Mahabubnagar District Police

Directions

Mahabubnagar District Police Mahabubnagar District Police

అర్ధరాత్రి సమయంలో పోలీసుల విధులకు ఆటంకం కలిగిస్తే కఠిన చర్యలుపోలీసులపై తప్పుడు ఆరోపణలు చేస్తే చట్టపరమైన చర్యలు తప్పవు – ...
03/10/2026

అర్ధరాత్రి సమయంలో పోలీసుల విధులకు ఆటంకం కలిగిస్తే కఠిన చర్యలు

పోలీసులపై తప్పుడు ఆరోపణలు చేస్తే చట్టపరమైన చర్యలు తప్పవు – వన్‌టౌన్ ఇన్‌స్పెక్టర్ అప్పయ్య

అర్ధరాత్రి సమయాల్లో శాంతిభద్రతలకు విఘాతం కలిగించే విధంగా బహిరంగ ప్రదేశాల్లో గొడవలు, హంగామా చేస్తూ ప్రజలకు ఇబ్బందులు కలిగించడంతో పాటు విధుల్లో ఉన్న పోలీసు సిబ్బందికి ఆటంకం కలిగించే వారిపై చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని మహబూబ్‌నగర్ వన్‌టౌన్ ఇన్‌స్పెక్టర్ అప్పయ్య ఒక ప్రకటనలో తెలిపారు.

02.03.2026 అర్ధరాత్రి 12 గంటల అనంతరం హబీబ్‌నగర్ ప్రాంతం నుంచి డయల్-112కు సమాచారం అందడంతో, వన్‌టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో బీట్ విధులు నిర్వహిస్తున్న పోలీస్ సిబ్బంది వెంటనే సంఘటనా స్థలానికి బైక్‌పై చేరుకున్నారు. అక్కడ గొడవకు పాల్పడుతున్న వారిని చెదరగొట్టి పరిస్థితిని అదుపులోకి తీసుకువచ్చారు.

ఈ సమయంలో ఒక వ్యక్తి సైకిల్‌పై వేగంగా వెళ్తూ అదుపుతప్పి కిందపడటంతో తలకు గాయమైనట్లు పోలీసుల దృష్టికి వచ్చింది. అనంతరం అతను సమీపంలోని ఒక ఇంట్లోకి వెళ్లగా, ఇంటి వారు అపరిచిత వ్యక్తిగా భావించి బయటకు పంపించినట్లు తెలిసింది.

అట్టి వ్యక్తి తనను విధుల్లో ఉన్న పోలీస్ సిబ్బంది మద్యం సేవించి కొట్టినట్లు కొంతమంది హబీబ్ నగర్ స్థానికులకు చెప్పడంతో అట్టి వ్యక్తి మరియు తన సహచరులు పోలీస్ స్టేషన్‌కు వచ్చి ఫిర్యాదు చేయడానికి రావడం జరిగినది.

ఈ నేపథ్యంలో విధుల్లో ఉన్న పోలీసు సిబ్బంది మద్యం సేవించారా లేదా అనే అంశంపై అధికారులు వెంటనే పరీక్షలు నిర్వహించారు. జిల్లా నైట్ డ్యూటీ అధికారి భూత్పూర్ సర్కిల్ ఇన్‌స్పెక్టర్ రామకృష్ణ ఆధ్వర్యంలో నిర్వహించిన బ్రీత్ అనలైజర్ పరీక్షలో సిబ్బంది మద్యం సేవించినట్లు ఎలాంటి నిర్ధారణ కాలేదు. అదేవిధంగా వన్‌టౌన్ ఇన్‌స్పెక్టర్ గారు కూడా సిబ్బంది ని ప్రభుత్వ ఆసుపత్రికి వైద్య పరీక్షల నిమిత్తం పంపడం జరిగినది.

పోలీసు సిబ్బంది అర్ధరాత్రి వేళ ప్రజల భద్రత కోసం విధులు నిర్వహిస్తూ, డయల్-112 ద్వారా అందే సమాచారంపై తక్షణమే స్పందిస్తున్నారని ఇన్‌స్పెక్టర్ అప్పయ్య తెలిపారు. విధుల్లో ఉన్న పోలీసు సిబ్బందిపై ఆధారాలు లేకుండా ఆరోపణలు చేయడం, పోలీసుల విధులకు ఆటంకం కలిగించడం లేదా శాంతిభద్రతలకు విఘాతం కలిగించేలా వ్యవహరించడం ఏమాత్రం సహించబోమని స్పష్టం చేశారు.

