SFI Parvathipuram Manyam District

Call Directions Contact the organization

SFI Parvathipuram Manyam District social service

*గురుకుల విద్యార్థిని గర్భం దార్చడం పై సమగ్రమైన విచారణ జరపాలి.* గుమ్మలక్ష్మీ పురం మండలంలో ఒక గురుకుల జూనియర్ కళాశాలలో సె...
31/08/2026

*గురుకుల విద్యార్థిని గర్భం దార్చడం పై సమగ్రమైన విచారణ జరపాలి.*

గుమ్మలక్ష్మీ పురం మండలంలో ఒక గురుకుల జూనియర్ కళాశాలలో సెకండ్ ఇయర్ చదువుతున్న విద్యార్థిని గర్భం దాల్చడం పై సమగ్రమైన విచారణ జరపాలని భారత విద్యార్థి ఫెడరేషన్ (ఎస్ఎఫ్ఐ) గుమ్మలక్ష్మీపురం అధ్యక్ష,కార్యదర్శులు పి.జయసింహా,ఏ.గంగారావు డిమాండ్ చేశారు.
సందర్భంగా నాయకులు మాట్లాడుతూ గుమ్మలక్ష్మిపురం మండలంలో గల ఒక గురుకుల జూనియర్ కళాశాలలో విద్యార్థిని గర్భం దాల్చడం బాధాకరమని.ఈ ఘటనపై తక్షణమే జిల్లా ఉన్నత స్థాయి అధికారుల కమిటీతో నిష్పక్షపాతంగా సమగ్ర దర్యాప్తు జరిపించి,
నిర్లక్ష్యంగా వ్యవహరించిన అధికారులను, సిబ్బంది పై తగు చర్యలు తీసుకోవాలని. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న అన్ని బాలికల గురుకులాలు, హాస్టళ్లలో ప్రతి మూడు నెలలకు ఒకసారి తప్పనిసరిగా వైద్య పరీక్షలు నిర్వహించాలి. బాధిత విద్యార్థినికి మెరుగైన ఉచిత వైద్యం ప్రభుత్వం తక్షణమే అందించాలని,
డిమాండ్ చేశారు.

ప్రెస్ నోట్తేదీ: 31-08-2026*డోకిశీల గిరిజన సంక్షేమ బాలుర ఆశ్రమ పాఠశాలలో కనీస మౌలిక సదుపాయాలు కల్పించాలి — ఎస్‌ఎఫ్‌ఐ*పార్...
31/08/2026

ప్రెస్ నోట్
తేదీ: 31-08-2026

*డోకిశీల గిరిజన సంక్షేమ బాలుర ఆశ్రమ పాఠశాలలో కనీస మౌలిక సదుపాయాలు కల్పించాలి — ఎస్‌ఎఫ్‌ఐ*

