జననీ ఫౌండేషన్

జననీ ఫౌండేషన్

Share

JananiFoundation
Thipparthi
Janani
Janani Foundation
HelpingHands
HelpsTogether
జననీ ఫౌ?

Photos from జననీ ఫౌండేషన్'s post 12/06/2025

కూలిన విమానం.. ఒకే కుటుంబంలో ఐదుగురు మృతి

అహ్మదాబాద్లో జరిగిన ఫ్లైట్ క్రాష్ లో చాలా మంది చనిపోయారు.. ఒక్కరు మాత్రమే ప్రాణాలతో బయటపడ్డారు. మృతుల్లో ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు ఉన్నారు. రాజస్థాన్ బన్స్ వారా నుంచి లండన్కు వెళ్తున్న ప్రతీక్ జోషీ- డాక్టర్ కోమీ వ్యాస్ దంపతులు, వారి ముగ్గురు చిన్నారులు ఉన్నారు. విమానంలో వాళ్లు నవ్వుతూ తీసుకున్న ఆఖరి సెల్ఫీ అందరి కళ్లు చెమ్మగిల్లేలా చేస్తోంది.

18/11/2024

కేరళలో అంబులెన్స్‌కి దారి ఇవ్వనందుకు ఓ కారు యజమానికి రూ.2.5 లక్షల జరిమానా విధించి, అతని లైసెన్స్ రద్దు చేసిన పోలీసులు..

14/11/2024

ఈ వీడియో తీసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. సరైన టైంలో సరైన వీడియో తీశారు... ఈ వీడియో ప్రతి ఒక్క ఇంటికి, ప్రతి ఒక్క వ్యక్తికి చేరేవరకు సెండ్ చేయండి...
ఇప్పుడు తెలంగాణ ప్రజలకు ఈ వీడియో చాలా అవసరం. ✍️🙏🙏🙏

24/10/2024

అత్యవసర సమయంలో రక్తదానం చేసి ప్రాణాన్ని కాపాడిన జననీ సైనికులు🙏

మాడుగులపల్లి మండలం దాచారం గ్రామానికి చెందిన మల్లయ్య కాలుకు ప్రమాదవశాత్తు తీవ్ర గాయమైంది. వెంటనే నార్కట్పల్లి కామినేని ఆసుపత్రికి తరలించారు. కానీ అతనికి శస్త్ర చికిత్స చేయాలంటే అత్యవసరంగా 4 యూనిట్ల రక్తం కావాలని వైద్యులు తెలిపారు..

దీంతో దిక్కుతోచని బాధితుని కుటుంబ సభ్యులు జననీ ఫౌండేషన్ చైర్మన్ బద్దం సుధీర్ గారిని సంప్రదించి సహాయం చేయాలని కోరారు.. ఆయన వెంటనే స్పందించి జననీ సైనికులు కిన్నెర విజ్ఞాన్, వంగూరి బన్నీ, పల్లె సంతోష్, దేవరకొండ భాను లను ఆసుపత్రికి వెళ్లి రక్తదానం చేయాలని సూచించారు. దీంతో వారు హుటాహుటిన ఆసుపత్రికి వెళ్లి రక్తదానం చేసి ఒక నిండు ప్రాణాన్ని కాపాడారు...

ప్రాణాపాయ స్థితిలో ఉన్న వ్యక్తికి రక్తదానం చేసి ప్రాణాన్ని నిలబెట్టిన జనని ఫౌండేషన్ సైనికుల రుణం జన్మలో మర్చిపోలేము అని బాధిత కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలియజేశారు.

07/09/2024

వాస్తు ప్రకారం ఇల్లు కట్టిన వాడిది.
వాస్తు లేకుండా కట్టిన వాడిది,
అసలు వాస్తు చెప్పిన వాడిది... అందరి ఇల్లు కొట్టుకు పోయాయి.
ప్రకృతిని కాపాడుకోవడమే అసలైన వాస్తు.

05/09/2024

నల్లగొండ జిల్లా :-

• చిట్యాల మండలం వనిపాకల గ్రామంలో వ్యవసాయ భూమిలో సాంకేతిక కారణాలతో అత్యవసర లాండింగ్ ఐన ఆర్మీ హెలికాఫ్టర్..

• విజయవాడ వరదబాధితులను కాపాడి తిరిగి హకీమ్ పేటకు వెలున్న రెండు హెలికాఫ్టర్ లోఒక దానికి సాంకేతిక లోపం

• వ్యవసాయ పొలంలో దించిన పైలెట్.

