11/02/2020
జిల్లా అదనపు కలెక్టర్ గా ప్రభుత్వ ఉత్తర్వులు ననుసరించి జాయింట్ కలెక్టర్ గా కొనసాగుతున్న వనమాల చంద్ర శేఖర్ జిల్లా కలెక్టర్ కార్యాలయం లో అదనపు కలెక్టర్ సోమ వారం బాధ్యత లు స్వీకరించారు.జాయింట్ కలెక్టర్ గా ఉన్న వి.చంద్ర శేఖర్ ను ప్రభుత్వం అదనపు కలెక్టర్ గా నియమిస్తూ ఆదివారం రాత్రి ఉత్తర్వులు జారీ చేసింది.ఈ సందర్భంగా పలువురు అధికారులు సిబ్బంది అదనపు కలెక్టర్ కు శుభాకాంక్షలు తెలిపారు.
06/02/2020
ఇంటర్మీడియట్ ప్రాక్టికల్ పరీక్షలు జరుగుతున్న తీరును జాయింట్ కలెక్టర్ వి.చంద్ర శేఖర్ పరిశీలించారు.బుధవారం నల్గొండ జిల్లా కేంద్రంలో ప్రభుత్వ
బాలికల జూనియర్ కళాశాలను జాయింట్ కలెక్టర్ సందర్శించి ఇంటర్మీడియట్ రెండవ సంవత్సరం జనరల్, వొకేషనల్ కోర్సులకు సంబంధించి ప్రాక్టికల్ పరీక్షలు ఏ విధంగా నిర్వహిస్తున్నారు జిల్లా ఇంటర్మీడియట్ అధికారి,కళాశాల ప్రిన్సిపాల్ లను అడిగి తెలుసుకున్నారు.కెమిస్ట్రీ, బాటనీ ల్యాబ్ లు పరిశీలించి పరీక్షా విధానం,మార్కులు కేటాయింపు గురించి తెలుసుకున్నారు.ఈ నెల ఒకటి నుండి 20 వరకు ఇంటర్మీడియట్ ప్రాక్టికల్ పరీక్షలు నిర్వహణకు ఇంటర్మీడియట్ బోర్డ్ టైమ్ టేబుల్ ప్రకటించిన విధంగా కళాశాలలో నాలుగు బ్యాచ్ లలో విద్యార్థినులకు ప్రాక్టికల్ నిర్వహిస్తున్నట్లు కళాశాల ప్రిన్సిపాల్ తెలిపారు.బుధవారం మొదటి షిఫ్ట్ ప్రాక్టికల్ పరీక్షలు పూర్తి చేసినట్లు తెలిపారు.జాయింట్ కలెక్టర్ తో జిల్లా ఇంటర్మీడియట్ విద్య అధికారి భాను నాయక్,జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్ మునావర్ అమీనా తదితరులు పాల్గొన్నారు.
28/08/2019
భూ సంబంధిత పెండింగ్ సమస్యలు ధరణి ద్వారా పరిష్కరించి అర్హులైన రైతులకు పట్టా దార్ పుస్తకాలు జారీ చేయాలని జాయింట్ కలెక్టర్ వి.చంద్ర శేఖర్ అన్నారు.
మంగళవారం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఉదయాదిత్య భవన్ లో జాయింట్ కలెక్టర్ చంద్ర శేఖర్ ధరణి ద్వారా పెండింగ్ భూ సమస్యల పై నల్గొండ,మిర్యాలగూడ డివిజన్ లకు చెందిన తహసీల్దార్ లు,డి.టి.లు,వి.ఆర్.ఓ.లు,ఆర్.ఐ., లు,కంప్యూటర్ ఆపరేటర్ లు ,సర్వేయర్ లతో సమీక్షించారు.ఉదయం నల్గొండ డివిజన్,మధ్యాహ్నం మిర్యాలగూడ రెవిన్యూ డివిజన్ వారీగా సమీక్ష నిర్వహించి డివిజన్, మండలం,గ్రామం వారీగా పెండింగ్ లో వివాదాలు లేని ఖాతాలు ధరణి ద్వారా నమోదు చేసి పూర్తి చేయటంలో కొన్ని మండలాలు వెనుక బడి ఉన్నట్లు, జాయింట్ కలెక్టర్ అసంతృప్తి వ్యక్తం చేస్తూ, ఈ నెల 31 పెండింగ్ ఖాతాలు,డిజిటల్బసంతకాలు పూర్తి చేయాలని ఆదేశించారు.