పార్వతీపురం: పార్వతీపురం మండలం డోకిశీల గిరిజన సంక్షేమ బాలుర ఆశ్రమ పాఠశాలలో విద్యార్థులకు కనీస మౌలిక సదుపాయాలు కల్పించాలని భారత విద్యార్థి ఫెడరేషన్ (ఎస్‌ఎఫ్‌ఐ) జిల్లా కమిటీ డిమాండ్ చేసింది. డోకిశీల ఆశ్రమ పాఠశాలలో సుమారు 216 మంది విద్యార్థులు విద్యనభ్యసిస్తున్నప్పటికీ, విద్యార్థుల వసతి గృహాల్లో కనీస సౌకర్యాలు, పరిశుభ్రత లేకపోవడం దారుణమని ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు హిమరక సింహాచలం, బిడ్డీక అనిల్ అన్నారు. ఆశ్రమ పాఠశాలలోని మరుగుదొడ్లు, బాత్రూమ్‌లకు సరైన నీటి సరఫరా లేక విద్యార్థులు బకెట్లతో నీటిని తీసుకెళ్లాల్సిన పరిస్థితి ఉందన్నారు. అనేక చోట్ల వాటర్ ట్యాపులు, పైపులు పాడైపోయి నీరు వృథాగా ప్రవహిస్తుండటంతో పాటు నీరు నిల్వ ఉండి దోమలు, అపరిశుభ్రత పెరిగే పరిస్థితి ఉందన్నారు. వెంటనే పాడైన పైపులు, ట్యాపులను మరమ్మతు చేసి బాత్రూమ్‌లు, మరుగుదొడ్లకు నిరంతర నీటి సరఫరా కల్పించాలని డిమాండ్ చేశారు. విద్యార్థులు నిద్రించే గదులకు తలుపులు లేకపోవడం, కిటికీలకు మెష్‌లు ఏర్పాటు చేయకపోవడం వల్ల దోమలు, ఇతర కీటకాలు గదుల్లోకి వస్తున్నాయని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారని నాయకులు తెలిపారు. విద్యార్థుల భద్రత, ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకొని అన్ని వసతి గదులకు తలుపులు ఏర్పాటు చేయడంతో పాటు కిటికీలకు మెష్‌లు బిగించాలని డిమాండ్ చేశారు. అదేవిధంగా, పాఠశాల వెనుక వైపున ఉన్న ప్రహరీ గోడ పూర్తిగా కూలిపోయి ఉండటంతో విద్యార్థుల భద్రతకు ముప్పు ఏర్పడిందని అన్నారు. పాఠశాల ప్రాంగణానికి రక్షణ లేకుండా ఉండటం వల్ల విద్యార్థుల భద్రతపై ఆందోళన నెలకొందన్నారు. వెంటనే కూలిపోయిన ప్రహరీ గోడను పునర్నిర్మించాలని కోరారు. 216 మంది విద్యార్థులకు ఒక్క వంట కుక్ మాత్రమే ఉండటం వల్ల విద్యార్థులకు సమయానికి భోజనం అందడం లేదని, ఫలితంగా కొన్నిసార్లు తరగతులకు కూడా ఆలస్యంగా వెళ్లాల్సి వస్తోందని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారని నాయకులు తెలిపారు. విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా వంట సిబ్బందిని వెంటనే నియమించాలని కోరారు. అదేవిధంగా, విద్యార్థులు అనారోగ్యానికి గురైనప్పుడు ఆసుపత్రికి తీసుకెళ్లేందుకు సరైన సిబ్బంది అందుబాటులో లేకపోవడంతో సిక్ రూమ్‌లోనే ఉండాల్సిన పరిస్థితి ఉందని విద్యార్థులు చెబుతున్నారని అన్నారు. విద్యార్థుల ఆరోగ్యం పట్ల వార్డెన్, హెచ్‌ఎం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. విద్యార్థుల ఆరోగ్యంపై నిర్లక్ష్యం వహిస్తున్న వార్డెన్, హెచ్‌ఎంలపై విచారణ జరిపి సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి కొల్లి గంగు నాయుడు మాట్లాడుతూ, గిరిజన విద్యార్థులు చదువుకునే ఆశ్రమ పాఠశాలల్లో కనీస సౌకర్యాలు లేకపోవడం ప్రభుత్వ నిర్లక్ష్యానికి నిదర్శనమన్నారు. విద్యార్థులకు నాణ్యమైన ఆహారం, స్వచ్ఛమైన తాగునీరు, పరిశుభ్రమైన వసతి, వైద్య సదుపాయాలు, భద్రత కల్పించడం ప్రభుత్వ బాధ్యత అని అన్నారు. పాఠశాల వెనుక ప్రహరీ గోడ కూలిపోయి ఉండటం, వసతి గదులకు తలుపులు లేకపోవడం వంటి సమస్యలు విద్యార్థుల భద్రతపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయని అన్నారు. విద్యార్థుల సమస్యలను వెంటనే పరిష్కరించకుండా నిర్లక్ష్యం చేస్తే భవిష్యత్తులో ఆందోళన కార్యక్రమాలు చేపట్టాల్సి వస్తుందని హెచ్చరించారు. అలాగే, ఆశ్రమ పాఠశాలలోని వంటశాల ఓపెన్ ప్లేస్‌లో ఉండటం వల్ల గాలి, వర్షం సమయంలో వంట చేయడానికి ఇబ్బందులు ఎదురవుతున్నాయని, దుమ్ము, ధూళి ఆహార పదార్థాల్లో పడుతున్న పరిస్థితి ఉందని నాయకులు తెలిపారు. విద్యార్థులకు పరిశుభ్రమైన వాతావరణంలో ఆహారం అందించేందుకు వంటశాలకు తగిన షెడ్డు, ఇతర మౌలిక సదుపాయాలు కల్పించాలని కోరారు. డోకిశీల ఆశ్రమ పాఠశాలలో నెలకొన్న సమస్యలపై జిల్లా ఉన్నతాధికారులు తక్షణమే పర్యటించి వాస్తవ పరిస్థితులను పరిశీలించాలని, ప్రహరీ గోడ, బాత్రూమ్‌ల నీటి సమస్య, వసతి గదుల తలుపులు, కిటికీల మెష్‌లు, వంటశాల, వంట సిబ్బంది, వైద్య సదుపాయాలు తదితర సమస్యలను వెంటనే పరిష్కరించాలని ఎస్‌ఎఫ్‌ఐ నాయకులు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా ఉపాధ్యక్షులు జి. సురేష్ పాల్గొన్నారు.

