Subhash Peram

Subhash Peram

Share

Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from Subhash Peram, Social service, Nalgonda.

04/09/2024

ప్రోటోకాల్ వివాదంపై ఎమ్మెల్యే వేముల వీరేశం సీరియస్

బుధవారం మినిస్టర్స్ క్వాటర్స్ లో స్పీకర్ గడ్డం ప్రసాద్ ను కలిసిన కాంగ్రెస్ ఎమ్మెల్యేలు వేముల వీరేశం, కవ్వంపల్లి సత్యనారాయణ, బత్తుల లక్ష్మారెడ్డి.పోలీస్ అధికారులు ఎమ్మెల్యేల పట్ల ప్రోటోకాల్ పాటించడం లేదని ఫిర్యాదు.
ఆగష్టు 30న భువనగిరి పార్లమెంట్ నియోజకవర్గంలో జరిగిన ఇరిగేషన్ సమీక్ష సమావేశం సందర్బంగా.. మంత్రుల కోసం ఏర్పాటు చేసిన హెలిప్యాడ్ వద్దకు ఎమ్మెల్యే వీరేశం ను వెళ్ళనివ్వని పోలీసులు పోలీసుల తీరుపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసిన ఎమ్మెల్యే వీరేశం.. వేములకు మద్దతుగా వచ్చిన ఎమ్మెల్యేలు కవ్వంపల్లి, బిఎల్ఆర్..

Photos from Subhash Peram's post 02/09/2024

గణేష్ నవరాత్రి ఉత్సవాలు శాంతియుత వాతావరణంలో నిర్వహించుకోవాలి
పట్టణ శాంతి సంఘం సభ్యులతో సమావేశం
కె. శివరాం రెడ్డి,నల్లగొండ డీఎస్పీ

రానున్న గణేష్ నవరాత్రి ఉత్సవాల సందర్బంగా జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ ఐపిఎస్ ఆదేశానుసారం, నల్లగొండ డీఎస్పీ శివరాం రెడ్డి ఆధ్వర్యంలో సోమవారం జిల్లా పోలీసు కార్యాలయంలో పట్టణ శాంతి సంఘం సభ్యులతో సమావేశం నిర్వహించారు.ఈ కార్యక్రమంలో డీఎస్పీ మాట్లాడుతూ గణేష్ ఉత్సవాలు శాంతియుత వాతావరణంలో నిర్వహించుటకు గాను అన్ని వర్గాల ప్రజలు సహకరించాలని,పట్టణంలో ఏ విధమైన అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీస్ యంత్రాంగం ముందస్తు పటిష్ఠ భద్రతా చర్యలు ఏర్పాట్లు చేస్తున్నామని అన్నారు. మండప నిర్వాహకులు విగ్రహ నిర్వహణకు అవసరమైన అన్ని శాఖల అనుమతులు తీసుకోవాలని కోరారు. వినాయక విగ్రహాల ఏర్పాటు చేయుటకు నిర్వాహకులు https://policeportal.tspolice.gov.in/index.htm నందు వివరాలు పొందుపరిచి అప్లికేషన్‌ను సంబంధిత పోలీస్ స్టేషన్‌లో అందజేయాలని సూచించారు.

గణేష్ మండప నిర్వాహకులు పాటించవలసిన నిబంధనలు:

