30/08/2026
బిస్మిల్లాహిర్ రహ్మానిర్ రహీమ్ 🤲🕋
అల్లాహు సుభానహు వ తఆలా అనుగ్రహం లేకుండా ఈ లోకంలో ఏదీ జరగదు. ఆయన కరుణ, దయ, అనుగ్రహంతో ఈరోజు పవిత్రమైన ఉమ్రా యాత్రకు బయలుదేరే గొప్ప అదృష్టం నాకు కలిగింది.
నిజానికి ఈ ఉమ్రా యాత్ర కార్యక్రమం చాలా అనుకోకుండా, సడన్‌గా నిర్ణయమైంది. అందువల్ల నా మిత్రులు, శ్రేయోభిలాషులు, ఆత్మీయులలో కొందరికి ముందుగా తెలియజేయలేకపోయాను. దయచేసి దీనిని మనసులో పెట్టుకోకుండా అర్థం చేసుకుంటారని ఆశిస్తున్నాను.
పవిత్రమైన మక్కా, మదీనా నగరాలను దర్శించి, కాబా షరీఫ్‌ను చూడగలగడం, ఉమ్రా ఆరాధనను నిర్వహించగలగడం ప్రతి ముస్లిం జీవితంలో ఒక గొప్ప భాగ్యం. ఈ అవకాశాన్ని నాకు ప్రసాదించిన అల్లాహ్ సుభానహు వ తఆలాకు హృదయపూర్వక కృతజ్ఞతలు. 🤲
ఇన్‌షా అల్లాహ్, 15 రోజుల ఈ పవిత్ర ఉమ్రా యాత్రను పూర్తి చేసుకుని క్షేమంగా తిరిగి వస్తాను. ఈ పవిత్ర యాత్ర ద్వారా నా జీవితంలోనే కాకుండా, నా కుటుంబ సభ్యులు, మిత్రులు, శ్రేయోభిలాషులు మరియు నన్ను ప్రేమించే ప్రతి ఒక్కరి జీవితాల్లో శాంతి, సుఖం, ఆరోగ్యం, బర్కత్, సంతోషం మరియు అల్లాహ్ కరుణ నిండాలని మనస్ఫూర్తిగా దువా చేస్తున్నాను.
మక్కా మదీనాలోని పవిత్ర స్థలాల్లో మీ అందరినీ నా దువాల్లో తప్పకుండా గుర్తు చేసుకుంటాను. మీరు కూడా నా కోసం దువా చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అల్లాహ్ మనందరి దువాలను స్వీకరించి, మన పాపాలను క్షమించి, మన కుటుంబాలను తన హిఫాజత్‌లో ఉంచి, ప్రతి ఒక్కరికీ తన పవిత్ర గృహాన్ని దర్శించే భాగ్యాన్ని ప్రసాదించుగాక.
ఆమీన్ యా రబ్బల్ ఆలమీన్ 🤲🕋
#మీ_మదీనా_దస్తగిరి
ిల్లా_ముస్లిం_మైనారిటీ_సెల్_జిల్లా_అధ్యక్షులు
YS Jagan Mohan Reddy YSR Congress Party - YSRCP YS Bharathi Reddy FC YS Avinash Reddy YSRCP SOCIAL MEDIA Amzath Basha
ిల్లా_మాజీ_వక్ఫ్_బోర్డు_చైర్మన్