NSUI TU

NSUI TU

Share

Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from NSUI TU, Political organisation, Dichpally, Nizamabad.

Photos from NSUI TU's post 13/09/2022

*విసిని తక్షణమే సస్పెండ్ చేయాలి*

తెలంగాణ విశ్వవిద్యాలయంలో NSUI ఆధ్వర్యంలో విసీ దిష్టిబొమ్మ దహనం చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో యూనివర్సిటీ NSUI నాయకులు సింగం వెంకటేష్ మాట్లాడుతూ యూనివర్సిటీలో అక్రమాలకు పాల్పడుతున్న వీసీ అలాగే ఆర్థిక వ్యవస్థను అస్తమస్థం చేస్తూ మొన్న జరిగిన గణేష్ నిమర్జనంలో రాత్రి పూట బయటి వ్యక్తులను బాలికల గృహం లోకి తీసుకు వచ్చి డాన్సులు చేస్తూ డబ్బులను వెదజల్లుతూ యూనివర్సిటీ ప్రతిష్ట మొత్తం దిగజార్చడం జరిగింది వీటితోపాటు తనకు నచ్చినట్టుగా రిజిస్టార్లను మార్చడం అలాగే తనకు నచ్చిన విధంగా పాలన చేస్తూ నిత్యం విశ్వవిద్యాలయం అక్రమాలకు నిలయంగా మారడం జరుగుతుంది ఎవరైతే విద్యార్థి నాయకులను ప్రశ్నిస్తే వారిపై కేసులు పెడతామని వార్నింగ్ ఇవ్వడం ఎమ్మెల్సీ కవిత మంత్రి అండ దండలతో ఇస్టా రీతిగా రెచ్చిపోవడం జరుగుతుంది ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం మేలుకొని విసిపై చర్య తీసుకుని వారిని బేషరత్ గా సస్పెండ్ చేస్తూ యూనివర్సిటీకి కొత్త విసీని అలాగే కొత్త నిధులు మంజూరు చేసి అభివృద్ధి చేయాలని ఆయన డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో యూనివర్సిటీ నాయకులు అనిల్ భారత్ రమేష్ శ్రీనివాస్ అశ్విన్ తదితరులు పాల్గొన్నారు

Photos from NSUI TU's post 11/06/2022

*రాష్ట్రంలోని ఆర్టీసీ బస్ పాస్ ధరల పెంపు నిర్ణయాన్ని వెంటనే వెనక్కి తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వ దిష్టిబొమ్మ దహనం - NSUI తెలంగాణ యూనివర్సిటీ*


*రాష్ట్ర ప్రభుత్వం, ఆర్టీసి బస్ పాస్ చార్జీలను మూడు నుండి నాలుగు రేట్లు అధికంగా పెంచడాన్ని NSUI తీవ్రంగా వ్యతిరేకిస్తుంది. ధరల పెంపు నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ తెలంగాణ యూనివర్సిటీ NSUI నాయకులు నవీన్ మాట్లాడుతూ, రాష్ట్రంలో పేద, మధ్యతరగతి విద్యార్థులకు విద్యను దూరం చేసే కుట్రలో భాగంగా ధరలు పెంచారని విద్యార్థిలోకం భావిస్తోంది. విద్యార్థులకు ఇచ్చే నెలసరి బస్ పాస్ ల ధర దాదాపు మూడు నుండి నాలుగింతల పెంచిన నిర్ణయాన్ని వెంటనే వెనక్కి తీసుకోవాలని, పేద విద్యార్థులు చదువుకునేందుకు నిర్దేశించిన బస్ పాస్ ధర పెంపు నిర్ణయం సరికాదని, గ్రామీణ నేపథ్యం గల విద్యార్థులు నగరలో ఆర్టీసి బస్ పాస్ ఉపయోగించుకొని చదువుకునే విద్యార్థులకు ప్రభుత్వ పెంపు నిర్ణయం భారమవుతుందన్నారు. విద్యార్థులకు ఇచ్చిన రాయితీని పాత పద్ధతిలోనే కొనసాగించాలని, ధరలు పెంచడం వలన విద్యార్థులపై అధిక ఆర్థిక భారం పడుతుందని, దీని వలన విద్యార్థులు అనేక ఆర్థిక సమస్యలకు గురి అవుతారని, చదువుకు దూరం అయ్యే ప్రమాదం ఉంది అని అన్నారు. కావున ప్రభుత్వం బస్ పాస్ ధరల పెంపు నిర్ణయాన్ని వెంటనే వెనక్కు తీసుకొని, ప్రస్తుతం ఉన్న రాయితీ కొనసాగించాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో బస్ భవన్, ప్రగతి భవన్ ముట్టడిస్తామని హెచ్చరించడం జరిగింది. ఈ కార్యక్రమంలో NSUI నాయకులు ప్రమోద్, సూర్య, అనీష్, శ్రీకాంత్, ప్రనీష్ తదితరులు పాల్గొన్నారు.*