పట్టాదారు పాసు పుస్తకాల జారీ విషయంలో సమస్య పరిష్కారం విషయంలో నిర్లక్ష్యం వహించే వారిని ఉపేక్షించమని హెచ్చరించారు.
ఈ సమావేశంలో డిఆర్ ఓ రవీంద్రనాథ్,సర్వే అండ్ ల్యాండ్ రికార్డ్స్, ఏ.డి.శ్రీనివాసులు,స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ క్టర్ గోపాల్,ఆర్డీఓ లు జగదీశ్వర్ రెడ్డి(నల్గొండ),జగన్నాథ రావు, కలెక్టరేట్ పరిపాలన అధికారి మోతిలాల్ తదితర అధికారులు పాల్గొన్నారు
22/08/2019
వివాదాలు లేని పెండింగ్ ఖాతాలు క్లియర్ చేసి అర్హులైన రైతు లకు పట్టాదార్ పాస్ పుస్తకాలు అంద చేయాలని జాయింట్ కలెక్టర్ వి.చంద్ర శేఖర్ అధికారులను ఆదేశించారు.బుధవారం మిర్యాల గూడ అర్.డి. ఓ.కార్యాలయంలో మిర్యాలగూడ, పెద్దవూర,మాడుగుల పల్లి, మండలాల తహశీల్దార్ లు,వి.అర్. ఓ.లు,రెవెన్యూ సిబ్బంది ధరణి పెండింగ్ ఖాతాల పై వి.అర్. ఓ.వారీగా గ్రామాల వారీగా సమీక్షించారు.ధరణి వెబ్ సైట్ లో పెండింగ్ ఖాతాలు నమోదు చేసి పట్టా దారు పాస్ పుస్తకాలు పంపిణీ కి చర్యలు తీసుకోవాలని అన్నారు.త్వరలో ధరణి వెబ్ సైట్ ప్రజలకు చూసుకునేందుకు ఆప్షన్ అందుబాటు లో కి ప్రభుత్వం తీసుకు రానుందని,పెండింగ్ ఖాతాల పై శ్రద్ద పెట్టి వెంటనే పరిష్కారం చేయాలని అన్నారు.పెండింగ్ ఖాతాలు లేని గ్రామాలు గా ప్రకటించాలని,వివాదాలు లేని ఖాతాలు 100 శాతం క్లియర్ చేయాలని ఆదేశించారు.రైతుల కు ఇబ్బంది లేకుండా పెండింగ్ క్లియర్ చేయాలని,డిజిటల్ సంతకాలు పూర్తి చేయాలని అన్నారు.గ్రామ పంచాయతీ కార్యాలయంలో వివిధ కారణాల రీత్యా క్లియర్ చేయలేని ఖాతా ల వివరాలు,కారణాలు పొందుపరుస్తూ ఫ్లెక్సీ లు ప్రదర్శించి మిగతావి క్లియర్ చేసినట్లు ప్రకటించాలని సూచించారు.ఈ సమావేశం లో సర్వే అండ్ ల్యాండ్ రికార్డ్స్ ఏ.డి.శ్రీనివాసులు, అర్.డి. ఓ.జగన్నాథ రావు,మిర్యాలగూడ,పెద్దవూర,మాడుగుల పల్లి తహశీల్దార్లు పాల్గొన్నారు.
22/08/2019
అర్హులైన ప్రతి ఒక్కరికి పట్టదార్ పాస్ పుస్తకాలు అంద చేయాలని జాయింట్ కలెక్టర్ వి.చంద్రశేఖర్ ఆదేశించారు.బుధవారం వేముల పల్లి తహశీల్దార్ కార్యాలయంలో ధరణి పెండింగ్ ఖాతా ల పై మండల తహశీల్దార్,డి. టి.,మండలం లోని వి.అర్. ఓ.లతో గ్రామం వారీగా సమీక్షించారు.ధరణి వెబ్ సైట్లో ఖాతా ల వివరాలు నమోదు చేసి ఖాతాలు త్వరిత గతిన పరిష్కారం చేసేందుకు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.వి.అర్. ఓ.వారి గా ఎన్ని ఖాతాలు పెండింగ్ లో ఉన్నాయి,ఎప్పటి లోగా పరిష్కరిస్తారు, క్షేత్ర స్థాయిలో పెండింగ్ లో వున్న విచారణ చేసి క్లియర్ చేయాలని ఆదేశించారు.ధరణి పెండింగ్ ఖాతా ల పరిష్కారం లో,మీ సేవ మ్యూటేషన్లు, సక్సేషన్ లు అలసత్వం చేయరాదని,నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.జిల్లాలో పార్ట్ బి లో వివాదాలు వున్నవి కాకుండా 98 శాతం ఖాతాలు ప్రకటించినట్లు,మండలంలో 99 శాతం ఖాతాలు క్లియర్ చేసినట్లు తెలిపారు.ఈ సమావేశంలో సర్వే ల్యాండ్ ఏ.డి.శ్రీనివాసులు,తహశీల్దార్ మౌలానా తదితరులు పాల్గొన్నారు.
17/07/2019
.ధరణి లో పెండింగ్ భూ సమస్యలను పరిష్కారం చేసేందుకు చర్యలు తీసుకోవాలని జాయింట్ కలెక్టర్ చంద్ర శేఖర్ ఆదేశించారు.మంగళ వారం జిల్లా కలెక్టర్ కార్యాలయం నుండి అర్.డి. ఓ.లు,తహ శీల్దార్ ల తో ధరణి పెండింగ్ సమస్యలు పై మండలాల వారీగా సమీక్షించారు.ఇప్పటి వరకు పెండింగ్ లో క్లియర్ ఖాతా లలో త్వరగా పరిష్కారం చేయాలని ఆదేశించారు.ధరణి ఆన్లైన్ లో సవరణలు,డిజిటల్ సైన్ చేయడం పై అవగాహన కలిగి వుండి , ఆపరేటర్ ల పై బాధ్యత ఉంచకుం డా,తహశీల్దార్ లు వ్యక్తిగతంగా దృష్టి సారించాలని,డిజిటల్ సైన్ పెండింగ్ క్లియర్ చేయాలని జాయింట్ కలెక్టర్ అన్నారు.రైతు ల నుండి వచ్చిన ఫిర్యాదులు జిల్లా కలెక్టర్ ,జాయింట్ కలెక్టర్ ఎండోర్స్ చేసినవి అర్.డి. ఓ.లు,తహశీల్దార్ లకు పంపినవి గ్రామాల లో సర్వ్ చేసి పంపాలని అన్నారు.వి.అర్. ఓ.గ్రామం లో వుండాలని అన్నారు.ఐదు మండలాలకు ఒక డిప్యూటీ కలెక్టర్,మండలం కు ఒక తహశీల్దార్,డిప్యూటీ తహశీల్దార్ లు పర్యవేక్షణ కు నియమించి నట్లు తెలిపారు.పెండింగ్ ఖాతాలు , రైతు ల నుండి వచ్చిన ఫిర్యాదులు సమస్య ను పరిశీలించి పరిష్కారం చేయాలని అన్నారు.ఈ.వి. సి.లో అర్.డి. ఓ. జగ దీశ్వర్ రెడ్డి ,సర్వే ఏ.డి.శ్రీనివాసులు, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ లు వాసు చంద్ర,గోపాల్ నాయక్ తదితరులు పాల్గొన్నారు.
02/03/2019
C NARAYANA REDDY ( JOINT COLLECTOR NALGONDA)