Banoth Shankar Naik

Directions

Banoth Shankar Naik Official Page Ex- MLA Mahabubabad (2014-2023) || Alumnus

స్వాతంత్ర సమరయోధుడు, తెలంగాణ పోరాట యోధుడు ఆచార్య శ్రీ కొండా లక్ష్మణ్ బాపూజీ గారి జయంతి సందర్భంగా..ఆ మహనీయుడికి ఘన నివాళు...
27/09/2026

స్వాతంత్ర సమరయోధుడు, తెలంగాణ పోరాట యోధుడు ఆచార్య శ్రీ కొండా లక్ష్మణ్ బాపూజీ గారి జయంతి సందర్భంగా..
ఆ మహనీయుడికి ఘన నివాళులు అర్పిస్తున్నాము.

26/09/2026

తేదీ:26-09-2026,
తెలంగాణ భవన్,
హైదరాబాద్.

తెలంగాణ భవన్‌లో బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర గార్ల సమక్షంలోమహబూబాబాద్ నియోజకవర్గ ఇన్‌చార్జి బానోత్ శంకర్ నాయక్ ఆధ్వర్యంలోఇనుగుర్తి మండల కేంద్రానికి చెందిన ఉప సర్పంచ్ సత్తూరి యాదగిరి కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి బీఆర్ఎస్ పార్టీలో చేరారు.
వారితో పాటు ఇనుగుర్తి మండలానికి చెందిన సుమారు 200 మంది బీఆర్ఎస్ పార్టీలో చేరారు.

ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీ కవిత, ఎమ్మెల్సీ రవీందర్ రావు, మాజీ మంత్రి పొన్నాల లక్ష్మయ్య, విద్యార్థి నాయకుడు శ్రీనివాస్ యాదవ్, రవికుమార్ తదితర పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

26/09/2026

🔥 జోరు పెరిగింది… జోష్ పెరిగింది! 🚘🔥
తెలంగాణ భవన్ వైపు దూసుకెళ్తున్న బానోత్ శంకర్ నాయక్ గారి కాన్వాయ్! 💗KTR

25/09/2026

కేసముద్రం మండలం వెంకటగిరి గ్రామానికి చెందిన బీఆర్‌ఎస్ సీనియర్ నాయకులు, మహబూబాబాద్ జిల్లా మాజీ సర్పంచ్‌ల ఫోరం అధ్యక్షులు మాదారపు సత్యనారాయణ రావు గారు ఇటీవల అనారోగ్యంతో మృతి చెందగా, వారి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించిన మహబూబాబాద్ మాజీ ఎమ్మెల్యే బానోత్ శంకర్ నాయక్ గారు, మాజీ మంత్రి సత్యవతి రాథోడ్ గారు.

అనంతరం కుటుంబ సభ్యులను పరామర్శించి, ప్రగాఢ సానుభూతి తెలియజేసి, ఈ విషాద సమయంలో ధైర్యంగా ఉండాలని భరోసా ఇచ్చారు.

వారి వెంట బీఆర్‌ఎస్ నాయకులు, మాజీ ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.

జయశంకర్ భూపాలపల్లి జిల్లా చెల్పూర్‌లోని కాకతీయ థర్మల్ పవర్ ప్లాంట్‌ను మాజీ మంత్రివర్యులు ఎర్రబెల్లి దయాకర్ రావు గారి ఆధ్...
24/09/2026

