CPM Prakasam

Call Directions Website Contact the organization

CPM Prakasam C.P.I.(M) Dist Committee
Sundaraiah Bhavan,
Near R.T.C Depo,
Ongole,
Prakasam- 523001. Phone: 9490300377

The CPI(M) was formed at the Seventh Congress of the Communist Party of India held in Calcutta from October 31 to November 7, 1964. More Updates Follow Our Social Media Sites

◆Follow us on Twitter: https://www.twitter.com/cpmprakasam
◆Follow us on Instagram: https://www.instagram.com/cpimprakasam
◆Subscribe us on Youtube: https://www.youtube.com/
◆Subscribe us on Telegram: https://t.me/cpmprakasam
◆Follow us on Share Chat: https://sharechat.com/profile/cpmeastprakasam

04/10/2026

ఫ్లైట్ FZ1073లో గగనతలంలో కెప్టెన్ స్మిత్ మచ్చర్ ప్రదర్శించిన అద్భుతమైన శౌర్యం వందలాది ప్రాణాలను కాపాడి, ఒక పెద్ద విషాదాన్ని నివారించింది. తీవ్రంగా గాయపడినప్పటికీ ఆయన చూపిన ధైర్యానికి, సమయస్ఫూర్తికి వందనం. ఆయన త్వరగా కోలుకోవాలని, దీర్ఘకాలం పాటు మంచి ఆరోగ్యంతో ఉండాలని ఆకాంక్షిస్తున్నాము.

04/10/2026
02/10/2026

క్రీడాకారులకు అభినందనలు - సిపిఐ (యం) రాష్ట్ర కార్యదర్శి వి. శ్రీనివాసరావు.

భారత మహిళల హాకీ జట్టు ఈరోజు చైనాతో జరిగిన ఫైనల్ మ్యాచ్ లో విజయం సాధించింది.
అలాగే 2028 లో జరగనున్న ఒలింపిక్స్ కు అర్హత సాధించడం పట్ల వి శ్రీనివాస రావు హర్షం వ్యక్తం చేశారు.

ఇలాంటి విజయాలు మరెన్నో సాధించాలని భారత్ కు మరెన్నో పతకాలు తెచ్చి పెట్టాలని వి. శ్రీనివాసరావు ఆకాంక్షించారు.
మొత్తం పథకాలలో 5 వ స్థానం చేరుకోవడం హర్షణీయం అన్నారు.

ఓటు హక్కు హరించే కుట్రను అడ్డుకోవాలి• జ్ఞానేష్‌కుమార్‌ను పదవి నుంచి తొలగించాలి• ఒంగోలులో వామపక్షాల ఆధ్వర్యంలో ర్యాలీ• ఎస...
02/10/2026

ఓటు హక్కు హరించే కుట్రను అడ్డుకోవాలి
• జ్ఞానేష్‌కుమార్‌ను పదవి నుంచి తొలగించాలి
• ఒంగోలులో వామపక్షాల ఆధ్వర్యంలో ర్యాలీ
• ఎస్‌ఐఆర్‌ పేరుతో 13 కోట్ల ఓట్లు తొలగించారని నేతల ఆరోపణ
• ఓటర్ల జాబితా సవరణను రద్దు చేయాలని డిమాండ్‌

ఓటు హక్కు పరిరక్షణకు పారదర్శకమైన ఎన్నికల ప్రక్రియ అవసరమని, ఓటర్ల జాబితాల ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్‌ఐఆర్‌) పేరుతో అర్హులైన ఓటర్లకు అన్యాయం జరగకుండా చూడాలని వామపక్ష నాయకులు డిమాండ్‌ చేశారు.

ఓటర్ల జాబితాల నుంచి పెద్ద సంఖ్యలో పేర్లు తొలగించారంటూ వస్తున్న అభ్యంతరాలపై ఎన్నికల సంఘం బాధ్యత వహించాలని, ప్రధాన ఎన్నికల కమిషనర్‌ జ్ఞానేష్‌కుమార్‌ను పదవి నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు .

జ్ఞానేష్‌కుమార్‌ను తొలగించే వరకు ఆందోళన కొనసాగుతుందని నేతలు హెచ్చరిక చేసారు.ఈ మేరకు శుక్రవారం ఒంగోలులో వామపక్ష పార్టీల ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించారు. ప్రజాస్వామ్య హక్కులను పరిరక్షించాలంటూ నినదించారు.

సీపీఎం, సీపీఐ, సీపీఐ(ఎంఎల్‌),న్యూ డెమోక్రసీ పార్టీల ఆధ్వర్యంలో అద్దంకి బస్‌స్టాండ్‌ నుంచి ప్రారంభమైన ర్యాలీ బాపూజీ కాంప్లెక్స్‌ వద్ద మహాత్మా గాంధి విగ్రహానికి పూల మాల వేసి నివాళులు అర్పించారు. అనంతరం ర్యాలీ పాత మార్కెట్‌, మిరియాలపాలెం, చర్చి సెంటర్‌ మీదుగా ప్రకాశం భవన్‌ వరకు సాగింది. నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. అనంతరం ప్రకాశం భవన్‌ వద్ద సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు చీకటి శ్రీనివాస రావు సిపిఐ నాయకులు కొత్తకోట వెంకటేశ్వర్లు అధ్యక్షతన నిర్వహించిన కార్యక్రమంలో నాయకులు మాట్లాడుతూ ఓటర్ల జాబితా అనేది కేవలం పరిపాలనా రికార్డు కాదని, ప్రతి పౌరుడి ప్రజాస్వామ్య హక్కుకు ఆధారమని పేర్కొన్నారు.
ఓటు హక్కును కాపాడాల్సిన బాధ్యత ఈసీదే.....
సీపీఐ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు జె. అజయ్‌కుమార్‌ మాట్లాడుతూ ఓటు హక్కు రాజ్యాంగం కల్పించిన ప్రాథమిక హక్కుల్లో కీలకమైనదని, అర్హులైన పౌరుల పేర్లు ఓటర్ల జాబితాలో లేకుండా పోతే ప్రజాస్వామ్య ప్రక్రియకు విఘాతం కలుగుతుందని అన్నారు. దేశవ్యాప్తంగా 13 కోట్లకు పైగా పేర్లు ముసాయిదా ఓటర్ల జాబితాల నుంచి తొలగించారనే అంశంపై తీవ్ర ఆందోళన వ్యక్తమవుతోందని తెలిపారు. ఆంధ్రప్రదేశ్‌లో 33 లక్షల మంది ఓటర్ల పేర్లు తొలగించారని, మరో 32 లక్షల మందికి నోటీసులు ఇచ్చారంటూ ఆయన పేర్కొన్నారు. ఈ వివరాలపై సమగ్ర పరిశీలన జరిపి, అర్హులైన ప్రతి ఒక్కరికీ ఓటు హక్కు కల్పించాలని డిమాండ్‌ చేశారు.ఎన్నికల సంఘం నిష్పక్షపాతంగా వ్యవహరించాల్సి ఉండగా, ఓటర్ల జాబితాల సవరణపై అనేక అనుమానాలు తలెత్తుతున్నాయని అజయ్‌కుమార్‌ విమర్శించారు. ఎన్నికల కమిషనర్‌ జ్ఞానేష్‌కుమార్‌ రాజీనామా చేయాలని, ఓటర్ల తొలగింపుపై బాధ్యతను నిర్ధారించాలని కోరారు. ఓటర్ల జాబితాల్లో తప్పులు సరిదిద్దుకునేందుకు ప్రజలకు తగిన అవకాశం కల్పించాలని, నోటీసులు అందుకున్నవారు కార్యాలయాల చుట్టూ తిరిగే పరిస్థితి లేకుండా చర్యలు తీసుకోవాలని అన్నారు.