*సాలూరు ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో మౌలిక వసతులు కల్పించాలి.— ఎస్ఎఫ్ఐ ధర్నా*పార్వతీపురం మన్యం జిల్లా:         సాలూరు పట్టణ క...
19/08/2026

*సాలూరు ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో మౌలిక వసతులు కల్పించాలి.— ఎస్ఎఫ్ఐ ధర్నా*

పార్వతీపురం మన్యం జిల్లా:

సాలూరు పట్టణ కేంద్రంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాల వద్ద బుధవారం భారత విద్యార్థి ఫెడరేషన్ (ఎస్ఎఫ్ఐ) ఆధ్వర్యంలో విద్యార్థుల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ నిరసన ధర్నా నిర్వహించారు. అనంతరం ఎస్ఎఫ్ఐ నాయకులు సాలూరు డిప్యూటీ తహసీల్దార్ (డీటీ) గారికి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఎస్ఎఫ్ఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి డి. రాము మాట్లాడుతూ సాలూరు ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో పదో తరగతి చదువుతున్న వరుణ్ తేజ్ ప్రహరీ గోడ ప్రమాదంలో మృతి చెందిన ఘటన అత్యంత బాధాకరమని అన్నారు. పాఠశాలలోనే విద్యార్థి ప్రాణాలు కోల్పోయే పరిస్థితి రావడం ప్రభుత్వ శాఖల నిర్లక్ష్యానికి నిదర్శనమని విమర్శించారు. మృత విద్యార్థి కుటుంబాన్ని ప్రభుత్వం వెంటనే ఆదుకోవాలని, తగిన ఆర్థిక సహాయం అందించాలని డిమాండ్ చేశారు. సుమారు 280 మంది విద్యార్థులు చదువుతున్న ఈ పాఠశాలలో మౌలిక వసతులు సక్రమంగా లేకపోవడం ఆందోళనకరమన్నారు. అర్ధంతరంగా నిలిచిపోయిన ప్రహరీ గోడ నిర్మాణ పనులను వెంటనే పూర్తి చేసి, పాఠశాల చుట్టూ విద్యార్థులకు పూర్తి భద్రత కల్పించాలని కోరారు. ప్రమాదకరంగా ఉన్న గోడలు, నిర్మాణాలు, ఇతర ప్రాంతాలను అధికారులు గుర్తించి తక్షణమే మరమ్మతులు చేపట్టాలని అన్నారు. ‘తల్లికి వందనం’ పథకం కింద విద్యార్థులకు అందుతున్న రూ.2,000 నిధులను విద్యార్థుల సంక్షేమానికి ఎలా వినియోగిస్తున్నారో ప్రభుత్వం స్పష్టత ఇవ్వాలని డి. రాము ప్రశ్నించారు. పాఠశాలల్లో మౌలిక వసతులు కల్పించేందుకు ప్రభుత్వం ప్రత్యేక నిధులు కేటాయించాలని, విద్యార్థుల భద్రతకు ప్రాధాన్యత ఇవ్వాలని అన్నారు. అలాగే నాడు-నేడు కార్యక్రమంలో భాగంగా పాఠశాలకు అవసరమైన నిధులు కేటాయించి పెండింగ్‌లో ఉన్న నిర్మాణ పనులను పూర్తి చేయాలని డిమాండ్ చేశారు. పాఠశాలలో తరగతి గదులు, తాగునీరు, విద్యుత్, ఫర్నిచర్, క్రీడా సామగ్రి, శుభ్రత వంటి మౌలిక సదుపాయాలను మెరుగుపరచాలని కోరారు. 280 మంది విద్యార్థులు చదువుతున్న పాఠశాలలో ఒక్క మరుగుదొడ్డి మాత్రమే ఉండటం, అది కూడా బాలికలకు మాత్రమే ఉండటం తీవ్ర నిర్లక్ష్యమని అన్నారు. బాలురకు ప్రత్యేక మరుగుదొడ్లు లేకపోవడం వల్ల విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా బాలురు, బాలికలకు ప్రత్యేక మరుగుదొడ్లు నిర్మించాలని డిమాండ్ చేశారు. ఇటీవల ప్రమాదంలో గాయపడి ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న విద్యార్థికి మెరుగైన వైద్యం అందించడంతో పాటు వైద్య ఖర్చుల కోసం రూ.2 లక్షల ఆర్థిక సహాయం ప్రభుత్వం అందించాలని డిమాండ్ చేశారు. విద్యార్థి ఆరోగ్య పరిస్థితిని జిల్లా ఉన్నతాధికారులు పర్యవేక్షించాలని కోరారు. పాఠశాలలో విద్యార్థుల భద్రతపై జిల్లా ఉన్నతాధికారులు ప్రత్యేక దృష్టి సారించాలని, అధికారులు స్వయంగా పాఠశాలను సందర్శించి సమస్యలను పరిశీలించాలని అన్నారు. పాఠశాలల్లో ప్రమాదాలు జరిగిన తర్వాత స్పందించడం కాకుండా ముందుగానే ప్రమాదకర పరిస్థితులను గుర్తించి నివారించాలని సూచించారు. వరుణ్ తేజ్ కుటుంబాన్ని ప్రభుత్వం వెంటనే ఆదుకోవాలి. అర్ధంతరంగా నిలిచిపోయిన ప్రహరీ గోడ నిర్మాణాన్ని వెంటనే పూర్తి చేయాలి. పాఠశాల ప్రాంగణంలోని ప్రమాదకర నిర్మాణాలను తొలగించి విద్యార్థులకు భద్రత కల్పించాలి. గాయపడిన విద్యార్థికి మెరుగైన వైద్యం అందించి రూ.2 లక్షల వైద్య సహాయం ఇవ్వాలి. బాలురు, బాలికలకు ప్రత్యేకంగా సరిపడా మరుగుదొడ్లు నిర్మించాలి. తాగునీరు, విద్యుత్, ఫర్నిచర్, తరగతి గదులు తదితర మౌలిక వసతులు కల్పించాలి. నాడు-నేడు పనులకు అవసరమైన నిధులు కేటాయించి పెండింగ్ పనులు పూర్తి చేయాలి. ‘తల్లికి వందనం’ పథకం నిధులను విద్యార్థుల సంక్షేమం, పాఠశాల అభివృద్ధికి సక్రమంగా వినియోగించాలి. జిల్లా ఉన్నతాధికారులు పాఠశాలను తక్షణమే సందర్శించి సమస్యలను పరిష్కరించాలి. జిల్లాలోని అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల భద్రతపై ప్రత్యేక తనిఖీలు నిర్వహించాలి. విద్యార్థుల భద్రత, విద్యా హక్కు విషయంలో ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తే ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో మరింత పెద్ద ఎత్తున ఆందోళనలు చేపడతామని డి. రాము హెచ్చరించారు. ఈ కార్యక్రమం ఎస్ఎఫ్ఐ పార్వతీపురం మన్యం జిల్లా అధ్యక్షులు హెచ్. సింహాచలం ఆధ్వర్యంలో నిర్వహించారు. ఎస్ఎఫ్ఐ సాలూరు మండల కమిటీ సభ్యులు జి. రాజుకుమార్, మహేష్, గణేష్, తిరుపతి తదితర నాయకులు పాల్గొన్నారు.

