Koilakuntla Police

Koilakuntla Police

Share

Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from Koilakuntla Police, Government Official, Mumbai.

29/06/2023

21/11/2022
09/12/2021

సైబర్ అలర్ట్ .

ఎటిఎం కేంద్రాల వద్ద అమాయక ప్రజలే లక్ష్యంగా చేసుకుని మోసాలు చేస్తున్నారు జాగ్రత్త.

ATM కేంద్రాలలో అపరిచితవ్యక్తులను నమ్మి ఎటిఎం కార్డులు, ఎటిఎం పిన్ నెంబర్లు ఇవ్వద్దు.

కార్డులు మార్చి డబ్బులు దొంగలిస్తున్నారు..... జాగ్రత్త !..కర్నూలు జిల్లా ఎస్పీ సిహెచ్ .సుధీర్ కుమార్ రెడ్డి ఐపియస్ గారు.

ఈ మధ్య కాలంలో ATM కేంద్రాలలో ఎటిఎం కార్డులు మార్చే మోసాలు ఎక్కువగా అవుతున్నాయని అమాయక ప్రజలు జాగ్రత్తగా ఉండాలని కర్నూలు జిల్లా ఎస్పీ సిహెచ్ .సుధీర్ కుమార్ రెడ్డి ఐపియస్ గారు శనివారం ఒక ప్రకటనలో తెలిపారు.

ఈ విషయాన్ని ఎన్ని సార్లు తెలిపినా మోసాలకు గురవుతూనే ఉన్నారని ప్రజలు జాగ్రత్తగా ఉండాలని ఎస్పీ గారు సూచించారు.

1) ఎటిఎం సెంటర్ల వద్ద అపరిచిత వ్యక్తులు అమాయకులకు డబ్బులు డ్రా చేసి ఇస్తామని చెప్పి ఎటిఎం కార్డులు తీసుకొని , పిన్ నెంబర్ తెలుసుకుని ఒరిజినల్ ఎటిఎం కార్డులు తిరిగి ఇవ్వకుండా నకిలి ఎటిఎం కార్డులు ఇచ్చి మోసాలు చేస్తున్నారు.

2) కొందరు ఎటిఎం కార్డుల వెనుక వైపు ఎటిఎం పిన్ నెంబర్లు రాసుకొని ఉండడంతో ఆ ఎటిఎం మరియు పిన్ నెంబర్లను తెలుసుకుని వాటిని పోలిన విధంగా నకిలి ఎటిఎం కార్డులు తయారు చేసి మోసాలు చేస్తున్నారు.

డబ్బుల(నగదు) కొరకు ఎటిఎం కేంద్రాలకు వెళ్ళే వృద్దులు, చదువురాని వారు డబ్బులు డ్రా చేయడం తెలియనప్పుడు అపరిచిత వ్యక్తులను నమ్మి వారిని ఎటిఎం కార్డుల నుండి డబ్బులు డ్రా చేసి ఇమ్మని అడిగిన సంధర్బాలలో వారు ఒరిజినల్ కార్డులు తిరిగి ఇవ్వకుండా నకిలి కార్డులు ఇచ్చి Original ATM Cards ని తీసుకొని దాని ద్వారా Account లోని మొత్తం డబ్బును డ్రా చేసుకుంటున్నారు.

అపరిచిత వ్యక్తులకు మీ ఎటిఎం కార్డు గాని, ఎటిఎం పిన్ నెంబర్ గాని ఇచ్చి డబ్బులు డ్రా చేయమని అడగవద్దని ఏదైనా అవసరమైన పరిస్ధితులలో ఎటిఎం కేంద్రాలలో డబ్బులు డ్రా చేసుకోవడం తెలియక పోతే అక్కడ ఉన్న ఎటిఎం సెక్యూరిటి గార్డులు లేదా తెలిసిన వ్యక్తుల సహాయం తీసుకోవాలని జిల్లా ఎస్పీ గారు తెలిపారు.

బాధితులు చేసిన ఫిర్యాదులలో కొన్ని...

