02/10/2026
మహాత్మా గాంధీ జయంతి సందర్భంగా..
మంచిర్యాల శాసనసభ్యులు శ్రీ కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు గారు, మంచిర్యాల జిల్లా మాజీ డీసీసీ అధ్యక్షురాలు శ్రీమతి శ్రీ కొక్కిరాల సురేఖ గార్ల ఆదేశాల మేరకు..
మంచిర్యాల నియోజకవర్గం..
మహాత్మా గాంధీ గారి జయంతి సందర్భంగా మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని మంచిర్యాల పట్టణంలోని గాంధీ పార్క్ వద్ద మహాత్మా గాంధీ గారి విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించిన కాంగ్రెస్ పార్టీ శ్రేణులు..
ఈసందర్భంగా మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ ధర్ని మధుకర్, డిప్యూటీ మేయర్ సల్ల రమ్య-మహేష్, కార్పొరేషన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, కార్పొరేటర్ తూముల నరేష్ గార్లు మాట్లాడుతూ సత్యం, అహింస, శాంతి మార్గాలతో దేశానికి స్వాతంత్ర్యాన్ని సాధించేందుకు మహాత్మా గాంధీ గారు చేసిన త్యాగం, పోరాటం మనందరికీ స్ఫూర్తిదాయకం. గాంధీజీ చూపిన సత్యం, అహింస, సేవా మార్గాలను ఆదర్శంగా తీసుకొని ప్రజాసేవలో ముందుకు సాగాలని ఈ సందర్భంగా ప్రతిజ్ఞ చేద్దాం. సమాజంలో శాంతి, సౌభ్రాతృత్వం, ఐక్యతను పెంపొందించేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలి.
ఈ కార్యక్రమంలో మంచిర్యాల జిల్లా INTUC అధ్యక్షులు పూదరి తిరుపతి, జిల్లా మైనారిటీ అధ్యక్షులు, కార్పొరేటర్ ఖలీద్, మంచిర్యాల జిల్లా మహిళా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు, కార్పొరేటర్ పెంట రజిత, కార్పొరేటర్లు, నాయకులు, మహిళా నాయకురాలు, యువజన కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు..