SDPI Chittoor District Official

Directions

SDPI Chittoor District Official Chittoor District SDPI Party

SDPI పార్టీ పెద్ద పంజాణి పంచాయతి అధ్యక్షులు గౌస్ గారి ఆధ్వర్యంలో పంచాయితి కమిటి సమావేశం నిర్వహించడం జరిగింది.ఈ కార్యక్రమ...
28/09/2026

SDPI పార్టీ పెద్ద పంజాణి పంచాయతి అధ్యక్షులు గౌస్ గారి ఆధ్వర్యంలో పంచాయితి కమిటి సమావేశం నిర్వహించడం జరిగింది.

ఈ కార్యక్రమంలో ముఖ్య అతిధిగా SDPI పార్టీ అంధ్ర ప్రదేశ్ రాష్ట్ర కార్యదర్శి K.S. ఆన్వర్ గారు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రానున్న స్థానిక ఎన్నికల గురించి మాట్లడడం జరిగింది. అదే విధంగా పార్టీని మరింత ముందుకు తీసుకెళ్లాలని ప్రజా సమస్యలపై ముందుండి పోరాడలని మరియు రాబోయే స్థానిక ఎన్నికల కోసం కృషి చేయాలని తెలిపారు.

ఈ కార్యక్రమంలో పెద్దపంజాణి పంచాయితి ఇంచార్జ్ హూజేపా గారు పాల్గొన్నారు.

ఈ కార్యక్రమంలో పెద్ద పంజాణి పంచాయితి నాయకులు బావాజాన్ గారు , నూరుద్దీన్ గారు, రిజ్వాన్ గారు, బాగష్ గారు, మురాద్ గారు మరియు బ్రాంచ్ నాయకులు మరియు కార్యకర్తలు పాల్గొన్నారు.

ప్రెస్ నోట్తేదీ: 28-09-2026SDPI పార్టీ పుంగనూరు అసెంబ్లీ కమిటీ సమావేశం నిర్వహణఈ రోజు పుంగనూరు అసెంబ్లీ అధ్యక్షులు సిద్ధి...
28/09/2026

ప్రెస్ నోట్
తేదీ: 28-09-2026

SDPI పార్టీ పుంగనూరు అసెంబ్లీ కమిటీ సమావేశం నిర్వహణ
ఈ రోజు పుంగనూరు అసెంబ్లీ అధ్యక్షులు సిద్ధిక్ గారు మరియు కార్యదర్శి శ్రీ అసిఫ్ గారి ఆధ్వర్యంలో, ఎస్‌డీపీఐ (SDPI) పార్టీ జిల్లా కార్యాలయంలో పుంగనూరు అసెంబ్లీ కమిటీ సమావేశం నిర్వహించబడింది.
ఈ సందర్భంగా అసెంబ్లీ అధ్యక్షులు సిద్ధిక్ గారు మాట్లాడుతూ, పార్టీని బూత్ స్థాయి నుంచి మరింత బలోపేతం చేయడం, సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని వేగవంతం చేయడం, రాబోయే పార్టీ కార్యక్రమాలను విజయవంతం చేయడం, అలాగే ప్రజలు ఎదుర్కొంటున్న వివిధ సమస్యల పరిష్కారానికి ఉద్యమాత్మకంగా పనిచేయాల్సిన అవసరాన్ని వివరించారు.
ఈ సమావేశంలో పుంగనూరు అసెంబ్లీ పరిధికి చెందిన పార్టీ నాయకులు, బూత్ కమిటీ సభ్యులు, నాయకులు పాల్గొని పార్టీ అభివృద్ధి, సభ్యత్వ నమోదు, రాబోయే కార్యక్రమాలపై తమ అభిప్రాయాలు, సూచనలు తెలియజేశారు.
ఈ కార్యక్రమంలో పుంగనూరు అసెంబ్లీ నాయకులు ఖాదర్ భాషా గారు శామీర్ భాషా గారు చాంద్ భాషా గారు అబ్దుల్ కలాందర్ గారు అతిక్ గారు బ్రాంచ్ నాయకులు జుబేర్ ముజాహిద్ సద్దాం తాహిర్ షాహిద్ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు

*పత్రికా ప్రకటన**SDPI - సోషల్ డెమోక్రటిక్ పార్టీ ఆఫ్ ఇండియా**చిత్తూరు & అన్నమయ్య ఉమ్మడి జిల్లాల కమిటీ**తేదీ: 20-09-2026,...
20/09/2026

