AP Agriculture

Directions Contact the organization

AP Agriculture This page for the department of Agriculture has been create mainly to provide Agricultural activities
(1)

ఏపీ రైతాంగానికి వ్యవసాయ శాఖ ముఖ్య సమాచారం! ఖరీఫ్ 2026-27 సీజన్‌కు సంబంధించి రైతులు పండించే వరి, జొన్న, రాగులు, పప్పు ధాన...
13/10/2026

ఏపీ రైతాంగానికి వ్యవసాయ శాఖ ముఖ్య సమాచారం! ఖరీఫ్ 2026-27 సీజన్‌కు సంబంధించి రైతులు పండించే వరి, జొన్న, రాగులు, పప్పు ధాన్యాలు, పత్తి, వేరుశనగ వంటి 17 రకాల ప్రధాన పంటలకు ప్రభుత్వం కనీస మద్దతు ధరలను (MSP) ప్రకటించింది. క్వింటాల్‌కు ఏ పంటకు ఎంత మద్దతు ధర లభిస్తుందో వివరంగా తెలుసుకునేందుకు ఈ పోస్టర్‌లోని పట్టికను పరిశీలించండి. రైతులు దళారుల బారిన పడకుండా, తమ వ్యవసాయ ఉత్పత్తులను కనీస మద్దతు ధరకు అమ్ముకుని ప్రయోజనం పొందాలని వ్యవసాయ శాఖ సూచిస్తోంది.

ఖరీఫ్ 2026 వ్యవసాయ పంటల బీమా అమలులో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం గణనీయమైన వృద్ధిని సాధించింది. జాతీయ స్థాయితో పోలిస్తే ఏపీలో బీ...
10/10/2026

ఖరీఫ్ 2026 వ్యవసాయ పంటల బీమా అమలులో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం గణనీయమైన వృద్ధిని సాధించింది. జాతీయ స్థాయితో పోలిస్తే ఏపీలో బీమా కవరేజ్ పొందిన రైతుల సంఖ్యలో 123%, దరఖాస్తుల సంఖ్యలో 134%, అలాగే బీమా చేయబడిన సాగు విస్తీర్ణంలో 123% అద్భుతమైన పెరుగుదల నమోదైంది. రైతులకు బీమా రక్షణ కల్పించి, సురక్షిత వ్యవసాయాన్ని ప్రోత్సహించడంలో రాష్ట్ర ప్రభుత్వం విశేష కృషి చేస్తోంది.

ఏపీ రైతులకు వ్యవసాయ శాఖ ముఖ్య గమనిక! ఎల్ నినో పరిస్థితులను సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు వీలుగా ప్రత్యామ్నాయ పంటల సాగును ప్...
10/10/2026

ఏపీ రైతులకు వ్యవసాయ శాఖ ముఖ్య గమనిక! ఎల్ నినో పరిస్థితులను సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు వీలుగా ప్రత్యామ్నాయ పంటల సాగును ప్రభుత్వం ప్రోత్సహిస్తోంది. ఇందులో భాగంగా ఏకంగా 80% భారీ రాయితీతో ఉలవలు, అలసందలు, మినుములు, పెసలు, కందులు, చిరుధాన్యాలు (జొన్నలు, కొర్రలు, రాగులు), నువ్వులు వంటి విత్తనాలను సరఫరా చేస్తోంది. తక్కువ నీటి వినియోగంతో, తక్కువ కాలవ్యవధిలో పండే ఈ పంటల విత్తనాల కోసం మీ సమీప వ్యవసాయ అధికారులను సంప్రదించి ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి.

ఏపీ రైతులకు వ్యవసాయ శాఖ ముఖ్య సమాచారం! ఖరీఫ్ 2026-27 సీజన్‌కు సంబంధించి నవంబర్ 1 నుండి ధాన్యం సేకరణ చేపట్టేందుకు ప్రభుత్...
07/10/2026

ఏపీ రైతులకు వ్యవసాయ శాఖ ముఖ్య సమాచారం! ఖరీఫ్ 2026-27 సీజన్‌కు సంబంధించి నవంబర్ 1 నుండి ధాన్యం సేకరణ చేపట్టేందుకు ప్రభుత్వ ప్రణాళిక సిద్ధంగా ఉంది. ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లో మీ పంటను ఎలాంటి ఇబ్బంది లేకుండా అమ్ముకోవడానికి రైతులందరూ తప్పనిసరిగా ఫార్మర్ ఐడీ (Farmer ID) నమోదు చేసుకోవాలి. అలాగే, ఈ-పంటలో (e-Crop) మీ e-KYC ప్రక్రియను వీలైనంత త్వరగా పూర్తి చేసుకుని సన్నద్ధంగా ఉండండి.

ఏపీ రైతులకు ముఖ్య గమనిక! ఈ-పంట (e-Crop) లో మీ పంట వివరాలను నిర్ధారిస్తూ తక్షణమే e-KYC పూర్తి చేయండి. పంటల బీమా క్లెయిమ్‌...
07/10/2026

ఏపీ రైతులకు ముఖ్య గమనిక! ఈ-పంట (e-Crop) లో మీ పంట వివరాలను నిర్ధారిస్తూ తక్షణమే e-KYC పూర్తి చేయండి. పంటల బీమా క్లెయిమ్‌లు పొందడానికి, ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లో మీ పంట ఉత్పత్తులను అమ్ముకోవడానికి ఇది ఎంతో అవసరం. దీనితో పాటు ప్రకృతి విపత్తుల వల్ల జరిగే పంట నష్ట పరిహారానికి, ఇన్‌పుట్ సబ్సిడీ మరియు ఇతర ప్రభుత్వ వ్యవసాయ పథకాలకు అర్హత సాధించడానికి రైతులందరూ e-KYC నమోదు చేసుకోవడం తప్పనిసరి.

