06/10/2026
*పిఠాపురం , యు. కొత్తపల్లి మండలంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో పాల్గున్న గోదావరి డెల్టా చైర్మన్ మురాలశెట్టి సునీల్ కుమార్ గారు*
ప్రెస్ నోట్ : కొత్తపల్లి , 06.10.2026
పిఠాపురం నియోజకవర్గం , ఉప్పాడ కొత్తపల్లి మండలంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశానికి విచ్చేసిన ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా వారికీ , కొత్తపల్లి మండల ఇంచార్జి రావు అక్షయ్ గారు , డా. జ్యోతుల శ్రీనివాస్ గారు , తెలగంశెట్టి వెంకటేశ్వరరావు గారు , సూర్య నిఖిల్ గారు , మత్స అప్పాజీ గారు , బాపన్న దొర గారు , జీవీకే గారు , ధన బాబు గారు , వంక కొండబాబు గారు , రాంబాబు గారికి , ఇతర జనసేన నాయకులకు వీరమహిళలకు , జనసైనికులకు , పేరు పేరున నా నమస్కారాలు తెలియజేస్తున్నాను.
ఈరోజు ప్రధానంగా మూడు ముఖ్యమైన అంశాలపై మాట్లాడబోతున్నాం.
✅మొదటిది — జనసేన పార్టీ అధ్యక్షులు , గౌరవ ఉపముఖ్యమంత్రివర్యులు , పిఠాపురం శాసనసభ్యులు శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారి అభివృద్ధి విజన్ లో భాగమైన "Principle of Subsidiarity".
✅రెండవది — పిఠాపురం నియోజకవర్గంలో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలు.
✅మూడవది — జనసేన పార్టీని లో “Me Culture” కాదు… “We Culture” అనే ఆలోచన.
1. శ్రీ పవన్ కళ్యాణ్ గారి విజన్ — Principle of Subsidiarity
పవన్ కళ్యాణ్ గారు పదేపదే చెబుతున్న ఒక ముఖ్యమైన పరిపాలనా ఆలోచన “Principle of Subsidiarity.”
దీనిని చాలా సులభంగా చెప్పాలంటే —
ప్రజల సమస్య ఏ స్థాయిలో ఉందో… ఆ స్థాయిలోనే సాధ్యమైనంత త్వరగా అధికారులు కానీ , నాయకులు కానీ పరిష్కరించాలి.
గ్రామ సమస్యను రాష్ట్ర రాజధానికి తీసుకెళ్లాల్సిన అవసరం లేకుండా గ్రామస్థాయిలోనే పరిష్కరించాలి.
పంచాయతీ పరిష్కరించగల సమస్యను జిల్లా స్థాయికి , మండల స్థాయిలో పరిష్కరించగల సమస్యను రాష్ట్ర స్థాయిలో ఫైళ్లుగా తిప్పకూడదు.
అంటే…
పరిపాలన ప్రజలకు అందుబాటులో ఉండాలి.
నిర్ణయం సమస్య ఉన్న చోటుకు దగ్గరగా ఉండాలి.
సంబంధిత అధికారులను అక్కడికే తీసుకెళ్లాలి…
పరిష్కారం వచ్చే వరకు పర్యవేక్షించాలి”
ఇదే Principle of Subsidiarity యొక్క అసలు ఉద్దేశం.
ఉదాహరణకు :
గతంలో పంచాయతీరాజ్ వ్యవస్థలో కొన్ని గ్రామాలను కలిపి ఒక క్లస్టర్‌గా నిర్వహించే విధానం ఉండేది. ఒకే కార్యాలయం పరిధిలో అనేక గ్రామాల పరిపాలన కొనసాగేది. గ్రామ సెక్రటరీ కి కూడా పరిమితమైన అధికారాలు, పరిమితమైన బాధ్యతలు మాత్రమే ఉండేవి. దీంతో ఒక గ్రామానికి సంబంధించిన చిన్న సమస్య పరిష్కారం కావాలన్నా, అది పైస్థాయి అధికారుల వరకు వెళ్లాల్సిన పరిస్థితులు ఉండేవి. అంటే అధికారం ప్రజలకు దగ్గరగా ఉండేది కాదు.
