Anil Chandaka JSP - Parvathipuram

Call Directions Contact the organization

Anil Chandaka JSP - Parvathipuram Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from Anil Chandaka JSP - Parvathipuram, Social service, Sowndarya Junction, Mainroad, Narsipatnam.

ప్రజలందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు
14/09/2026

ప్రజలందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు

మట్టి వినాయకుడిని పూజిద్దాం…!మన ప్రకృతిని కాపాడుదాం...!భక్తితో బొజ్జ గణపయ్యను ఆహ్వానిద్దాం…బాధ్యతతో పర్యావరణాన్ని పరిరక్...
14/09/2026

మట్టి వినాయకుడిని పూజిద్దాం…!
మన ప్రకృతిని కాపాడుదాం...!

భక్తితో బొజ్జ గణపయ్యను ఆహ్వానిద్దాం…
బాధ్యతతో పర్యావరణాన్ని పరిరక్షిద్దాం.

🚩 వినాయక చవితి వేడుకలను భక్తిశ్రద్ధలతో జరుపుకుందాం…
🌱 మట్టి వినాయకుడిని ప్రతిష్ఠించి పర్యావరణానికి మన వంతు మేలు చేద్దాం.

“మట్టి వినాయకుడు – మన సంప్రదాయానికి ప్రతీక…
పర్యావరణ పరిరక్షణ – మన బాధ్యత!” 🙏🌿
🔯🔯🔯

🚩పార్వతీపురం స్థానిక సంస్థల ఎన్నికల పైన సమన్వయ సమావేశంపార్వతీపురం: స్థానిక సంస్థల ఎన్నికలపై అరకు పార్లమెంట్ నియోజకవర్గం ...
13/09/2026

🚩పార్వతీపురం స్థానిక సంస్థల ఎన్నికల పైన సమన్వయ సమావేశం

పార్వతీపురం: స్థానిక సంస్థల ఎన్నికలపై అరకు పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలోని పార్వతీపురం మున్సిపాల్టీల, మండలాల నాయకులు, కార్యకర్తలతో నిర్వహించిన సదస్సులో పాల్గొని దిశానిర్దేశం చేసిన జనసేన పార్టీ అరుకు పార్లమెంట్ ఎన్నికల సమన్వయ కమిటీ కో-ఆర్డినేటర్ "కోరికాన రవి" గారు. ఆయన మాట్లాడుతూ జనసేన పార్టీ ఆవిర్భావం నుండి పార్టీ కోసం నిస్వార్థంగా కష్టపడి పనిచేస్తున్న ప్రతి కార్యకర్తకు తప్పకుండా తగిన గుర్తింపు లభిస్తుందని ఈ సందర్భంగా తెలియజేశారు. క్షేత్రస్థాయిలో జనసేన పార్టీకి బలం, పట్టు ఉన్న ప్రతి ప్రాంతంలో సమర్థవంతమైన అభ్యర్థులను బరిలో నిలిపి, వారి విజయానికి పక్కా వ్యూహంతో సమిష్టిగా ముందుకు సాగాల్సిన అవసరం ఉందని పేర్కొన్నాను. స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రతి జనసైనికుడు సమన్వయంతో, బాధ్యతతో పనిచేసి పార్టీ విజయానికి కృషి చేయాలని పిలుపునిచ్చాను.

"24వ వార్డులో జనసేన పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా మట్టి వినాయకుల పంపిణీ"పార్వతీపురం:పర్యావరణ పరిరక్షణలో భాగంగా పార్వతీపురం మున...
13/09/2026

"24వ వార్డులో జనసేన పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా మట్టి వినాయకుల పంపిణీ"