అర్ధరాత్రి అనంతరం బహిరంగ ప్రదేశాల్లో గొడవలు, హంగామా చేస్తూ ప్రజలకు ఇబ్బందులు కలిగించే వారిపై, అలాగే విధుల్లో ఉన్న పోలీసు సిబ్బందికి ఆటంకం కలిగించే వారిపై చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని వన్‌టౌన్ ఇన్‌స్పెక్టర్ అప్పయ్య హెచ్చరించారు.

ప్రజలు పోలీసుల విధి నిర్వహణకు సహకరించాలని, అత్యవసర పరిస్థితుల్లో డయల్-112ను ఆశ్రయించాలని ఆయన సూచించారు.

ఇన్స్పెక్టర్
మహబూబ్ నగర్ 1 టౌన్ పోలీస్ స్టేషన్.

తెలంగాణ రాష్ట్ర పోలీస్ స్పోర్ట్స్ అండ్ గేమ్స్ మీట్–2026లో మహబూబ్‌నగర్ జిల్లా పోలీసుల ప్రతిభబ్యాడ్మింటన్ డబుల్స్‌లో రజతం....
03/10/2026

తెలంగాణ రాష్ట్ర పోలీస్ స్పోర్ట్స్ అండ్ గేమ్స్ మీట్–2026లో మహబూబ్‌నగర్ జిల్లా పోలీసుల ప్రతిభ

బ్యాడ్మింటన్ డబుల్స్‌లో రజతం.. లాన్ టెన్నిస్ డబుల్స్‌లో కాంస్యం

పతకాలు సాధించిన క్రీడాకారులను అభినందించిన జిల్లా ఎస్పీ శ్రీమతి డి.జానకి, ఐపీఎస్

తెలంగాణ రాష్ట్ర పోలీస్ అకాడమీ, హైదరాబాద్‌లో నిర్వహించిన తెలంగాణ రాష్ట్ర పోలీస్ స్పోర్ట్స్ అండ్ గేమ్స్ మీట్–2026లో మహబూబ్‌నగర్ జిల్లా పోలీస్ సిబ్బంది వివిధ క్రీడా విభాగాల్లో ప్రతిభ కనబరిచి పతకాలు సాధించారు.

బ్యాడ్మింటన్ డబుల్స్ విభాగంలో మహబూబ్‌నగర్ జిల్లా పోలీస్‌కు చెందిన లింగం, హెడ్ కానిస్టేబుల్, DAR మరియు శేఖర్, హెడ్ కానిస్టేబుల్, టూ టౌన్ పోలీస్ స్టేషన్ జోడీ రజత పతకం (Silver Medal) సాధించడం జరిగినది.

అదేవిధంగా లాన్ టెన్నిస్ డబుల్స్ విభాగంలో ఇమ్రాన్, హెడ్ కానిస్టేబుల్, DAR మరియు లింగం, హెడ్ కానిస్టేబుల్, DAR జోడీ కాంస్య పతకం (Bronze Medal) సాధించి జిల్లా పోలీస్ శాఖకు గౌరవం తీసుకువచ్చారు.

ఈ సందర్భంగా పతకాలు సాధించిన ముగ్గురు పోలీస్ క్రీడాకారులను మహబూబ్‌నగర్ జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలోని ఎస్పీ గారి చాంబర్‌లో జిల్లా ఎస్పీ శ్రీమతి డి.జానకి, ఐపీఎస్ గారు అభినందించి, ప్రశంసించారు. విధి నిర్వహణతో పాటు క్రీడల్లోనూ ప్రతిభ కనబరిచి జిల్లాకు పతకాలు సాధించడం అభినందనీయమని ఎస్పీ గారు పేర్కొన్నారు.

క్రీడలు పోలీస్ సిబ్బందిలో శారీరక దృఢత్వం, క్రమశిక్షణ, ఏకాగ్రత, జట్టు స్ఫూర్తి పెంపొందించడంలో కీలక పాత్ర పోషిస్తాయని ఎస్పీ గారు తెలిపారు. భవిష్యత్తులో కూడా మరిన్ని క్రీడా పోటీల్లో ప్రతిభ కనబరిచి జిల్లా పోలీస్ శాఖకు మరింత పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు.