మండపం ఏర్పాటు చేసే స్థలం కోసం సంబంధిత శాఖల వారితో అనుమతులు తీసుకోవాలి.
గణేష్ మండపాల కొరకు విద్యుత్ శాఖ వారి అనుమతితోనే కనెక్షన్ తీసుకోవాలి.
* షార్ట్ సర్క్యూట్ జరుగకుండా మంచి నాణ్యత గల వైరు ఉపయోగించాలి.
* గణేష్ మండపాల నిర్వాహకులు వారి మండపాల కమిటీ వివరాలు, మండపాల బాధ్యత వహించే వారి వివరాలు, ఫోన్ నెంబర్లను మండపంలో ఏర్పాటు చేయాలి.
* గణేష్ మండపాలను ఎవరికి ట్రాఫిక్ ఇబ్బంది లేకుండా ఏర్పాటు చేసుకోవాలి.
* అధిక శబ్ద కాలుష్యం చేసే స్పీకర్లను ఏర్పాటు చేయరాదు.
* మండపాల వద్ద రాత్రి 10 గంటల వరకు మాత్రమే స్పీకర్లను వినియోగించాలి.
* గణేష్ ప్రతిమలు కూర్చుండబెట్టే ప్రదేశంలో మంచి నాణ్యత గల షెడ్ ఏర్పాటు చేయవలెను.
* గణేష్ మండపంలో 24 గంటలు ఒక వాలంటీర్ ఉండే విధంగా నిర్వహకులు తగు చర్యలు తీసుకోవాలి.
* గణేష్ మండపాలకు వచ్చే భక్తుల సందర్శన దృష్టిలో ఉంచుకుని, మండపాలలో భక్తుల కోసం క్యూలైన్లను ఏర్పాటు చేయడంతో పాటు వాలంటీర్లను నియమించాలి.
* గణేష్ మండపాల వద్ద మద్యం సేవించడం, పేకాట అడటం, అసభ్యకరమైన నృత్యాల ఏర్పాటు, అన్యమతస్తులను కించపరిచే విధంగా ప్రసంగాలు చేయడం, పాటలు పాడటంపై పూర్తిగా నిషేధం.
* విధిగా పాయింట్ పుస్తకం ఏర్పాటు చేసుకోవాలి, పోలీసు అధికారుల తనిఖీకి వచ్చినప్పుడు అందులో వ్రాసి సంతకం చేస్తారు.
* మండపాల్లో ఏదైనా అనుమానాస్పదంగా బ్యాగులు, ప్లాస్టిక్ సంచులు, వస్తువులు లేదా వ్యక్తులు కనిపించినట్లయితే తక్షణమే డయల్ 100 గాని లేదా స్థానిక పోలీసులకు సమాచారం అందించాలి.
* సామాజిక మాధ్యమాలలో వచ్చే ఎలాంటి రూమర్స్, వదంతులను నమ్మకూడదు అని ఎవ్వరికైనా ఎలాంటి సందేహాలు ఉన్నా సంబంధిత పోలీసు వారికి లేదా డయల్ 100 కి సమాచారం అందించాలి.మున్సిపల్ చైర్మన్ బుర్రి శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ వినాయక చవితి ఉత్సవాలకు మున్సిపాలిటీ తరఫున అన్ని వసతులు కల్పిస్తూ నవరాత్రి ఉత్సవాలలో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూసుకుంటామని తెలియజేశారు.ఈ కార్యక్రమంలో పలువురు పీస్ కమిటీ సభ్యులు, కౌన్సిలర్లు, ప్రజా ప్రతినిధులు వినాయక చవితి ఉత్సవాలను ప్రశాంతంగా జరుపుటకు పలు రకాల చూచనలు చెప్పారు.ఈ కార్యక్రమంలో వన్ టౌన్ సిఐ రాజశేఖర్ రెడ్డి టూ టౌన్ సిఐ డేనియల్ ట్రాఫిక్ సిఐ క్రాంతికుమార్ ఎస్ఐలు సందీప్ శంకర్ సురేష్ మానస, వైస్ చైర్మన్ అబ్బగోని రమేష్, పీస్ కమిటీ సెక్రటరీ , గోలి మధుసూదన్ రెడ్డి, గణేష్ ఉత్సవ సమితి అధ్యక్షుడు కర్నాటి విజయ్ కుమార్, గుమ్మల మోహన్ రెడ్డి, నూకల నరసింహారెడ్డి, నాగం వర్షిత్ రెడ్డి, కలీం, డా.ఖాన్ మరియు కౌన్సిలర్లు ఖయ్యూం బేగ్, సమద్ ఇంతియాజ్, అభిమన్యు శ్రీను, వేణుగోపాల్ రెడ్డి, జమాల్ ఖాద్రి తదితరులు పాల్గొన్నారు.