పార్వతీపురం:
పర్యావరణ పరిరక్షణలో భాగంగా పార్వతీపురం మున్సిపాలిటీ 24వ వార్డు జనసేన పార్టీ ఆధ్వర్యంలో ఆదివారం ఉదయం "మట్టి వినాయకుల పంపిణీ" కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. స్థానిక గ్రామదేవత శ్రీ ఇప్పలపోలమ్మ ఆలయ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో భక్తులకు, వార్డు ప్రజలకు ఉచితంగా మట్టి వినాయక విగ్రహాలను పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా పార్టీ నాయకులు చందక అనీల్ మాట్లాడుతూ, రసాయనాలతో తయారు చేసిన విగ్రహాల వల్ల నీటి వనరులు కలుషితమై పర్యావరణానికి తీవ్ర విఘాతం కలుగుతుందని పేర్కొన్నారు. భావితరాలకు స్వచ్ఛమైన పర్యావరణాన్ని అందించేందుకు ప్రతి ఒక్కరూ మట్టితో చేసిన ప్రతిమలనే పూజించి భక్తితో పాటు పర్యావరణ స్పృహను చాటుకోవాలని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ 24వ వార్డు నాయకులు, కార్యకర్తలు, ఆలయ నిర్వాహకులు మరియు స్థానిక ప్రజలు విశేషంగా పాల్గొన్నారు.

"జన సేన ఆధ్వర్యంలో మట్టి వినాయకులు పంపిణీ"- జనసేన పార్టీ నాయకులు "చందక అనీల్" గారు మరియు జనసేన పార్టీ ఆధ్వర్యంలో "మట్టి ...
12/09/2026

"జన సేన ఆధ్వర్యంలో మట్టి వినాయకులు పంపిణీ"

- జనసేన పార్టీ నాయకులు "చందక అనీల్" గారు మరియు జనసేన పార్టీ ఆధ్వర్యంలో "మట్టి వినాయకుల పంపిణీ" కార్యక్రమం.

తేదీ: 13/9/2026 ఆదివారం
సమయం: ఉదయం 11 గంటలకు స్థలం: పార్వతీపురం గ్రామ దేవత ఇప్పలపొలమ్మ ఆలయ ప్రాంగణంలో

ఇట్లు
చందక అనీల్
జనసేనపార్టీ పార్వతీపురం నియోజకవర్గం

🚩జనసేన అధినేత జన్మదిన సందర్భంగా పార్వతీపురం పట్టణంలో జనసైనికులుతో కిక్కిరిసిపోయిన భారీ బైక్ ర్యాలీ..✊🏼🚩పార్వతీపురం నియోజ...
05/09/2026

🚩జనసేన అధినేత జన్మదిన సందర్భంగా పార్వతీపురం పట్టణంలో జనసైనికులుతో కిక్కిరిసిపోయిన భారీ బైక్ ర్యాలీ..✊🏼

🚩పార్వతీపురం నియోజకవర్గంలో జనసైనికులు నిర్వహించిన ఈ బైక్ ర్యాలీ సరికొత్త చరిత్రను తిరగరాసింది! - చందక అనీల్

పార్వతీపురం సెప్టెంబర్ 2,
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, జనసేన అధినేత శ్రీ పవన్ కల్యాణ్ గారి జన్మదిన వేడుకలు. పార్వతీపురం నియోజకవర్గంలో రికార్డు స్థాయిలో హోరెత్తాయి. జనసేన పార్టీ నాయకులు, వీర మహిళలు, వేలాది మంది జనసైనికులు ఒకటై పార్వతీపురం పురవీధుల్లో నిర్వహించిన బైక్ ర్యాలీ ఊహించని రీతిలో కన్నులపండువగా సాగింది. "జై జనసేన.. జై పవన్ కల్యాణ్" నినాదాలతో పార్వతీపురం పట్టణం ప్రతిధ్వనించింది. పార్టీ జెండాల కోలాహలం, జనసైనికుల కదనోత్సాహంతో ప్రధాన రహదారులన్నీ జనసేన సైన్యంతో కిక్కిరిసిపోయాయి. పవన్ కల్యాణ్ గారి సిద్ధాంతాల పట్ల, ఆయన నాయకత్వం పట్ల తమకున్న అపరిమిత అభిమానాన్ని చాటుకుంటూ జనసైనికులు గ్రాండ్ కాన్వాయ్‌తో వీధులను దద్దరిల్లేలా చేశారు. క్రమశిక్షణ, ఉత్సాహం మేళవించిన ఈ ర్యాలీ స్థానిక ప్రజలను అమితంగా ఆకట్టుకుంది. జనసేన సేనాని సుదీర్ఘకాలం ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని, ప్రజలకు మరింత సేవ చేయాలని నాయకులు ఆకాంక్షించారు. పార్వతీపురం నియోజకవర్గంలో జనసైనికులు చాటిన ఈ అభిమానం, నిర్వహించిన ఈ బైక్ ర్యాలీ సరికొత్త చరిత్రను తిరగరాసింది!