పోలీస్ సిబ్బందిలో దాగి ఉన్న క్రీడా ప్రతిభను ప్రోత్సహించడంతో పాటు, వారు జాతీయ, రాష్ట్ర స్థాయి పోటీల్లో మరింత ప్రతిభ కనబరిచేలా అవసరమైన ప్రోత్సాహం అందిస్తామని జిల్లా ఎస్పీ శ్రీమతి డి.జానకి, ఐపీఎస్ గారు తెలిపారు.
ఈ కార్యక్రమంలో వర్టికల్ DSP బాలాజీ, SP CC రామ్ రెడ్డి, CCS ఇన్స్పెక్టర్ రవి బాబు, DTC ఇన్స్పెక్టర్ గోవింద రెడ్డి, జడ్చర్ల టౌన్ ఇన్స్పెక్టర్ కమలాకర్, RI లు కృష్ణయ్య, నగేష్, అశోక్ కుమార్ అసోసియేషన్ ప్రెసిడెంట్ ప్యారసాని సురేష్ మరియు ఇతర సిబ్బంది పాల్గొన్నారు.

కోర్టు కేసుల పురోగతిపై జిల్లా ఎస్పీ సమీక్షకోర్టు డ్యూటీ అధికారులు, లైజన్ అధికారులు సమన్వయంతో పనిచేయాలి: ఎస్పీ డి.జానకి, ...
03/10/2026

కోర్టు కేసుల పురోగతిపై జిల్లా ఎస్పీ సమీక్ష

కోర్టు డ్యూటీ అధికారులు, లైజన్ అధికారులు సమన్వయంతో పనిచేయాలి: ఎస్పీ డి.జానకి, ఐపీఎస్

శనివారం జిల్లా పోలీసు ప్రధాన కార్యాలయంలోని ఎస్పీ గారి ఛాంబర్‌లో కోర్టు డ్యూటీ అధికారులు మరియు కోర్టు లైజన్ అధికారులతో జిల్లా ఎస్పీ శ్రీమతి డి.జానకి, ఐపీఎస్ గారు సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా జిల్లాలోని వివిధ పోలీస్ స్టేషన్ల పరిధిలో నమోదైన కేసులకు సంబంధించి కోర్టు విచారణలు, పెండింగ్‌లో ఉన్న కేసులు, సాక్షుల హాజరు, చార్జిషీట్‌ల దాఖలు, కోర్టు ఉత్తర్వుల అమలు తదితర అంశాలపై ఎస్పీ గారు సమీక్షించారు.

కేసుల దర్యాప్తు పూర్తయిన అనంతరం చట్టపరమైన ప్రక్రియను వేగవంతంగా పూర్తి చేసి, కోర్టుల్లో కేసుల విచారణ సజావుగా జరిగేలా కోర్టు డ్యూటీ అధికారులు, లైజన్ అధికారులు సంబంధిత పోలీసు అధికారులతో సమన్వయంతో పనిచేయాలని సూచించారు.

కోర్టు కేసులకు సంబంధించిన రికార్డులు, డాక్యుమెంట్లు మరియు సాక్ష్యాలను పకడ్బందీగా నిర్వహించాలని, కోర్టు నుండి వచ్చే సమన్లు, వారెంట్లు, ఉత్తర్వులను సకాలంలో అమలు చేయాలని ఆదేశించారు. ముఖ్యంగా పెండింగ్ కేసులపై ప్రత్యేక దృష్టి సారించి, కేసుల పురోగతిని ఎప్పటికప్పుడు సమీక్షించాలని సూచించారు.

న్యాయస్థానాల్లో కేసుల సమర్థవంతమైన ప్రాసిక్యూషన్‌కు అవసరమైన పూర్తి సహకారం అందిస్తూ, కేసుల్లో నిందితులకు చట్టపరమైన శిక్షలు పడేలా అధికారులు బాధ్యతతో విధులు నిర్వహించాలని జిల్లా ఎస్పీ గారు సూచించారు.

