15/08/2026
ప్రజా అవగాహన ప్రకటన
కర్నూలు నగర ప్రజలకు ముఖ్య గమనిక: ఈ నెల 17వ తేదీ సోమవారం ఆషోక్ నగర్‌లోని నీటి శుద్ధి కేంద్రంలో నిర్వహణ మరియు మరమ్మత్తు పనులు చేపడుతున్నారు. అందువల్ల ఆ రోజు నగరంలోని కొన్ని ప్రాంతాలకు తాగునీటి సరఫరా నిలిపివేయబడుతుంది.
ప్రజలు ముందస్తుగా అవసరమైన నీటిని నిల్వ చేసుకొని, నీటిని పొదుపుగా వినియోగించుకోవాలని కర్నూలు మున్సిపల్ కార్పొరేషన్ విజ్ఞప్తి చేస్తోంది. అసౌకర్యానికి చింతిస్తున్నాము.