22/09/2026
గణేష్ నిమజ్జన శోభ యాత్ర ప్రశాంత వాతావరణములో నిర్వహించుకోవాలి -- జిల్లా యస్.పి శ్రీ శరత్ చంద్ర పవార్ ఐపిఎస్.
-- నిఘా నీడలో శోభాయాత్ర నిరంతర పర్యవేక్షణ...
--శోభ యాత్ర సందర్భంగా పట్టణ కేంద్రంలో ట్రాఫిక్ డైవర్షన్...
--డి.జేలకు ఎట్టి పరిస్థితిలో అనుమతి లేదు...
--విగ్రహాల ఎత్తును బట్టి ప్రత్యేక నిమజ్జన మార్గాలు...
--1000 మంది సిబ్బందితో శోభాయాత్రకు పటిష్ఠ బందోబస్తు...
--జిల్లా వ్యాప్తంగా 6184 విగ్రహాల ఏర్పాటు...
సెయింట్ ఆల్ఫోన్సస్ స్కూల్ వద్ద ఫుట్ ఓవర్ బ్రిడ్జి (FOB) ఉన్నందున, 10 అడుగుల కంటే ఎక్కువ ఎత్తు ఉన్న గణేష్ విగ్రహాలను ఈ సంవత్సరం 14వ మైలు, హాలియా వైపు అనుమతించబడదు.
🔹10 అడుగుల ఎత్తు లోపు ఉన్న విగ్రహాలు :
బతుకమ్మ కుంట / వల్లభరావు చెరువులో నిమజ్జనం చేసుకోవాలి.
🔹10 అడుగుల కంటే ఎక్కువ ఎత్తు ఉన్న విగ్రహాలు:
క్లాక్ టవర్ – రామగిరి – పానగల్ ఫ్లైఓవర్ – తిప్పర్తి – వేములపల్లి మార్గం ద్వారా వేములపల్లి కెనాల్ వద్ద ఏర్పాటు చేసిన నిమజ్జన ప్రదేశంలో నిమజ్జనం చేసుకోవాలి..
జిల్లాలోని ప్రధాన నిమజ్జన ప్రాంతాలైన నల్గొండ పట్టణంలోని వల్లభరావు చెర్వు,భీమ సముద్రం,14 వ మైలు రాయి,వేములపల్లి సాగర్ కెనాల్,మిర్యాలగూడ వాడపల్లి, నాగార్జునసాగర్,ఎడమ కాలువ కొత్త బ్రిడ్జి దయ్యాలగండి, అడవిదేవులపల్లి,దేవరకొండ కొండబీమనపల్లి,డిండి, పెద్ద మునిగల్ సాగర్ బ్యాక్ వాటర్ వద్ద పోలీసు శాఖ భారీ బందోబస్తు ఏర్పాటు చేసి,పోలీసు పికెట్లు ప్లడ్ లైట్లు,క్రేన్లు, ఏర్పాటు చేశామని,నిమజ్జనం జరిగే ప్రాంతాల్లో గజ ఈతగాళ్లను అందుబాటులో ఉన్నారు. ఎక్కడా ఎలాంటి సంఘటనలు జరగకుండా చర్యలు తీసుకోవడంతో పాటు జిల్లాలో ఏ ప్రాంతానికి వెళ్లినా ఐదు నుంచి పది నిమిషాల వ్యవధిలో పెట్రో వాహనాలు, బ్లూకోట్స్, సంబంధిత పోలీసు అధికారులు అప్రమత్తమయ్యేలా ఆన్లైన్ విధానంలో భద్రతను పర్యవేక్షిస్తున్నారు.
నిమజ్జనం రోజున జిల్లా కేంద్రంలోని ప్రజలకు,వాహనదారులకు శోభ యాత్ర సందర్భంగా ట్రాఫిక్ అంతరాయం కలగకుండా శోభ యాత్ర నిర్వహించే మార్గం పూల్ చౌరస్తా,1టౌన్ పోలీస్, క్లాక్ టవర్ , పుల్లా రెడ్డి సెంటర్, రామాలయం, చందమామ టవర్, పానగల్ గుండా ట్రాఫిక్ డైవర్షన్ ఏర్పాటు చేయడం జరిగింది. వినాయక ఉత్సవ కమిటీ నిర్వాహకులు శోభ యాత్రకు నిర్దేశించిన మార్గం గుండా వెళ్తూ ట్రాఫిక్ అంతరాయం కలగకుండా పోలీసు వారికి సహకరించాలి.