• సాంకేతిక కారణాలతో ఆగిపోయిన ఆర్మీ హెలిక్యాప్టెర్ ను రిపేర్ చేయ్యడానికి హకీమ్ పెట్ నుంచి వచ్చిన మరో హెలికాఫ్టర్ లో వచ్చిన సాంకేతిక బృందం సభ్యులు.ఫోటో అద్భుతం.,

31/08/2024

వణికించిన విషాదంలో కదిలించే ప్రేమకథ


26/08/2024

విషాద ఘటన 🥲

మస్కట్ నుంచి భారత దేశం తిరిగి వస్తూ ..✈️

విజయవాడ నుంచి తన స్వగ్రామం “ #కోరుమామిడి” కి వెల్లే మార్గమధ్యంలో బస్సులో తను గుండె నొప్పితో మరణించడం జరిగింది..💔

కోటి ఆశలతో…… పొట్ట కూటి కోసం విదేశాలకు వెళ్లి పిల్లల కోసం కుటుంబం కోసం ఎంతో కష్టపడి తిరిగి మళ్లీ స్వదేశానికి వస్తున్న సమయంలో ఆమెకు అకస్మాత్తుగా గుండెపోటు రావడంతో విజయవాడ మార్గమధ్యంలో బస్సులో తుది శ్వాస విడిచారు.

నిద్రపోతున్నట్టే ఉంది అసలు 😭😭😭 చాలా విషాదకరమైన సంఘటన 😩

పశ్చిమగోదావరి జిల్లా నిడదవోలు యర్నగూడెం మధ్య కోరుమామిడి అనే ఊరు స్వగ్రామం 😥😥😥

27/06/2024

నేను చనిపోయాక ఆస్తి మొత్తం ట్రస్ట్ కి, పేద ప్రజలకు మాత్రమే చెందాలి..
1 పైసా కూడా నా కుటుంబ సభ్యులు తీసుకోరు...
మీరు నా సినిమా టిక్కెట్లు కొనడం వల్లే నేను సూపర్ స్టార్ ని అయ్యాను...
ఈ రోజు ఇంత డబ్బు,హోదా సంపాదించాను...
అందుకే అవి మీకే చెందాలి అని ప్రకటించిన రజినీకాంత్..... 👏👏👏
మహనీయులు అంటే మీలా ఉంటారు 🙏🥰

16/06/2024

ఈ దృశ్యం... అందరినీ కదిలించింది.రాతి గుండెలను సైతం కరిగించింది.

ఆమె విజయం.. ఆ కన్నతండ్రికి గర్వకారణమైంది.తెలంగాణ పోలీస్‌ అకాడెమీకి వచ్చిన ట్రైనీ IAS కూతురైన ఉమా హారతికి.. ఎస్పీ ర్యాంక్‌ ఆఫీసరైన తండ్రి వెంకటేశ్వర్లు సెల్యూట్‌ కొట్టారు...

కొన్ని స్పూర్తిదాయకమైన, సకారాత్మక దృశ్యాలు....ఎందరికో ఆదర్శం...💐🙏

06/06/2024

*💥సికింద్రాబాద్‌ కంటోన్మెంట్‌ క్లబ్‌ వద్ద ప్రమాదం🚖*

సిగ్నల్‌ పడ్డప్పుడు ఆగే ఓపిక కూడా కొందరు వాహనదారులకు లేకుండా పోతుండటం బాధాకరం. తొందరగా వెళ్లాలనే ఆత్రమే ఇలాంటి రోడ్డు ప్రమాదాలకు కారణం. ఒక్క నిమిషం ఆగితే కొంపలేం మునిగిపోవు. ప్రపంచమేం ఆగిపోదు.గుర్తుపెట్టుకోండి.. ఇలా సిగ్నల్‌ బ్రేక్‌ చేయడం ప్రమాదకరం. రోడ్డు ప్రమాదాల నివారణ అనేది ప్రతి ఒక్కరి బాధ్యత. అందుకు రహదారులపై విధిగా ట్రాఫిక్‌ నిబంధనలు పాటించాలి. ఇలా నిర్లక్ష్యపు డ్రైవింగ్‌ చేసి రోడ్డు ప్రమాదాలకు కారణమై.. బాధిత కుటుంబాలకు తీరని శోకాన్ని మిగల్చకండి.సికింద్రాబాద్‌ కంటోన్మెంట్‌ క్లబ్‌ వద్ద జరిగిందీ ప్రమాదం.

02/05/2024

11111111111111
22222222222222

నారాయణ ప్రభంజనం.....
శ్రీ చైతన్య ఘన విజయం...

మావే అన్ని ర్యాంకులు... రికార్డులు మొత్తం బద్దలు...

ఉత్తమ బోధనకు మేమే బ్రాండ్ అంబాసిడర్....

ఇది విన్నారా......రిజల్ట్ వచ్చిన క్షణానికే ఈ నినాదాలు ఆల్ ఛానెల్స్ లో మోత మోగుతాయి.....వినలేక చెవులు పగిలిపోతాయ్. సరే ఇప్పుడు అసలు మ్యాటర్ కొద్దాం.కాసేపు రియాల్టీ గమనిద్దాం.ఏ కార్పోరేట్ విద్యా సంస్థలో నైనా సీటు కావాలన్నా, ఫీజు తగ్గియాలన్నా పైరవీ చేయాలి.ఇవన్నీ అయ్యాకా...పిల్లల్ని రుద్ది రుద్దీ వదిలేయగా వచ్చిన ర్యాంకుల తో పెద్ద డబ్బానే కొట్టుకుంటుంటాయి కొన్ని కార్పొరేట్ విద్యా సంస్థలు. సరే కాసేపు మానవత్వం అనే పదం పక్కన పెడదాం.ఎందుకంటే కార్పొరేట్ విద్యా సంస్థలను కూడా తప్పు పట్టొద్దు.ఎందుకంటే అది వారి బిజినెస్.

