VCK it wing-Andhra pradesh

Directions Website

VCK it wing-Andhra pradesh VCK itwing

విజయవాడలో అఖిలపక్ష రౌండ్ టేబుల్ సమావేశంనిన్న విజయవాడలో CPM ఆధ్వర్యంలో నిర్వహించిన అఖిలపక్ష రౌండ్ టేబుల్ సమావేశంలో VCK పా...
29/09/2026

విజయవాడలో అఖిలపక్ష రౌండ్ టేబుల్ సమావేశం

నిన్న విజయవాడలో CPM ఆధ్వర్యంలో నిర్వహించిన అఖిలపక్ష రౌండ్ టేబుల్ సమావేశంలో VCK పార్టీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షులు N. J. విద్యాసాగర్ గారు పాల్గొన్నారు.

ఈ సమావేశంలో చీఫ్ ఎలక్షన్ కమీషనర్ జ్ఞానేష్ కుమార్‌ను తొలగించాలని, అలాగే SIR (Special Intensive Revision) ప్రక్రియను నిలిపివేయాలని అఖిలపక్షాల నాయకులు డిమాండ్ చేశారు.

విజయవాడలో బీసీ చైతన్య వేదిక సదస్సుఈరోజు విజయవాడలో బీసీ చైతన్య వేదిక ఆధ్వర్యంలో నిర్వహించిన సదస్సులో VCK పార్టీ ఆంధ్రప్రద...
27/09/2026

విజయవాడలో బీసీ చైతన్య వేదిక సదస్సు

ఈరోజు విజయవాడలో బీసీ చైతన్య వేదిక ఆధ్వర్యంలో నిర్వహించిన సదస్సులో VCK పార్టీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షులు N. J. విద్యాసాగర్ గారు ప్రసంగించారు.

ఈ కార్యక్రమంలో రాజ్యసభ సభ్యులు విల్సన్ గారు, బి.పి. మండల్ మనుమడు సూరజ్ మండల్ గారు, డా. ఆల వెంకటేశ్వర్లు గారు, బక్కా పరంజ్యోతి గారు తదితరులు పాల్గొని వేదికను అలంకరించారు.

బీసీల సామాజిక న్యాయం, హక్కులు మరియు సమానత్వం కోసం ఐక్యంగా ముందుకు సాగాల్సిన అవసరంపై సదస్సులో చర్చ జరిగింది.

27-09-2026 | తిరుపతి జిల్లా | సూళ్లూరుపేట నియోజకవర్గంVCK పార్టీ తిరుపతి జిల్లా జనరల్ సెక్రటరీ మాల్చి చెంగయ్య గారు కంటి ఆ...
27/09/2026

27-09-2026 | తిరుపతి జిల్లా | సూళ్లూరుపేట నియోజకవర్గం

VCK పార్టీ తిరుపతి జిల్లా జనరల్ సెక్రటరీ మాల్చి చెంగయ్య గారు కంటి ఆపరేషన్ అనంతరం విశ్రాంతి తీసుకుంటున్న విషయం తెలుసుకున్న VCK పార్టీ తిరుపతి జిల్లా వైస్ ప్రెసిడెంట్ పామంజి ధనుంజయ గారు, హరివేణి/నాయుడుపేట మండల కన్వీనర్ ఏ. హరి గారు వారి నివాసానికి వెళ్లి పరామర్శించారు.

చెంగయ్య గారు త్వరగా కోలుకుని సంపూర్ణ ఆరోగ్యంతో ప్రజా సేవలోకి రావాలని ఆకాంక్షించారు. 🙏💐

జై భీమ్ ✊
VCK పార్టీ – ఆంధ్రప్రదేశ్

చీకటి గోపి లాకప్ మరణంపై SIT అధికారిని కలిసిన VCK రాష్ట్ర అధ్యక్షులు25-06-2026న తాడేపల్లిలో జరిగిన చీకటి గోపి లాకప్ మరణం ...
26/09/2026

చీకటి గోపి లాకప్ మరణంపై SIT అధికారిని కలిసిన VCK రాష్ట్ర అధ్యక్షులు

25-06-2026న తాడేపల్లిలో జరిగిన చీకటి గోపి లాకప్ మరణం ఘటనపై, ప్రభుత్వం నియమించిన SIT అధికారి రవి కుమార్ IPS గారిని VCK పార్టీ రాష్ట్ర అధ్యక్షులు ఎన్.జె. విద్యాసాగర్ గారు కలిసి ఘటనకు సంబంధించిన వివరాలను తెలియజేసి, తమ వాదనను వినిపించారు.

చీకటి గోపి లాకప్ మరణానికి సంబంధించిన అంశాలపై సమగ్ర విచారణ జరిపి, వాస్తవాలను వెలుగులోకి తీసుకురావాలని VCK పార్టీ తరఫున కోరారు.