 #
16/08/2026

#

15/08/2026
*ఆగస్టు 29, 30 తేదీల్లో పార్వతీపురం జిల్లా కేంద్రంలో ఎస్‌ఎఫ్‌ఐ పార్వతీపురం మన్యం జిల్లా ప్లీనరీ సమావేశాలు*పార్వతీపురం: ఆ...
14/08/2026

*ఆగస్టు 29, 30 తేదీల్లో పార్వతీపురం జిల్లా కేంద్రంలో ఎస్‌ఎఫ్‌ఐ పార్వతీపురం మన్యం జిల్లా ప్లీనరీ సమావేశాలు*

పార్వతీపురం: ఆగస్టు 14

భారత విద్యార్థి ఫెడరేషన్ (ఎస్‌ఎఫ్‌ఐ) పార్వతీపురం మన్యం జిల్లా ప్లీనరీ సమావేశాలు 2026 ఆగస్టు 29, 30 తేదీల్లో పార్వతీపురం జిల్లా కేంద్రంలో నిర్వహిస్తున్నట్లు పోస్ట్ మెట్రిక్ బాయ్స్ హాస్టల్ లో వాల్ పోస్టర్స్ విడుదల చేశారు. ఈ సందర్భంగా ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా అధ్యక్షులు హెచ్. సింహాచలం, మాట్లాడుతూ.... ఈ ప్లీనరీ సమావేశాలకు రాష్ట్ర నాయకత్వంతో పాటు జిల్లా నలుమూలల నుంచి సుమారు 200 మంది ప్రతినిధులు హాజరుకానున్నారని పేర్కొన్నారు. “అధ్యయనం... పోరాటం...” అనే నినాదంతో, స్వాతంత్ర్యం, ప్రజాస్వామ్యం, సోషలిజం ఆశయాలుగా 1970 ఆగస్టు 12న కేరళలో ఎస్‌ఎఫ్‌ఐ ఏర్పడిందన్నారు. ఉమ్మడి విజయనగరం జిల్లాలో 1982లో బొబ్బిలి పట్టణంలో ఎస్‌ఎఫ్‌ఐ కార్యకలాపాలు ప్రారంభమై, నేడు జిల్లా వ్యాప్తంగా విద్యార్థుల సమస్యలపై నిరంతరం పోరాటాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. దేశ సమగ్రత, సమైక్యతను కాపాడుతూ విద్యా కాషాయీకరణను వ్యతిరేకిస్తూ, విద్యార్థుల్లో దేశభక్తి, సామాజిక స్పృహ పెంపొందించేందుకు జాతీయ నాయకుల జయంతి, వర్ధంతి కార్యక్రమాలను నిర్వహిస్తున్నామని చెప్పారు. విద్యార్థుల సమస్యలపై నిరంతర పోరాటం పార్వతీపురం మన్యం జిల్లాలో విద్యార్థుల సమస్యల పరిష్కారం కోసం ఎస్‌ఎఫ్‌ఐ నిరంతరం పోరాడుతోందన్నారు. విద్యా సంవత్సరం ప్రారంభం నుంచే సంక్షేమ వసతిగృహాల్లో మౌలిక సదుపాయాల కొరతపై ఆందోళనలు నిర్వహించి, కలెక్టరేట్ వద్ద నిరసనలు, ధర్నాలు చేపట్టి, జిల్లా కలెక్టర్‌కు వినతిపత్రాలు అందజేసినట్లు తెలిపారు. పార్వతీపురం పోస్ట్‌మెట్రిక్ బాయ్స్ హాస్టల్‌లో ప్రహరీ గోడ, బాత్రూములు, ఆర్వో ప్లాంట్ ఏర్పాటు చేయాలని హాస్టల్ వద్ద ధర్నా నిర్వహించామని చెప్పారు. జిల్లాలో ప్రభుత్వ పాఠశాలల మూసివేతను ఆపాలని, గిరిజన విద్యార్థుల సమస్యలపై జూన్ 23న విద్యార్థుల తల్లిదండ్రులతో కలిసి నిరసన కార్యక్రమాలు నిర్వహించామని తెలిపారు. జూలై 20న జిల్లా విద్యారంగ సమస్యలపై కలెక్టరేట్ వద్ద ధర్నా నిర్వహించి, పెండింగ్ ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలను విడుదల చేయాలని, మెస్ ఛార్జీలను రూ.3,000కు పెంచాలని, పాలకొండ, కురుపాం పీజీ కేంద్రాలను ప్రారంభించాలని, విద్యార్థులకు నష్టం కలిగించే FRS విధానాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేసినట్లు తెలిపారు. ఈ కార్యక్రమానికి ముందు