01/10/2026
కడప జిల్ల ఇంచార్జ్ మంత్రి సవితా గారు మరియు పులివెందుల నియేజకవర్గ తెలుగుదేశం ఇంచార్జ్ బిటెక్ రవి గారి మాటలను ఖండించిన లింగాలమండల వైసిపి నాయకులు
మంత్రి సవిత, బీటెక్ రవిలు మతిభ్రమించి మాట్లాడుతున్నారు.
తెలుగుదేశం పార్టీ జిల్లా ఇన్చార్జి మంత్రి సవిత, పులివెందుల టిడిపి ఇంచార్జ్ బీటెక్ రవి లు మతిభ్రమించి మాట్లాడుతున్నారు.
-- రాయలసీమను హార్టికల్చర్ హబ్ గా మారుస్తున్నామని వారు చెబుతున్న మాటలు చూస్తుంటే హాస్యాస్పదంగా ఉంది.
-- రాయలసీమ గురించి పక్కన పెడితే లింగాల మండలానికి సంబంధించిన రైతులకు తెలుగుదేశం పార్టీ ఏం ఓరగ బెట్టారో చెప్పాలి.
-- కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక వరుసగా రెండు సంవత్సరాలు గాలివానతో లింగాల మండలంలో వేలాది ఎకరాల అరటిపంట నేలకొరిగి రైతులు నష్టపోవడం జరిగింది.
-- మంత్రి సవిత తో పాటు పులివెందుల తెలుగుదేశం పార్టీ నాయకులు అరటి పంటలను పరిశీలించారే తప్ప ప్రభుత్వం తరఫున రైతులకు ఒక్క రూపాయి కూడా నష్టపరిహారం అందించలేదు.
-- మా నాయకులు వైయస్ జగన్మోహన్ రెడ్డి, వైయస్ అవినాష్ రెడ్డిలు పంట నష్టపోయిన ప్రతి రైతుకు తమ సొంత నిధులతో హెక్టార్కు 20,000 రూపాయలు అందించి రైతులకు భరోసా కల్పించారు.
-- వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ హయాంలో చిత్రావతి డ్యాం కు సంబంధించి 250 కోట్లతో నాలుగు గ్రామాలకు ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీ చెల్లించి చిత్రావతి జలాశయంలో పది టీఎంసీల నీరును నింపడం జరిగింది.
-- చిత్రావతి లో 10 టీఎంసీల నీరు నిల్వ ఉండడంతో సుమారు 1,10,000 ఎకరాల ఆయకట్టుకు సమృద్ధిగా నీరు అందింది.
-- మీ ప్రభుత్వ హయాంలో చిత్రావతిలో పది టీఎంసీల నీరు ఎందుకు నిల్వ చేయలేకపోయారో సమాధానం చెప్పాలి.
-- మీ హయాంలో కనీసం చెరువులకు నీరు కూడా నింప లేకపోయిన విషయం ఈ ప్రాంత రైతులందరికీ తెలుసు.
-- చెరువులకు నీరు వదలాలంటే మోటార్లు పనిచేయలేదని, ట్రాన్స్ ఫార్మర్ లు కాలిపోయాయని కుంటి సాకులు చెప్పారు.
-- రైతుల పట్ల చిత్తశుద్ధి ఉన్న మా ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి ట్రాన్స్ ఫార్మర్ లు ఏర్పాటుచేసి, మోటర్లు రిపేర్ చేయిస్తే వాటికి కనెక్షన్లు ఇవ్వకుండా అడ్డుకున్న నీచ చరిత్ర మీది కాదా.
-- రైతుల పట్ల మీకు చిత్తశుద్ధి ఉంటే పాపాగ్ని నదిలో యదేచ్చగా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఇసుక అక్రమ రవాణా చేస్తుంటే దాని వలన భూగర్భ జలాలు అడుగంటిపోయి రైతులు ఇసుక అక్రమ రవాణాను అడ్డుకుంటే వారిపై కేసులు పెట్టించడంతో రైతుల పట్ల మీకు ఉన్న చిత్తశుద్ధి ఏ పాటిదో తెలుస్తోంది.
-- ఇప్పటికైనా తెలుగుదేశం పార్టీ నాయకులు ఈ ప్రాంత రైతులకు మేలు చేయాలనుకుంటే గండికోట నుంచి చిత్రావతికి 10 టీఎంసీలు, పైడిపాలెం రిజర్వాయర్ లో 6 టీఎంసీల నీటిని నిల్వ చేయడానికి కృషి చేయాలి.
YS Jagan Mohan Reddy
YS Avinash Reddy
YSR Congress Party - YSRCP