02/10/2026
//*స్వచ్ఛ ఆంధ్ర–స్వర్ణాంధ్ర కార్యక్రమంలో పల్నాడు జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయానికి అవార్డు అందజేత* //
పరిశుభ్రత కేవలం ప్రభుత్వ అధికారుల బాధ్యత కాదు... ప్రతి పౌరుడి సామాజిక బాధ్యత – పల్నాడు జిల్లా అదనపు ఎస్పీ శ్రీ రోహిత్ కుమార్ చౌదరి, ఐపీఎస్.
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న “స్వచ్ఛ ఆంధ్ర–స్వర్ణాంధ్ర” కార్యక్రమంలో భాగంగా గాంధీ జయంతి సందర్భంగా శుక్రవారం నరసరావుపేట టౌన్ హాల్‌లో అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పల్నాడు జిల్లా కలెక్టర్ శ్రీమతి కృతిక శుక్ల గారు, నరసరావుపేట శాసనసభ్యులు శ్రీ చదలవాడ అరవింద బాబు గారి చేతుల మీదుగా వివిధ విభాగాల్లో ఉత్తమ ప్రతిభ కనబరిచిన ప్రభుత్వ కార్యాలయాలకు అవార్డులు అందజేశారు.
ఈ సందర్భంగా “స్వచ్ఛ ప్రభుత్వ కార్యాలయం” విభాగంలో పరిశుభ్రత, పారిశుధ్య నిర్వహణ, కార్యాలయ పరిసరాల పరిశుభ్రత, వ్యర్థాల నిర్వహణ తదితర అంశాల్లో ఉత్తమ ప్రమాణాలు పాటించినందుకు పల్నాడు జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయానికి అవార్డు లభించింది.
జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయం తరఫున పల్నాడు జిల్లా ఎస్పీ జగదీష్ అదహళ్లి ఐపీఎస్ గారి ఆదేశాల మేరకు అదనపు ఎస్పీ శ్రీ రోహిత్ కుమార్ చౌదరి, ఐపీఎస్ గారు ఈ అవార్డును స్వీకరించారు.
ఈ సందర్భంగా అదనపు ఎస్పీ శ్రీ రోహిత్ కుమార్ చౌదరి ఐపీఎస్ గారు మాట్లాడుతూ,
👉 పరిశుభ్రత అనేది కేవలం ప్రభుత్వ అధికారులు, సిబ్బంది మాత్రమే నిర్వహించాల్సిన బాధ్యత కాదని, సమాజంలోని ప్రతి పౌరుడి బాధ్యత అని తెలిపారు.
👉 పరిశుభ్రమైన పరిసరాలు ఆరోగ్యకరమైన సమాజానికి పునాది వంటివని పేర్కొన్నారు.
👉ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన స్వచ్ఛ ఆంధ్ర–స్వర్ణాంధ్ర కార్యక్రమాన్ని ప్రజలందరూ తమ కార్యక్రమంగా భావించి భాగస్వాములు కావాలని ఆయన పిలుపునిచ్చారు. ప్రతి ఇంటి నుంచి, ప్రతి కార్యాలయం నుంచి, ప్రతి గ్రామం, పట్టణం నుంచి పరిశుభ్రత కార్యక్రమాలు ప్రారంభమైనప్పుడే రాష్ట్రాన్ని మరింత పరిశుభ్రంగా తీర్చిదిద్దడం సాధ్యమవుతుందని తెలిపారు.
👉ప్రజా భాగస్వామ్యంతోనే స్వచ్ఛ పల్నాడు
దేశంలోనే పరిశుభ్రతకు ప్రత్యేక గుర్తింపు పొందిన ఇండోర్ నగరం తరహాలో పల్నాడు జిల్లాలోని ప్రతి ప్రాంతం పరిశుభ్రంగా, ఆరోగ్యకరంగా ఉండేలా చర్యలు చేపట్టాల్సిన అవసరం ఉందని అదనపు ఎస్పీ గారు తెలిపారు. ఇందుకు ప్రభుత్వ శాఖల సమన్వయంతో పాటు ప్రజల భాగస్వామ్యం అత్యంత కీలకమని పేర్కొన్నారు.
👉 ప్రభుత్వ కార్యాలయాలలో పరిశుభ్రతను నిరంతరం కొనసాగిస్తూ, సిబ్బందిలోనూ పరిశుభ్రతపై అవగాహన పెంపొందించాల్సిన అవసరం తెలిపారు.
మార్పు మన ఇంటి నుంచే ప్రారంభం కావాలి
మహాత్మా గాంధీ గారి ఆశయాలను స్ఫూర్తిగా తీసుకుని సమాజంలో మనం చూడాలనుకునే మార్పును ముందుగా మన ఇంటి నుంచే ప్రారంభించాలని అదనపు ఎస్పీ గారు తెలిపారు.
👉వ్యక్తిగత పరిశుభ్రతతో పాటు పరిసరాల పరిశుభ్రతకు కూడా ప్రతి ఒక్కరూ ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు.
స్వచ్ఛతను ఒకరోజు కార్యక్రమంగా కాకుండా నిత్య జీవితంలో భాగంగా మార్చుకోవాలని ఆయన కోరారు. ప్రభుత్వ శాఖలు చేపట్టే కార్యక్రమాలకు ప్రజలు సహకరిస్తే పరిశుభ్రమైన, ఆరోగ్యకరమైన, సుందరమైన పల్నాడు జిల్లాను నిర్మించుకోవచ్చని తెలిపారు.
ఈ కార్యక్రమంలో పల్నాడు జిల్లా కలెక్టర్ శ్రీమతి కృతిక శుక్ల గారు, నరసరావుపేట శాసనసభ్యులు చదలవాడా అరవింద బాబు గారు, అదనపు ఎస్పీ శ్రీ రోహిత్ కుమార్ చౌదరి ఐపీఎస్ గారు, డీఆర్వో అద్దయ్య, ఆర్డీవో బాలకృష్ణ, మున్సిపల్ కమిషనర్ రమ్య కీర్తన, డీపీఓ నాగేశ్వర్ నాయక్ తదితర జిల్లా అధికారులు పాల్గొన్నారు.