ఎస్‌ఎఫ్‌ఐ నాయకులను ముందస్తుగా హౌస్ అరెస్టులు చేయడం జరిగిందన్నారు. విశాఖపట్నంలో జూలై 13 నుంచి 15 వరకు విద్యారంగ సమస్యల పరిష్కారం కోసం జరిగిన జాతీయ సమావేశాల్లో పార్వతీపురం నుంచి 20 మంది నాయకులు పాల్గొన్నారని తెలిపారు. అలాగే కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని, ఢిల్లీలో విద్యార్థులపై జరిగిన లాఠీచార్జిని నిరసిస్తూ జిల్లాలోని వివిధ మండల కేంద్రాల్లో పెద్ద ఎత్తున ర్యాలీలు నిర్వహించినట్లు పేర్కొన్నారు. జిల్లాలో విద్యాభివృద్ధికి డిమాండ్లు పార్వతీపురం కేంద్రంలో యూనివర్సిటీ ఏర్పాటు చేయాలని, పార్వతీపురం, పాలకొండ, గుమ్మలక్ష్మీపురం కేంద్రాల్లో పీజీ సెంటర్లు ఏర్పాటు చేయాలని ఎస్‌ఎఫ్‌ఐ డిమాండ్ చేస్తోందన్నారు. కురుపాం, బలిజిపేట, భామిని మండల కేంద్రాల్లో డిగ్రీ కళాశాలలు, గరుగుబిల్లి, సీతంపేట మండల కేంద్రాల్లో జూనియర్ కళాశాలలు, గుమ్మలక్ష్మీపురంలో డైట్ కళాశాల, సాలూరులో బీఈడీ కళాశాల ఏర్పాటు చేయాలని కోరారు. పార్వతీపురంలో మెడికల్ కళాశాల, కురుపాంలో ఇంజనీరింగ్ కళాశాల పనులు ప్రారంభించాలని, పార్వతీపురంలో ప్రభుత్వ ఐటీఐ కళాశాలను ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. సంక్షేమ వసతిగృహాల మూసివేతను ఆపాలని, పెరిగిన ధరలకు అనుగుణంగా కాస్మోటిక్స్, మెస్ ఛార్జీలు పెంచాలని, పెండింగ్ మెస్ బిల్లులను వెంటనే విడుదల చేయాలని, హాస్టళ్లలో మౌలిక సదుపాయాలు కల్పించాలని దశలవారీగా పోరాటాలు కొనసాగిస్తున్నామని తెలిపారు. మున్సిపల్, గిరిజన ఆశ్రమ పాఠశాలల్లో ఖాళీగా ఉన్న టీచర్, ఏఎన్‌ఎం పోస్టులను భర్తీ చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నామని చెప్పారు. విద్యార్థులను డ్రగ్స్‌కు దూరంగా ఉంచేందుకు సెమినార్లు, సదస్సులు, ర్యాలీలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. భవిష్యత్ కార్యాచరణకు ప్లీనరీ కీలకం ప్రస్తుత విద్యారంగంలో వస్తున్న మార్పులు, విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలపై ప్లీనరీలో సమగ్రంగా చర్చించి, భవిష్యత్తులో విద్యారంగ అభివృద్ధి కోసం కార్యాచరణ ప్రణాళికను రూపొందించుకుంటామని ఎస్‌ఎఫ్‌ఐ నాయకులు తెలిపారు.
విద్యార్థుల హక్కుల కోసం నిరంతరం పోరాడుతున్న ఎస్‌ఎఫ్‌ఐ పార్వతీపురం మన్యం జిల్లా ప్లీనరీ సమావేశాలను విజయవంతం చేసేందుకు విద్యార్థులు, తల్లిదండ్రులు, విద్యావేత్తలు, ప్రజాస్వామికవాదులు, పెద్దలు తమ హార్దిక, ఆర్థిక సహకారాన్ని అందించి జయప్రదం చేయాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో ఎస్‌ఎఫ్‌ఐ మండల కమిటీ సభ్యులు, హాస్టల్ కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.
హెచ్. సింహాచలం
జిల్లా అధ్యక్షులు, ఎస్‌ఎఫ్‌ఐ
📞 8886504044
బి. అనిల్
జిల్లా కార్యదర్శి, ఎస్‌ఎఫ్‌ఐ
📞 9440932438