*పత్రికా ప్రకటన*
*SDPI - సోషల్ డెమోక్రటిక్ పార్టీ ఆఫ్ ఇండియా*
*చిత్తూరు & అన్నమయ్య ఉమ్మడి జిల్లాల కమిటీ*
*తేదీ: 20-09-2026, పుంగనూరు *

*రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో క్లీన్ స్వీపే లక్ష్యం: చిత్తూరు, అన్నమయ్య జిల్లాల సమన్వయ కమిటీ విస్తృత స్థాయి సమావేశం*

సోషల్ డెమోక్రటిక్ పార్టీ ఆఫ్ ఇండియా (SDPI) చిత్తూరు మరియు అన్నమయ్య ఉమ్మడి జిల్లాల సమన్వయ కమిటీ విస్తృత స్థాయి సమావేశం ఈరోజు చిత్తూరులో ఘనంగా జరిగింది.

ఈ సమావేశం *జిల్లా అధ్యక్షులు యూసుఫ్ గారు మరియు జిల్లా ప్రధాన కార్యదర్శి రోషన్ గారి* అధ్యక్షతన జరగగా, *రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అన్వర్ బాషా గారు* ముఖ్య అతిథిగా హాజరై దిశా నిర్దేశం చేశారు. ఈ సమావేశంలో జిల్లా వ్యాప్తంగా ఉన్న అన్ని అసెంబ్లీ అధ్యక్షులు, కార్యదర్శులు, జిల్లా కార్యవర్గ సభ్యులు, మండల ఇన్‌చార్జులు పాల్గొన్నారు.

*రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అన్వర్ బాషా గారి సూచనలు:*

ఈ సందర్భంగా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అన్వర్ బాషా గారు మాట్లాడుతూ, రానున్న స్థానిక సంస్థల ఎన్నికలు పార్టీకి అత్యంత కీలకమని తెలిపారు.

1. ప్రతి గ్రామం, ప్రతి వార్డులో పార్టీ నిర్మాణాన్ని పటిష్టం చేయాలని, బూత్ స్థాయి నుంచి కమిటీలను బలోపేతం చేయాలని సూచించారు.
2. చిత్తూరు, అన్నమయ్య జిల్లాల మధ్య సమన్వయం కోసం ఉమ్మడి కార్యాచరణ ప్రణాళికను రూపొందించి, సరిహద్దు నియోజకవర్గాల్లో కలిసికట్టుగా పనిచేయాలని పిలుపునిచ్చారు.
3. ప్రజా సమస్యలైన తాగునీరు, రోడ్లు, విద్య, వైద్యం, ఉపాధి వంటి అంశాలను ప్రధాన ఎజెండాగా తీసుకుని ప్రజల్లోకి వెళ్లాలని సూచించారు.
4. కష్టపడి పనిచేసే, నిజాయితీగల, ప్రజల్లో ఆదరణ ఉన్న కార్యకర్తలకే స్థానిక ఎన్నికల్లో టికెట్లు ఇవ్వాలని, డబ్బు, పలుకుబడి కంటే సేవకే ప్రాధాన్యత ఇవ్వాలని స్పష్టం చేశారు.

*జిల్లా అధ్యక్షులు, కార్యదర్శుల తీర్మానం:*

రాష్ట్ర నాయకత్వ సూచనల మేరకు జిల్లా అధ్యక్షులు యూసుఫ్ గారు, జిల్లా ప్రధాన కార్యదర్శి రోషన్ గారు పలు తీర్మానాలు చేశారు.

- రాబోయే 7 రోజుల్లో రెండు జిల్లాల పరిధిలోని అన్ని మండల కేంద్రాల్లో సన్నాహక సమావేశాలు నిర్వహించాలని తీర్మానించారు.
- ప్రతి పంచాయతీ, మున్సిపల్ వార్డులో 10 మందితో బూత్ కమిటీలను పూర్తి చేయాలని నిర్ణయించారు.
- స్థానిక ఎన్నికల్లో పార్టీ క్లీన్ స్వీప్ చేయడమే లక్ష్యంగా ప్రతి కార్యకర్త పనిచేయాలని, ఎన్నికల వేళ కార్యకర్తలకు ఎటువంటి ఇబ్బందులు ఎదురైనా జిల్లా నాయకత్వం పూర్తి అండగా నిలబడుతుందని హామీ ఇచ్చారు.