26/03/2021

#అసెంబ్లీని_ముట్టడించిన_ఓయూ_జెఏసి_టీయూ_జేఏసీ
శుక్రవారం ఉదయం పోలీసు వలయాలను చేదించుకుని అసెంబ్లీ గేటువరుకు వెళ్ళిన జెఏసి నేతలు

*విద్యార్థి నిరుద్యోగ జెఏసి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సంతోష్ గౌడ్* మరియు నిరుద్యోగ జెఏసి చైర్మన్ కోటూరి మానవతా రాయి తెలంగాణ విశ్వవిద్యాలయం NSUI సింగం వెంకటేశ్, ఓయూ నిరుద్యోగ జెఏసి నేతలు భిక్షునాయక్, జానకిరామ్ ముదిరాజ్, ఓయూ నేత రామిరెడ్డి లు అరెస్ట్

రాంగోపాల్ పేట్ పోలీస్టేషన్ కి తరలింపు
అనంతరం విద్యార్థి నాయకులు సంతోష్ గౌడ్ మాట్లాడుతూ..

61 ఏళ్ళ ప్రభుత్వ ఉద్యోగుల వయోపరిమితి ని ఉపసహంహరించుకోకుంటే కెసిఆర్ సర్కార్ ని నిరుద్యోగులు బొందపెట్టుడు కాయం అని విద్యార్థి నిరుద్యోగ జెఏసి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సంతోష్ గౌడ్ హెచ్చరించారు.

ప్రభుత్వ ఉద్యోగుల 61 ఏళ్ల వయోపరిమితి ఆలోచనను ప్రభుత్వం విరమించుకోక పోతే *న్యాయ పోరాటం చేయక తప్పదని* స్పష్టం చేశారు

*లక్షా తొంభై వేల* ఉద్యోగాలు భర్తీ చేసేవరకు నిరుద్యోగ జెఏసి ముఖ్యమంత్రి కెసిఆర్ ని వెంటాడుతుందని తెలిపారు

*ప్రైవేట్ టీచర్, లెక్చరర్స్ ను వెంటనే ఆదుకోవాలని*

*ఉద్యోగాల భర్తీపై శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు*.
త్వరలోనే నిరుద్యోగులతో హైదరాబాద్లో భారీ బహిరంగ సభను నిర్వహిస్తామని

అంతేకాకుండా

ఈ ఉద్యమం ఇంతటితో ఆగలేదని *అవసరమైతే రాజకీయంగా దెబ్బతీయడానికి నాగార్జునసాగర్ కు వెళ్లి ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీని ఓడించేందుకు నిరుద్యోగులు అందరూ కలిసి ఇంటింటికి ప్రచారం చేస్తామని* హెచ్చరించారు...,

Want your business to be the top-listed Government Service in Nizamabad?

Click here to claim your Sponsored Listing.

Location

Website

Address


Dichpally
Nizamabad
503322