ఈ సమావేశంలో ఆయన ఎస్పీ NB రత్నం, DCRB DSP రమణా రెడ్డి, వర్టికల్ DSP బాలాజీ, CCS ఇన్స్పెక్టర్ రవి బాబు, DTC ఇన్స్పెక్టర్ గోవింద రెడ్డి, కోర్టు డ్యూటీ అధికారులు మరియు కోర్టు లైజన్ అధికారులు పాల్గొన్నారు.

గాంధీ జయంతి సందర్భంగా మహాత్మా గాంధీకి ఘన నివాళులుజాతిపిత మహాత్మా గాంధీ జయంతిని పురస్కరించుకొని శుక్రవారం మహబూబ్‌నగర్ జిల...
02/10/2026

గాంధీ జయంతి సందర్భంగా మహాత్మా గాంధీకి ఘన నివాళులు

జాతిపిత మహాత్మా గాంధీ జయంతిని పురస్కరించుకొని శుక్రవారం మహబూబ్‌నగర్ జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో గాంధీ జయంతి కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. జిల్లా ఎస్పీ శ్రీమతి డి.జానకి, ఐపీఎస్ గారి ఆదేశాల మేరకు అదనపు ఎస్పీ (ఏఆర్) సురేష్ కుమార్ గారు మహాత్మా గాంధీ చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు.

ఈ సందర్భంగా అదనపు ఎస్పీ (ఏఆర్) సురేష్ కుమార్ గారు మాట్లాడుతూ... మహాత్మా గాంధీ సత్యం, అహింస, శాంతి మార్గాలను ఆచరించి దేశ స్వాతంత్ర్య పోరాటానికి నాయకత్వం వహించారని తెలిపారు. గాంధీజీ చూపిన సత్యం, అహింస, సేవా మార్గాలు నేటికీ సమాజానికి ఆదర్శంగా నిలుస్తున్నాయని అన్నారు. ప్రజాసేవలో ఉన్న ప్రతి ఒక్కరూ గాంధీజీ ఆశయాలను స్ఫూర్తిగా తీసుకొని నిజాయితీ, క్రమశిక్షణ, అంకితభావంతో విధులు నిర్వహించాలని సూచించారు.

ఈ కార్యక్రమంలో DCRB DSP రమణారెడ్డి, RIలు కృష్ణయ్య, నగేష్, అశోక్ కుమార్, RSIలు, పోలీస్ అధికారులు మరియు సిబ్బంది పాల్గొన్నారు.

జిల్లా జైలులో ఘనంగా ఖైదీల సంక్షేమ దినోత్సవంగాంధీ జయంతి సందర్భంగా జిల్లా జైలులో ఖైదీల సంక్షేమ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహి...
02/10/2026

జిల్లా జైలులో ఘనంగా ఖైదీల సంక్షేమ దినోత్సవం

గాంధీ జయంతి సందర్భంగా జిల్లా జైలులో ఖైదీల సంక్షేమ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ప్రిన్సిపల్ & డిస్ట్రిక్ట్ జడ్జి శ్రీమతి ప్రేమలత గారు ముఖ్యఅతిథిగా హాజరుకాగా, జిల్లా ఎస్పీ శ్రీమతి డి.జానకి, ఐపీఎస్ గారు విశిష్ట అతిథిగా పాల్గొన్నారు.

ఈ సందర్భంగా మహాత్మా గాంధీ గారి చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం ఖైదీల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకొని నిర్వహించిన కార్యక్రమంలో ఖైదీలతో అధికారులు మాట్లాడారు.

జిల్లా ప్రిన్సిపల్ & డిస్ట్రిక్ట్ జడ్జి శ్రీమతి ప్రేమలత గారు మాట్లాడుతూ, ఖైదీలు చేసిన తప్పులను పునరావృతం చేయకుండా, జైలు జీవితాన్ని తమలో మార్పు తీసుకురావడానికి ఒక అవకాశంగా భావించాలని సూచించారు. క్రమశిక్షణతో జీవిస్తూ, జైలు నుంచి బయటకు వెళ్లిన అనంతరం సమాజంలో గౌరవప్రదమైన జీవితాన్ని కొనసాగించేందుకు అవసరమైన నైపుణ్యాలను పెంపొందించుకోవాలని తెలిపారు. న్యాయపరమైన సహాయం అవసరమైన ఖైదీలకు అందుబాటులో ఉన్న న్యాయ సేవలను వినియోగించుకోవాలని సూచించారు.

