Jupally Krishna Rao

Directions Contact the organization

Jupally Krishna Rao Minister for Excise and Prohibition,
Tourism and Culture, Government of Telangana. MLA from Kollapur.

ఫలించిన కాంగ్రెస్ ప్రభుత్వం కృషి..జూరాలకు నీటివిడుదలకు కర్ణాటక గ్రీన్ సిగ్నల్..అల్మట్టి నుంచి జారాల ప్రాజెక్ట్‌కు నీటి వ...
23/09/2026

ఫలించిన కాంగ్రెస్ ప్రభుత్వం కృషి..
జూరాలకు నీటివిడుదలకు కర్ణాటక గ్రీన్ సిగ్నల్..

అల్మట్టి నుంచి జారాల ప్రాజెక్ట్‌కు నీటి విడుదలకు కర్ణాటక సర్కార్ అంగీకారం

నీటి విడుదలపై డీకే శివకుమార్‌ను కలిసిన మంత్రులు జూపల్లి, శ్రీహరి, ఎమ్మెల్యేలు

ఉమ్మడి పాలమూరు జిల్లా ప్రజలకు సాగు, తాగునీటిని విడుదల చేయాలని విజ్ఞప్తి

నీటి విడుదలపై వెంటనే చర్యలు తీసుకోవాలని అధికారులకు సీఎం డీకే ఆదేశాలు.

జూరాల ప్రాజెక్టుకు నీటి విడుదల విషయంలో కర్ణాటక ప్రభుత్వం సానుకూలంగా స్పందించిందని మంత్రులు జూపల్లి కృష్ణారావు, వాకిటి శ్...
23/09/2026

జూరాల ప్రాజెక్టుకు నీటి విడుదల విషయంలో కర్ణాటక ప్రభుత్వం సానుకూలంగా స్పందించిందని మంత్రులు జూపల్లి కృష్ణారావు, వాకిటి శ్రీహరి తెలిపారు. కర్ణాటకలోనూ నీటి పరిస్థితి అంతగా అనుకూలంగా లేకపోయినప్పటికీ తెలంగాణ రైతుల ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని కర్ణాటక సీఎం డీకే శివకుమార్‌ సానుకూలంగా స్పందించారని చెప్పారు. ఎల్‌నినో ప్రభావంతో రాష్ట్రంలో నెలకొన్న వర్షాభావ పరిస్థితులు, జూరాల ప్రాజెక్టు వద్ద నీటి మట్టం, సాగునీటి కోసం ఉమ్మడి మహబూబ్‌నగర్‌ జిల్లా ఆయకట్టు రైతులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను సీఎం దృష్టికి తీసుకెళ్లినట్లు చెప్పారు. కర్ణాటకలో 10 రోజుల పాటు ఆన్‌ అండ్‌ ఆఫ్‌ పద్ధతిలో నీటి విడుదల కొనసాగిస్తూ జూరాలకు నీళ్లు అందిస్తామని సీఎం డీకే శివకుమార్‌ గారు హామీ ఇచ్చారని మంత్రులు తెలిపారు.

తెలంగాణ రైతుల పరిస్థితిని సానుకూలంగా అర్థం చేసుకుని జూరాలకు నీటిని విడుదల చేసేలా అధికారులకు సీఎం డీకే శివకుమార్ గారు ఆదేశించినట్లు తెలిపారు. కర్ణాటకలోనూ నీటి పరిస్థితి అంతగా అనుకూలంగా లేకపోయినప్పటికీ తెలంగాణ రైతుల ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని సీఎం డీకే శివకుమార్‌ సానుకూలంగా స్పందించారని మంత్రులు పేర్కొన్నారు. ఈ విషయంలో సహకరిస్తున్న కర్ణాటక ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు.

ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆదేశాల మేరకు ఈ నెల 20న తెలంగాణ నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి కర్ణాటక సీఎంకు లేఖ రాశారని మంత్రి జూపల్లి తెలిపారు. అనంతరం కర్ణాటక ప్రభుత్వంతో నిరంతరం సంప్రదింపులు జరుపుతూ జూరాలకు నీటిని విడుదల చేసేలా చర్యలు తీసుకున్నామని చెప్పారు. జూరాలతో పాటు భీమా, నెట్టెంపాడు, కోయిలాసాగర్‌ ప్రాజెక్టుల ఆయకట్టు పరిధిలోని రైతులు, ప్రజలు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని మంత్రులు స్పష్టం చేశారు. సాగు, తాగునీటి అవసరాలను దృష్టిలో పెట్టుకుని అందుబాటులో ఉన్న నీటిని ప్రణాళికాబద్ధంగా వినియోగించుకునేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని తెలిపారు.

ఉమ్మడి మహబూబ్‌నగర్‌ జిల్లాకు చెందిన మంత్రులు, ఎమ్మెల్యేలు, సాగునీటి శాఖ అధికారులతో రేపు సమావేశం నిర్వహించనున్నట్లు వెల్లడించారు.


