08/10/2026
నల్లగొండ జిల్లా చింతపల్లి మండలం పీకే మల్లేపల్లి గ్రామ పంచాయతీలో దళిత మహిళా ఐకేపీ వీఓఏ (VOA) గనిపెళ్లి మాధవిపై జరిగిన భౌతిక దాడి మరియు కులవివక్ష ఘటనపై మాజీ మంత్రి, మాదిగ మహాశక్తి రాష్ట్ర అధ్యక్షుడు మోత్కుపల్లి నర్సింహులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ విషయమై ఆయన నల్లగొండ జిల్లా కలెక్టర్‌తో మాట్లాడి బాధితురాలికి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు.
అక్టోబర్ 2న పీకే మల్లేపల్లి గ్రామసభలో వీఓఏ మాధవి వివరణ ఇస్తుండగా, మాజీ సర్పంచ్ భర్త కొప్పుల అమర్‌నాథ్ గౌడ్ ఆమెను కులం పేరుతో దూషించి, భౌతిక దాడికి పాల్పడ్డారు.
కలెక్టర్‌కు విజ్ఞప్తి & డిమాండ్లు: మోత్కుపల్లి నర్సింహులు జిల్లా కలెక్టర్‌తో మాట్లాడుతూ, దళిత మహిళపై దాడి చేసి మానసిక ఒత్తిడికి గురిచేసిన నిందితుడిపై కఠిన చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరారు. బాధితురాలిపై నమోదైన తప్పుడు ఆరోపణలను తొలగించి, ఆమె కోల్పోయిన ఉద్యోగాన్ని తిరిగి ఇప్పించాలని డిమాండ్ చేశారు.
ప్రభుత్వ సహాయం: బాధితురాలికి ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టం కింద ప్రభుత్వం నుండి రావలసిన ఆర్థిక సహాయాన్ని తక్షణమే అందించాలని, అలాగే ఆమెకు ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేసి ఆదుకోవాలని కలెక్టర్‌ను కోరడం జరిగింది.
హాజరైన ప్రముఖులు: ఈ కార్యక్రమంలో ఎమ్మార్పీఎస్ (MRPS) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మేడి నరసింహ మాదిగతో పాటు వివిధ ప్రజా సంఘాల నాయకులు, ఎమ్మార్పీఎస్ ప్రతినిధులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
Telangana