ఇప్పుడు ఆ విధానంలో మార్పు తీసుకుని వచ్చారు శ్రీ పవన్ కళ్యాణ్ గారు..
ప్రతి గ్రామాన్ని ఒక ఇండివిడ్యుఅల్ అడ్మినిస్ట్రేటివ్ యూనిట్‌గా బలోపేతం చేస్తూ, గ్రామ స్థాయిలో పనిచేసే సెక్రటరీ బాధ్యతలను మరింత స్పష్టంగా నిర్వచించి, వారిని Village Development Officers – VDOsగా తీర్చిదిద్దే దిశగా వ్యవస్థను బలోపేతం చేశారు. ఈ కార్యాచరణ కార్యాచరణ ఒక బాధ్యతాయుతమైన పరిపాలన కు నిదర్శనం.
2. పిఠాపురం — కేవలం నియోజకవర్గం కాదు, ఒక Model Constituency
పవన్ కళ్యాణ్ గారు పిఠాపురాన్ని కేవలం ఒక నియోజకవర్గంగా చూడటం లేదు.
దేశానికి ఒక Model Constituencyగా పిఠాపురాన్ని తీర్చిదిద్దాలన్నది ఆయన లక్ష్యం.
ఇటీవల పిఠాపురం నియోజకవర్గంలో సుమారు ₹1,500 కోట్ల విలువైన అభివృద్ధి కార్యక్రమాలు శ్రీ కారం చుట్టడం మనమందరం చూసాం..
2 ఏళ్ళ పాలనలో ఒక్క నియోజకవర్గానికి ₹1,500 కోట్ల నిధులను కేటాయించారంటే పిఠాపురం ప్రజలు ఎంత అదృష్టవంతులో లో ఆలోచించండి.
రోడ్లు మరియు డ్రైనేజీ — 200 cr
ఇప్పటికే 600కు పైగా CC, BT రోడ్లు ప్రజలకు అందుబాటులోకి వచ్చాయి , మరో 200 వందల కోట్లతో రోడ్ కం డ్రైన్ వ్యవస్థను మెరుగు పరచడానికి కేటాయించారు.
గత ప్రభుత్వంలో రోడ్లు ఎంత అద్వానంగా ఉండేవో ఒకసారి గుర్తుచేసుకోండి..వందలలో ఐసీసిడెంట్స్ , స్కూల్ బస్సులు , మార్కెట్ వెళ్లేవారు , పేషెంట్స్ , ధాన్యం తోలే రైతులు అందరు ఇబ్బంది పడ్డారు ఈ రోజు అద్భుతమైన రోడ్లో పిఠాపురం అంత నిర్మించారు.
తాగునీరు — 307 కోట్లు జల్ జీవన మిషన్ ,, అమరజీవి జలధార పథకాలలో ప్రతి ఇంటికి సురక్షిత మంచి నీరు అందించనున్నారు.
నాగులపల్లి సమగ్ర రక్షిత మంచినీటి పథకాన్ని సుమారు ₹9.59 కోట్లతో ఆధునీకరించారు.
1 లక్ష మంది ప్రజలకు తాగునీటి ప్రయోజనం కలగనుంది.
అండర్‌గ్రౌండ్ డ్రైనేజీ — పిఠాపురానికి దీర్ఘకాలిక పరిష్కారం
పిఠాపురం పట్టణంలో సుమారు ₹225 కోట్లతో అండర్‌గ్రౌండ్ డ్రైనేజీ వ్యవస్థ ఏర్పాటు చేయడం ఒక కీలక నిర్ణయం.
దీనికి అనుబంధంగా రోజుకు 72 లక్షల లీటర్ల సామర్థ్యంతో రెండు Sewage Treatment Plants ఏర్పాటు చేస్తున్నారు.
అదే విధంగా 40 టన్నుల Wet Waste Processing Plant, ప్రజా మరుగుదొడ్ల ఏర్పాటు వంటి పనులు కూడా చేపడుతున్నారు.
ఇది కేవలం డ్రైనేజీ సమస్య పరిష్కారం కాదు.
భవిష్యత్ పిఠాపురం కోసం ఒక sustainable urban infrastructure.
