30/08/2026
ప్రెస్ నోట్
మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలలో SDPI విజయం కోసం చర్చించిన సోషియల్ డెమోక్రటిక్ పార్టీ ఆఫ్ ఇండియా నాయకులు
నెల్లూరు, 30-08-2026, స్థానిక SDPI జిల్లా కార్యాలయంలో సోషియల్ డెమోక్రటిక్ పార్టీ ఆఫ్ ఇండియా ఆంద్రప్రదేశ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు అన్వర్ బాషా గారి మరియు షేక్ ముహ్మద్ ఘని గారి ఆధ్వర్యంలో రాబోయే నెల్లూరు నగర కార్పొరేషన్ ఎన్నికల సమరంలో SDPI సంపూర్ణ విజయం ఎలా సాధించాలి అనే విషయం పై జిల్లా నాయకులతో చర్చ జరిగింది.
ఈ కార్యాక్రమం లో సోషియల్ డెమోక్రటిక్ పార్టీ ఆఫ్ ఇండియా జిల్లా అధ్యక్షులు షేక్ ముహ్మద్ రఫి గారు మాట్లాడుతూ త్వరలో జరగబోవు నెల్లూరు నగర కార్పొరేషన్ మరియు నెల్లూరు జిల్లా లోని యితర ప్రాంతాల్లో లోకల్ బాడి ఎన్నికల లో SDPI తమ అభ్యర్ధులను రంగంలోకి నిలబెట్టుతుందని తెలిపారు. SDPI అవినీతి రహిత సమాజం కోసం, పాజిటివ్ పాలిటిక్స్ తో , ప్రజలు శ్రేయస్సు కోసం శ్రమిస్తుందని SDPI అభ్యర్ధులను గెలిపించుకోవటం ప్రజల యొక్క బాధ్యత అని తెలిపారు.
SDPI నెల్లూరు జిల్లా ప్రధాన కార్యదర్శులు షేక్ అబ్దుల్ అజీజ్ మరియు అడ్వకేట్ సయ్యద్ కాషిఫ్ గారు మాట్లాడుతూ SDPI కార్యకర్తలు నిరంతరం ప్రజల సంక్షేమం మరియు శ్రేయస్సు కోసం మైదానంలో ఉంటారని, రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల లో SDPI తమ అభ్యర్ధులను బరిలో దింపబోతుందని తెలిపారు. ఎన్నికల లో ప్రజలకు ధనము మరియు మధ్యం పంచకుండా , చేసిన వాగ్దానాలను నెరవేర్చటంలో శ్రమించే అభ్యర్ధులు SDPI లో ఉన్నారని తెలిపారు.