రైతు సోదరులకు వ్యవసాయ శాఖ సూచన! వర్షాధార మెట్ట సాగులో అంతర పంటలుగా పప్పు ధాన్యాల సాగు ఎంతో లాభదాయకం. కందిలో వేరుశనగ, మిన...
07/10/2026

రైతు సోదరులకు వ్యవసాయ శాఖ సూచన! వర్షాధార మెట్ట సాగులో అంతర పంటలుగా పప్పు ధాన్యాల సాగు ఎంతో లాభదాయకం. కందిలో వేరుశనగ, మినుము, పెసర, సోయాచిక్కుడు లాంటివి వేసుకోవచ్చు. అలాగే మామిడి, కొబ్బరి, ఆయిల్ పామ్ వంటి ఉద్యాన తోటల్లో చెట్ల మధ్య ఖాళీ నేలలో ఉలవలు, బొబ్బర్లు సాగు చేయడం ద్వారా అదనపు ఆదాయం పొందటమే కాకుండా భూసారం పెరిగి, నేల కోత తగ్గుతుంది. పప్పు ధాన్యాలలో స్వయం సమృద్ధి సాధించేందుకు ఖాళీ నేలలను వదలకుండా పప్పు ధాన్యాలను సాగు చేద్దాం.

ఏపీ రైతులకు ముఖ్య సమాచారం! ఈ-పంట (e-Crop) లో మీ పంట వివరాలను ధృవీకరిస్తూ తక్షణమే e-KYC పూర్తి చేయండి. పంటల బీమా క్లెయిమ్...
05/10/2026

ఏపీ రైతులకు ముఖ్య సమాచారం! ఈ-పంట (e-Crop) లో మీ పంట వివరాలను ధృవీకరిస్తూ తక్షణమే e-KYC పూర్తి చేయండి. పంటల బీమా క్లెయిమ్‌లు పొందడానికి, ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లో మీ పంట ఉత్పత్తులను అమ్ముకోవడానికి ఇది ఎంతో అవసరం. అలాగే ప్రకృతి విపత్తుల వల్ల జరిగే పంట నష్ట పరిహారం, ఇన్‌పుట్ సబ్సిడీతో పాటు ఇతర ప్రభుత్వ వ్యవసాయ పథకాలకు అర్హత సాధించాలంటే రైతులందరూ e-KYC నమోదు చేసుకోవడం తప్పనిసరి అని గమనించగలరు.

05/10/2026

రైతులు తప్పనిసరిగా ఈ-క్రాప్, ఈ-కేవైసి చేపించుకోవాలి || E-Crop,E-Kyc

వీటిపై సోషల్ మీడియాలోని యూట్యూబ్, ఇన్‌స్టాగ్రామ్, ఫేస్‌బుక్‌లలో లింకులు పరిశీలించగలరు:

ఇన్‌స్టాగ్రామ్: https://www.instagram.com/reels/DdqTsNmPinJ/

ఫేస్‌బుక్: https://www.facebook.com/reel/2421718485300883

యూట్యూబ్: https://www.youtube.com/shorts/2OS9e2KLCZE

ఆధునిక వ్యవసాయంలో డిజిటల్ సేవల ద్వారా రైతులకు సాధికారత కల్పించేందుకు పీఎం కిసాన్ పోర్టల్ ఎంతో ఉపయోగపడుతుంది. ఈ సులభమైన ప...
30/09/2026

ఆధునిక వ్యవసాయంలో డిజిటల్ సేవల ద్వారా రైతులకు సాధికారత కల్పించేందుకు పీఎం కిసాన్ పోర్టల్ ఎంతో ఉపయోగపడుతుంది. ఈ సులభమైన పోర్టల్ ద్వారా రైతులు ఆన్‌లైన్‌లో స్వయంగా నమోదు చేసుకోవడంతో పాటు, సొమ్ము జమ వివరాలను కూడా సులభంగా పరిశీలించుకోవచ్చు. రిజిస్ట్రేషన్ మొదలుకొని ఫిర్యాదుల పరిష్కారం వరకు అవసరమైన సేవలన్నీ ఇప్పుడు రైతుల కోసం ఒకే వేదికపై అందుబాటులో ఉంచబడ్డాయి.

పీఎం కిసాన్ తదుపరి విడత సొమ్ము సకాలంలో పొందడానికి వెంటనే e-KYC పూర్తి చేయండి, బ్యాంక్ ఖాతాకు ఆధార్ లింక్ మరియు భూమి రికా...
28/09/2026

పీఎం కిసాన్ తదుపరి విడత సొమ్ము సకాలంలో పొందడానికి వెంటనే e-KYC పూర్తి చేయండి, బ్యాంక్ ఖాతాకు ఆధార్ లింక్ మరియు భూమి రికార్డులను ధృవీకరించుకోండి.

Address

AP AGRICULTURE OFFICE
Mangalagiri
522503

Website

Alerts

Be the first to know and let us send you an email when AP Agriculture posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Organization

Send a message to AP Agriculture:

Shortcuts

Share