07/10/2026
📢 సైబర్ క్రైమ్ అవగాహన కార్యక్రమం
వెంకటాపురం ప్రభుత్వ జూనియర్ కళాశాలలో సి.ఐ. ఆఫ్ పోలీస్, వెంకటాపురం శ్రీ ముత్యం రమేష్ గారి ఆధ్వర్యంలో విద్యార్థులకు సైబర్ క్రైమ్ మరియు ఆన్‌లైన్ మోసాలపై అవగాహన కార్యక్రమం నిర్వహించడం జరిగింది.
ఈ సందర్భంగా పార్ట్‌టైమ్ జాబ్ మోసాలు, ఆన్‌లైన్ షాపింగ్ ఫ్రాడ్స్, లోన్ యాప్ మోసాలు, ఇంపర్సనేషన్ ఫ్రాడ్స్ తదితర సైబర్ నేరాలపై విద్యార్థులకు అవగాహన కల్పించారు. అలాగే OTP, UPI PIN, CVV, బ్యాంక్ వివరాలు ఎవరితోనూ పంచుకోకూడదని, అనుమానాస్పద లింకులు, యాప్స్‌ను ఉపయోగించకూడదని సూచించారు.
సైబర్ మోసానికి గురైతే వెంటనే 1930కు కాల్ చేసి లేదా www.cybercrime.gov.in ద్వారా ఫిర్యాదు చేయాలని సూచించారు.
“అప్రమత్తంగా ఉండండి – సైబర్ నేరాలకు దూరంగా ఉండండి.”