23 వ తేదీ బుధవారం రోజున బారి వాహనాలు వెళ్లే మార్గాలు.
* హలియ - దేవరకొండ నుంచే హైదరాబాద్ కు వెళ్ళే వాహనదారులు JM గౌడ్ X రోడ్డు, ఈద్గా వయా మునుగోడు బై పాస్ గిరిక బావి గూడెం, ఐటీ టవర్ మీదిగా మళ్ళించనైనది.
* మిర్యాలగూడ నుంచి హైద్రాబాద్ వెళ్లే వాహనాలు తిప్పర్తి, నకేరేకల్,నార్కట్ పల్లి మీదిగా హైద్రాబాద్ వైపు మళ్లించనైనది.
* హైద్రాబాద్ నుంచి మిర్యాలగూడ వెళ్లే వాహనాలు నార్కట్పల్లి నకేరేకల్ వయా తిప్పర్తి మీదిగా మిర్యాలగూడ మళ్లించనైనది.
* హైదరాబాద్ నుంచి హలియ - దేవరకొండ కు వెళ్ళే వాహనదారులు ఐటీ హబ్ మునుగోడు బై పాస్,ఈద్గా వయా,JM గౌడ్ X రోడ్డు మీదిగా మళ్ళించనైనది
* దేవరకొండ నుంచి మిర్యాలగూడ వెళ్ళే వాహనదారులు డి.ఈ.ఓ ఆఫీసు నుంచి మళ్లించడం జరిగింది.
*ప్రజలు పాటించాల్సిన ముఖ్య నిబంధనలు:
* డీజేలకు ఎట్టి పరిస్థితుల్లోనూ అనుమతి లేదు.
* బాణాసంచా కాల్చరాదు.
* మద్యం సేవించి వాహనాలు నడపరాదు; ఆల్కహాల్ మీటర్ ద్వారా తనిఖీలు నిర్వహిస్తారు.
* విగ్రహాలను తరలించే వాహనాలను ముందుగానే తనిఖీ చేయించుకోవాలి.
* నిమజ్జన ప్రాంతాల్లో చిన్నపిల్లలను అనుమతించరాదు.
* మహిళల పట్ల అసభ్యంగా ప్రవర్తించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటారు; షీ టీమ్స్ నిఘా కొనసాగుతుంది.
* చిన్నపిల్లలు తప్పిపోకుండా తల్లిదండ్రులు జాగ్రత్తలు తీసుకోవాలి.
* ప్రజలు పోలీసుల సూచనలు పాటిస్తూ ట్రాఫిక్ నియంత్రణకు సహకరించాలి.
నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు:
నిమజ్జన సమయంలో సంయమనం పాటించాలని, ఇతరులకు ఇబ్బంది కలిగించే విధంగా ప్రవర్తించరాదని ఎస్పీ గారు సూచించారు. డీజేలు, అధిక శబ్దంతో సౌండ్ సిస్టమ్స్, బాణాసంచా తదితర నిబంధనలకు విరుద్ధమైన చర్యలకు అనుమతి లేదని స్పష్టం చేశారు. నిబంధనలు ఉల్లంఘించే వారిపై చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
“జీరో యాక్సిడెంట్ – జీరో ఇన్సిడెంట్” లక్ష్యంతో గణేష్ నిమజ్జన కార్యక్రమాన్ని ప్రశాంతంగా, సురక్షితంగా నిర్వహించేందుకు అన్ని చర్యలు చేపట్టామని జిల్లా ఎస్పీ శ్రీ శరత్ చంద్ర పవార్, ఐపీఎస్ తెలిపారు. ప్రజలు, గణేష్ ఉత్సవ కమిటీలు, నిర్వాహకులు పోలీస్ శాఖకు సహకరించి నిమజ్జన కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించాలని కోరారు.