వైద్యం — 34 కోట్లతో వందపడకల ఆసుపత్రి
CU, Diagnostic Laboratories, Operation Theatres, 30-bed maternity wingతో పాటు Pediatrics, Ophthalmology, Orthopaedics వంటి సేవలు అందుబాటులోకి రానున్నాయి.
పిఠాపురం మరియు పరిసర మండలాల్లోని సుమారు 3 లక్షల మంది ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందే అవకాశం ఉంది.
5 కోట్ల రూపాయలతో కాలువలు ఆధునీకరించాం..
గత ప్రభుత్వం ఒక బకెట్ మట్టిని కానీ , గుప్పెడు గుర్రపు డెక్క తియ్యని మీరు రైతులు కష్టం వచ్చిందంటూ మాట్లాడుతున్నారు వైస్సార్సీపీ నాయకులు శ్రీమతి వంగా గీత గారు.
రైతులను వెళ్లి అడగండి కాలువలు ఈ రోజు ఎలా ఉన్నాయో , మీ ప్రభుత్వంలో వరద వస్తే 15-20 రోజులు ప్రజల్లో ఆ నీటిలోనే కష్టాలు పడేవారు , ఈ కాలువలు గుర్రపు డెక్క తీసి , డిసిల్టింగ్ చేసి కెనాల్ కెపాసిటీని పెంచాం 2 రోజులలో వరద నీరు లాగుతుంది , ఎల్నినో పరిస్థితుల్లో కూడా సకాలంలో సాగునీరు , త్రాగు నీరు అందిస్తున్నాం..ధాన్యం కొనుగోలు చేసిన 24 గంటలో డబ్బులు జమచేస్తున్నాం..రైతులకు పనిముట్లు , ట్రాక్టర్లు సబ్సిడీలో అందిస్తున్నాం , కూటమి ప్రభుత్వం రైతు సంక్షేమ ప్రభుత్వం అని గర్వంగా చెప్తున్నాం..
విద్య — ఉప్పాడ కొత్తపల్లి మండలంలో ₹3.5 కోట్ల స్కూల్స్ ఆధునీకరణ , లాబ్స్ , కాంపౌండ్ వాల్స్ , స్పోర్ట్స్ ఎక్విప్మెంట్ అభివృద్ధి చేసారు..ఉపాద్యాలను వైన్ షాపులు దగ్గర కాపలా పెట్టిన మీ ప్రభుత్వం విద్య స్కూల్స్ గురించి మాట్లాడకూడదు.
ఉప్పాడ తీర ప్రాంత రక్షణ
ఉప్పాడ సముద్ర తీర ప్రాంతంలో ఎన్నో సంవత్సరాలుగా ప్రజలను వేధిస్తున్న సముద్ర కోత సమస్యకు శాశ్వత పరిష్కారం కోసం కేంద్రం ₹323 కోట్ల రక్షణ గోడకు ఆమోదం ఇచ్చింది.
IIT Madras ద్వారా డిజైన్, సర్వే పూర్తి చేశారు. ఇది ఉప్పాడ ప్రజలకు కేవలం ఒక నిర్మాణం కాదు.
వారి ఇళ్లు, వారి జీవనం, వారి భవిష్యత్తుకు రక్షణ.
మత్స్యకారుల సంక్షేమం
ఉప్పాడ–యు.కొత్తపల్లి ప్రాంత మత్స్యకారుల కోసం సముద్ర భద్రతా పరికరాలు, లైఫ్ జాకెట్లు, డ్రై ఫిష్ యూనిట్లు, ఐస్‌బాక్స్‌లతో కూడిన వాహనాలు వంటి సహాయాన్ని అందిస్తున్నారు.
ఇటీవలి కార్యక్రమాల్లో 1,258 మంది మత్స్యకారులకు safety kits/life jackets, 76 మందికి dry-fish units, 30 మందికి Kinetic Honda వాహనాలు, 3 మందికి autorickshaws అందించారు.
మహిళా సాధికారత
మహిళా స్వయం సహాయక సంఘాలకు ₹120 కోట్ల రుణ సహాయం అందించడం ద్వారా మహిళలు స్వయం ఉపాధి, చిన్న వ్యాపారాలు, ఆర్థిక కార్యకలాపాల్లో ముందుకు రావడానికి అవకాశం కల్పిస్తున్నారు.
