09/12/2025
రాష్ట్రా ఎన్నికల కమిషనర్ రాణి కుముదిని హైదరాబాద్ నుండి అన్ని జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలు, గ్రామపంచాయతీ ఎన్నికల పరిశీలకులతో గ్రామపంచాయతీ ఎన్నికలపై వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.
👉నల్గొండ జిల్లాలో రెండు డివిజన్లలోని 14 మండలాలలో మొదటి విడత గ్రామపంచాయతీ ఎన్నికలను నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసుకుని సిద్ధంగా ఉన్నట్లు జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రాణి కుమిదినికి తెలిపారు. జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ మాట్లాడుతూ మొదటి విడత గ్రామపంచాయతీ
👉ఎన్నికల నిర్వహించే పోలింగ్ కేంద్రాల్లో అవసరమైన బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగిందని, ఎక్కడ ఎలాంటి ఇబ్బంది కలగకుండా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు.
👉రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రాణి కుమిదిని మాట్లాడుతూ పోలింగ్ రోజున 9, 11,1 గంటకు పంపించే పోలింగ్ శాతాన్ని సనైన సమయంలో పంపించేందుకు బృందాలను ఏర్పాటు చేసుకోవాలని ఫలితాలను. ఫలితాలను ఎప్పటికప్పుడు టీ పోల్ లో ఏర్పాటు చేయాలని సూచించారు.
