03/10/2026
మహబూబాబాద్ జిల్లా ఏ.ఆర్. డీఎస్పీలు శ్రీనివాస్, విజయ్ ప్రతాప్ 5వ తెలంగాణ పోలీస్ స్పోర్ట్స్ మీట్‌లో టెన్నిస్ విభాగంలో సత్తా చాటారు. డబుల్స్‌లో బంగారు, ఓపెన్ సింగిల్స్, ఓపెన్ డబుల్స్‌లో రెండు రజత పతకాలు సాధించారు. ఈ సందర్భంగా ఎస్పీ డా. శబరీష్, ఐపీఎస్ అభినందించి మరిన్ని విజయాలు సాధించాలని ప్రోత్సహించారు.