*పార్వతీపురం*తేది:11.08.2026*విద్యార్థి ఉద్యమాల పై నియంత్రణ, నిర్బంధం సరి కాదు!*  *రౌండ్ టేబుల్ సమావేశంలో వక్తలు ఉద్ఘాటన...
14/08/2026

*పార్వతీపురం*
తేది:11.08.2026

*విద్యార్థి ఉద్యమాల పై నియంత్రణ, నిర్బంధం సరి కాదు!*
*రౌండ్ టేబుల్ సమావేశంలో వక్తలు ఉద్ఘాటన!*
"'''''""""""''"""""""""''''’'"""
ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం సంక్షేమ హాస్టళ్ళు, కాలేజీలు పాఠశాలల్లో విద్యార్థి సంఘాల ప్రతి విధులను మీడియా ప్రతినిధుల రాకను నియంత్రిస్తూ ఇచ్చిన ఉత్తర్వులను తక్షణమే రద్దు చేయాలని ప్రజాసంఘాల నాయకులు డిమాండ్ చేశారు. ఈ మేరకు మంగళవారం పార్వతీపురం సుందరయ్య భవనంలో భారత విద్యార్థి ఫెడరేషన్ (ఎస్ఎఫ్ఐ) జిల్లా కమిటీ ఆధ్వర్యంలో *జిల్లా అధ్యక్షులు హెచ్ సింహాచలం* అధ్యక్షతన నిర్వహించిన రౌండ్ టేబుల్ సమావేశంలో *సిఐటియు రాష్ట్ర కార్యదర్శి కె సుబ్బరావమ్మ, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ఉపాధ్యక్షులు కె గంగునాయుడు, కార్యదర్శి ఆర్ ఈశ్వరరావు, సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి వై మన్మధరావు, ఉపాధ్యక్షులు ఎన్ వై నాయుడు,ఐద్వా జిల్లా కార్యదర్శి బి లక్ష్మి, శ్రామిక మహిళ నాయకులు వి ఇందిర, కౌలు రైతు సంఘం జిల్లా అధ్యక్షులు రెడ్డి వేణు, ప్రజానాట్యమండలి జిల్లా కార్యదర్శి కే ఈశ్వరరావు, అంగన్వాడీ యూనియన్ కార్యదర్శి జి జ్యోతి, మిడ్డే మేల్ వర్కర్స్ యూనియన్ కార్యదర్శి శాంత కుమారి, ఎస్ ఎఫ్ ఐ జిల్లా ఉపాధ్యక్షులు సురేష్* తదితర నాయకులు మాట్లాడుతూ.. రోజురోజుకీ రాష్ట్రంలో నియంత్రత్వ పోకడలు పెరిగిపోతున్నాయని, ప్రస్తుతం ప్రజా సమస్యలను వెలికి తీసే లక్ష్యంతో పని చేస్తున్న విద్యార్థి సంఘాలు, సోషల్ మీడియా ప్రతినిధులను, పత్రికా, ప్రింట్ ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులను హాస్టల్స్ కాలేజీల్లోకి ప్రవేశాన్ని నియంత్రిస్తూ చేసిన ఉత్తర్వులు నిజంగా ప్రజాస్వామ్య దేశంలో సరైనవి కావని విమర్శించారు.. ప్రజా సమస్యను వెలికితీస్తుంటే సమస్యలు పరిష్కారానికి చర్యలు చేపట్టాల్సిన ప్రభుత్వం ఆ దిశగా ప్రయత్నం చేయకుండా ఇలా నిర్బంధం ప్రయోగించి నియంత్రించడం సమంజసం కాదని తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన ఉత్తర్వలను రద్దు చేయాలని, లేనియెడల విద్యార్థి, యువజన, ప్రజాసంఘాల ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన చేపడతామని హెచ్చరించారు.. ఈ కార్యక్రమంలో *రైతు సంఘం నాయకులు అప్పారావు, గిరిజన సంఘం నాయకులు ప్రభాకర్ రావు* తదితరులు పాల్గొన్నారు...