30/08/2024
30/08/2024

సాగర్ ఎడమ కాలువ వేములపల్లి బ్రిడ్జి వద్ద ఓ మహిళ సెల్ఫీ దిగుతూ కాలుజారి నీటిలో పడగా అటు వైపు వెళుతున్న గజలపురం గ్రామానికి చెందిన యువకులు జక్క నాగయ్య, జక్కా నాగరాజు, మరియు తదితరులు గమనించి వెంటనే నీటిలో దూకి తాడు సాయంతో ఆమెను సురక్షితంగా ఒడ్డుకు చేర్చి కాపాడారు

09/08/2024

Today news

05/08/2024
27/01/2024

నేను రాను బిడ్డో సర్కారు దవాఖాన కి అనే విధంగా ఉంది నల్గొండ గవర్నమెంట్ ఆసుపత్రి తీరు జబ్బు చేసి హాస్పిటల్ కి చూపించుకుందమని వెలితే పట్ట పగలే చుక్కలు చూపిస్తున్నారు నల్లగొండ మండలం పానగల్లు కు చెందిన తగుళ్ల పాపయ్య అనే వ్యక్తి చర్మానికి సంబంధించిన సమస్యతో హాస్పిటల్ కి వెళ్ళగా బయటి రోగుల పేరు నమోదు చేసే విభాగం దగ్గర పేరు నమోదు చేసే ఉద్యోగి అత్యుత్సాహంతో బూతులు తిట్టారు దీంతో చేసేది లేక బాధితుడు మరో కౌంటర్లో పేరు నమోదు చేసుకున్నాడు తనకి తగిన న్యాయం చేయాలని ఆసుపత్రి అధికారులను కోరుతున్నడు

13/01/2024

లయన్స్ క్లబ్ నల్గొండ స్నేహ వారి ఆధ్వర్యంలో లైన్స్ క్లబ్ ఆఫ్ ఇంటర్నేష్నల్ ఫౌండర్ మెల్విన్ జోన్స్ పుట్టినరోజు సందర్భంగా లైన్స్ క్లబ్ మెంబర్స్ ఎలిజబెత్, పుష్పలత,విజయలక్ష్మి ఎస్టి కాలనీ శేషమ్మ గూడెం లోని వృద్ధులకు శనివారం పండ్లు స్వెటర్స్ పంపిణీ చేశారు

Photos from Subhash Peram's post 02/01/2024

మంగళవారం రాత్రి నల్గొండ లోని సావర్కర్ నగర్ పెట్రోల్ బంక్ లో పెట్రోల్ కోసం ప్రజలు భారీ లైన్లు కట్టారు రేపటి నుండి పెట్రోల్ బంక్ లు బంద్ అనే తప్పుడు సమాచారంతో ప్రజలు పెట్రోల్ కోసం ఇలా లైన్లో నిలుచున్నారు

28/12/2023

యూత్ ఫర్ సేవా ఆధ్వర్యంలో "చిగురు" పోస్టర్ ఆవిష్కరణ

యూత్ ఫర్ సేవా నల్లగొండ ఆధ్వర్యంలో ఫిబ్రవరి 4న నిర్వహించబోయే చిగురు కార్యక్రమ వాల్ పోస్టర్ ను గురువారం నల్గొండ పట్టణంలోని కోమటిరెడ్డి ప్రతీక్ మెమోరియల్ ప్రభుత్వ బాలుర & ఒకేషనల్ జూనియర్ కళాశాలలో జిల్లా ఇంటర్మీడియట్ విద్యాధికారి దస్రూనాయక్, కోమటిరెడ్డి ప్రతీక్ ఫౌండేషన్ సీఈఓ గోనారెడ్డి , కళాశాల ప్రిన్సిపాల్ నరేందర్ ఆవిష్కరించారు. అనంతరం దస్రూ నాయక్ మాట్లాడుతూ యూత్ ఫర్ సేవా సంస్థ చిగురు కార్యక్రమంలో 30 ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు నిర్వహించబోయే సైన్స్ ల్యాబ్, డ్రాయింగ్, యోగా, సాంస్కృతిక కార్యక్రమాలు, క్రీడా పోటీలు విద్యార్థులకు ఎంతో దోహదపడతాయని ఆయన తెలిపారు. కార్యక్రమంలో యూత్ ఫర్ సేవా అడ్వైజరీ బోర్డు మెంబర్ వెంకట్ రెడ్డి గారు, కోఆర్డినేటర్స్ స్వామి, వెంకట్, సైదులు, తిరుపతి, వలంటీర్లు, అభ్యసిక ట్యూటర్స్ పాల్గొన్నారు.

Want your business to be the top-listed Government Service in Nalgonda?

Click here to claim your Sponsored Listing.

Location

Category

Telephone

Website

Address


Nalgonda
508001