02/09/2026

జన్మదిన శుభాకాంక్షలు తెలియచేసిన ప్రతి ఒక్కరికీ హృదయపూర్వక ధన్యవాదాలు - JanaSena Chief shri Pawan Kalyan

🚩పార్వతీపురం మున్సిపాలిటీ 1వ వార్డులో ఘనంగా పవన్ కల్యాణ్ గారి జన్మదిన వేడుకలుపార్వతీపురం:ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమం...
02/09/2026

🚩పార్వతీపురం మున్సిపాలిటీ 1వ వార్డులో ఘనంగా పవన్ కల్యాణ్ గారి జన్మదిన వేడుకలు

పార్వతీపురం:
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత శ్రీ పవన్ కల్యాణ్ గారి జన్మదిన వేడుకలు పార్వతీపురం మున్సిపాలిటీ పరిధిలోని 1వ వార్డులో జనసేన పార్టీ నాయకులు ఇజ్జాడ అప్పలరాజు, గేదెల వంశీ, సంబాన కూర్మ, శివాజీ ఆధ్వర్యంలో బుధవారం ఎంతో వేడుకగా జరిగాయి.
ఈ సందర్భంగా వార్డు నాయకులు, కార్యకర్తల సమక్షంలో ఇజ్జాడ అప్పలరాజు భారీ కేక్ కట్ చేసి, పవన్ కల్యాణ్ గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం స్థానిక ప్రజలకు, చిన్నారులకు కేకులు, మిఠాయిలు పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా ఇజ్జాడ అప్పలరాజు మాట్లాడుతూ — "కూటమి ప్రభుత్వంలో ఉప ముఖ్యమంత్రిగా శ్రీ పవన్ కల్యాణ్ గారు రాష్ట్రాభివృద్ధికి, ప్రజల సంక్షేమానికి నిరంతరం శ్రమిస్తున్నారు. గ్రామీణాభివృద్ధి, పంచాయతీరాజ్, అటవీ శాఖల మంత్రిగా ఆయన తీసుకుంటున్న నిర్ణయాలు ప్రజల్లో నూతన ఉత్సాహాన్ని నింపుతున్నాయి. ఆయన ఆయురారోగ్యాలతో ఎల్లప్పుడూ ప్రజలకు సేవ చేయాలని, భగవంతుని ఆశీస్సులు ఆయనకు నిరంతరం ఉండాలని కోరుకుంటున్నాం" అని తెలిపారు.
ఈ కార్యక్రమంలో జనసేనపార్టీ ఆరుకు పార్లమెంట్ సమాచార సేకరణ కమిటీ సభ్యులు, పార్వతీపురం సీనియర్ నాయకులు చందక అనీల్ గారు, వార్డు నాయకులు, కార్యకర్తలు, అభిమానులు మరియు స్థానిక ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని దిగ్విజయం చేశారు.

Address

Sowndarya Junction, Mainroad
Narsipatnam
535501

Telephone

+919440161076

Website

Alerts

Be the first to know and let us send you an email when Anil Chandaka JSP - Parvathipuram posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Organization

Send a message to Anil Chandaka JSP - Parvathipuram:

Shortcuts

Share