మన అభివృద్ధి నిజమైన అభివృద్ధి కావాలంటే…
ఇంట్లో మహిళ ఆర్థికంగా బలపడాలి.
గ్రామంలో మహిళ నిర్ణయాలు తీసుకునే స్థాయికి రావాలి.
సమాజంలో మహిళ నాయకత్వం వహించాలి.
అదే సాధికారత.
పిఠాపురం, గొల్లప్రోలు మున్సిపాలిటీల్లో AMRUT 2.0, ఇతర నిధులతో సుమారు ₹140 కోట్ల మున్సిపల్ పనులు జరుగుతున్నాయి మరో 80 కోట్లు కేటాయించారు.
పర్యావరణం — గ్రేట్ గ్రీన్ అఫ్ ఆంధ్ర ప్రదేశ్
పర్యావరణ పరిరక్షణలో భాగంగా Peethikapuravanam వంటి పచ్చదనం పెంపు కార్యక్రమాలు చేపట్టారు.
అలాగే దేవాలయాల అభివృద్ధి, పునరుద్ధరణకు సుమారు ₹34 కోట్ల పనులు చేపడుతున్నారు.
ట్రైబల్ గ్రామాలలో పల్లెబాటలో కొండలను మధ్యనుండి రోడ్డులో ..ఈ రోజు ఆ గిరిజనులకు కరెంటు వచ్చింది , స్కూల్ వచ్చింది , అంబులెన్సు వెళ్తుంది , మార్కెట్ లో అమ్ముకుని ప్రతి కుటుంబానికి ఆదాయం వస్తుంది , రాష్ట్ర వ్యప్తంగా 30,000 మినీ గోకులాలు , ఎలా చెప్పుకుంటే పోతే ఒక రోజు కూడా సరిపోదు..
3. జనసేనలో క్యాడర్లో “Me Culture” కాదు — “We Culture” ఉంటుంది
“Me Culture” అంటే — నేను చేశాను, నా వల్లే జరిగింది, నా పేరు ఉండాలి, నా ఫోటో ఉండాలి.
పిఠాపురం అది కుదరదు..పిఠాపురం ఒక్కడే నాయకుడు అది శ్రీ పవన్ కళ్యాణ్ గారు మాత్రమే..
“We Culture” అంటే — మనమందరం కలిసి పనిచేస్తాం , కలిసి అభివృద్ధి చేస్తాం , కలిసి ప్రయాణం చేస్తాం ఇదే మా నాయకుడు శ్రీ పవన్ కళ్యాణ్ గారు నేర్పించిన సిద్ధాంతం..
జనసేన ఒక వ్యక్తి కోసం ఏర్పడినది కాదు ...ఒక మంచి వ్యవస్థను ఏర్పాటు చేసేందుకు ఏర్పడింది.
“నేను” నుంచి “మనం” వైపుకి మారాలి..
“నా కోసం” నుంచి “మన కోసం” వైపు మారాలి..
“నా విజయం” నుంచి “ప్రజల విజయం” గా భావించాలి..
ఇదే We Culture.
ముగింపు
పిఠాపురం అభివృద్ధి ఒకరోజులో పూర్తి అయ్యది కాదు..ఇది ఒక long-term transformation.
ఈరోజు రోడ్డు వేస్తాం.
రేపు తాగునీరు అందిస్తాం.
అదే సమయంలో డ్రైనేజీ నిర్మిస్తాం.
సకాలంలో రైతులకు సాగునీరు అందిస్తాం
ఆరోగ్య సదుపాయాలు పెంచుతాం.
విద్యను బలోపేతం చేస్తాం.
మహిళలను ఆర్థికంగా బలపరుస్తాం.
మత్స్యకారుల జీవనోపాధిని మెరుగుపరుస్తాం.
తీర ప్రాంతాన్ని రక్షిస్తాం.
పర్యావరణాన్ని కాపాడుతాం.
జై జనసేన!
జై హింద్!
🏢 గోదావరి తూర్పు డెల్టా ప్రాజెక్ట్ చైర్మన్ కార్యాలయం
జలవనరుల శాఖ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం
📞 95153 66262