కానీ ఏ సార్థమూ,ఎలాంటి ప్రచారమూ చేసుకోకుండా ర్యాంకులు సాధించగలిగే ఓ సంస్థ ఉందంటే మీరు నమ్మగలరా.వినడానికి ఆశ్చర్యంగానే ఉన్నా మీరు విన్నదే నిజం.ఎందుకంటే వాళ్లకు డబ్బా కొట్టుకోవడం తెలియదు.ప్రకటన లకు అయ్యే లక్షల ఖర్చుతో కొంత మంది పేద పిల్లలను చదివించవచ్చు అనేది వారి కాన్సెప్ట్.

ఇక ఇక్కడ ఫోటోలో కనిపిస్తున్న వ్యక్తి పేరు గుమ్మి రాంరెడ్డి,స్వగ్రామం చిట్యాల, జిల్లా నల్గొండ.ప్రస్తుతం హైద్రాబాద్ లో ARK అనే స్వచ్ఛంద సంస్థను నడుస్తున్నారు రాంరెడ్డి.పదవ తరగతి ఉత్తీర్ణులు అయిన పేద విద్యార్దులకు ఉచిత విద్య నందించడం సంస్థ ముఖ్య ఉద్దేశం. రైతు కుటుంబంలో జన్మించిన రాంరెడ్డి,చిన్న నాటి కష్ట నష్టాల నుంచి ఓ ఆలోచన పుట్టుకొచ్చింది.ఆ ఆలోచన లక్ష్యం గా మారింది.పేద విద్యార్థులను ఉన్నత స్థాయి లో చూడాలన్నదే ఆయన అంతిమ మార్గమై పోయింది..ఆ ఆలోచనకు పదును పెట్టారు రాంరెడ్డి.అనుకున్న విజయం సాధించ గలుగుతున్నారు.ఇయర్ అకాడమీ లో సుమారుగా 100 మంది విద్యార్థుల చదువుకు ఆర్ధిక సహాయం అందిస్తున్నారు.కేవలం ప్రభుత్వ పాఠశాలలో చదివే విద్యార్థులకు మాత్రమే ఆయన అండగా నిలబడుతున్నారు.ఇలా పేద విద్యార్థి, విద్యార్ధినిల ప్రతిభా నైపుణ్యాన్ని వెలికి తీసి వారిని ఉత్తీర్ణులు గా తీర్చిదిద్దుతున్నరు.అందుకు నిదర్శనమే తాజా ఘటన.

ఆఫ్షన్ జబీన్. మైనార్టీ వర్గానికి చెందిన ఓ నిరుపేద విద్యార్థిని. ఈమె ఇంటర్ చదువుకు ఆర్ధిక భరోసా కల్పించారు ARK ఫౌండేషన్ CMD గుమ్మి రాంరెడ్డి. ఇప్పుడీ అమ్మాయి 438/440 మార్కులతో స్టేట్ ఫస్ట్ ర్యాంక్ సాధించింది.మరో పేద విద్యార్థి అఖిల్ కూడా 461/470 మార్కులతో చక్కటి ర్యాంకు సాధించి ఘనత సృష్టించారు.కార్పొరేట్ చదువులు కాదు కాబట్టి ఈ పిల్లల ర్యాంకులు టీవీలో మోగలేదు. ఇది కేవలం ఒక ఉదాహరణ మాత్రమే.ఎంతో మంది పేద విద్యార్దులకు,సరస్వతి పుత్రులకు గుమ్మి రాంరెడ్డి విద్యను అందించే మెడిసిన్ అయ్యారు.

కోటీశ్వరులు కోట్లలో ఉండురు గాక.ఉన్న డబ్బును ఇన్వెస్ట్ మెంట్ చేసి రెట్టింపు డబ్బు సంపాదించాలనే ఆలోచన ఉన్న ఈ రోజుల్లో....వచ్చిన సంపాదన ను పేద విద్యార్థులకు ఖర్చు పెడుతున్న గుమ్మి రాంరెడ్డి ఎందరికో ఆదర్శంగా నిలిచారు.కార్పొరేట్ విద్యా సంస్థలకు కనువిప్పు కలిగిస్తున్నారు.మానవ సంబంధాలు మనీ బందాలుగా మారుతున్న సమాజానికి ఉచిత విద్య ద్వారా చక్కటి మెసేజ్ అందిస్తున్నారు.

శభాష్ రాంరెడ్డి గారు 🌹....

Source: కిరణ్ రెడ్డి వరకాంతం.(ఐన్యూస్ జర్నలిస్ట్)

Want your business to be the top-listed Government Service in Nalgonda?

Click here to claim your Sponsored Listing.

Location

Category

Telephone

Website

Address


Nalgonda