ఫలించిన కాంగ్రెస్ ప్రభుత్వం కృషి..జూరాలకు నీటివిడుదలకు కర్ణాటక గ్రీన్ సిగ్నల్..అల్మట్టి నుంచి జారాల ప్రాజెక్ట్‌కు నీటి వ...
23/09/2026

ఫలించిన కాంగ్రెస్ ప్రభుత్వం కృషి..
జూరాలకు నీటివిడుదలకు కర్ణాటక గ్రీన్ సిగ్నల్..

అల్మట్టి నుంచి జారాల ప్రాజెక్ట్‌కు నీటి విడుదలకు కర్ణాటక సర్కార్ అంగీకారం.

నీటి విడుదలపై డీకే శివకుమార్‌ను కలిసిన మంత్రులు జూపల్లి, శ్రీహరి, ఎమ్మెల్యేలు.

ఉమ్మడి పాలమూరు జిల్లా ప్రజలకు సాగు, తాగునీటిని విడుదల చేయాలని విజ్ఞప్తి.

నీటి విడుదలపై వెంటనే చర్యలు తీసుకోవాలని అధికారులకు సీఎం డీకే ఆదేశాలు.

ఆల్మట్టి, నారాయణపూర్ నుంచి కృష్ణా జలాలు విడుదల చేయాలని కోరుతూ కర్ణాటక ముఖ్యమంత్రి డీకే శివకుమార్‌ గారిని ఉమ్మడి పాలమూరు ...
23/09/2026

ఆల్మట్టి, నారాయణపూర్ నుంచి కృష్ణా జలాలు విడుదల చేయాలని కోరుతూ కర్ణాటక ముఖ్యమంత్రి డీకే శివకుమార్‌ గారిని ఉమ్మడి పాలమూరు జిల్లా ప్రజాప్రతినిధుల బృందం కలిసింది. నెల రోజులపాటు 5 వేల క్యూసెక్కులు విడుదల చేయాలని ఎమ్మెల్యేలతో కలిసి మంత్రులు జూపల్లి కృష్ణారావు గారు, వాకిటీ శ్రీహరి గారు ఆ రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.

దక్షిణ తెలంగాణలోని రైతుల ప్రయోజనాలను కాపాడేందుకు కృష్ణా నది నుంచి సాగునీటిని విడుదల చేయాలని ఈ సందర్భంగా కర్ణాటక సీఎంను కోరారు. ప్రస్తుతం జూరాల, భీమా, నెట్టెంపాడు, కోయిల్‌సాగర్ ఆయకట్టు పరిధిలో పంటలు కీలక దశలో ఉన్నందున వాటిని కాపాడేందుకు కర్ణాటక నుంచి కృష్ణా జలాలను విడుదల చేయాల్సిన అవసరాన్ని వివరించారు. నాలుగు సాగునీటి పథకాల కింద దాదాపు ఐదున్నర లక్షల ఎకరాల ఆయకట్టు ఉందని వేలాది రైతు కుటుంబాలు వ్యవసాయంపైనే ఆధారపడి జీవిస్తున్నారని తెలిపారు. ప్రస్తుత దశలో నీటి కొరత ఏర్పడితే పంట దిగుబడులతోపాటు రైతుల ఆదాయం, జీవనోపాధిపై ప్రభావం పడే అవకాశం ఉందని తెలిపారు. ప్రస్తుత పంటలను కాపాడేందుకు నెల రోజులపాటు నిరంతరాయంగా 5 వేల క్యూసెక్కుల కృష్ణా జలాలు విడుదల చేయాలని కర్ణాటక ముఖ్యమంత్రి డీకే శివకుమార్‌ను మంత్రులు, ఎమ్మెల్యేల బృందం కోరింది. ఈ నీటితో కీలక దశలో ఉన్న పంటలకు సకాలంలో సాగునీరు అందించి రైతులను ఆదుకోవచ్చని వివరించింది.

కర్ణాటక సీఎల్పీ సమావేశం కారణంగా బిజీగా ఉన్న డీకే ఇవాళ మరోసారి ప్రత్యేకంగా భేటీ అవుదామని మంత్రుల బృందానికి సూచించారు. కర్ణాటక నీటిపారుదల శాఖ మంత్రి, కార్యదర్శితోపాటు ఇతర అధికారులతో భేటీ నిర్వహించి తెలంగాణ నీటి అవసరాలపై చర్చిద్దామని పేర్కొన్నారు.