• కర్నూలు ఎటిఎం కేంద్రంలో రూ. 45 వేలు డ్రా చేసి ఇస్తానని చెప్పి అపరిచిత వ్యక్తి మోసగించారని కల్లూరు మండలం, రాజీవ్ నగర్ కు చెందిన వి. హనుమయ్య ఫిర్యాదు చేశారు.

• కర్నూలు ఎటిఎం కేంద్రంలో రూ. 1 లక్ష 34 వేలు డ్రా చేసి ఇస్తానని చెప్పి అపరిచిత వ్యక్తి మోసగించారని ఆదిత్యనగర్ కు చెందిన తిరుపాల్ నాయక్ ఫిర్యాదు చేశారు.

• కర్నూలు ఆర్టిసి బస్టాండు కు ఎదురుగా ఉన్న ఎటిఎం కేంద్రంలో రూ. 66 వేలు డ్రా చేసి ఇస్తానని చెప్పి అపరిచిత వ్యక్తి మోసగించారని గొందిపర్లకు చెందిన చిదంబరం ఫిర్యాదు చేశారు.

జిల్లా పోలీసు కార్యాలయం నుండి జారీ చేయడమైనది.

#𝐀𝐧𝐝𝐡𝐫𝐚𝐏𝐫𝐚𝐝𝐞𝐬𝐡𝐏𝐨𝐥𝐢𝐜𝐞

08/05/2020

What is Success?????

09/04/2020

No Caption !!!!

06/04/2020

20 sec
30 sec
40 sec
50 sec
60 sec........?????? Find out answer

Photos from Koilakuntla Police's post 04/03/2020

I wish all the Best 10th and inter students,,,, Examination instructions for students $$$ Kurnool # POLICE # Koilakuntla PS

Photos from Koilakuntla Police's post 18/02/2020

🌸 ‘దిశ’ యాప్‌లోని ముఖ్యాంశాలు ఇవీ..⬇

❖ ఆండ్రాయిడ్‌, ఐఓఎస్‌ ప్లాట్‌ఫాంలపై అందుబాటులో ఉంటుందని పోలీసువర్గాలు తెలిపాయి.

❖ ఇంటర్నెట్‌ ఉన్నా.. లేకపోయినా యాప్‌ పనిచేస్తుంది.

❖ ఫోన్‌లో యాప్‌ని తెరిచి ఎస్‌ఓఎస్‌ బటన్‌ నొక్కితే ఆ ఫోన్‌ లొకేషన్‌ వివరాలు, ఆ ఫోన్‌ నెంబరు ఎవరి పేరు మీద ఉంది, చిరునామా వంటి వివరాలన్నీ పోలీసు కంట్రోల్‌ రూంకి వెళతాయి.

❖ ఫోన్‌ లొకేషన్‌, 10 సెకన్ల నిడివిగల వీడియో, ఆడియో కూడా కంట్రోల్‌ రూంకి చేరతాయి. బాధితురాలు ఎక్కడున్నారో, అక్కడి పరిస్థితులు ఎలా ఉన్నాయో అంచనా వేసేందుకు వీడియో, ఆడియో ఉపయోగపడతాయి.

❖ ఈ యాప్‌లో ‘ట్రాక్‌ మై ట్రావెల్‌’ అని ఒక ఆప్షన్‌ ఉంది.

❖ ఉదాహరణకు ఒక మహిళ విజయవాడలో బెంజ్‌సర్కిల్‌ నుంచి బస్టాండ్‌కి ఆటో లేదా క్యాబ్‌లో వెళుతుంటే.. ‘ట్రాక్‌ మై ట్రావెల్‌’ ఆప్షన్‌లో బయల్దేరిన ప్రాంతం, గమ్యం నమోదుచేయాలి. ఆ మహిళ వెళుతున్న మార్గాన్ని కంట్రోల్‌ రూం నుంచి గమనిస్తారు. నమోదుచేసిన మార్గంలో కాకుండా, ఆటో మరో మార్గంలోకి వెళ్తే వెంటనే పోలీసు కంట్రోల్‌ రూంని, స్థానికంగా ఉన్న పోలీసుస్టేషన్‌ను అప్రమత్తం చేస్తూ సందేశం వెళుతుంది.