*అసెంబ్లీ నాయకుల హామీ:*

ఈ సమావేశంలో పాల్గొన్న అసెంబ్లీ అధ్యక్షులు, కార్యదర్శులు మాట్లాడుతూ, జిల్లా కమిటీ చేసిన తీర్మానాన్ని తూ.చ. తప్పకుండా అమలు చేస్తామని, తమ తమ నియోజకవర్గాల్లో పార్టీని మరింత బలోపేతం చేసి, రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో SDPI జెండా ఎగురవేస్తామని స్పష్టం చేశారు.

ఈ కార్యక్రమంలో జిల్లా కార్యవర్గ సభ్యులు, అసెంబ్లీ, మండల నాయకులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

ఇట్లు,
జిల్లా కమిటీ,
SDPI - చిత్తూరు & అన్నమయ్య జిల్లాలు.

---

ప్రజాస్వామ్య హక్కులను పరిరక్షించాలి!ప్రజాస్వామ్యంలో ప్రజలు తమ హక్కుల సాధన కోసం శాంతియుతంగా నిరసనలు, ఆందోళనలు చేపట్టడం రా...
19/09/2026

ప్రజాస్వామ్య హక్కులను పరిరక్షించాలి!

ప్రజాస్వామ్యంలో ప్రజలు తమ హక్కుల సాధన కోసం శాంతియుతంగా నిరసనలు, ఆందోళనలు చేపట్టడం రాజ్యాంగం కల్పించిన ప్రాథమిక హక్కు.

ప్రజల గొంతుకను అణచివేయడం, వారి శాంతియుత నిరసనలను అడ్డుకోవడం ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధం. ప్రజల హక్కులను కాలరాసే అధికారం ఏ ప్రభుత్వానికీ లేదు.

ప్రజాస్వామ్యంలో ప్రజల గొంతుకను గౌరవించడం, వారి హక్కులను పరిరక్షించడం ప్రభుత్వ బాధ్యత.

ప్రజల హక్కులు – ప్రజాస్వామ్యానికి బలం!
ప్రజల గొంతుకను గౌరవించాలి!

అబ్దుల్లా ఖాన్
రాష్ట్ర అధ్యక్షులు
SDPI - Social Democratic Party of India

యంగ్ డెమోక్రాట్స్ చిత్తూరు జిల్లా ఆర్గనైజింగ్ కమిటీ సమావేశంపుంగనూరు: పుంగనూరులో యంగ్ డెమోక్రాట్స్ చిత్తూరు జిల్లా ఆర్గనై...
12/09/2026

యంగ్ డెమోక్రాట్స్ చిత్తూరు జిల్లా ఆర్గనైజింగ్ కమిటీ సమావేశం

పుంగనూరు: పుంగనూరులో యంగ్ డెమోక్రాట్స్ చిత్తూరు జిల్లా ఆర్గనైజింగ్ కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో చిత్తూరు జిల్లాలో అసెంబ్లీ కమిటీల ఏర్పాటు, సంస్థాగత నిర్మాణం, యువత సమస్యలు తదితర ముఖ్య అంశాలపై విస్తృతంగా చర్చించారు.

జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో యువతను సంఘటితం చేసి, యువత ఎదుర్కొంటున్న సమస్యలపై ప్రజాస్వామ్య పద్ధతిలో కార్యక్రమాలు నిర్వహించడం, అసెంబ్లీ స్థాయిలో యంగ్ డెమోక్రాట్స్ సంస్థను బలోపేతం చేయడం వంటి అంశాలపై సమావేశంలో చర్చించారు.

ఈ సమావేశానికి SDPI చిత్తూరు జిల్లా ఉపాధ్యక్షులు జమీల్ లాల్, యంగ్ డెమోక్రాట్స్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ కన్వీనర్ సయ్యద్ ఇంతియాజ్ హాజరై సమావేశాన్ని ఉద్దేశించి మాట్లాడారు.

యువత సమస్యలపై నిరంతరం పోరాడుతూ, యువతను ప్రజాస్వామ్య ప్రక్రియలో మరింత చురుకుగా భాగస్వామ్యం చేయడానికి కృషి చేయాలని సమావేశంలో నిర్ణయించారు.

