SFI Prakasam

Call Directions Website Contact the organization

SFI Prakasam This Is the Official page of
SFI East Prakasam (Dist Committee)
Students Federation of India (SFI).

◆Like us on Facebook: https://www.facebook.com/sfieastprakasam/
◆Subscribe us on Youtube: http://www.youtube.com/c/SFIEastPrakasam
◆Follow us on Twitter: https://www.twitter.com/sfieastprakasam/
◆Follow us on Instagram: https://www.instagram.com/sfieastprakasam/
◆Subscribe us on Telegram: https://t.me/sfieastprakasam
◆Follow us on Share Chat: https://sharechat.com/profile/sfieastprakasam
◆Follow us on Tik-Tok: http://vm.tiktok.com/eFBnSM/
◆Contact us on Whatsapp: https://wa.me/9490078728

28/09/2026

















తౌసిక్ మృతి, మౌలాబీ మృతిపై జ్యుడీషియల్ ఎంక్వైరీ జరపాలినిజాలను వెలికితీసి బాధ్యులుగా తేలిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకో...
15/09/2026

తౌసిక్ మృతి, మౌలాబీ మృతిపై జ్యుడీషియల్ ఎంక్వైరీ జరపాలి

నిజాలను వెలికితీసి బాధ్యులుగా తేలిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలి.

*ప్రభుత్వం స్పందించకపోతే విద్యార్థుల బంద్ నిర్వహిస్తాం...*

ఒంగోలు, ఫిబ్రవరి 14 :
సింగరాయకొండ లోని శ్రీ చైతన్య నవోదయ కోచింగ్ సెంటర్‌ విద్యార్థి తౌసిక్ మృతి చెందడం, తన కుమారుడికి న్యాయం చేయాలని పోరాడిన తల్లి మౌలాబీ అనంతరం సెప్టెంబర్ 12 మృతి చెందడం అత్యంత బాధాకరమైన పరిణామమని ఎస్‌ఎఫ్‌ఐ, డివైఎఫ్ఐ ఐద్వా ప్రకాశం జిల్లా కమిటీలు పేర్కొంది.

ఈ ఘటనకు సంబంధించిన వాస్తవాలు పూర్తిగా వెలుగులోకి రావాల్సిన అవసరం ఉందని, విద్యాశాఖ స్థాయి విచారణలకే పరిమితం కాకుండా రిటైర్డ్ జడ్జితో 'స్వతంత్ర జ్యుడీషియల్ ఎంక్వైరీ' ఏర్పాటు చేసి సమగ్ర విచారణ జరపాలని డిమాండ్ చేసింది.

ఈ ఘటనకు సంఘీభావంగా మంగళవారం ఒంగోలు నగరంలోని ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా కార్యాలయం నుంచి బస్టాండ్ మీదుగా సాగర్ సెంటర్ వరకు ర్యాలీ నిర్వహించి మౌలాబీ కుటుంబానికి సంఘీభావం తెలిపారు.

ఈ కార్యక్రమానికి ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా కార్యదర్శి బండి వీరాస్వామి అధ్యక్షత వహించారు. ఎస్‌ఎఫ్‌ఐ మాజీ జిల్లా కార్యదర్శి ch. వినోద్, డివైఎఫ్‌ఐ జిల్లా కార్యదర్శి కె.ఎఫ్. బాబు, మహిళా సంఘం జిల్లా కార్యదర్శి కంకణాల రమాదేవి కార్యక్రమాన్ని ఉద్దేశించి మాట్లాడారు.

తౌసిక్ సింగరాయకొండలోని కోచింగ్ సెంటర్‌లో చదువుతున్నప్పటికీ, అతని అధికారిక విద్యా నమోదు, హాజరు వివరాలు మరో పాఠశాలకు సంబంధించినవిగా ఉన్నాయనే అంశంపై కూడా స్పష్టత ఇవ్వాలని ఎస్‌ఎఫ్‌ఐ డిమాండ్ చేసింది.

అలాగే కోచింగ్ సెంటర్‌కు నవోదయ, సైనిక్ తదితర ప్రవేశ పరీక్షల కోచింగ్ నిర్వహించేందుకు అవసరమైన అనుమతులు ఉన్నాయా? హాస్టల్ నిర్వహణకు అవసరమైన అనుమతులు, లైసెన్సులు ఉన్నాయా? విద్యార్థుల భద్రతా ప్రమాణాలు పాటించారా? అనే అంశాలపై కూడా విచారణ జరగాలని డిమాండ్ చేశారు.

*త్రీ మెన్ కమిటీ నివేదికను విడుదల చేయాలి*
తౌసిక్ మృతి అనంతరం జరిగిన విచారణకు సంబంధించిన త్రీ మెన్ కమిటీ నివేదికను వెంటనే బహిర్గతం చేయాలి. కమిటీ ఏ అంశాలను పరిశీలించింది? ఏమైనా లోపాలు గుర్తించిందా? పాఠశాల యాజమాన్యం లేదా సంబంధిత అధికారుల బాధ్యతపై ఏమైనా అభిప్రాయాలు వ్యక్తమయ్యాయా? అనే విషయాలను ప్రజలకు తెలియజేయాలని డిమాండ్ చేశారు.