❖ ఆపదలో ఉన్నప్పుడు అత్యవసర సమాచారం పంపేందుకు కుటుంబసభ్యులు, బంధువులు, మిత్రుల ఫోన్‌ నంబర్లను యాప్‌లో నమోదు చేయవచ్చు. ఐదు నంబర్లు నమోదు చేసేందుకు వీలుంటుంది. ఎస్‌ఓఎస్‌ సందేశం పంపినా, ‘ట్రాక్‌ మై ట్రావెల్‌’ ఆప్షన్‌ వినియోగించినప్పుడు వాహనం దారితప్పి వెళుతున్నా.. పోలీసులతో పాటు, ఈ ఐదు నంబర్లకూ సందేశం వెళుతుంది.

❖ ఆపదలో ఉన్నవారు యాప్‌లో ఎస్‌ఓఎస్‌ బటన్‌ నొక్కగానే.. ఆ సమాచారాన్ని వెంటనే సమీపంలోని పోలీసు స్టేషన్‌కి, అక్కడికి దగ్గర్లో ఉన్న పోలీసు రక్షక వాహనాలకు కంట్రోల్‌ రూం నుంచి ఆటోమేటిక్‌ కాల్‌ డిస్పాచ్‌ విధానంలో పంపిస్తారు.

❖ జీపీఎస్‌ అమర్చిన పోలీసు రక్షణ వాహనాల్లో ‘మొబైల్‌ డాటా టెర్మినల్‌’ ఉంటుంది. వాహనం ఉన్న ప్రాంతం నుంచి ఆ సందేశం వచ్చిన ప్రాంతం వరకు రూట్‌ మ్యాప్‌ అందులో కనిపిస్తుంది. దాన్ని అనుసరించి ఆ వాహనం ఆ ప్రదేశానికి చేరుకోవచ్చు.

❖ యాప్ ద్వారా 100/112 నంబర్లకూ సహాయం కోసం ఫోన్‌ చేయవచ్చు.

❖ యాప్‌లో పోలీసు అధికారుల ఫోన్‌ నంబర్లు, సమీపంలోని పోలీసుస్టేషన్ల వివరాలు తెలుసుకునేందుకు ప్రత్యేక ఆప్షన్లు ఉన్నాయి.

❖ ఈ యాప్‌ని ప్రధానంగా మహిళల కోసమే ఉద్దేశించినా, ఆపదలో ఉన్న వృద్ధులూ దీన్ని ఉపయోగించవచ్చు.

❖ వైద్యసేవలు అవసరమైనప్పుడు యాప్‌ ద్వారా దగ్గర్లోని మెటర్నిటీ, ట్రామా కేర్‌ సెంటర్లు, ఇతర ఆస్పత్రులు, బ్లడ్‌ బ్యాంకులు, ఫార్మసీలు వంటి వాటి వివరాలు తెలుసుకోవచ్చు.

❖ ఇంకా ఈ యాప్‌లో సమీపంలోని సురక్షిత ప్రదేశాల వివరాలు, బాధితులు ఉన్న ప్రదేశం నుంచి సమీపంలోని పోలీసు స్టేషన్లకు, సురక్షిత ప్రాంతానికి వెళ్లేందుకు మార్గసూచి (నావిగేషన్‌)లు, పోలీసు డైరెక్టరీ, అత్యవసర సమయాల్లో ఫోన్‌ చేయాల్సిన నంబర్లు, సామాజిక మాధ్యమాలు, రోడ్డు భద్రత వంటి ఆప్షన్లు పొందుపరిచారు
Download link for DISHA APP

https://play.google.com/store/apps/details?id=com.likhatech.disha

SHARE THIS MSG TO ALL YOUR NEAR N DEAR

25/09/2019

Being human is given..!
But keeping our humanity is a choice...!!! heart touching video

Want your business to be the top-listed Government Service in Mumbai?

Click here to claim your Sponsored Listing.

Location

Website

Address


Mumbai