జయశంకర్ భూపాలపల్లి జిల్లా చెల్పూర్‌లోని కాకతీయ థర్మల్ పవర్ ప్లాంట్‌ను మాజీ మంత్రివర్యులు ఎర్రబెల్లి దయాకర్ రావు గారి ఆధ్వర్యంలో సందర్శించిన మహబూబాబాద్ మాజీ ఎమ్మెల్యే
బానోత్ శంకర్ నాయక్ గారు,మరియు
మాజీ మంత్రివర్యులు సత్యవతి రాథోడ్ గారు,మాజీ ఉప ముఖ్యమంత్రి
తాటికొండ రాజయ్య గారు,జనగాం
ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి గారు, మాజీ ఎమ్మెల్యేలు ఆరురి రమేష్,
గండ్ర వెంకటరమణ గారు,ములుగు జిల్లా బిఆర్ఎస్ అధ్యక్షుడు లక్ష్మణ్ రావు మరియు బిఆర్ఎస్ నాయకులు.
పోలీసులు కాకతీయ థర్మల్ పవర్ ప్లాంట్ లోకి అనుమతించాలని ధర్నా నిర్వహించారు.
పోలీస్ అధికారులుఅనుమతించడంతో
కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రంలో విద్యుత్ రంగంలో నెలకొన్న పరిస్థితులను సంబంధిత అధికారులను వివరించడం జరిగింది.

17/09/2026

🕊️ ఘన నివాళి.. ప్రగాఢ సానుభూతి 🙏

కేసముద్రం మండలం వెంకటగిరి గ్రామానికి చెందిన BRS సీనియర్ నాయకులు, మహబూబాబాద్ జిల్లా మాజీ సర్పంచుల ఫోరం అధ్యక్షుడు మాదారపు సత్యనారాయణ రావు గారు అనారోగ్యంతో మృతి చెందడం బాధాకరం.

వారి నివాసానికి వెళ్లి పార్థివదేహానికి పూలమాల వేసి నివాళులర్పించిన మహబూబాబాద్ మాజీ ఎమ్మెల్యే బానోత్ శంకర్ నాయక్ గారు, మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు గారు.

అనంతరం కుటుంబ సభ్యులను పరామర్శించి, వారి దుఃఖంలో పాలుపంచుకుని అంత్యక్రియల్లో పాల్గొన్నారు.

మాదారపు సత్యనారాయణ రావు గారి ఆత్మకు శాంతి చేకూరాలని, వారి కుటుంబ సభ్యులకు భగవంతుడు మనోధైర్యాన్ని ప్రసాదించాలని ప్రార్థిస్తున్నాము. 🙏🕊️

17/09/2026

🔥 గిరిజనుల ఆత్మగౌరవానికి ప్రతీక కేసీఆర్ గారి పాలన! 🔥

10% గిరిజన రిజర్వేషన్ పెంపుకు 4 ఏళ్లు పూర్తి సందర్భంగా…

కేసముద్రం మున్సిపాలిటీ సబ్ స్టేషన్ తండాలో స్థానిక గిరిజన మహిళలతో కలిసి తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారి చిత్రపటానికి పాలాభిషేకం చేసిన
మహబూబాబాద్ మాజీ ఎమ్మెల్యే & నియోజకవర్గ ఇన్‌చార్జ్ బానోత్ శంకర్ నాయక్ గారు.

🔹 తండాలకు గ్రామ పంచాయతీ హోదా
🔹 గిరిజన రిజర్వేషన్ 10%కు పెంపు
🔹 6 లక్షల మందికి పోడు పట్టాలు
🔹 ఆదివాసీ సంక్షేమానికి ₹37 వేల కోట్ల వ్యయం

“అపన్ తాండెమా… అపన్ రాజ్”
తండాలకు స్వయంపాలన… గిరిజనులకు ఆత్మగౌరవం…
ఈ మార్పులకు బాటలు వేసిన నాయకత్వం కేసీఆర్ గారిది. ❤️

ఈ సందర్భంగా మహబూబాబాద్ నియోజకవర్గంలోని ప్రతి తండాలో కేసీఆర్ గారి చిత్రపటాలకు పాలాభిషేకాలు నిర్వహిస్తూ గిరిజన బాంధవుడికి కృతజ్ఞతలు తెలియజేశారు

Address

Mahabubabad
Mahabubbad
506101

Website

Alerts

Be the first to know and let us send you an email when Banoth Shankar Naik posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Shortcuts

Share