, despite road accidents and repeated appeals by the police to follow basic road safety precautions.

04/10/2026

తుంగభద్ర డ్యామ్లో తగ్గుతున్న నీటి నిల్వలు
తుంగభద్ర జలాశయానికి ఎగువ ప్రాంతాల నుంచి వరద నీటి ప్రవాహం క్రమంగా తగ్గుతూ వస్తోంది. అక్టోబర్ 4 (ఆదివారం) ఉదయానికి అందిన అధికారిక వివరాల ప్రకారం.. డ్యామ్ పూర్తి స్థాయి నీటి మట్టం 1,633 అడుగులు కాగా.. ప్రస్తుతం నీటి మట్టం 1,622.395 అడుగులకు చేరుకుంది. మొత్తం 105.788 టీఎంసీల గరిష్ఠ నిల్వ సామర్థ్యం కలిగిన ఈ జలాశయంలో ప్రస్తుతం 68.306 టీఎంసీల నీరు నిల్వ ఉంది.

ఇలాగే కొనసాగితే రానున్న కాలంలో ప్రజలు నీటి కష్టాలు తప్పవు అని నిపుణులు అంచనా వేస్తున్నారు.

Address

Kothapeta
Kurnool
518001,02,03,04

Alerts

Be the first to know and let us send you an email when My city-KURNOOL posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Organization

Send a message to My city-KURNOOL:

Shortcuts

Share