*ఐక్య విద్యార్థి ఆవిర్భావ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించిన - ఎస్‌ఎఫ్‌ఐ*పార్వతీపురం మన్యం జిల్లాపార్వతీపురం పట్టణంలోని బాయ...
14/08/2026

*ఐక్య విద్యార్థి ఆవిర్భావ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించిన - ఎస్‌ఎఫ్‌ఐ*

పార్వతీపురం మన్యం జిల్లా

పార్వతీపురం పట్టణంలోని బాయ్స్ కళాశాల వసతి గృహాల్లో బుధవారం ఆగస్టు 12న ఎస్‌ఎఫ్‌ఐ ఐక్య విద్యార్థి ఆవిర్భావ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎస్‌ఎఫ్‌ఐ జెండాను ఆవిష్కరించి, విద్యార్థుల సమస్యల పరిష్కారం కోసం నిరంతరం పోరాటం కొనసాగిస్తామని ప్రతిజ్ఞ చేశారు.
అనంతరం ఎస్‌ఎఫ్‌ఐ పార్వతీపురం మన్యం జిల్లా అధ్యక్షులు హెచ్. సింహాచలం మాట్లాడుతూ.. ఎస్‌ఎఫ్‌ఐ ఏర్పడి 56 సంవత్సరాల ఉద్యమ ప్రస్థానాన్ని పూర్తి చేసుకుని, 57వ సంవత్సరంలోకి అడుగుపెట్టిందని తెలిపారు.
దేశవ్యాప్తంగా విద్యార్థుల విద్యా హక్కులు, సామాజిక న్యాయం, సమాన విద్యా అవకాశాల కోసం ఎస్‌ఎఫ్‌ఐ నిరంతరం పోరాటాలు నిర్వహిస్తోందన్నారు. విద్యారంగంలో విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి ఎస్‌ఎఫ్‌ఐ ఎల్లప్పుడూ ముందుంటుందని తెలిపారు. ప్రభుత్వ విద్యాసంస్థల్లో మౌలిక వసతులు కల్పించడం, ఖాళీగా ఉన్న ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేయడం, వసతి గృహాల్లో మెరుగైన వసతులు కల్పించడం, విద్యార్థులకు సకాలంలో ఫీజు రీయింబర్స్‌మెంట్ మరియు స్కాలర్‌షిప్‌లు అందించడం వంటి సమస్యలపై ఎస్‌ఎఫ్‌ఐ తన పోరాటాలను మరింత ఉధృతం చేస్తుందని పేర్కొన్నారు. చదువుతూ పోరాడు – చదువుకై పోరాడు! అనే నినాదంతో విద్యార్థుల హక్కుల సాధన కోసం ఎస్‌ఎఫ్‌ఐ నిరంతరం పనిచేస్తుందని హెచ్. సింహాచలం తెలిపారు. ఈ కార్యక్రమంలో డి,వై,ఎఫ్,ఐ నాయకులు పి. ప్రభాకర్ ఎస్,ఎఫ్,ఐ మండల అధ్యక్షులు ఎం. శివ తదితరులు పాల్గొన్నారు.