ఎస్‌ఐఆర్‌ వెనుక రాజకీయ కుట్ర :
సీపీఎం జిల్లా కార్యదర్శి ఎస్‌కే మాబు మాట్లాడుతూ సాధారణంగా ఓటర్ల జాబితాల సవరణలో కొత్త ఓటర్లను చేర్చడం, మరణించినవారి పేర్లను తొలగించడం వంటి ప్రక్రియలు జరుగుతాయని తెలిపారు. అయితే ఎస్‌ఐఆర్‌ ప్రక్రియలో పెద్ద సంఖ్యలో పేర్లు తొలగించడంపై ప్రజల్లో ఆందోళన నెలకొందన్నారు. అర్హులైన ఓటర్లకు న్యాయం జరగాలంటే సవరణ ప్రక్రియ పారదర్శకంగా ఉండాలని స్పష్టం చేశారు.
కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కార్పొరేట్‌ ప్రయోజనాలకు ప్రాధాన్యమిస్తూ, మత విభజన రాజకీయాలను ప్రోత్సహిస్తోందని ఆయన విమర్శించారు. ఎస్‌ఐఆర్‌ ప్రక్రియ పౌరసత్వానికి సంబంధించిన వివాదాలకు దారితీసే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. ఎన్నికల కమిషనర్‌ నియామక విధానం, ఓటర్ల జాబితాల సవరణలో అనుసరిస్తున్న పద్ధతులపై సమగ్ర విచారణ జరపాలని కోరారు. ఎన్నికల సంఘం స్వతంత్రతను కాపాడటంతోపాటు అర్హులైన ఓటర్లందరి పేర్లు జాబితాలో ఉండేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు.
ఓటర్ల తొలగింపుపై ఎన్నికల కమిషన్‌లోని ఇతర కమిషనర్లు అభ్యంతరాలు వ్యక్తం చేశారంటూ వచ్చిన నివేదికలను కూడా మాబు ప్రస్తావించారు. ఈ పరిణామాల నేపథ్యంలో ఎన్నికల సంఘం తన నిర్ణయాలపై ప్రజలకు స్పష్టత ఇవ్వాల్సిన అవసరం ఉందన్నారు. ఎస్‌ఐఆర్‌ ప్రక్రియను నిలిపివేసి, ఓటర్ల జాబితాల్లో జరిగిన మార్పులపై విచారణ చేపట్టాలని కోరారు.
ఓటు లేకపోతే పౌరుడి గొంతు మూగబోతుంది:
సీపీఐ(ఎంఎల్‌) న్యూ డెమోక్రసీ జిల్లా నాయకులు ఆర్‌. మోహన్‌ మాట్లాడుతూ ఓటర్ల జాబితాల నుంచి పేర్లు తొలగించడం వల్ల అర్హులైన పౌరులు ఎన్నికల్లో తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేసే అవకాశాన్ని కోల్పోయే ప్రమాదం ఉందన్నారు. 13 కోట్ల మంది ఓటర్ల పేర్లు తొలగించారన్న ఆరోపణలు ప్రజాస్వామ్య వ్యవస్థపై తీవ్రమైన ప్రశ్నలను లేవనెత్తుతున్నాయని పేర్కొన్నారు. ఎన్నికల సంఘం నిష్పక్షపాతంగా వ్యవహరించాల్సిన బాధ్యతను విస్మరించకూడదన్నారు.
బీహార్‌, పశ్చిమ బెంగాల్‌, తమిళనాడు, కేరళ తదితర రాష్ట్రాల్లో ఓటర్ల జాబితాల సవరణపై వివాదాలు తలెత్తిన అంశాలను ప్రస్తావిస్తూ, అర్హులైన ఓటర్లకు నష్టం కలగకుండా చూడాలని కోరారు. ఓటర్ల తొలగింపుపై వచ్చిన ఆరోపణలను విచారించి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని, జ్ఞానేష్‌కుమార్‌ను పదవి నుంచి తొలగించాలని డిమాండ్‌ చేశారు.