22/09/2026

జూరాల ప్రాజెక్టు సామర్థ్యం 9 టీఎంసీల్లో పూడిక, డెడ్ స్టోరేజీ, నీటి ఆవిరి, మంచి నీటి అవసరాలకు పోను నికరంగా ఎన్ని జలాలు మిగులుతాయని మంత్రి జూపల్లి కృష్ణారావు గారు బీఆర్ఎస్ నేతలను ప్రశ్నించారు. ఎల్ నినో కారణంగా ఏర్పడిన వర్షాభావం వల్ల ప్రాజెక్టుల్లో నీళ్లు అడుగంటిపోతున్నాయని, తాగునీటికే ఇబ్బందులు ఎదురయ్యే పరిస్థితులు వస్తున్నాయని తెలిపారు. ప్రభుత్వం, అధికారులు గత కొన్ని రోజులుగా ఆరుతడి పంటలపై ప్రచారం చేసినా... రైతులు ప్రధాన పంట అయిన వరినే సాగు చేశారని పేర్కొన్నారు. అయినా రైతులకు నీళ్లు ఇచ్చే అంశంలో వెనకడుగేయబోమని మంత్రి స్పష్టం చేశారు. కాళేశ్వరం కింద రంగనాయకసాగర్, మల్లన్నసాగర్ వంటి వందల టీఎంసీల రిజర్వాయర్లు కట్టిన బీఆర్ఎస్ సర్కారు.. జూరాల కింద ఎందుకు రిజర్వాయర్లు నిర్మించలేదని ప్రశ్నించారు. గట్టు, గుడ్డెందొడ్డి నిర్మించి ఉంటే ఈనాడు రైతులు ఇబ్బందులు పడేవారు కాదన్నారు. తమ ప్రభుత్వం గుడ్డెందొడ్డి పనులను వేగవంతం చేసిందన్నారు.

22/09/2026

రాజకీయ లబ్ధి కోసమే బీఆర్ఎస్ నేతలు నీళ్ల నాటకానికి తెరలేపారని మంత్రి జూపల్లి కృష్ణారావు విమర్శించారు. తమ ప్రభుత్వం కర్నాటక సర్కారుతో మాట్లాడిన విషయం తెలుసుకొని క్రెడిట్ కోసం ఆరాటపడుతున్నారని ఎద్దేవా చేశారు. నారాయణపూర్, ఆల్మట్టి నుంచి నీళ్లు విడుదల చేసేలా ఇవాళ తాము కర్నాటక సీఎంను కలిసి మాట్లాడతామని తెలిపారు.

22/09/2026

గత పదేండ్లలో బీఆర్ఎస్ ప్రభుత్వం కృష్ణా జలాల్లో గరిష్ఠంగా వాడుకున్న నీటి వాటా కేవలం 33 శాతం మాత్రమేనని మంత్రి జూపల్లి కృష్ణారావు గారు తెలిపారు. 72 శాతం వరకు వాటా ఏపీకి ఇచ్చేశారని విమర్శించారు. కానీ ప్రజాప్రభుత్వం అధికారంలోకి వచ్చాక 45 శాతం నీళ్లు తెలంగాణ వాడుకుందని వెల్లడించారు. 299 టీఎంసీలు తెలంగాణకు, 512 టీఎంసీలు ఏపీకి ఇచ్చేందుకు కేసీఆర్ ప్రభుత్వం ఒప్పందం చేసుకుందని ధ్వజమెత్తారు. ఏపీతో రాజీపడి వారికి లేని నీటి హక్కును వరుసగా పదేండ్ల పాటు కట్టబట్టిన ఘనత బీఆర్ఎస్ ప్రభుత్వానిదేనని ఆరోపించారు. కృష్ణా జలాల్లో తెలంగాణకు 69.5 శాతం వాటా రావాలని సుప్రీంకోర్టులో తమ ప్రభుత్వం కొట్లాడుతోందని పేర్కొన్నారు. నీళ్లు, నిధులు ఉన్నా కేసీఆర్ ప్రభుత్వం జూరాల కింద రిజర్వాయర్లు నిర్మించలేదన్నారు. ఇప్పుడు పాలమూరుపై లేని ప్రేమను కురిపిస్తూ వీధి నాటకాలు ఆడుతున్నారని మండిపడ్డారు.


22/09/2026

Live :- Minister Jupally Krishna Rao Garu Pressmeet.

హైదరాబాద్‌లోని డా. బీఆర్ అంబేద్కర్ సచివాలయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని మంత్రులు జూపల్లి కృష్ణారావు, ఉత్తమ్ కుమార...
22/09/2026

హైదరాబాద్‌లోని డా. బీఆర్ అంబేద్కర్ సచివాలయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని మంత్రులు జూపల్లి కృష్ణారావు, ఉత్తమ్ కుమార్ రెడ్డి, వాకిటి శ్రీహరి మరియు, ఎమ్మెల్యేలు బండ్ల కృష్ణమోహన్ రెడ్డి, మధుసూదన్ రెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా జూరాల నీటి విడుదలపై కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వంతో సంప్రదింపులపై చర్చించారు.

ఈ సాయంత్రం సాయంత్రం మంత్రులు, ఎమ్మెల్యేలు బెంగళూరు వెళ్లనున్నారు. ఆల్మట్టి–నారాయణపూర్‌ నుంచి జూరాలకు నీటి విడుదలపై కర్ణాటక ముఖ్యమంత్రి డీకే శివకుమార్ తో చర్చించనున్నారు.


Address

Lingampally

Website

Alerts

Be the first to know and let us send you an email when Jupally Krishna Rao posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Organization

Send a message to Jupally Krishna Rao:

Shortcuts

Share