*“కోర్టు అనుమతి” పేరుతో పాఠశాల పునఃప్రారంభంపై స్పష్టత కావాలి*
తౌసిక్ ఘటన అనంతరం సంబంధిత పాఠశాల గుర్తింపు రద్దు చేశారు. అనంతరం పాఠశాల తిరిగి కార్యకలాపాలు నిర్వహించిన పరిస్థితులపై ప్రభుత్వం పూర్తి వివరాలు వెల్లడించాలి. పాఠశాల పునఃప్రారంభానికి “కోర్టు అనుమతి ఉంది” అని ఎవరైనా పేర్కొంటున్నట్లయితే, సంబంధిత కోర్టు ఉత్తర్వులను ప్రజల ముందుంచాలని కోరారు. .

*మౌలాబీ పోరాటాన్ని ప్రభుత్వం విస్మరించకూడదు*

తన కుమారుడి మృతిపై వాస్తవాలు వెలుగులోకి రావాలని, న్యాయం జరగాలని, అనుమతి లేకుండా పాఠశాల తిరిగి ప్రారంభించడాన్ని విద్యాశాఖ అధికారులు పట్టించుకోవాలని కోరుతూ మౌలాబీ పోరాటం చేసింది. సెప్టెంబర్ 10న ఆమె పురుగుల మందు సేవించి చికిత్స పొందుతూ సెప్టెంబర్ 12న మృతి చెందినట్లు అధికారికంగా వెల్లడైంది.

మౌలాబీ మరణానికి దారితీసిన పరిస్థితులు, ఆమె చేసిన ఫిర్యాదులు, నిరసనలు, అధికారులను సంప్రదించిన వివరాలు, ఆమె లేవనెత్తిన అంశాలపై అధికారులు తీసుకున్న చర్యలు తదితర అంశాలను కూడా స్వతంత్ర విచారణలో పరిశీలించాలని ఎస్‌ఎఫ్‌ఐ డిమాండ్ చేసింది.

న్యాయం కోసం పోరాడిన ఒక తల్లి చివరకు ప్రాణాలు కోల్పోయిన పరిస్థితులపై ప్రభుత్వం బాధ్యతగా స్పందించాలి.

ఎస్‌ఎఫ్‌ఐ ప్రధాన డిమాండ్లు

1. తౌసిక్ మృతి, మౌలాబీ మృతి ఘటనలపై స్వతంత్ర జ్యుడీషియల్ ఎంక్వైరీ ఏర్పాటు చేయాలి.

2. తౌసిక్ మృతి ఘటనకు సంబంధించిన త్రీ మెన్ కమిటీ నివేదికను వెంటనే విడుదల చేయాలి.

3. పాఠశాల యాజమాన్యం వెల్లడించిన మృతి కారణానికి సంబంధించిన ఆధారాలను ప్రజలకు వెల్లడించాలి.

4. తౌసిక్ విద్యా నమోదు, హాజరు, కోచింగ్ వివరాలపై సమగ్ర విచారణ జరపాలి.

5. కోచింగ్ సెంటర్, హాస్టల్‌కు సంబంధించిన అనుమతులు, లైసెన్సులు, విద్యార్థుల భద్రతా ప్రమాణాలను పరిశీలించాలి.

6. పాఠశాల గుర్తింపు రద్దు, అనంతరం పునఃప్రారంభానికి సంబంధించిన పూర్తి ఉత్తర్వులను బయటపెట్టాలి.

7. విచారణలో ఎవరి తప్పిదం, నిర్లక్ష్యం లేదా నిబంధనల ఉల్లంఘన రుజువైతే వారిపై చట్టప్రకారం చర్యలు తీసుకోవాలి.

8. మౌలాబీ కుటుంబానికి తగిన ప్రభుత్వ సహాయం అందించాలి.

ప్రభుత్వం స్పందించకపోతే విద్యార్థుల బంద్

తౌసిక్, మౌలాబీ ఘటనలపై ప్రభుత్వం తక్షణమే స్పందించి, స్వతంత్ర న్యాయ విచారణకు ఆదేశించాలని ఎస్‌ఎఫ్‌ఐ డిమాండ్ చేసింది.

ప్రభుత్వం డిమాండ్లపై స్పష్టమైన చర్యలు తీసుకోకుండా కాలయాపన చేస్తే, ప్రజాస్వామ్యబద్ధంగా విద్యార్థులు, ప్రజాస్వామిక సంఘాలను సమీకరించి జిల్లా వ్యాప్తంగా విద్యార్థుల బంద్ నిర్వహిస్తామని నాయకులు హెచ్చరించారు.

