10/10/2026
ఆపరేషన్ త్రిశూల్‌లో భాగంగా గంజాయి అక్రమ నెట్‌వర్క్‌లపై EAGLE, స్థానిక పోలీసుల సంయుక్త తనిఖీలు
8 మందికి పరీక్షలు నిర్వహించగా ఐదుగురికి పాజిటివ్ – తదుపరి విచారణ కొనసాగింపు
గంజాయి వినియోగం, విక్రయం, సరఫరా, అక్రమ రవాణాను అరికట్టడంతో పాటు వీధి స్థాయిలో కొనసాగుతున్న గంజాయి అక్రమ నెట్‌వర్క్‌లను గుర్తించి నిర్మూలించే లక్ష్యంతో, EAGLE IGP శ్రీ ఆకే రవికృష్ణ, IPS గారు, కృష్ణా జిల్లా ఎస్పీ శ్రీ వి. విద్యాసాగర్ నాయుడు, IPS గారు మరియు శ్రీ K.M. మహేశ్వర రాజు, IPS గారి ఆదేశాల మేరకు, EAGLE విభాగం మరియు బందరు సబ్ డివిజన్ పోలీసులు సంయుక్తంగా ప్రత్యేక తనిఖీలు నిర్వహించారు.
మచిలీపట్నం డీఎస్పీ శ్రీ ఆవుల శ్రీనివాసరావు గారి ఆధ్వర్యంలో మచిలీపట్నం టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఇందిరమ్మ కాలనీ, రాబర్ట్‌సన్‌పేట పోలీస్ స్టేషన్ పరిధిలోని బాలరామునిపేట, చిలకలపూడి పోలీస్ స్టేషన్ పరిధిలో ప్రత్యేక డ్రైవ్ చేపట్టారు.
రాష్ట్రవ్యాప్తంగా గంజాయి అక్రమ కార్యకలాపాలను అరికట్టేందుకు చేపట్టిన **ఆపరేషన్ త్రిశూల్**లో భాగంగా నిర్వహించిన ఈ డ్రైవ్‌లో అనుమానిత వ్యక్తులను తనిఖీ చేసి, వారి వివరాలు, కదలికలను పరిశీలించారు. అవసరమైన చోట గంజాయి డిటెక్షన్ కిట్ల ద్వారా పరీక్షలు నిర్వహించారు. ఈ క్రమంలో మొత్తం 8 మందికి పరీక్షలు నిర్వహించగా, ఐదుగురికి పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. వారి నుంచి సంబంధిత సమాచారాన్ని సేకరిస్తూ తదుపరి విచారణ కొనసాగిస్తున్నారు. అలాగే వారి ఐదుగురికి కౌన్సిలింగ్ నిర్వహించారు.
గంజాయి వినియోగం, విక్రయం, సరఫరా, అక్రమ రవాణాకు పాల్పడే వ్యక్తులపై చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు. గంజాయి అక్రమ నెట్‌వర్క్‌ల మూలాలను గుర్తించి, వాటిని పూర్తిస్థాయిలో అరికట్టేందుకు ప్రత్యేక తనిఖీలు, నిఘా, దర్యాప్తు నిరంతరం కొనసాగుతాయని స్పష్టం చేశారు.
*BREAK THE SILENCE – CALL EAGLE 1972*
ప్రజలు తమ పరిసరాల్లో గంజాయి విక్రయం, వినియోగం, సరఫరా లేదా అక్రమ రవాణాకు సంబంధించిన సమాచారం తెలిస్తే భయపడకుండా EAGLE హెల్ప్‌లైన్ నంబర్ 1972కు తెలియజేయాలని పోలీసులు కోరారు. ప్రజల సహకారంతో యువతను మాదకద్రవ్యాల బారిన పడకుండా కాపాడేందుకు పోలీసు శాఖ నిరంతరం కృషి చేస్తుందని తెలిపారు.
ఈ ప్రత్యేక తనిఖీల్లో మచిలీపట్నం డీఎస్పీ శ్రీ ఆవుల శ్రీనివాసరావుగారు చిలకలపూడి పోలీస్ స్టేషన్ సీఐ శ్రీ నభి గారు, రాబర్ట్‌సన్‌పేట పోలీస్ స్టేషన్ సీఐ శ్రీ యేసోబు గారు, మచిలీపట్నం టౌన్ పోలీస్ స్టేషన్ ఎస్‌ఐ, EAGLE RI శ్రీ D. నాగార్జున, నార్కోటిక్ డాగ్ రీటా, డ్రోన్ బృందం, కృష్ణా జిల్లా EAGLE సిబ్బంది పాల్గొన్నారు.