సాలూరు పట్టణం.తేది:08.08.2026*గిరిజన ప్రజానీకం హక్కులు హరించి, గిరిజన ఉత్సవాలు జరుపుతారా?* ఆదివాసి ప్రజల హక్కులు కాపాడండ...
11/08/2026

సాలూరు పట్టణం.
తేది:08.08.2026

*గిరిజన ప్రజానీకం హక్కులు హరించి, గిరిజన ఉత్సవాలు జరుపుతారా?*
ఆదివాసి ప్రజల హక్కులు కాపాడండి, లేకుంటే జరిగే పోరాటాలకి ప్రభుత్వానిదే బాధ్యత.
"''""""""""""""""""""'""""""''"
గిరిజన విద్యార్థులకు, యువకులకు అత్యంత అవసరమైన జీవో నెంబర్ 3 లక్ష్యాలకు అనుగుణంగా కొత్త చట్టం తెస్తామన్న కూటమినేతల హామీలు అమలు చేయాలని, గిరిజనుల భూహక్కుల పరిరక్షణకు 1/70 చట్టాన్ని పకడ్బందీగా అమలు చేసేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సుప్రీంకోర్టులో రివ్యూ పిటిషన్ లు వేయాలని డిమాండ్ చేస్తూ *ఆదివాసి గిరిజన సంఘం, భారత విద్యార్థి ఫెడరేషన్ ఎస్ఎఫ్ఐ, యుటిఎఫ్, సిఐటియు
ఆధ్వర్యంలో మన్యం జిల్లా సాలూరులో జరిగిన బంద్ లో పట్టణం కేంద్రంలో శనివారం ర్యాలీ, రాస్తారోకో జరిగింది.ఈ సందర్భంగా జరిగిన సభలో *ఆదివాసిగిరిజన సంఘం కమిటీ సభ్యుడు, ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షుడు హిమరక సింహాచలం, యుటిఎఫ్ జిల్లా నాయకులు కోట జానకిరామ్, ఆదివాసి గిరిజన ఉద్యోగుల సంఘం నాయకులు అంబటి సీతయ్య, సిఐటియు జిల్లా కార్యదర్శి ఎన్ వై నాయుడు పాల్గొని మాట్లాడుతూ... గిరిజనులకు అండగా ఉన్న చట్టాలు నాశనం చేసి, నేడు హక్కులు పోతున్న తరుణంలో ఉత్సవాలను నిర్వహించడం, అదీ గిరిజన ప్రజలు నిర్వహిస్తున్న "మన్యం బంద్" రోజున ఉత్సవాలు నిర్వహించి గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సంధ్యారాణి గారు, గిరిజన ప్రజలకు అండగా ఉన్న హక్కులను పునరుద్ధరణ చేసి, చిత్తశుద్ధిని నిరూపించుకోవాలని డిమాండ్ చేశారు.
గత ఎన్నికల్లో జీవో నెంబర్ 3 కి ప్రత్యామ్నాయంగా చట్టం చేస్తామన్న చంద్రబాబు రెండేళ్లు గడుస్తున్నప్పటికీ కనీసం చర్యలు చేపట్టకపోవడంలో ఆంతర్యం ఏమిటని ప్రశ్నించారు.. గిరిజనుల భూములకు హక్కులు కల్పించే 1/70 చట్టాన్ని నిర్వీర్యం చేసేందుకు గిరిజనేతరులు చేస్తున్న ప్రయత్నాలను నిలువరించాల్సిన రాష్ట్ర ప్రభుత్వం ఆ దిశగా ప్రయత్నించకపోవడం సిగ్గుచేటని, తక్షణమే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సుప్రీంకోర్టులో రివ్యూ పిటిషన్ వేసి 1/70 చట్టం పరిరక్షణకు చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు... గిరిజనులు అత్యధికంగా ఉన్న గిరిజన గ్రామాలను షెడ్యూల్ ఏరియాలో చేర్చాలని అనేక సంవత్సరాలుగా గిరిజన సంఘాలు ఉద్యమాలు చేస్తున్న కనీసం స్పందించని పాలకులు ఇప్పటికైనా నాన్ షెడ్యూల్ గిరిజన గ్రామాలు షెడ్యూల్డ్ ఏరియాలో చేర్చాలని డిమాండ్ చేశారు. ఈ సమస్యలపై ఈ బంద్ తో అయినా కళ్ళు తెరిచి ప్రభుత్వం చర్యలు చేపట్టాలని లేనియెడల గిరిజన ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు..
ఈ కార్యక్రమంలో సిఐటియు పట్టణ నాయకులు గంట్రెడ్డి సింహాచలం, టి శంకర్రావు, టి వెంకటరావు, యువజన సంఘాల నాయకులు టి రాముడు, ఎస్ఎఫ్ఐ సాలూరు పట్టణ నాయకులు మహేష్, బుజ్జి, గమ్మెల రాజేషు, మర్రి గణేష్ , సునీల్, రాజ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.🙏

Address

Parvathipuram, Belagam, Mainroad
Parvathipuram
535501

Telephone

+919441969693

Website

Alerts

Be the first to know and let us send you an email when SFI Parvathipuram Manyam District posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Organization

Send a message to SFI Parvathipuram Manyam District:

Shortcuts

Share

Category