యంగ్ డెమోక్రాట్స్
చిత్తూరు జిల్లా ఆర్గనైజింగ్ కమిటీ

యంగ్ డెమోక్రాట్స్ చిత్తూరు జిల్లా ఆర్గనైజింగ్ కమిటీ సమావేశంపుంగనూరు: పుంగనూరులో యంగ్ డెమోక్రాట్స్ చిత్తూరు జిల్లా ఆర్గనై...
12/09/2026

యంగ్ డెమోక్రాట్స్ చిత్తూరు జిల్లా ఆర్గనైజింగ్ కమిటీ సమావేశం

పుంగనూరు: పుంగనూరులో యంగ్ డెమోక్రాట్స్ చిత్తూరు జిల్లా ఆర్గనైజింగ్ కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో చిత్తూరు జిల్లాలో అసెంబ్లీ కమిటీల ఏర్పాటు, సంస్థాగత నిర్మాణం, యువత సమస్యలు తదితర ముఖ్య అంశాలపై విస్తృతంగా చర్చించారు.

జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో యువతను సంఘటితం చేసి, యువత ఎదుర్కొంటున్న సమస్యలపై ప్రజాస్వామ్య పద్ధతిలో కార్యక్రమాలు నిర్వహించడం, అసెంబ్లీ స్థాయిలో యంగ్ డెమోక్రాట్స్ సంస్థను బలోపేతం చేయడం వంటి అంశాలపై సమావేశంలో చర్చించారు.

ఈ సమావేశానికి SDPI చిత్తూరు జిల్లా ఉపాధ్యక్షులు జమీల్ లాల్, యంగ్ డెమోక్రాట్స్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ కన్వీనర్ సయ్యద్ ఇంతియాజ్ హాజరై సమావేశాన్ని ఉద్దేశించి మాట్లాడారు.

యువత సమస్యలపై నిరంతరం పోరాడుతూ, యువతను ప్రజాస్వామ్య ప్రక్రియలో మరింత చురుకుగా భాగస్వామ్యం చేయడానికి కృషి చేయాలని సమావేశంలో నిర్ణయించారు.

— యంగ్ డెమోక్రాట్స్
చిత్తూరు జిల్లా ఆర్గనైజింగ్ కమిటీ

*ప్రెస్ నోట్**తేదీ: 09-09-2026**ప్రదేశం: పుంగనూరు**రహ్మత్ నగర్ సచివాలయంలో SDPI సేవా కార్యక్రమం*ఈరోజు పుంగనూరు పట్టణంలోని...
10/09/2026

*ప్రెస్ నోట్*

*తేదీ: 09-09-2026*
*ప్రదేశం: పుంగనూరు*

*రహ్మత్ నగర్ సచివాలయంలో SDPI సేవా కార్యక్రమం*

ఈరోజు పుంగనూరు పట్టణంలోని *రహ్మత్ నగర్ సచివాలయం* నందు, సోషల్ డెమోక్రటిక్ పార్టీ ఆఫ్ ఇండియా (SDPI) ఆధ్వర్యంలో ప్రజా సేవా కార్యక్రమం నిర్వహించబడింది.

*పార్టీ జిల్లా కార్యవర్గ సభ్యులు జనాబ్ హుజెఫా గారు* స్వయంగా సచివాలయానికి వెళ్లి, కొత్తగా పింఛన్ కోసం అప్లై చేసుకునే వృద్ధులు, వితంతువులు, ఉచితంగా ఫారాలు ఫిలప్ చేసి, అవసరమైన డాక్యుమెంట్స్ జత చేసి, అప్లికేషన్ ప్రాసెస్ లో సహాయం చేశారు.

ఈ సందర్భంగా హుజెఫా గారు మాట్లాడుతూ...

> "ప్రభుత్వం ఇచ్చే పథకాలు పేద ప్రజలకు చేరడం లేదు. సచివాలయాల చుట్టూ తిరిగి వారు ఇబ్బంది పడుతున్నారు. అందుకే SDPI పార్టీ తరపున మేము నేరుగా ప్రజల వద్దకు వెళ్లి వారికి అండగా నిలబడుతున్నాము. రాజకీయం అంటే కేవలం ఓట్లు అడగడం కాదు, ప్రజా సమస్యలపై పని చేయడం. రాబోయే రోజుల్లో ప్రతి సచివాలయం పరిధిలో ఈ కార్యక్రమాన్ని విస్తరిస్తాము" అని అన్నారు.

ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజలు SDPI నాయకులకు కృతజ్ఞతలు తెలిపారు. పెద్ద ఎత్తున ప్రజలు తమ పింఛన్ సమస్యలను హుజెఫా గారికి విన్నవించుకున్నారు.

Address

Punganuru

Website

Alerts

Be the first to know and let us send you an email when SDPI Chittoor District Official posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Shortcuts

Share