జిల్లా ఎస్పీ శ్రీమతి డి.జానకి, ఐపీఎస్ గారు మాట్లాడుతూ, మహాత్మా గాంధీ చూపిన సత్యం, అహింస, శాంతి మార్గాలను ప్రతి ఒక్కరూ ఆదర్శంగా తీసుకోవాలని అన్నారు. ఖైదీల సంక్షేమం, వారి పునరావాసం, సమాజంలో తిరిగి గౌరవప్రదమైన జీవితాన్ని ప్రారంభించేలా ప్రోత్సహించడం ప్రతి ఒక్కరి బాధ్యత అని తెలిపారు. జైలు శిక్ష అనేది జీవితానికి ముగింపు కాదని, తమలో మార్పు తెచ్చుకొని భవిష్యత్తును మంచిగా తీర్చిదిద్దుకునేందుకు ఒక అవకాశంగా భావించాలని ఖైదీలకు సూచించారు.

ఖైదీలు కూడా తమలో సానుకూల మార్పు తీసుకువచ్చి, భవిష్యత్తులో చట్టాన్ని గౌరవిస్తూ మంచి పౌరులుగా జీవించాలని ఎస్పీ గారు ఆకాంక్షించారు. జైలు సిబ్బంది ఖైదీల సంక్షేమం, భద్రతతో పాటు వారి మానసిక, సామాజిక పునరావాసానికి అవసరమైన సహకారం అందించాలని సూచించారు.

ఈ కార్యక్రమంలో జైలు సూపరింటెండెంట్ శ్రీ కాళిదాస్, DLSA చైర్‌పర్సన్ శ్రీమతి ఇందిరా గారు, DM&HO శ్రీనివాస్, DSP వెంకటేశ్వర్లు తదితర అధికారులు, సిబ్బంది మరియు ఖైదీలు పాల్గొన్నారు.

సత్యం, అహింస, శాంతి మార్గాలను ప్రపంచానికి చాటినమహాత్మా గాంధీ ఆశయాలను స్మరించుకుంటూగాంధీ జయంతి శుభాకాంక్షలు.
02/10/2026

సత్యం, అహింస, శాంతి మార్గాలను ప్రపంచానికి చాటిన
మహాత్మా గాంధీ ఆశయాలను స్మరించుకుంటూ
గాంధీ జయంతి శుభాకాంక్షలు.

తెలంగాణ రాష్ట్ర పోలీస్ స్పోర్ట్స్ అండ్ గేమ్స్ మీట్–2026లో మహబూబ్‌నగర్ జిల్లా పోలీస్ సిబ్బంది ప్రతిభఅభినందించిన జిల్లా ఎస...
01/10/2026

తెలంగాణ రాష్ట్ర పోలీస్ స్పోర్ట్స్ అండ్ గేమ్స్ మీట్–2026లో మహబూబ్‌నగర్ జిల్లా పోలీస్ సిబ్బంది ప్రతిభ

అభినందించిన జిల్లా ఎస్పీ డి.జానకి, ఐపిఎస్

తెలంగాణ రాష్ట్ర పోలీస్ అకాడమీ ప్రాంగణంలో గత ఐదు రోజులుగా నిర్వహిస్తున్న తెలంగాణ రాష్ట్ర పోలీస్ స్పోర్ట్స్ అండ్ గేమ్స్ మీట్–2026లో మహబూబ్‌నగర్ జిల్లా పోలీస్ సిబ్బంది వివిధ క్రీడా విభాగాల్లో అత్యుత్తమ ప్రతిభ కనబరిచి పతకాలు సాధించారు.

బ్యాడ్మింటన్ డబుల్స్ విభాగంలో లింగం, హెడ్ కానిస్టేబుల్, DAR మరియు శేఖర్, హెడ్ కానిస్టేబుల్, టూ టౌన్ పోలీస్ స్టేషన్ రజత పతకం (Silver Medal) సాధించారు.

అదేవిధంగా లాన్ టెన్నిస్ డబుల్స్ విభాగంలో మహబూబ్‌నగర్ జిల్లా పోలీస్‌కు చెందిన ఇమ్రాన్, హెడ్ కానిస్టేబుల్, DAR మరియు లింగం, హెడ్ కానిస్టేబుల్, DAR కాంస్య పతకం (Bronze Medal) సాధించి జిల్లా పోలీస్ శాఖకు గౌరవం తీసుకువచ్చారు..

క్రీడల్లో ప్రతిభ కనబరిచి పతకాలు సాధించిన సిబ్బందిని మహబూబ్‌నగర్ జిల్లా ఎస్పీ శ్రీమతి డి.జానకి, ఐపీఎస్ గారు అభినందించి, ప్రశంసించారు. పోలీస్ సిబ్బంది విధి నిర్వహణతో పాటు క్రీడల్లో కూడా ప్రతిభ కనబరచడం అభినందనీయమని పేర్కొంటూ, భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షించారు.

క్రీడలు పోలీస్ సిబ్బందిలో శారీరక దృఢత్వంతో పాటు క్రమశిక్షణ, ఏకాగ్రత, జట్టు స్ఫూర్తిని పెంపొందించడంలో కీలక పాత్ర పోషిస్తాయని ఎస్పీ గారు తెలిపారు. జిల్లాకు పతకాలు సాధించిన క్రీడాకారులను ప్రోత్సహిస్తూ, వారి ప్రతిభను మరింత మెరుగుపరుచుకునేందుకు పోలీస్ శాఖ తరఫున అవసరమైన ప్రోత్సాహం అందిస్తామని తెలిపారు.

మహిళలు, బాలికల భద్రతకు షీ టీమ్స్‌ నిరంతర నిఘామానవ అక్రమ రవాణా, బాల్యవివాహాల నివారణకు AHTU ప్రత్యేక చర్యలుజిల్లా ఎస్పీ శ్...
01/10/2026

మహిళలు, బాలికల భద్రతకు షీ టీమ్స్‌ నిరంతర నిఘా

మానవ అక్రమ రవాణా, బాల్యవివాహాల నివారణకు AHTU ప్రత్యేక చర్యలు

జిల్లా ఎస్పీ శ్రీమతి డి.జానకి, ఐపీఎస్

మహబూబ్‌నగర్ జిల్లాలో మహిళలు, బాలికలు, విద్యార్థినుల భద్రతకు జిల్లా పోలీస్ శాఖ ప్రత్యేక ప్రాధాన్యతనిస్తూ షీ టీమ్స్‌, యాంటీ హ్యూమన్ ట్రాఫికింగ్ యూనిట్ (AHTU) ద్వారా నిరంతరం నిఘా, అవగాహన కార్యక్రమాలు మరియు రక్షణ చర్యలు చేపడుతున్నట్లు జిల్లా ఎస్పీ శ్రీమతి డి.జానకి, ఐపీఎస్ గారు తెలిపారు.

విద్యాసంస్థలు, బస్టాండ్లు, రైల్వే స్టేషన్లు, రద్దీ ప్రాంతాల్లో షీ టీమ్స్‌ సిబ్బంది సివిల్‌ డ్రెస్సులో నిరంతరం నిఘా కొనసాగిస్తున్నారని తెలిపారు.

*సెప్టెంబర్‌లో షీ టీమ్స్‌ కార్యకలాపాలు*
సెప్టెంబర్ నెలలో షీ టీమ్స్‌కు అందిన ఫిర్యాదులపై తక్షణమే స్పందించి వేధింపులకు పాల్పడుతున్న వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవడంతో పాటు, అవసరమైన చోట తల్లిదండ్రుల సమక్షంలో కౌన్సెలింగ్ నిర్వహించారు.

- ఫిర్యాదులు – 17
- కౌన్సెలింగ్ – 16
- రెడ్ హ్యాండెడ్‌గా పట్టుబడినవి – 13
- ఈ-పెట్టీ కేసులు – 03
- ఆన్‌లైన్ పిటిషన్ – 01
- అవగాహన కార్యక్రమాలు – 26
- హాట్‌స్పాట్ సందర్శనలు – 50

షీ టీమ్స్‌ బృందాలు పాఠశాలలు, కళాశాలలు, తెలంగాణ మోడల్ స్కూళ్లు, రెసిడెన్షియల్ స్కూళ్లు, కేజీబీవీలలో ఈవ్‌టీజింగ్, ర్యాగింగ్, పోక్సో, సైబర్ నేరాలు, సోషల్ మీడియా, గుడ్ టచ్–బ్యాడ్ టచ్, బాల్యవివాహాలు, సెల్ఫ్ డిఫెన్స్, T-SAFE, డయల్-100 తదితర అంశాలపై అవగాహన కల్పిస్తున్నారు.

మహిళలు, బాలికలు లేదా విద్యార్థినులు ఎలాంటి వేధింపులకు గురైనా వెంటనే షీ టీమ్ నంబర్ 8712659365 లేదా డయల్-100కు సమాచారం అందించాలని ఎస్పీ గారు సూచించారు. ఫిర్యాదుదారుల వివరాలను గోప్యంగా ఉంచుతామని తెలిపారు.

*మానవ అక్రమ రవాణాపై ప్రత్యేక దృష్టి*

సెప్టెంబర్ నెలలో AHTU మరియు సురక్ష పోలీస్ కళాబృందం ఆధ్వర్యంలో పాఠశాలలు, కళాశాలలు, గ్రామాల్లో 11 అవగాహన కార్యక్రమాలు నిర్వహించడంతో పాటు, మానవ అక్రమ రవాణాకు అవకాశం ఉన్న 70 హాట్‌స్పాట్ ప్రాంతాలను తనిఖీ చేశారు.

ఈ సందర్భంగా మానవ అక్రమ రవాణా, బాల్యవివాహాలు, బాల కార్మిక వ్యవస్థ, అక్రమ దత్తత, మహిళలు మరియు బాలికలపై నేరాలు తదితర అంశాలపై ప్రజలకు అవగాహన కల్పించారు. మైనర్ పిల్లలను పనుల్లో పెట్టుకోవడం, అక్రమంగా తరలించడం లేదా అమ్మడం, కొనడం చట్టరీత్యా నేరమని, బాధ్యులపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని పోలీసులు తెలిపారు.

*బాల్యవివాహాన్ని అడ్డుకున్న AHTU*

జడ్చర్లకు చెందిన ఒక మైనర్ బాలికకు ఇంటి వద్ద వివాహం జరిపించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు AHTUకి సమాచారం అందడంతో పోలీసులు వెంటనే స్పందించి బాలికను రక్షించారు. తల్లిదండ్రులకు కౌన్సెలింగ్ నిర్వహించి DCPO అధికారులకు సమాచారం అందించి బాలికను స్టేట్ హోమ్‌కు తరలించారు.

మహిళలు, బాలికలు, చిన్నారులపై నేరాలు, బాల్యవివాహాలు, బాల కార్మిక వ్యవస్థ లేదా మానవ అక్రమ రవాణాపై సమాచారం ఉన్నవారు వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని సూచించారు.
డయల్-112
షీ టీమ్ : 8712659365
AHTU : 8712680066
చైల్డ్‌లైన్ : 1098

సమాచారం అందించే వారి వివరాలు గోప్యంగా ఉంచుతామని పోలీసులు తెలిపారు.

జిల్లా ఎస్పీ శ్రీమతి డి.జానకి, ఐపీఎస్ గారు మాట్లాడుతూ, మహిళలు, బాలికలు, చిన్నారుల భద్రతకు జిల్లా పోలీస్ శాఖ ఎల్లవేళలా అండగా ఉంటుందని, ఎలాంటి సమస్య ఎదురైనా భయపడకుండా పోలీసులను సంప్రదించాలని సూచించారు.

37 సంవత్సరాల సేవల అనంతరం పదవీ విరమణ పొందిన పోలీసు అధికారులకు ఘన సన్మానంజిల్లా ఎస్పీ శ్రీమతి డి.జానకి, ఐపీఎస్మహబూబ్‌నగర్ ...
30/09/2026

37 సంవత్సరాల సేవల అనంతరం పదవీ విరమణ పొందిన పోలీసు అధికారులకు ఘన సన్మానం

జిల్లా ఎస్పీ శ్రీమతి డి.జానకి, ఐపీఎస్

మహబూబ్‌నగర్ జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో ఘనంగా పదవీ విరమణ కార్యక్రమం

మహబూబ్‌నగర్ జిల్లా పోలీస్ శాఖలో 37 సంవత్సరాల పాటు విశిష్ట సేవలు అందించి బుధవారం పదవీ విరమణ పొందిన Ch.రాజేంద్ర సుధీర్ కుమార్, SI, CCS మరియు వై.దామోదర్, ARSI, DARలను జిల్లా ఎస్పీ శ్రీమతి డి.జానకి, ఐపీఎస్ గారు ఘనంగా సన్మానించారు.

జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలోని ఎస్పీ చాంబర్‌లో నిర్వహించిన పదవీ విరమణ కార్యక్రమంలో జిల్లా ఎస్పీ గారు పదవీ విరమణ పొందిన అధికారులను శాలువాలతో సత్కరించి, జ్ఞాపికలను అందజేశారు. పోలీస్ శాఖలో సుదీర్ఘకాలం అందించిన సేవలను ఈ సందర్భంగా ఎస్పీ గారు అభినందించారు.

పోలీస్ శాఖలో విధులు నిర్వహించడం ద్వారా ప్రజల భద్రత, శాంతిభద్రతల పరిరక్షణలో వారు అందించిన సేవలు అభినందనీయమని ఎస్పీ గారు పేర్కొన్నారు. పదవీ విరమణ అనంతరం వారు తమ కుటుంబ సభ్యులతో ఆరోగ్యంగా, సుఖసంతోషాలతో జీవించాలని ఆకాంక్షించారు.

ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీ ఎన్.బి. రత్నం, ఏఆర్ అదనపు ఎస్పీ సురేష్ కుమార్, ఏఓ రుక్మిణి భాయ్, ఆర్‌ఐలు కృష్ణయ్య, నగేష్, ఎస్పీ సీసీ రామ్ రెడ్డి, ఆఫీస్ సూపరింటెండెంట్లు మధు, బాలరాజు, పోలీస్ అసోసియేషన్ అధ్యక్షుడు ప్యారసాని సురేష్తో పాటు ఇతర పోలీస్ అధికారులు, సిబ్బంది కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.

మహబూబ్‌నగర్ జిల్లాలో అక్టోబర్ నెలలో 30 పోలీస్ యాక్ట్ అమలుజిల్లా ఎస్పీ శ్రీమతి డి.జానకి, ఐపీఎస్.మహబూబ్‌నగర్ జిల్లాలో శాంత...
30/09/2026

మహబూబ్‌నగర్ జిల్లాలో అక్టోబర్ నెలలో 30 పోలీస్ యాక్ట్ అమలు

జిల్లా ఎస్పీ శ్రీమతి డి.జానకి, ఐపీఎస్.

మహబూబ్‌నగర్ జిల్లాలో శాంతిభద్రతల పరిరక్షణ, ప్రజల్లో ప్రశాంత వాతావరణం కొనసాగించడంతో పాటు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా ముందస్తు చర్యల్లో భాగంగా 01.10.2026 నుండి 31.10.2026 వరకు 30 పోలీస్ యాక్ట్ అమలు చేస్తున్నట్లు జిల్లా ఎస్పీ శ్రీమతి డి.జానకి, ఐపీఎస్ గారు ఒక ప్రకటనలో తెలిపారు.

30 పోలీస్ యాక్ట్ అమల్లో ఉన్న సమయంలో జిల్లా పోలీసుల అనుమతి లేకుండా సభలు, సమావేశాలు, ఊరేగింపులు, ర్యాలీలు, ధర్నాలు, ప్రదర్శనలు తదితర కార్యక్రమాలు నిర్వహించరాదని ఎస్పీ గారు స్పష్టం చేశారు.

ప్రజలు శాంతిభద్రతలకు భంగం కలిగించే ఎలాంటి కార్యక్రమాలకు పాల్పడకుండా పోలీసులకు సహకరించాలని ఆమె సూచించారు. అత్యవసర పరిస్థితుల్లో ప్రజలు డయల్ 112కు సమాచారం అందించాలని తెలిపారు.

30 పోలీస్ యాక్ట్ నిబంధనలను ఉల్లంఘించే వారిపై చట్టప్రకారం చర్యలు తీసుకుంటామని జిల్లా ఎస్పీ శ్రీమతి డి.జానకి, ఐపీఎస్ గారు హెచ్చరించారు.

Address

Opp Union Bank Main Branch
Mahabubnagar
509001

Website

Alerts

Be the first to know and let us send you an email when Mahabubnagar District Police posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Shortcuts

Share