ఈ కార్యక్రమంలో మహిళా సంఘం నగర కార్యదర్శి ఆదిలక్ష్మి, రాజేశ్వరి, డివైఎఫ్‌ఐ నాయకులు సురేష్, మోహన్, ఎస్‌ఎఫ్‌ఐ నాయకులు దేవా, కార్తీక్, తదితరులు, విద్యార్థులు పాల్గొన్నారు.

– ఎస్‌ఎఫ్‌ఐ ప్రకాశం జిల్లా కమిటీ

ఎస్ఎఫ్ఐ జిల్లా స్థాయి విద్యా వైజ్ఞానిక శిక్షణా తరగతులు కందుకూరు ఆగస్టు 26..క్లాస్ బోధిస్తున్న ఎస్ఎఫ్ఐ జిల్లా మాజీ అధ్యక్...
26/08/2026

ఎస్ఎఫ్ఐ జిల్లా స్థాయి విద్యా వైజ్ఞానిక శిక్షణా తరగతులు
కందుకూరు ఆగస్టు 26..
క్లాస్ బోధిస్తున్న ఎస్ఎఫ్ఐ జిల్లా మాజీ అధ్యక్షులు కంకణాల ఆంజనేయులు గారు.

21/08/2026

*విశాఖ వన్ టౌన్లో దారుణం..!*

*విద్యార్థి షర్ట్ విప్పుతూ చెంప దెబ్బలు స్కూల్ టీచర్. *

*దెబ్బలు తట్టుకోలేక గుండె ఆగి మృతిచెందిన విద్యార్థి.*

*కేజీహెచ్ దగ్గర ఆందోళనకు దిగిన విద్యార్థి బంధువులు.*....................... ...

Be a part of the first student federation of India. We carry the legacy of revolutionaries who fought for freedom, democ...
20/08/2026

Be a part of the first student federation of India. We carry the legacy of revolutionaries who fought for freedom, democracy and sovereignty.
SFI PRAKASAM is continuously fighting for student rights in PRAKASAM DISTRICT demanding a safe and inclusive space for everyone.

Established in 1970 from Indian independence struggle to the recent protests led by Gen Z demanding government accountability and a better education system, SFI has consistently been on the ground, fighting for the right to education and organizing students to build a better society..

Be a part of the first student federation of India. We carry the legacy of revolutionaries who fought for freedom, democ...
20/08/2026

Be a part of the first student federation of India. We carry the legacy of revolutionaries who fought for freedom, democracy and sovereignty.
SFI PRAKASAM is continuously fighting for student rights in PRAKASAM DISTRICT demanding a safe and inclusive space for everyone.

Established in 1970 from Indian independence struggle to the recent protests led by Gen Z demanding government accountability and a better education system, SFI has consistently been on the ground, fighting for the right to education and organizing students to build a better society.

16/08/2026

విద్యలయలు ఆధునికదేవలయలు అంటారు కానీ ఇవి వ్యాపారకేంద్రాలగా మారాయి ఒక్క విద్యార్థి కాలేజీ లో చేరిన తర్వాత ఆ కాలేజీ నచ్చకపోయినా ఆ తీసుకున్న కోర్సు నచ్చకపోయినా సేవ్చగా వేరే కాలేజీ కి వెళ్లడానికి వేరే కోర్సు తీసుకోవడానికి హక్కు ఉంది UGC గైడింగ్లెన్స్ కూడా అదే చెప్తుంది కానీ కొని విద్య సంస్థలు UGC గైడింగ్లెన్స్ కి విరుద్యగ విద్యార్థులు కాలేజీలు మరలన్న సర్టిఫికెట్లు తీసుకోవాలన్న అనేక రకాల ఆంక్షలు పెడుతుఉన్నారు... ఉదాహరణకి మొదటి సంవత్సరం పూర్తయి ఆ కాలేజీ నచ్చక వేరే కాలేజీ కి వెళ్తాను అంటే సెకండ్ ఇయర్ చదవకపోయినా కూడా ఫీజులు చెల్లించాలి అని అడుగుతున్నారు ఇది ఎంతవరకు కరెక్ట్ .ఈ విధమైన సమస్యలను ఈ జిల్లాలో ఉన్న అనేక విద్యార్థులు ఎదుర్కుంటున్నారు ఆ విషయాలు అనేకసార్లు మా దృష్టికి తీసుకునివచ్చారు ఈ సమస్యలని ఈ పాటికే జిల్లా అధికారుల దృష్టికి తీసుకువెళ్ళి పరిష్కారం చేసిన చాలా ఘటనలు కూడా ఉన్నయ్
ఆయన ఇటువంటి అనేక సమస్యల�

16/08/2026
12/08/2026

Address

LBG Bhavan
Ongole
5232001

Alerts

Be the first to know and let us send you an email when SFI Prakasam posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Organization

Send a message to SFI Prakasam:

Shortcuts

Share