గుంటూరులో చీకటి గోపి కేసుపై కీలక ప్రెస్‌మీట్ఈరోజు గుంటూరులో MRPS వ్యవస్థాపక అధ్యక్షులు మంద కృష్ణ మాదిగ గారితో కలిసి ప్రె...
20/09/2026

గుంటూరులో చీకటి గోపి కేసుపై కీలక ప్రెస్‌మీట్

ఈరోజు గుంటూరులో MRPS వ్యవస్థాపక అధ్యక్షులు మంద కృష్ణ మాదిగ గారితో కలిసి ప్రెస్‌మీట్‌లో పాల్గొన్న VCK పార్టీ రాష్ట్ర అధ్యక్షులు NJ Vidya Sagar గారు

చీకటి గోపి కేసులో ఇప్పటివరకు అజ్ఞాతంలో ఉన్నట్లు పేర్కొన్న ప్రధాన నిందితుడు గోపి కృష్ణ, ఈ ప్రెస్‌మీట్‌లో కీలక విషయాలను వెల్లడించారు. పోలీసుల అదుపులో చీకటి గోపిని ఎలా చిత్రహింసలకు గురిచేసి, కొట్టారనే విషయాలను ఆయన వివరించారు.

చీకటి గోపి మృతిపై సమగ్ర, నిష్పక్షపాత విచారణ జరిపి వాస్తవాలను వెలుగులోకి తీసుకురావాలని, బాధ్యులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాం.

చీకటి గోపి ఘటనపై నిష్పక్షపాత విచారణ, బాధ్యులపై చర్యలు కోరుతూ మంద కృష్ణ మాదిగ ఇప్పటికే పలు సందర్భాల్లో డిమాండ్ చేశారు.


**అమలాపురం మున్సిపల్ ఓటర్ల జాబితాలో అక్రమాలు: జాయింట్ కలెక్టర్ కి విముక్తి చిరుతల పార్టీ(VCK )వినతి*​* *అక్రమ ముసాయిదా ఓ...
19/09/2026

**అమలాపురం మున్సిపల్ ఓటర్ల జాబితాలో అక్రమాలు: జాయింట్ కలెక్టర్ కి విముక్తి చిరుతల పార్టీ(VCK )వినతి*

​* *అక్రమ ముసాయిదా ఓటర్ల జాబితా, రిజర్వేషన్ల ప్రక్రియను తక్షణమే నిలిపివేయాలి.**

*జీవో 1113 నిబంధనల ప్రకారం క్షేత్రస్థాయిలో పారదర్శకంగా రీ-సర్వే నిర్వహించాలి.

*గణాంకాల తారుమారుపై సమగ్ర విచారణ జరిపి బాధ్యులైన అధికారులపై కఠిన చర్యలు తీసుకోవాలి.

అమలాపురం పురపాలక సంఘం పరిధిలో అధికారులు ప్రచురించిన ముసాయిదా ఓటర్ల జాబితా, రిజర్వేషన్ల ప్రక్రియ తీవ్ర అభ్యంతరకరంగా, రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధంగా ఉందని విముక్తి చిరుతల పార్టీ (VCK) రాష్ట్ర డిప్యూటీ జనరల్ సెక్రటరీ బొంతు రమణ ఆరోపించారు. శనివారం అమలాపురం కలెక్టరేట్‌లో జిల్లా జాయింట్ కలెక్టర్‌ను కలసి పార్టీ బృందంతో కలసి వినతిపత్రం అందజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. జీవో నంబరు 1113 ప్రకారం ఈ నెల 8 నుంచి 12వ తేదీ వరకు మున్సిపల్ అధికారులు ప్రతీ వార్డులోనూ ఇంటింటికీ తిరిగి ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఓసీ, మహిళా ఓటర్ల వివరాలను పారదర్శకంగా సేకరించాల్సి ఉందని గుర్తుచేశారు. కానీ అధికారులు క్షేత్రస్థాయికి వెళ్లకుండా, కార్యాలయాల్లో కూర్చొని బోగస్ రీతిలో జాబితాలు తయారు చేశారని తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.

​అంకెల తారుమారు.. బీసీ ఓటర్లలో తీవ్ర కోత

2020 సంవత్సరపు ఓటర్ల గణాంకాలతో ప్రస్తుతం విడుదల చేసిన జాబితాను పోల్చి చూస్తే తీవ్ర వ్యత్యాసాలు స్పష్టమవుతున్నాయని బొంతు రమణ పేర్కొన్నారు. 2020లో 454 మంది ఉన్న ఎస్టీ ఓటర్లను ప్రస్తుతం 581కి పెంచి 73 మంది పెంపు నమోదు చేశారని తెలిపారు. అలాగే 5,034 మంది ఉన్న ఎస్సీ ఓటర్లను ప్రస్తుతం 5,093 మందిగా చూపి కేవలం 61 మంది మాత్రమే పెరిగినట్లు లెక్కలు తేల్చారన్నారు. ఇదే సమయంలో 20,206 మంది ఉన్న ఓసీ ఓటర్ల సంఖ్యను ఏకంగా 21,194కి పెంచి 988 మందిని అదనంగా చేర్చడం పలు అనుమానాలకు తావిస్తోందన్నారు. అన్ని వర్గాల జనాభా పెరుగుతుంటే ఒక్క బీసీ ఓటర్ల సంఖ్యలోనే తీవ్ర కోత విధించడం విడ్డూరంగా ఉందని విమర్శించారు. 2020లో 14,341 మంది ఉన్న బీసీ ఓటర్లు ప్రస్తుతం 14,211 మంది మాత్రమే ఉన్నట్లు చూపి, ఏకంగా 130 మంది తగ్గారని పేర్కొనడం అధికారుల అపారదర్శకతకు నిదర్శనమన్నారు.