నోటీసులతో ఓటర్లకు ఇబ్బందులు:
సీపీఐ(ఎంఎల్‌) నాయకురాలు ఎస్‌. లలితకుమారి మాట్లాడుతూ ఓటర్ల జాబితాలో తమ పేరు ఉందో లేదో తెలుసుకోవడానికి, తొలగించిన పేర్లను తిరిగి నమోదు చేయించుకోవడానికి ప్రజలు కార్యాలయాల చుట్టూ తిరగాల్సి వస్తోందని విమర్శించారు. అర్హత ఉన్నప్పటికీ ఓటు హక్కుపై అనిశ్చితి ఏర్పడటం ప్రజాస్వామ్య వ్యవస్థకు మంచిది కాదన్నారు.
సీపీఐ జిల్లా కార్యదర్శి ఆర్‌. వెంకట్రావు మాట్లాడుతూ ఓటు హక్కును పరిరక్షించడం ఎన్నికల సంఘం ప్రాథమిక బాధ్యతని పేర్కొన్నారు. ఓటర్ల జాబితాల సవరణలో ఎలాంటి అక్రమాలకు తావులేకుండా చూడాలని, అర్హులైన పౌరుల పేర్లు తొలగితే వాటిని తిరిగి చేర్చాలని డిమాండ్‌ చేశారు. ఎన్నికల ప్రక్రియపై ప్రజల్లో విశ్వాసం నిలబెట్టేందుకు పారదర్శకత, జవాబుదారీతనం అవసరమన్నారు.
సీపీఐ(ఎంఎల్‌) న్యూ డెమోక్రసీ రాష్ట్ర అధ్యక్షులు చిట్టిపాటి వెంకటేశ్వర్లు
సిపిఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు కంకణాల ఆంజనేయులు, యంరమేష్, జిల్లా కమిటీ సభ్యులు కాలం సుబ్బారావు, జి రమేష్, జె.జయంతి బాబు, బంకా సుబ్బారావు, యుఆదిలక్ష్మి, పి కల్పన, బి రఘురామ్, వి బాలకోటయ్య, కే.జీ మస్తాన్, ఎన్ వెంకటేశ్వర్లు, పల్లాపల్లి ఆంజనేయులు, జి శ్రీనివాసరావు, సిపిఐ నాయకులు టి ప్రభాకర్, ఇతర వామపక్ష నాయకులు పద్మ, ఎల్ రాజశేఖర్ వామపక్ష పార్టీల నాయకులు,
కార్యకర్తలు పాల్గొన్నారు. ఓటర్ల జాబితాల సవరణపై వచ్చిన అభ్యంతరాలను పరిష్కరించాలని, అర్హులైన ప్రతి పౌరుడికి ఓటు హక్కు కల్పించాలని, ఎన్నికల సంఘం స్వతంత్రతను కాపాడాలని నాయకులు డిమాండ్‌ చేశారు.

02/10/2026
02/10/2026

చీఫ్ ఎలక్షన్ కమిషనర్ జ్ఞానేశ్ కుమార్ రాజీనామా చేయాలి. SIR ప్రక్రియను నిలిపివేయాలి. ఓటర్ల జాబితా నుండి అన్యాయంగా తొలగించిన వారందరికీ ఓటు హక్కును పునరుద్ధరించాలి ..
ఒంగోలు అద్దంకి బస్టాండ్ సెంటర్ నుండి కలెక్టరేట్ వరకు వామపక్ష పార్టీల ర్యాలీ..

Address

Sundaraiah Bhavan
Ongole
523001

Alerts

Be the first to know and let us send you an email when CPM Prakasam posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Organization

Send a message to CPM Prakasam:

Shortcuts

Share