​రాజ్యాంగబద్ధ హక్కులకు తీవ్ర విఘాతం

జనాభా పెరిగినప్పటికీ బీసీ ఓటర్ల సంఖ్యను తగ్గించడం, ఎస్సీ ఓటర్ల సంఖ్యను జనాభా నిష్పత్తికి తగినట్లుగా పెంచకపోవడం వల్ల రాబోయే ఎన్నికల్లో ఆయా వర్గాలు రాజ్యాంగం కల్పించిన రాజకీయ రిజర్వేషన్ హక్కులను దారుణంగా కోల్పోయే ప్రమాదం ఏర్పడిందని ఆందోళన వ్యక్తం చేశారు. డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ జిల్లాలో బీసీ సామాజికవర్గానికి చెందిన మంత్రి, ముగ్గురు ఎస్సీ శాసనసభ్యులు ఉన్నప్పటికీ, మున్సిపల్ రిజర్వేషన్లు, ఓటర్ల జాబితా వ్యవహారంలో అధికారులు వ్యవహరిస్తున్న తీరుపై మౌనం వహించడం శోచనీయమన్నారు. ప్రజాప్రతినిధులు వెంటనే స్పందించి, ఎస్సీ, బీసీ వర్గాలకు జనాభా నిష్పత్తి ప్రకారం దక్కాల్సిన చట్టబద్ధమైన రిజర్వేషన్ హక్కులు లభించేలా అధికారులపై ఒత్తిడి తెచ్చి న్యాయం చేయాలని కోరారు.

​రీ-సర్వే చేసి న్యాయం చేయాలి

ప్రస్తుతం ప్రచురించిన అక్రమ ఓటర్ల ముసాయిదా, రిజర్వేషన్ల ప్రక్రియను తక్షణమే నిలిపివేయాలని VCK నాయకులు డిమాండ్ చేశారు. జీవో 1113 నిబంధనల ప్రకారం మున్సిపల్ సిబ్బందితో క్షేత్రస్థాయిలో నిజాయితీగా, పారదర్శకమైన రీ-సర్వే నిర్వహించాలని కోరారు. గణాంకాల తారుమారుపై సమగ్ర విచారణ జరిపి బాధ్యులైన అధికారులపై కఠిన చర్యలు తీసుకోవాలని, బడుగు, బలహీన వర్గాలు తమ రాజ్యాంగబద్ధమైన రిజర్వేషన్ హక్కులను కోల్పోకుండా పక్కా గణాంకాలతో సరైన రీతిలో రిజర్వేషన్లు ఖరారు చేయాలని బొంతు రమణ కోరారు. ఈ కార్యక్రమంలో.... వి సి కే పార్టీ జిల్లా అధ్యక్షులు మెండి డేవిడ్ అంబేద్కర్, జల్లి అజయ్ పాల్గొన్నారు

.

18/09/2026

చీకటి గోపి మృతి పై న్యాయ విచారణ కోరుతూ మహాధర్నా

తాడికొండ పోలీసుల చిత్రహింసల కారణంగా చీకటి గోపి మృతి చెందిన ఘటనపై న్యాయ విచారణ జరిపించాలని డిమాండ్ చేస్తూ గుంటూరు కలెక్టర్ కార్యాలయం ఎదుట నిర్వహించిన మహాధర్నా జరిగింది.

CPI, సీపీఎం, VCK, MRPS, మాల మహానాడు, భీమ్ సేన సేవాదళ్, దళిత బహుజన ఫ్రంట్ తదితర సంఘాల సమిష్టి ఆధ్వర్యంలో ఈ మహాధర్నా నిర్వహించారు.

ఈ సందర్భంగా ధర్నా వేదిక వద్ద జరిగిన ప్రెస్‌మీట్‌లో MRPS నాయకులు మందా కృష్ణ మాదిగ, నీలం నాగేంద్రం, సీపీఎం రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాస్, కొరివి వినయ్ కుమార్ తదితరులతో కలిసి VCK పార్టీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షులు ఎన్.జె. విద్యాసాగర్ గారు మాట్లాడారు.

చీకటి గోపి మృతి ఘటనపై సమగ్ర న్యాయ విచారణ జరిపించి, బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని నాయకులు డిమాండ్ చేశారు.
#చీకటి_గోపి
#న్యాయ_విచారణ
#మహాధర్నా
#గుంటూరు











#మాల_మహానాడు
#భీమ్_సేన_సేవాదళ్
#దళిత_బహుజన_ఫ్రంట్

Address

Nagalapuram

Alerts

Be the first to know and let us send you an email when VCK it wing-Andhra pradesh posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Shortcuts

Share